Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, June 29, 2012

తిక్కా .లెక్కా ..అన్నీ కుదిరాయి..!


gabbarsing 

ఓ హీరోతో సినిమా తెరకె క్కించాలంటే ఆ దర్శకుడు పెద్ద మేధావి కావాల్సిన అవసరం లేదు. ఆ హీరోని అభిమానిస్తూ.. ఆ హీరో అభిమాని అయితే చాలు’ ఇది ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో చిరంజీవి అన్న మాటలు.. సరిగ్గా అదే అభిమానాన్ని గుండెల్లో దాచుకొని ‘గబ్బర్‌సింగ్’ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు హరీష్ శంకర్. గత పది సంవత్సరాల నుంచి సరైన విజయం లేక, విజయ దాహం తీరక ఎదురుచూస్తున్న పవన్‌కు, ఆయన అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాలనుకున్న ఈ యువ దర్శకుడికి తోడుగా నిలిచాడు నిర్మాత బండ్ల గణేష్. పవన్ నాకు ఓ వ్యసనం అంటూ తన అభిమానాన్ని వెల్లడించిన ఈ నిర్మాత పవన్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు తన సినిమానే కరెక్ట్ అనుకున్నాడు. 

అందుకే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొంది ఘన విజయం సాధించిన ‘దబాంగ్’ను పవన్‌తో ‘గబ్బర్‌సింగ్’ పేరిట నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా రీమేక్ చేశాడు. పవన్ అంటే ప్రాణం ఇచ్చే దర్శకుడు, నిర్మాత కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలించిందో తెలుసుకుందాం..!

కథ: కొండవీడు గ్రామంలో నివసించే ఓ రైస్‌మిల్ యజమాని (నాగినీడు) తన భార్య మరణంతో, భర్త మరణించి కొడుకు ఉన్న ఓ మహిళని (సుహాసిని) పెళ్ళి చేసుకుంటాడు. ఆమె కొడుకే వెంకటరత్నం నాయుడు (పవన్ కళ్యాణ్), మొదట్నుంచీ సవతి తండ్రి వివక్షని తట్టుకోలేక చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి హాస్టల్‌లో వుండి చదువుకొని తన ఊరికే పోలీస్ అధికారిగా తిరిగి వస్తాడు వెంకటరత్నం నాయుడు. ‘షోలే’ చిత్రంలోని విలన్ పాత్రధారి అయిన ‘గబ్బర్‌సింగ్’ను ఆరాధించే వెంకటరత్నం నాయుడు తన పేరును ‘గబ్బర్‌సింగ్’గా మార్చుకుంటాడు. అంతేకాదు పోలీస్ అధికారిగా తనదైన ‘తిక్క’తో తనకున్న లెక్కతో పనిచేస్తుంటాడు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ను గబ్బర్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌గా పేరు మార్చేస్తాడు. ఇక అదే గ్రామంలో పేరుమోసిన రౌడీషిటర్ సిద్ధప్ప నాయుడు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ అతన్ని ముప్పు తిప్పలు పెడుతుంటాడు గబ్బర్‌సింగ్. ఎమ్మెల్యే కావాలని కలలు కంటూ దానికోసం సిద్దప్ప నాయుడు చేసే దుశ్చర్యలను అడ్డుకుంటుంటాడు. ఇక గబ్బర్‌సింగ్‌ను అడ్డుతొలగించాలని సిద్ధప్ప నాయుడు వేసే ప్లాన్స్‌ను తిప్పికొట్టి తన శైలిలో రెచ్చిపోతుంటాడు గబ్బర్‌సింగ్. ఈ క్రమంలోనే భాగ్యలక్ష్మీ (శ్రుతిహాసన్)తో ప్రేమలో పడతాడు..! ఇక అడుగడుగునా తన ఆధిపత్యానికి అడ్డంకిగా తయారైన గబ్బర్‌సింగ్‌ను సిద్ధప్ప ఏం చేశాడు? భాగ్యలక్ష్మితో అతని ప్రేమ ఫలించిందా..? గబ్బర్‌సింగ్ సిద్ధప్పకు ఎలా బుద్ధి చెప్పాడు? అతని ఆగడాల నుంచి కొండవీడు ప్రజలను ఎలా రక్షించాడు? అనేది మిగిలిన కథాంశం.

‘ఖుషీ’ తర్వాత పవన్ ఫుల్ జోష్‌తో నటించిన సినిమా ఇది. అతని నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెంటిమెంట్, వినోదం, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ తనదైన శైలిలో నటించాడు. పవన్ స్టయిల్, గెటప్, నడకతీరు చూసి ఇక అభిమానులైతే థియేటర్స్‌లో పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత డాన్స్ మూమెంట్స్‌తో కూడా ప్రేక్షకులను అలరించాడు పవన్‌కళ్యాణ్. శృతిహాసన్ నటనలో ఇంకా ఓనమాలు దిద్దుకుంటున్న హీరోయిన్‌గా కనిపించింది. నాగినీడు, సుహాసిని తమ పాత్రల పరిధి మేరకు ఒదిగిపోయారు. పవన్ తర్వాత ఈ సినిమాకు ప్రాణం పెట్టింది మాత్రం దర్శకుడు హరీష్‌శంకర్ అని చెప్పుకోవాలి. పవన్‌కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీష్ హీరో పవన్‌ను ఎలా చూపిస్తే అభిమానులు ఖుషీ అవుతారో అచ్చంగా అలాగే చూపించాడు. 

ముఖ్యంగా ఆయన రాసిన సంభాషణలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ ‘ట్రెండ్‌ని ఫాలో అవను, ట్రెండ్‌ను సెట్ చేస్తా’ వంటి సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ‘పాపులారిటీదేముంది పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, నేను ఆకాశం లాంటి వాడ్ని, నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ అనే సంభాషణలు పవన్ నోట పలుకుతుంటే అభిమానులు థియేటర్స్‌లో క్లాప్స్ కొడుతున్నారు. ఈ సంభాషణలే మున్ముందు ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేస్తాయి. ఈ చిత్రానికి వున్న మరో బలం దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం.

 సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే పాటలను విజువల్‌గా మరింత బాగా తీసుంటే బాగుండనిపిస్తుంది. జయనన్ విన్సెంట్ ఛాయాగ్రహణం డీసెంట్‌గా వుంది. ఓవరాల్‌గా గబ్బర్‌సింగ్ పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. సమ్మర్ సీజన్ కావడంతో ఇక ‘గబ్బర్‌సింగ్’కు వసూళ్లకు అడ్డు వుండదని చెప్పొచ్చు.

Read more...

బి.ఇడి సీటు చాలా హాటు!


బి.ఇడి ఎంట్రన్స్‌ను తేలికగా తీసుకున్నవారు ఇప్పుడు కౌన్సిలింగ్‌లో సీటు కోసం కుస్తీ పట్టవలసి ఉంటుంది. సోషల్ స్టడీస్‌లో, బయోలాజికల్ సైన్స్, మేథమేటిక్స్ గ్రూపుల్లో ప్రతి సీటుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీపడుతుంటే ఇక ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా, ఐ.ఎ.ఎస్.ఇ. , కాకతీయ కాంపస్‌లలో సీటు రావాలంటే ర్యాంకు ఎంత కనిష్టంగా వుంటే అంత సులువు అవుతుందని తెలిసిందే. 2011 కౌన్సిలింగ్ ముగింపు ర్యాంకుల ఆధారంగా విశ్లేషణ.

బి.ఇడి సోషల్ స్టడీస్ మెథడాలజీలో 19,500 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 59,605. ఇక బి.ఇడి మేథమేటిక్స్ మెథడాలజీలో 16,250 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 25,257. బయోలాజికల్ మెథడాలజీలో 13,000 సీట్లు వుండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 37,375. ఇక ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో 9,750 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 11,237, చివరగా బి.ఇడి ఇంగ్లీష్ మెథడాలజీలో 6,500 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 3193. బి.ఇడి సీట్లు, సంబంధిత బి.ఇడి మెథడాలజీ సీట్లు, ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను బట్టి చూస్తే ఇంగ్లీష్ మెథడాలజీ మినహాయిస్తే అన్ని మెథడాలజీలలో అందుబాటులో ఉన్న సీట్లకంటే అర్హత గల అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక గత ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,92, 389) కంటే, ఈ ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,36,667).

57 వేలు తగ్గినప్పటికీ నిర్థిష్ట మెథడాలజీలల్లో పోటీ కనిపించటం విశేషం. డియస్సీ రిక్రూట్‌మెంటులో ఎస్.జి.టి. పోస్టులకు బి.ఇడి. అభ్యర్థులను అనుమతించకపోవటంతో బి.ఇడి కోర్సుపై గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తక్కువ మోజు కనబరుస్తున్నారనేది తాజా ఎడ్‌సెట్ పోటీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా ఆయా మెథడాలజీ బి.ఇడి కోర్సుల సీట్లకంటే పోటీపడే అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనించాల్సిన విషయమే.


 Drawe00 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


కేంపస్‌లో సీటు పొందాలంటే?
ఎడ్‌సెట్ పరీక్షలో బెస్ట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఎక్కువగా కోరుకునేవి యూనివర్సిటీ బి.ఇడి కోర్సులనే. ఉన్నత విద్యకు, ఉత్తమ సదుపాయాలకు యూనివర్సిటీలే కేంద్రాలు. అందుకే ఇవి అఫర్ చేసే బి.ఇడి సీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. హాస్టల్ వసతి అదనపు ఆకర్షణగా అభ్యర్థులు కేంపస్ బి.ఇడిలకు మొగ్గు చూపుతుంటారు. గత ఏడాది జరిగిన ఉస్మానియా వర్సిటీ కేంపస్ కాలేజీ బి.ఇడి.అడ్మిషన్స్‌లో బి.ఇడి సీట్లు కైవసం చేసుకున్న టాప్ ర్యాంకర్ల వివరాలు పరిశీలిస్తే బి.ఇడి మ్యాథ్స్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ వుండగా, అలాగే ఫిజికల్ సైన్స్‌లో 26వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 1వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 16వ ర్యాంకర్, ఇంగ్లీష్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ అభ్యర్థులున్నారు.

అలాగే కాకతీయ యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి. కాలేజీలో సీట్లు సాధించిన ర్యాంకర్ అభ్యర్థులు బిఇడి మ్యాథమెటికల్ మెథడాలజీలో 367వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 86వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 14వ ర్యాంకర్, చివరగా ఇంగ్లీష్ మెథడాలజీ బి.ఇడిలో 26వ ర్యాంకర్ సీట్లు కైవసం చేసుకున్నారు. ఇదే పంథాలో టాప్ 100 నుంచి 500 ర్యాంకుల మధ్యన గల ర్యాంకర్లు ఆయా యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి కాలేజీలలో సీట్లు పొందగలరు. ఉదాహరణకు బి.ఇడి. కేంపస్ సీట్లు ఇంకా ప్రైవేటు బి.ఇడి సీట్లు మొత్తం సంఖ్యలో 15శాతం సీట్లు యూనివర్సిటీయేతర అభ్యర్థులు మెరిట్ ర్యాంకుతో రాష్ట్రంలో ఎక్కడైనా బి.ఇడి. సీటును కోరుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో బి.ఇడి. సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ జిల్లాలు), ఆంధ్రా వర్సిటీ (కోస్తాంధ్ర జిల్లాలు), శ్రీవేంకటేశ్వర వర్సిటీలలో (రాయల సీమ జిల్లాలు) భర్తీ అవుతాయి.

 edcet0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


100 సీట్లు గల బి.ఇడిలో 85 సీట్లు స్థానికులకు రిజర్వ్ చేయగా 15 సీట్లు స్థానికులు లేదా స్థానికేతరులు ఎవరైనా మెరిట్‌తో ఎంపిక అవుతారు. సాధారణంగా కేంపస్ బి.ఇడి సీటు డిమాండ్ ఉస్మానియా వర్సిటీకి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజధానిలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడకు వచ్చి కోర్సు చేస్తే బహుముఖ అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయం అభ్యర్థుల్లో వుంది. దానితో ఉస్మానియా బి.ఇడి కోర్సు పట్ల ఇతర యూనివర్సిటీ అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. యూనివర్సిటీ కాలేజీ బి.ఇడి. అభ్యర్థులకు ప్రముఖ కార్పోరేట్ సంస్థలో ప్లేస్‌మెంట్స్ ఇస్తుండటంతో కేంపస్ కోర్సులకు డిమాండ్ ఉంటోంది.

ఐ.ఎ.ఎస్.ఇ అంటే క్రేజ్
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐ.ఎ.ఎస్. ఇ.) ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు అభ్యర్థుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఉదా॥ మాసాబ్‌ట్యాంకులోని ఐ.ఎ.ఎస్.ఇ. విద్యా సంస్థ 1959లో ఏర్పాటైన పురాతన కాలేజీగా ఖ్యాతి గడించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ బి.ఇడి. కాలేజీల్లో ఒకటైన కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు ర్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. పటిష్టమైన విద్యాబోధన అందించే సీనియర్ క్వాలిఫైడ్ లెక్చరర్లు ఐ.ఎ.ఎస్.ఇ.;సి.టి.ఇ.లలో ఉండటం, అత్యంత తక్కువగా ఫీజు చెల్లించి బి.ఇడి ని సొంతం చేసుకునే అవకాశం ఉంటున్న దృష్ట్యా ఇక్కడి బి.ఇడి కోర్సులకు డిమాండ్ ఉంటోంది.
మాసాబ్‌ట్యాంక్‌లోని ఐ.ఎ.ఎస్.ఇ.లో 2011 బి.ఇడి సీట్లు పొందిన టాప్ ర్యాంకర్లను పరిశీలిస్తే, మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 46వ ర్యాంక్, ఫిజికల్ సైన్స్‌లో 208వ ర్యాంక్, బయోలాజికల్ సైన్స్‌లో 25వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 46వ ర్యాంకర్ చివరగా ఇంగ్లీష్ మెథడాలజీలో 30వ ర్యాంక్ అభ్యర్థులు అడ్మిషన్లు కైవసం చేసుకున్నారు.

 B.Ed0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


ప్రఖ్యాత బి.ఇడి. కాలేజీలు
రాష్ట్రంలో బి.ఇడి మొత్తం కాలేజీలు 605, ఇందులో మొత్తం సీట్లు 65వేలు ఉన్నాయి. ఫీజుల పరంగా సౌలభ్యం ఇతర సదుపాయాలపరంగా సౌకర్యం గల కేంపస్, గవర్నమెంట్ బి.ఇడి.కాలేజీల సంఖ్య పట్టుమని 15 మించడం లేదు. ఇందులో మొత్తం బి.ఇడి సీట్లు సంఖ్య 2వేలకు మించదు. పోటీకీ సమీపంలో గల ఎయిడెడ్ కాలేజీలలో ఫీజులు సాధారణంగానే ఉన్న దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు సదరు బి.ఇడి. కోర్సుల వైపు చూస్తున్నారు.

ఎక్కువభాగం బి.ఇడి సీట్లు ప్రైవేట్ బి.ఇడి కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ బి.ఇడి. కాలేజీలు కేంపస్ కాలేజీలతో పోటీపడేలా బి.ఇడి కోర్సును ఆఫర్ చేస్తూ అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఫీజులు మాత్రం కాస్త భారీగానే చెల్లించాల్సిందే. గత ఏడాది ప్రైవేటు కాలేజీలలో బి.ఇడి సీటు పొందాలంటే రూ. 16,500 ట్యూషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా, కేంపస్ బి.ఇడి కాలేజీలలో రూ.8,000 ఉండగా ఐ.ఎ.ఎస్.ఇ విద్యా సంస్థల్లో రూ.3000లతో బి.ఇడి కోర్సు చేసే అవకాశం ఉంటున్నది.
ఇంకా ఎస్.సి. , బి.సి, ఎస్.టి.కి చెందిన నిర్థిష్ట రూ.లక్ష రూపాయల కుటుంబ వార్షికాదాయం గల వారికి బి.ఇడి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వం నుంచి కాలేజీలకు రీయం బర్స్‌మెంటు లభించటం అభ్యర్థులకు తెలిసిందే.

Take By: T News

Read more...

రాయల రచ్చ


rayalatelangana-ఎందుకొస్తున్నదీ ప్రస్తావన?
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?


తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
- ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ జేఏసీ చైర్మన్


ఆంధ్రతో విలీనం చేసిన తెలంగాణ ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. నేను రాయల తెలంగాణకు సానుకూలమంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మొద్దు.
- గండ్ర వెంకటరమణాడ్డి, చీఫ్‌విప్


హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా):రాయలసీమలోని ప్రజల నుంచి ఇప్పటివరకు రాయల తెలంగాణ డిమాండ్ వినిపించకపోయినా కేవలం ఇద్దరు, ముగ్గురు సీమ నేతలు తరచూ ఈ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హస్తినలో కదలిక వచ్చినప్పుడల్లా ఆ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు ముందుకు నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు సైతం ఆ ప్రతిపాదనలకు గళం కలుపుతుండటం గమనార్హం. సీఎం మార్పు ఉంటుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని రాష్ట్ర మంత్రి జానాడ్డి గురువారం నల్గొండ జిల్లాలో వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం రాయల తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అనంతరం మాట మారుస్తూ రాయలతెలంగాణను ఏర్పాటు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నదని మాత్రమే తాను చెప్పానని అన్నారు.

అసలు రాయల తెలంగాణ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నది? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికా? లేక తెలంగాణకు పీటముడి వేయడానికా? తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలోనే ఈ ప్రతిపాదనలు రావడంపై రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణవాదుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలు తమ డిమాండ్‌పై ఎంతో కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే, సమయం, సందర్భం లేకున్నా కొందరు రాయల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటుండటంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ ప్రతిపాదన వెనుక వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప మరో కారణం లేదనే విషయం స్పష్టమవుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు ఏనాడైనా రాయల తెలంగాణ కోరుకున్నారా? ఆ దిశగా ఉద్యమాలు, ఆందోళనలు చేశారా? .. అలాంటి దాఖలాలే కనిపించవు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాయల తెలంగాణ ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తాము రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే ఉండదని తెలంగాణవాదులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిరసన కార్యక్షికమాలకు కూడా పిలుపునిచ్చింది. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని మరోమారు స్పష్టం చేసింది.

ఆ ముగ్గురి వల్లే..
రాయల తెలంగాణ ప్రస్తావన రావడానికి ఆ ముగ్గురే కారణం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మజ్లిస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని, భవిష్యత్తులో తమ ఉనికితోపాటు ముస్లింలకు ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన మజ్లిస్ పార్టీని వెంటాడుతున్నది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదని, తెలంగాణలోని 10 జిల్లాలతో ఆ రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయవచ్చని మజ్లిస్ భావిస్తోంది. మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ కోణంలోనే రాయల తెలంగాణ వైపు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒవైసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా తొలుత సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మంత్రి టీజీ వెంక మాజీ మంత్రి జేసీ దివాకర్‌డ్డి ఇప్పుడు పదే పదే రాయల తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని టీజీ వెంక రాయల తెలంగాణకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కడప జిల్లాకు చెందిన జగన్ లాంటి నేతలతో తన రాజకీయ ఎదుగుదల, పదవులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, భవిష్యత్తులో తాను కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగేందుకు వీలుకలుగుతుందని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఈ మధ్య గట్టిగా వాదిస్తూ చీటికి మాటికి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇటు తెలంగాణలో, అటు సీమలోని ఆ రెండు జిల్లాల్లో రాజకీయ నేతలు ఎవరు కూడారాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేయడం లేదు.

సంస్కృతి వేరు.. సమస్యలు జోరు
తెలంగాణ ప్రాంత ప్రజల, సీమలోని రెండు జిల్లాల ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర వేర్వేరు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య నీటి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నీటి వినియోగంపై మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏ రకంగానూ సబబు కాదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాయల తెలంగాణ ఏర్పాటుతో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం అందులో సరిగ్గా సగమవుతుంది. అంటే రాయల తెలంగాణ, ఆంధ్రాలో 21 మంది చొప్పున ఎంపీలు, 147 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉండేందుకు వీలు కలుగుతుందే తప్ప తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.

జనం వ్యతిరేకిస్తారు: పయ్యావుల కేశవ్
రాయల తెలంగాణ అనేది బాధ్యత లేని నేతల ప్రతిపాదన అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను సామాన్య జనం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో పయ్యావుల ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

గండ్రకేమన్న హైకమాండ్ చెప్పిందా: సారయ్య
వరంగల్ సిటీ, జూన్ 28 (టీ మీడియా): ‘రాయల తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏమన్న గండ్ర వెంకటరమణాడ్డితో చెప్పిందా? ఆయన ఏమన్న హైకమాండ్‌తో మాట్లాడారా’ అని మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని గండ్ర చెప్పారని విలేకరులు సారయ్య దృష్టిగాతేగా ఆయన పై విధంగా స్పందించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌ను, ఏ తెలంగాణ అన్నది కాదు తెలంగాణ మాత్రం వస్తుందని వివరించారు. నేను రాయల, ఆంధ్రా అని చెప్పడం లేదు, తెలంగాణ మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు.

రాయల తెలంగాణకు కేంద్రం ఓకే: గండ్ర
-సాయంవూతానికి మాటమార్చిన చీఫ్‌విప్
-విలీనమైన తెలంగాణే కోరుతున్నామని వివరణ

వరంగల్,  ప్రతినిధి: అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలతెలంగాణ ఏర్పడినా హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వస్త్తున్న ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం, కర్నూలుతో కలుపుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తమకు సమచారం ఉందన్నారు. కృష్ణాజలాల విషయంలో, అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదం పొందాలంటే కచ్చితంగా సంఖ్యాబలం కావాలని అన్నారు. బహుశా ఆ కారణంగా కేంద్రం ఆ రెండు జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ ప్రతిపాదనకు వస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ మండిపడటంతో సాయంవూతానికి గండ్ర మాటమార్చారు. గతంలోనే ఎంపీలు ఒవైసీ, కేసీఆర్ రాయల తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిందని చెప్పారని గుర్తు చేశారు. తాను సైతం అదే ప్రతిపాదన ఉందని మాత్రమే చెప్పానని వివరించారు. తమకు పాత హైదరాబాద్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

Take BY: T News

Read more...

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

Read more...

Thursday, June 28, 2012

ఏజెన్సీ మద్యం దుకాణాలకు బినామీల అవతారం



- వెనకుండి కథ నడిపించిన మద్యం మాఫియా
- విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న వ్యాపారులు
- ‘టీమీడియా’ పరిశీలనలో వెల్లడైన నిజాలు
- ప్రశాంతంగా మద్యం దుకాణాలకు ముగిసిన లాటరీ


ఖమ్మం టౌన్, జూన్ 27():‘నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. నవసమాజ నిర్మాతలు’ అని మన పెద్దలు సూక్తీకరించారు. కానీ ఆ విద్యార్థులు జిల్లాలో వేళ్లూనుకున్న మద్యం వ్యాపారంలో నేడు పావులుగా మారారు. అక్రమ మద్యం వ్యాపారంలో ఆరితేరి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న కొందరు రాబందులు వెనుక బడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తమ ఉన్నతికి మెట్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది కథ కాదు. పచ్చి నిజం..టీమీడియా పరిశీలనలో వెల్లడైన నిప్పులాంటి నిజం. జిల్లాలోని 153 మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిల్లో 71దుకాణాలను ఏజెన్సీ ప్రాంతానికి కేటాయించింది. అయితే ఏజెన్సీలో మద్యం దుకాణానికి దరఖాస్తు చేయాలంటే స్థానిక గిరిజనుడికే మొదటి ప్రాధాన్యత. అలాగే సంబంధిత తహసీల్దార్ ఇచ్చిన నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలనే కచ్చితమైన నిబంధన అమల్లో ఉంది. కాగా ఆ రెండు సర్టిఫికెట్‌లు పొందాలంటే ప్రస్తుత చట్టాల ప్రకారం సామాన్యులకు వెంటనే సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఎప్పటి నుంచో మద్యంతో మన్యం ప్రజలను దగా చేస్తున్న అక్రమార్కుల కన్ను విద్యార్థులపై పడింది.

ఉన్నత విద్య కోసం తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను ఆసరాగా చేసుకుని విద్యార్థులను ముగ్గులోకి లాగింది మద్యం మాఫియా. ఈనెల 19 నుంచి 25 వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసేందుకు వచ్చిన వారిని పరిశీలించడంతోపాటు రెండు రోజులు( మంగళ, బుధవారాల్లో) రామకృష్ణా ఫంక్షన్‌హాల్లో చేపట్టిన లాటరీ ప్రక్రియకు హాజరైన వారిని ‘టీమీడియా’ నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో వారిని పలకరిస్తే నిజాలు నిగ్గు తేలాయి. వారు ఏషాపునకు దరఖాస్తు చేశారో.. ఎంత డబ్బు చెల్లించారో ఎవ్వరికీ తెలియదు. లాటరీలో దుకాణం దక్కినా.. ఈఎండీ ఫీజు డబ్బు చెల్లించడానికి వెనకుండి ఉరికిచ్చిన వారు సకాలంలో ఎవరూరాక పోవటంతో నేరం చేసిన వాళ్ల లాగా బిక్కమొహాలేసుకుని గంటల తరబడి హాల్‌లోనే కూర్చున్నారు. ఇలా చదువుతో చక్కని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే విద్యార్థులను మద్యం మాఫియా బినామీ వ్యాపారులుగా మార్చారు.

ముగిసిన లాటరీ ప్రక్రియ...
మైదానంలో 2, ఏజెన్సీలో 71 కలిపి జిల్లాలో మొత్తం 153మద్యం దుకాణాలు ఉన్నాయి. కాగా ఆయా ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మైదానంలో1591, ఏజెన్సీలో 971 మొత్తం 2562 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా అదికారులు వాటికి పట్టణంలోని బైపాస్‌రోడ్‌లోని రామకృష్ణా ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎంఎం నాయక్ సమక్షంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న లాటరీ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఆ క్రమంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటేంతవరకు మైదాన ప్రాంత దుకాణాలకు(2)కు లాటరీ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు. కాగా మిగిలిన ఏజెన్సీ ప్రాంత దుకాణాలు (71) కు సంబంధించి నిబందనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లాటరీ తీయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సూచించడంతో బుధవారం ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో వ్యాపారులు కొంత అసహనానికి గురై ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే అక్కడకు వచ్చిన నాయక్ ఉన్నతాధికారులతో సంప్రదించి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. అలాగే మిగిలిన 71 ఏజెన్సీ దుకాణాల్లో 11 దుకాణాలకు ఒకే ఒక్కరు దరఖాస్తులు చేశారు. వాటిల్లో కొత్తగూడెం మండలం చుంచుపల్లి(92), భద్రాచలం మండల కేంద్రం(115), కూనవరం(122), చింతూరు(126), మణుగూరు(131, 133, 135, 136, 139, 141, 142) ఉన్నాయి. వీటి దరఖాస్తులకు లాటరీ ప్రక్రియ చేపట్టకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే చింతూరు మండల కేంద్రంలోని దుకాణానికి ఒక్కరు కూడా దరఖాస్తు చేయకపోవటంతో లాటరీ నిలిపేశారు. కాగా ఏజెన్సీ ప్రాంత దుకాణాలకు లాటరీ ప్రక్రియలో స్థానిక నివాస, కుల సర్టిఫికెట్లను సమర్పించిన వారినే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. కొందరు తమ పిల్లల సర్టిఫికెట్లను దరఖాస్తుతో జత చేసినా ఇన్‌చార్జ్ కలెక్టర్ నాయక్ వాటిని తిరస్కరించారు. మరికొన్ని దుకాణాలకు ఇద్దరు కలిసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్నీ అడ్డుకున్నారు.

శభాష్ నాయక్..!
కలెక్టర్ సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు ఆ మరుసటి రోజే గురుతరమైన బాధ్యత భుజాలపై పడింది. అదే మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ. గతంలో టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారి పలువురి మెడలకు ఉచ్చు బిగిసిన నేపథ్యంలో అసలు ఈ వ్యవహారమంటేనే వణుకు పుట్టే పరిస్థితి అధికారుల్లో నెలకొంది. ఈక్రమంలో రెండ్రోజుల పాటు సాగిన లాటరీ ప్రక్రియను నాయక్ తన భుజాలపై వేసుకున్నారు. దరఖాస్తుదారుల జాతకాలు చూసే ఈ ప్రక్రియను మొదటి రోజు ప్రారంభించిన ఆయన ఆధ్యంతం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. తొలి రోజున తెల్లవారుజామున మూడు గంటల వరకూ అక్కడే ఉండి లాటరీ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.

ఎక్సైజ్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ నియమ, నిబంధనలకు ఉల్లంఘన కలుగకుండా దిశానిర్దేశం చేశారు. రెండోరోజున మొదలైన ఏజెన్సీ షాపుల ఎంపికలోనూ పారదర్శకత పాటించారు. దరఖాస్తుదారులు స్థానిక గిరిజన, నివాస ధ్రువపత్రాలను సమర్పించే విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించారు. షాపుల వారీగా ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. ఒకానొక సందర్భంలో ఏజెన్సీ సర్టిఫికెట్లను సరైన రీతిలో పరిశీలించకుండా దరఖాస్తుదారులను లోపలికి అనుమతించిన ఓ పోలీసు అధికారిపై ఆయన మండిపడ్డారు. వెంటనే ఆయనకు మెమో జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇతరులెవరికీ లాటరీ తీసే అవకాశం కల్పించకుండా మీడియా, పత్రికల ప్రతినిధులతో టోకెన్లను తీయించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Take By: T News

Read more...

Good Cartoon - Namasthe Telangaana


Take By: T News

Read more...

సమన్వయం లేదు అందుకే ఓడాం - చిరంజీవి


Chieee talangana patrika telangana culture telangana politics telangana cinema
సోనియాకు నివేదించిన చిరంజీవి మీరూ కారణమేనన్న అధినేత్రి
‘ఉప’ ఓటమిపై పోస్ట్‌మార్టం
- పార్టీ బలోపేతంపై చర్చించాం
- పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో మేడమ్ కార్యాచరణ
- నాయకత్వ మార్పు ఉండదు
- నావల్లే గెలిచామని నేననలేదు మీడియానే వక్రీకరించింది
- సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి
- రాష్ట్రంపై అధినేత్రి ప్రత్యేక దృష్టి
- అందుకే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు
- నాయకత్వ మార్పు అక్కర్లేదు: రఘువీరా
- అధిష్ఠానం ఆదేశిస్తే చిరును సమర్థిస్తాం

న్యూఢిల్లీ, జూన్ 27 ():కాంగ్రెస్‌లో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సమన్వయం లోపించడంవల్లే ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినట్లు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధినేత్రి సోనియాగాంధీ కూడా అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె దృష్టి సారించినట్లు తెలిపారు. దానిపై ఆమె రూపొందించే కార్యాచరణ ప్రణాళికను తామంతా అనుసరించి పార్టీని బలోపేతం చేస్త్తామని చెప్పుకొచ్చారు. కిందిస్థాయి నాయకులకు పార్టీ, నామినే పదవులు ఇచ్చి పని కల్పించాలని మేడమ్‌ను లేదు సమన్వయం.. అందుకే ఓడాం
కోరినట్లు తెలిపారు. ఆయన బుధవారం రాష్ట్ర మంత్రులు సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాసరావులతో కలిసి సోనియాతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. పార్టీ ఓటమి చెందడానికి కారణాలపై తనదైన నివేదికను ఆమెకు అందజేశారు.

ఆంధ్రవూపదేశ్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం పార్టీ అగ్ర నేతలు పలువురు అధిష్ఠానాన్ని కలిసి తమ వివరణలను, అభివూపాయాలను నివేదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం చిరంజీవి కాంగ్రెస్ అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. అగ్ర నాయకత్వం నుంచి, క్షేత్రస్థాయి వరకు అన్నిచోట్లా సమన్వయ లోపం కారణంగానే పార్టీకి దారుణ అనుభవం ఎదురైందని ఆయన విశ్లేషించినట్లు సమాచారం. తిరుపతిలాంటిచోట్ల కూడా నాయకుల మధ్య సఖ్యత కొరవడటం, అంతర్గత గ్రూపు తగాదాలవల్లే పార్టీ నష్టపోయిందని వివరించినట్లు తెలిసింది. రాజంపేట, రాయచోటి లాంటిచోట్ల సరైన అభ్యర్థులను నిలుపలేదని ఆయన అసంతృప్తి వ్యక్తపరిచినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గంతో పోలిస్తే తన సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పార్టీకి పడ్డాయని ఆయన నియోజకవర్గాలవారీగా సమాచారాన్ని సోనియాకు అందించినట్లు తెలిసింది.

దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంవల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీ పీఆర్పీ విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని, తన వర్గానికి ప్రాధాన్యం లభించలేదని చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సోనియా సైతం చిరంజీవి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకత్వం సహకరించటం లేదని ఫిర్యాదు చేస్తున్న మీరు సమన్వయం కోసం ఏం ప్రయత్నాలు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ విలీనమై ఏడాది గడుస్తున్నా సొంత వర్గీయులైన గంటా, రామచంవూదయ్యలను వెంట తిప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సీనియర్లతో, నాయకులతో సఖ్యత యత్నాలు ఆశాజనకంగా లేవని అన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నందున అహంభావాలకు పోకుండా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

అందుకే కేంద్ర పదవి అడుగుదామనుకున్న చిరంజీవి ఆ పనిచేయకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది. సోనియాతో సమావేశమైన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనూ తాను కేంద్ర పదవిని ఆశించలేదంటూ నిట్టూర్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సోనియాతో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. సానుభూతే జగన్ విజయానికి కారణమని, అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారిందన్న అంశం తమ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. రెండుస్థానాల్లో పార్టీ విజయానికి కారణాలపై సైతం చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలపై మేడమ్‌కు అవగాహన ఉందని, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి? పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. రామచంవూదాపురం, నరసాపురంలో పార్టీ తనవల్లే గెలిచిందని తానెప్పుడూ అనలేదని వివరణ ఇచ్చారు. అదంతా మీడియా వక్రీకరణ అంటూ కొట్టిపారేశారు.

‘‘కలిసికట్టుగా పనిచేయడంవల్లే ఆయా స్థానాల్లో విజయం సాధించాం. ఇదే రకంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పా. నావల్లే అక్కడ గెలిచారని నేనన్నట్లు మీడియా పదే పదే ప్రచారం చేయడం భావ్యం కాదు’’ అని సూచించారు. అందరం కలిసి ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే తిరుపతి అభ్యర్థిని ఎంపిక చేశామని, వెంకటరమణ ఎంపిక సమిష్టి నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 ఎన్నికల తర్వాత చిరంజీవే సీఎం అన్న పెడన ఎమ్మెల్యే జోగు రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ- అది ఆయన అభిమానంగా చూస్తున్నాను తప్ప ఆయన పదాల్లోని అర్థాన్ని తాను చూడటం లేదని అన్నారు. పార్టీలో తననెవ్వరు టార్గెట్ చేయడం లేదన్న ఆయన, దాన్ని మీడియానే ఎక్కువచేసి చూపుతోందన్నారు. తెలంగాణ అంశంగానీ, తనకు కేంద్ర మంత్రి పదవి అంశంగానీ చర్చకు రాలేదన్నారు. ‘‘సామాన్య కార్యకర్తగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.

నా బాధ్యత ఏమిటన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది తప్ప నేను ఫలానా పదవి కావాలని ఏనాడూ అడగలేదు. కేంద్ర పదవి ఇవ్వకపోయినా, సంతృప్తిగా పనిచేస్తా. ప్రజలకు ఏం చేయాలన్నదే నాకు ముఖ్యం తప్ప నాకేం కావాలన్నది ముఖ్యం కాదు. ఎంపీగా అవకాశం ఇచ్చారు. నన్ను నిరూపించుకోనీయండి’’ అని స్పందించారు. ప్రభుత్వ పెద్దల పనితీరుపై అధ్యక్షురాలి వద్ద అసంతృప్తి వ్యక్తంచేయలేదని చెప్పారు. కేవలం భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపైనే సలహాలిచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాయకత్వ మార్పుల అంశం తమ చర్చలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. నాయకత్వ మార్పుంటుందని తాననుకోవడంలేదని చెప్పారు. మనుషులను సోనియా మారుస్తారని అనుకోనన్నారు. సీఎం మార్పుపై చర్చే లేనప్పుడు మీడియా వారికి నాయకత్వ మార్పుపై అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందన్నది కేవలం అభియోగమే తప్ప అది నిర్ధారణ కాలేదని గుర్తు చేశారు.

అవినీతి నిర్ధారణ అయితే తాను ఖచ్చితంగా స్పందిస్తానని బదులిచ్చారు. కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లేశారా అన్న ప్రశ్నకు తానేం మాట్లాడనని సమాధానమిచ్చారు. ఓట్లు ఎవ్వరు వేసినా వేయకపోయినా కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్న ఆయన అది ఎప్పటికీ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇతరుల ఓట్లు ఎంత మేర సాధించుకుంటామన్నదే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పీఆర్పీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయలోపం కొనసాగుతోందని అంగీకరించారు. దాన్ని అధిగమించేలా పార్టీ కార్యాచరణ చేపట్టాలని కోరిన ఆయన అధిష్ఠానం చేపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆగస్టులోపు పార్టీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టడానికి పార్టీ పెద్దలు దృష్టిసారిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలవల్లే పదవుల భర్తీ జరగలేదని తెలిపారు. నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

దాంట్లో అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీని కలిసి అభినందనలు తెలియచేశారు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక్కడి పార్టీ పరిస్థితులపై అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని పార్టీ వర్గాలు అభివూపాయపడుతున్నాయి.
4200 talangana patrika telangana culture telangana politics telangana cinema
నాయకత్వ మార్పుపై అధిష్ఠానానిదే నిర్ణయం: మంత్రి రఘువీరాడ్డి
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితులను గాడిలో పెట్టడానికి నాయకత్వ మార్పు అవసరం లేదని రాష్ట్రమంత్రి రఘువీరాడ్డి అభివూపాయపడ్డారు. తనతో సహ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న ఆయన పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యతని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఢిల్లీ వచ్చిన రఘువీరాతో ఎంపీ చిరంజీవి బుధవారం కొద్దిసేపు మంతనాలు జరిపారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. పార్టీలో సమన్వయం లోపించిందన్న చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికార పార్టీలో ఇలాంటివి సహజమని అన్నారు. దానికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. ఉప ఓటమికి కారణాలు వెతకడానికే పరిమితం కాకుండా ఓటమిని అధిగమించే విధంగా కార్యాచరణ రూపొందించుకుని నాయకులు ఐక్యంగా పనిచేయాలని కోరారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇకపై దానిపై మాట్లాడబోమని తెలిపారు. పదే పదే నాయకులు అభివూపాయాలను వ్యక్తంచేయడం భావ్యం కాదన్నారు. అధిష్ఠానం చిరంజీవి నాయకత్వంలో పనిచేయాలని ఆదేశిస్తే దాన్ని తాము ధిక్కరించబోమని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. అధిష్ఠానం చెబితే చిరుతో సహా ఎవరి నాయకత్వాన్నైనా అంగీకరిస్తామని తెలిపారు.

Take By: T News

Read more...

గోప్యజ్ఞానం కాల్‌యుగ! కాల్‌లిస్టుల సంచలనం క్యా హై?


వ్యక్తుల ప్రైవసీ మాటేమిటి?.. మీడియా పాత్రేమిటి? చట్టం చుట్టరికం ఎందాక?
- కాల్‌లిస్టుల వ్యవహారంలో సందర్భాన్ని బట్టి నేరం తీవ్రత పెరుగుతుందా?
- బోఫోర్స్ నుంచి తెహల్కా దాకా.. మారుతూ వచ్చిన మీడియా మాటేమిటి?
- రెండుగా చీలిన రాష్ట్ర మీడియాలో ఏది సత్యం.. ఏదసత్యం?

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన మొబైల్‌లో ఎవరితో మాట్లాడారు క్లాస్‌మేట్ చంద్రబాల ఎవరికి ఫోన్ చేశారు.. వారి మొబైల్ కాల్‌లిస్టులో ఎవవరి నంబర్లున్నాయి ఇది తెలుసుకోవాలంటే చట్టవూపకారం తెలుసుకోవచ్చా.. తెలుసుకోవచ్చుననుకుంటే అది వారి ప్రైవసీకి భంగం కలిగించినట్టు కాదా?.. వారే కాదు, ఎవరి నంబర్ల నుంచి కాల్స్ ఎటు వెళ్లాయో ఏ సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పోలీసు అధికారుల స్థాయిలో ఇది సాధ్యమే అయినా, ప్రైవేటు వ్యక్తులు దొడ్డిదారిన ఆ పని చేస్తే ఎలా? అసలు వ్యక్తుల ప్రైవసీకి అర్థమే లేదా?.. ఒకవేళ ఉన్నతస్థాయి వ్యక్తులకు సంబంధించి ఈ సమాచారాన్ని తెలుసుకుంటే అది అధికార రహస్యాల చట్టం కింద తీవ్రమైన నేరం అవుతుందా?

ఆధునిక సాంకేతిక పరిజ్ఖానంతో మీడియా బహుదా విస్తరించిన కాలంలో ఉన్నాం. కాలంతో పాటు కొత్త ప్రశ్నలూ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే కాల్‌లిస్టుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం ఒకవైపు, దానిని అందిపుచ్చుకొని ప్రైవసీ పరిధిని ఛేదించుకొని సమాచార సేకరణ దిశగా పరుగులు పెడుతున్న మీడియా మరోవైపు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు పెను తుఫాన్‌గా మారిన కాల్‌లిస్టుల వ్యవహారంపై.. ఇప్పటికే రాష్ట్రంలో రెండుగా విడిపోయిన మీడియాను గమనిస్తున్నవారికి, ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కాల్‌లిస్టులను సేకరించి నేర పరిశోధన చేసిన ఉదంతాలు ఒక ఎత్తయితే, ఇదే కాల్‌లిస్టుల వ్యవహారంలో ఏకంగా ఓ జర్నలిస్టుపై కేసులు నమోదు కావడం ఇప్పుడు తాజా పరిణామం. జాతీయ స్థాయిలో బోఫోర్స్ కుంభకోణం మొదలుకొని గత దశాబ్దంలోని తెహల్కా స్టింగ్ ఆపరేషన్ వరకు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు మీడియా కొత్త పుంతలు తొక్కింది.

మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు ఆనాడు చట్టబద్ధత లేకపోయినా, మారిన పరిస్థితుల్లో ఆ ఆపరేషన్‌ను కోర్టులు కూడా ఆమోదించాయి. అదే క్రమంలో ఇప్పుడున్న మార్గాలను దాటి జర్నలిస్టులు సమాచార సేకరణకు పూనుకుంటే చట్టపరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఇప్పుడు రాష్ట్రంలో కాల్‌లిస్టుల వివాదం ముందుకు తెచ్చింది. గతంలో మద్దెలచెరువు సూరి హంతకుడు భాను అజ్ఞాతంలో ఉన్నపుడు అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్టును మీడియా ప్రతినిధులే బయటపెట్టారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన కాల్‌లిస్టును బయటపెట్టడమూ సంచలనమే అయింది. గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మాట్లాడారంటూ ఓ వ్యక్తి కాల్‌లిస్టుతో కోర్టుకెక్కడమూ జరిగింది. అయితే, ఆ కేసులు వేరు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసు తీవ్రత వేరు కేసు తీవ్రతను బట్టి కాల్‌లిస్టుల సేకరణలో నేరం తీవ్రత కూడా మారుతుందా అనేది ఇక్కడ ప్రశ్నగా నిలిచింది. జర్నలిస్టు యాదగిరిరెడ్డి అక్రమ మార్గంలో జేడీ కాల్‌లిస్టును సేకరించారు. అది నేరమే కావచ్చు. అంతమాత్రాన అధికార రహస్యాల చట్టం కింద పరిగణించేంత నేరమా అనేది మరో ప్రశ్న.

హైదరాబాద్, జూన్ 27 () సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...ఆయన క్లాస్‌మేట్ వాసిడ్డి చంద్రబాల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టుల వ్యవహారంలో ఇటు మీడియా, అటు దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ అక్రమాస్తులు, కంపెనీల కేసుల నేపథ్యంలో ఇప్పటికే రెండుగా విడిపోయిన మీడియా రంగం తమకు ఆసక్తి ఉన్న కోణాల్లో మాత్రమే వార్త కథనాలను వండివారుస్తూ మొదలుపెట్టిన ‘మీడియా యుద్ధం’ చివరకు జర్నలిస్టుల విధులనే ప్రశ్నార్థకం చేసే దశకు చేరుకుంది. వేర్వేరు కుంభకోణాలు...కేసులకు సంబంధించి వివరాలు కావాల్సి వచ్చినపుడు మీడియా ప్రతినిధులు వేర్వేరు మార్గాల్లో సమాచారాన్ని సేకరించటం పరిపాటి. ఆనాటి బోఫోర్స్ కుంభకోణం మొదలుకుని రాష్ట్రాన్ని కుదిపేసిన మాజీ గవర్నర్ తివారీ రాసలీలల వ్యవహారం...మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న భాను సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ వరకు జర్నలిస్టులు తమకు వీలైన మార్గాల్లోనే సమాచారాన్ని సంపాదించారు.

ప్రయివేట్ వ్యక్తులు ఐపీఎస్ అధికారుల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టులను సేకరించి బయటపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఉదంతంలోనూ జర్నలిస్టులపైగానీ.పయివేట్ వ్యక్తులపైగానీ కేసులు నమోదు కాలేదు. కానీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంగా మారిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...వాసిడ్డి చంద్రబాల సెల్‌ఫోన్ల కాల్‌లిస్టుల ఉదంతంలో మాత్రం మీడియా ప్రతినిధి యాదగిరిడ్డిపై కేసులు నమోదయ్యాయి.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా సదరు జర్నలిస్టుపై కేసులు పెట్టటం. యాదగిరిడ్డి చేసింది తప్పే...అయితే ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదని న్యాయ నిపుణులు చెబుతుండగా, ఓ మీడియా ప్రతినిధిగా రాష్ట్రం మొత్తం మీద చర్చనీయంగా ఉన్న కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వృత్తి ధర్మంలో భాగంగానే అతను చంద్రబాల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సేకరించాడని జర్నలిస్టు సంఘాల నేతలు అంటున్నారు. కాగా, చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించేందుకు సదరు జర్నలిస్టు అనుసరించిన విధానం ఖచ్చితంగా తప్పేనని సీనియర్ ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తమిళనాడు తరహాలో పార్టీలవారీగానో...సొంత ప్రయోజనాల కోసమో మీడియా రెండుగా విడిపోవటం వల్ల ఏ అంశంలోనూ ప్రజలకు పూర్తి నిజాలు తెలియకుండా పోతుండటంతోపాటు ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అందరి దృష్టి...
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జగన్ కంపెనీలపై కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మేళ్లు పొందిన సంస్థలు, వ్యక్తులే జగన్‌కు చెందిన కంపెనీల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని సీబీఐ అధికారులు దర్యాప్తులో తేల్చారు. అంతా క్విడ్-వూపో-కో పద్ధతిలోనే జరిగిందంటూ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో అభియోగాలు కూడా మోపారు. జగన్‌తోపాటు ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్‌ఛైర్మన్ విజయసాయిడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌లను అరెస్టు కూడా చేశారు. ఆరేళ్లపాటు ముఖ్యమంవూతిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్‌కు సంబంధించిన కేసు కావటంతో దీనిపై మొదటి నుంచి అటు మీడియా ఇటు ప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రెండుగా విడిపోయిన మీడియాలో ఒకరు అంతా చట్టవూపకారమే జరిగిందంటూ వాదనలు వినిపిస్తుండగా మరొకరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల ప్రజాధనం లూటీ చేశారంటూ వరుస కథనాలను ఇ స్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

ఆరోపణలతో దుమారం...
సరిగ్గా దీనిపైనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఉద్దేశపూర్వకంగా మీడియాలో కొందరికి లీకులు ఇస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ...జగన్ ప్రతిష్టను దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఉప ఎన్నికల సమయంలో కావాలని జగన్‌ను దెబ్బతీసేలా లీకులు ఇస్తూ, జగన్ వర్గం మరింతగా బలపడకుండా సీబీఐ అధికారులు కుట్ర పన్నారనేది వారి ప్రధాన ఆరోపణ. జగన్ అరెస్టు, ఇతరత్రా కథనాలు ఎంతో ముందుగా లీక్ కావడంతో కూడా ఎన్నికల సమయంలో తమ పార్టీకి ఎంతో నష్టంగా వారు భావిస్తున్నారు.

ఇలాంటి లీక్‌లు రానట్లయితే ఇంకా కొందరు నేతలు తమ పార్టీలోకి వచ్చే వారని రెండు కీలక పార్టీల నుంచి వలసలు ఇంకా పెరిగేవని, కానీ సీబీఐ లీక్‌ల వల్లనే ఇవి కొంతవరకు తగ్గినట్లుగా కూడా జగన్ వర్గం వారు వాదిస్తూ, ఇది కుట్రలో భాగమనే విధంగా విమర్శలు చేస్తూ, లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ప్రభుత్వంలో సలహాదారునిగా పనిచేసిన ఓ నాయకుని బంధువు లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్టును సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం నాందేడ్‌లోని ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీని ఆశ్రయించారు. సదరు ఏజన్సీ నిర్వాహకులు నాందేడ్ ఎస్‌పీ సహాయంతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించి దానిని అతనికి అందచేసినట్టుగా పోలీసులు అంతర్గతంగా జరిపిన విచారణలో వెల్లడైంది. ఆ తరువాత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన నేత బంధువు జగన్ కంపెనీల కేసులో లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు.

కారణాలు తెలియవుగాని ఆ తరువాత కొన్నిరోజులకు ఆయన తన పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇలా బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరింది. ఆ తరువాత మీడియా ప్రతినిధి యాదగిరిడ్డి చేతికి చిక్కింది. కాగా, తన మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ బయటకు వచ్చిందని తెలిసి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన సెల్‌ఫోన్ నెంబర్‌ను అప్పుడే మార్చుకున్నారు. తప్పితే తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ ఎలా బయటకు వచ్చిందన్న దానిపై మాత్రం ఆరా తీయలేదు. అయితే పోలీసు కేసు లేకుండా ఫోన్ కాల్స్ లిస్టును కోరడంలో ఔచిత్యం లేదని.. అయినప్పటికీ జేడీ, చంద్రబాల లిస్టును పోలీసులు సేకరించడం తప్పని, అయితే జర్నలిస్టుగా తనకు లభించిన వివరాలను ప్రచురిస్తే మాత్రమే తప్పనే విధంగా పోలీసుల కేసు నమోదు చేయడం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నారు.

ఇవిగో ఆధారాలు..
ఆ తరువాత కొన్నిరోజులకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు దొరికాయని ప్రకటించారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు తరచుగా వాసిడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్లు చేస్తున్నారని...ఆమె తన మొబైల్ నుంచి ఓ పత్రిక అధినేతకు కూడా ఫోన్లు చేసినట్టుగా ఆధారాలున్నాయని వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే లీకులు నిజమే అనిపిస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఓ మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ వరుస కథనాలు రాగా మరో మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను సమర్థిస్తూ కథనాలు వచ్చాయి. దాంతో అసలు జరిగిందేమిటి? వాస్తవాలు ఏమిటి? అన్నది జనానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

చంద్రబాల ఫిర్యాదుతో...
ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాల తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించి దానిని బహిరంగ పరచటం ద్వారా ప్రతిష్టను దెబ్బ తీశారంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి జరిపిన దర్యాప్తులో జర్నలిస్టు యాదగిరి నాచారం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సహాయంతో ఆమె మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించినట్టుగా తేలింది. యాదగిరిడ్డి అడిగిన వెంటనే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కూడా వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా...పైగా మల్కాజిగిరి డీసీపీ ఈ-మెయిల్ ఐడీని తస్కరించి కాల్‌లిస్ట్‌ను తెప్పించి యాదగిరిడ్డికి ఇచ్చారు. దీని ఆధారంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాలపై ఆరోపణలను తీవ్రతరం చేశారు. ఈ విషయంపై సీనియర్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడినపుడు.. ఈ విషయంలో యాదగిరిడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లు చేసింది చట్టవూపకారం తప్పేనని వ్యాఖ్యానించారు. ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని దొడ్డిదారుల్లో సంపాదించే హక్కు ఎవ్వరికీ ఉండదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు.

ఇదే మొదటిసారి కాదు...
యాదగిరిడ్డిపై తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. మీడియా ప్రతినిధులు...చివరకు ప్రయివేట్ వ్యక్తులు సైతం ఇతరుల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులను సంపాదించటం ఇదే మొదటిసారి కాదన్నారు. మద్దెలచెరువు సూరిని హత్య చేసిన భాను అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం మీడియా ప్రతినిధులే అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని గుర్తు చేశారు. భాను మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులో సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉండటాన్ని కూడా మీడియానే వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు. గుంటూరు రూరల్ ఎస్‌పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మొబైల్‌ఫోన్‌లో మాట్లాడారంటూ కే.కార్తిక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేయటమే కాకుండా కాల్‌లిస్ట్‌ను సమర్పించిన ఉదంతాన్ని కూడా గుర్తు చేశారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసినపుడు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను ఫోన్‌లో వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని కూడా ఉదహరించారు. ఏ డిటెక్టీవ్ ఏజన్సీకి వెళ్లి...ఫలానా నెంబర్ వివరాలు కావాలంటే ఒకటి రెండు రోజుల్లో తెచ్చి ఇవ్వటం లేదా? అని ప్రశ్నించారు. ఈ అన్ని సందర్భాల్లో ప్రస్తావనకు రాని అధికార రహస్యాల చట్టం ఇప్పుడెలా ముందుకు వచ్చిందని అడిగారు. ఈ పరిణామాలు దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై ఖచ్చితంగా అనుమానాలు కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.

అంత తీవ్ర చట్టమా?
సైబరాబాద్ పోలీసులు జర్నలిస్టు యాదగిరి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కేసులో అధికార రహస్యాల చట్టం ఎందుకు వచ్చిందో? ఎలా వచ్చిందో? తమకు అర్థం కావటం లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించటానికి యాదగిరిడ్డి అనుసరించిన మార్గం తప్పుడుదే అయినా...ఓ ప్రయివేట్ మహిళ కాల్‌లిస్ట్ సంపాదిస్తే అది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొనసాగుతున్న వార్‌లో భాగంగా ఓ వర్గం మీడియా జరిగినదాన్ని భూతద్దంలో చూపించటం...దర్యాప్తు సంస్థలు సైతం యాదగిరిడ్డిని మీడియా ప్రతినిధిగా కాకుండా జగన్‌కు చెందిన పత్రికలో పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన మనిషిలా చూడటం వల్లనే ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారేమో అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా.. అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సమర్థించక పోవటం గమనార్హం. అయితే అటు లక్ష్మీనారాయణ, ఇటు చంద్రబాల కాల్‌లిస్ట్‌లను అక్రమ పద్ధతిలో సంపాదించడం కూడా సరైనది కాదని మరికొందరు అభివూపాయపడుతున్నారు. వీరితో మాట్లాడినపుడు రాష్ట్రంలోని మీడియాలో క్రమంగా తమిళనాడులోని మీడియా తరహాలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అక్కడ పార్టీలవారీగా విడిపోయిన మీడియా పరస్పరం బురద చల్లుకోవటం సర్వసాధారణమైపోయిందని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలో...పార్టీల వారీగా పక్షం తీసుకోవటం వల్లనే తెలియదుగాని మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషించారు.

ప్రైవసీ ఇంకా ప్రాథమిక హక్కు కాదు
- జీవించే హక్కులో అంతర్భాగమన్న సుప్రీంకోర్టు

హైదరాబాద్, జూన్ 27 (టీ మీడియా): రాజ్యాంగ నిర్మాణం జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రైవసీ ప్రాథమిక హక్కుగా గుర్తింపునకు నోచుకోలేదు. 1964లో ఉత్తరవూపదేశ్- ఖరక్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవసీ అన్నది జీవించే హక్కులో అంతర్భాగమని మాత్రమే వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి జీవితంలోకి మరో వ్యక్తి తొంగిచూడటం ప్రైవసీని భంగపరిచినట్టు కాదంటూ మేనకాగాంధీ-రచయిత కుష్వంత్‌సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. కుష్వంత్‌సింగ్ రచించిన ట్రూత్ లవ్ అండ్ లిటిల్ మలైస్ పుస్తకంలో తన ప్రైవసీకి భంగం కలిగించేవిధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచిన మరో కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది.

ప్రైవసీ హక్కు అన్నది రాజ్యాంగం కల్పించలేదని, అయితే కేసు అంశాల ఆధారంగా మాత్రమే దానిని గుర్తించాలని వ్యాఖ్యానించింది. అయితే, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్ స్టాకింగ్, సైబర్ స్నూపింగ్, స్పాం మెయిల్, మొబైల్‌ఫోన్లు, హ్యాకింగ్ ద్వారా ఒక వ్యక్తి జీవితంలోకి ఇతరులు జోక్యం చేసుకోవటానికి అనేక అవకాశాలు లభించాయి. దీనిని అరిక ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 72 ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మరెవరికో అందజేస్తే, చట్టం ప్రకారం సదరు అధికారి శిక్షార్హుడవుతాడు.

వాస్తవాలను వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా ఇప్పటికీ అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


మీడియా సంస్థల్లోకి రాజకీయాలు వచ్చి అవి విడిపోయాయి. మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేని కోసమో వాడడు. చంద్రబాల కాల్ లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవు
సమాచార సేకరణలో జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవుగానీ ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో వాస్తవాలను వెల్లడించడానికి అనువుగా కొన్ని సదుపాయాలున్నాయి. వార్తను ఇచ్చే, చెప్పే వ్యక్తుల దగ్గర ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు. సమాచార సేకరణ వృత్తి ధర్మంలో భాగంగా ప్రభుత్వ వర్గాలతోపాటు, సమాజంలోని పలు వర్గాల ప్రజలతో జర్నలిస్టులు సన్నిహితంగా మెలుగుతారు. కొన్ని సందర్భాలలో వాస్తవాల వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి. వీటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో ఈ అంశాలను కొన్నింటిని ప్రచురిస్తే, ప్రసారం చేస్తే అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కింద నేరారోపణ చేసి విచారించడానికి ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి. ఒక వర్కింగ్ జర్నలిస్టుగా, ప్రజావూపయోజనమే పరమావధిగా భావించేవారు అవసరమైతే కష్టనష్టాలను కూడా ఎదుర్కోవాలి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు,
ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు
సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమే పత్రికా స్వేచ్ఛ. జర్నలిస్టులు వార్తలు రాయడానికి అనేక పద్ధతులు అవలంబిస్తారు. వారిని ఆపే హక్కు ఎవరికీ లేదు. అయితే వికిలీక్స్ అధినేత అసాంజే, తెహల్కా విలేకరులు కుంభకోణాలు బయట పెట్టడంతో ప్రభుత్వాలు చట్టం దృష్టితో వారిని శిక్షించాయి. కానీ వారి చర్యలను ప్రజలు హర్షించారు. మన రాష్ట్రంలోని విషయాలకు వస్తే ఈ మధ్యన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కొన్ని పత్రికలు, చానెళ్లతో మాట్లాడిన వ్యవహారాన్ని బయటపెట్టినప్పుడు వ్యక్తులుగా జర్నలిస్టులను ఇందులోకి లాగవద్దని చెప్పాం. మీడియా సంస్థల్లో రాజకీయాలు వచ్చి విడిపోయాయి.

మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేనికోసం వాడడు. చంద్రబాల కాల్‌లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత అధికార రహస్యాల చట్టానికి కాలం చెల్లింది. ఆ చట్టం కింద నేరారోపణ చేయడం ఆక్షేపణీయం.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


అధికార రహస్యాల చట్టానికి విలువ లేదు
అధికార రహస్యాల చట్టం బ్రిటీష్ కాలం నాటి పురాతన చట్టం. సమాచార హక్కు చట్టం రావటానికి ముందే దీనికి విలువ లేకుండా పోయింది. విదేశీ వ్యవహారాలు, దేశ భద్రత, రక్షణశాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాదాపు 12 కేసుల్లో తీర్పులు వెలువరిస్తూ స్పష్టం చేసింది. జర్నలిస్టులపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదు. స్టోలెన్ ఎవిడెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఎవిడెన్స్ (దొంగిలించబడిన సాక్ష్యం పరిగణనలోకి తీసుకోవాలి) అంటూ బ్రిటీష్ కాలంనాటి ప్రీవీ కౌన్సిల్ (అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం) సైతం చెప్పింది. ఇప్పటికీ దేశంలోని అన్ని న్యాయస్థానాలు దీనిని అనుసరిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టులు సమాచారాన్ని సేకరించవచ్చు. దానిని బహిరంగపరచవచ్చు.
- కే రామకృష్ణాడ్డి, సీనియర్ న్యాయవాది


జర్నలిస్టులపై కేసులు తప్పు
ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వాతంత్య్రం, ప్రైవసీ అన్నది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు. తాజా వివాదాన్ని అలా పక్కనబెడితే ప్రైవసీ చాటున తప్పుడు వ్యవహారాలకు పాల్పడినపుడు రాజ్యాంగం ప్రకారం రక్షణ ఉండదు. తప్పులు చేసినవారి గురించి బయటపెట్టటంలో తప్పు లేదు. వాస్తవాలను వెలికితీసే జర్నలిస్టులపై కేసులు పెట్టటం తప్పు. దీనిపై మీడియా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది.
-ఎస్ రాంచందర్‌రావు, సీనియర్ న్యాయవాది


సమాచార సేకరణ విలేకరుల వృత్తి ధర్మం
కుంభకోణాల కేసుల్లో వాస్తవ వివరాలను తెలుసుకుని బహిర్గతం చేయడం అన్నది జర్నలిస్టుల వృత్తి. దీనివల్లనే బోఫోర్స్ లాంటి కుంభకోణాలు సైతం వెలుగు చూశాయి. మావోయిస్టులతో, గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో సైతం మీడియా ప్రతినిధులు మాట్లాడారు. సమాచారాన్ని ప్రజలకు అందజేశారు. అటువంటి సందర్భాల్లో సైతం కేసులు నమోదు కాలేదు. ఓ మహిళ మొబైల్ ఫోన్ కాల్‌లిస్ట్‌ను తీసుకున్నంత మాత్రాన తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసు నమోదు చేయటం సరైంది కాదు.
- శ్రీరంగారావు, న్యాయవాది

Take By: T News

Read more...

Monday, June 25, 2012

Kodandaram advocates reservation for Muslims


Hyderabad, June 24:
Telangana Political Joint Action Committee chairman Prof M Kondandaram on Sunday advocated reservation for Muslims in employment and jobs.

Addressing a seminar on the Justice Ranganath Mishra Commission's Report organised by Movement for Peace and Justice here, Prof Kondandaram said that reservation was must for the overall development of the Muslim community in the country.

However, he said that the successive governments have neglected the welfare of Muslims and the Congress party was primarily responsible for the backwardness of the community.

He announced that the TP-JAC would support the movement for the implementation of Justice Ranganath Mishra Commission's Report and fight for the Muslim reservation.

Siasat Daily Editor and TDP polit-bureau member Zahed Ali Khan demanded that the Centre convene a meeting with all the elected representatives to discuss the implementation of Justice Ranganath Mishra Commission's Report at the national level.

He also exhorted the Muslim community to unite to gain political power at the State level. Citing an example, he said the political maturity of Uttar Pradesh Muslims would help the community solve its problems on its own.

TRS Executive Committee Member Dr Chiranjeevi, V Sudhakar of CPI (ML), Hamed Mohammad Khan of MPJ and other leaders participated in the meeting.

Take By: Siasat News

Read more...

Jawans lose battle, little Mahi is dead

All hopes of four-year-old Mahi coming alive out of the 70-foot-deep borewell at Kasna village here were dashed on Sunday afternoon, when Army personnel brought out her decomposed body after an 86-hour rescue operation that had kept the people nationwide glued to their TV sets. 

The operation — launched soon after Mahi fell into the borewell on Wednesday night during her birthday celebrations and was prolonged by almost 48 hours as the rescue team ran into rocky terrain — ended around 1.30 p.m. on Sunday, when a team of personnel pulled her out. 

The girl, wrapped in a green cloth, was immediately rushed to the ESIC Hospital at Manesar in an Army ambulance, amid loud applause by locals who had gathered at the spot in large numbers since early morning, anticipating a successful climax. But the child was declared dead on arrival at the hospital. The body was then sent to the Gurgaon Civil Hospital mortuary. 

Post-mortem revealed that Mahi died of asphyxia just in a couple of hours of the fall. “She died three-four hours after she fell into the borewell,” said a doctor at the Gurgaon Civil Hospital.
The rescue team had reached Mahi in the early hours of Sunday, negotiating around a boulder in the rescue tunnel, but there was delay as it had to cut through a rock in the borewell also, where the bloated body was found stuck. 

“While digging the borewell, the house owner had hit a rocky terrain. He tried to cut through the rock but abandoned it when he could not do so. It was in this rock that Mahi’s body was found stuck. The rescue teams encountered boulders twice while digging the tunnel also, and this caused the delay,” Gurgaon Deputy Commissioner P.C. Meena said. 

Cases filed
 
He said separate cases were registered against house owner Rohtash and the contractor who had sunk the illegal borewell. “Three police teams have been constituted to trace and arrest them. So far, our priority had been to pull out the girl. Now that the operation is over, we hope to catch them soon.”

Delayed response
 
The girl’s parents and relatives blamed the death on the district administration’s delayed response. “Had the administration responded quickly to the situation, she would have been alive today. The police reached the spot almost two hours after they were informed. The efforts to pull her out gathered pace only on Thursday morning, after the Army was called in,” said Mithilesh, a close relative. 

An inconsolable Sonia, mother of Mahi, almost collapsed in grief soon after the news was broken to the family. She had to be physically lifted by women police personnel and taken away from the hospital gate. 

Earlier, around noon, the crowd grew restless as the rescue operation drew out. The people started shouting slogans against the administration, but the situation was soon brought under control. 

Take By: The Hindu News

Read more...

Morsy wins Egypt’s Presidency

Mohamed Morsy is set to become Egypt’s first elected President following a historic election, brought about by an uprising that first expelled the former dictator, Hosni Mubarak, and then paved the way for the country’s transition to democracy. 

As a nation gripped in suspense watched, Farouk Soltan, head of the Supreme Presidential Election Commission, announced after a lengthy preamble on Sunday that Mr. Morsy, the Islamist candidate belonging to the Muslim Brotherhood, won a bitterly contested race. He secured 51.7 per cent of the vote, defeating Ahmed Shafiq, who got 48.3 per cent. 

Cairo’s Tahrir Square, the ground zero of the revolution, filled by Mr. Morsy’s supporters, erupted in elation as the message of their candidate’s victory homed in. 

For the next few minutes, a giant roar seemed to overwhelm the square, where thousands waved the Egyptian flag, while some sought vantage points to express their joy. Emotions, built on the bedrock of anxiety, ran high as both candidates had claimed victory earlier. 

Mr. Morsy’s supporters were particularly on edge after the recent rulings by the generals negated much of their previous electoral gains. The Supreme Council of the Armed Forces (SCAF) had earlier dissolved an elected Muslim Brotherhood-dominated parliament, following a ruling by the country’s highest court, which ruled that one-third of the People’s Assembly had been unconstitutionally elected. 

Sunday’s announcement was a giant moment for the Muslim Brotherhood, whose candidate managed to scale the highest office of the land, after 80 blood-stained years since the group was formed. 

Mr. Morsy’s victory is set to resonate in West Asia and North Africa, where Libya is heading for elections next month, and moderate Islamists, following the example of Turkey’s Justice and Development Party, have triumphed in Tunisia. 

Despite the euphoria that has followed the announcement, Mr. Morsy’s task is cut out. The parliament has to be restored, for after its contentious dissolution, the generals have grabbed all legislative powers. 

The SCAF has also stripped the president-elect of significant political powers by adding a debilitating annexure to an earlier constitutional declaration. The writ of the President, no longer the Supreme Commander of the Armed Forces, will not run over the Army, which has, in effect, recast itself as a state-within-a state. 

The drafting of a new constitution, on which hangs the promise of Egypt becoming a civil state, is set to emerge as a new arena of conflict between the Muslim Brotherhood and the SCAF. 

Take By: The Hindu News

Read more...

సోనియాతో నేడు చిరు భేటీ


-కాంగ్రెస్ నేతలే కొంప ముంచారు
-పార్టీలో ఐక్యత లోపించింది
-పీఆర్పీకి ద్వితీయ శ్రేణి గుర్తింపే!
-ఓటమికి ఇవే కారణాలు
-ఉప ఫలితాలపై నివేదిక!

హైదరాబాద్, ():కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చిరంజీవి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటి అయిన రెండోరోజే చిరంజీవి సోనియాతో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలను వివరించనున్నారు. కాంగ్రెస్ నేతల వైఖరివల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని తన నివేదికను ఆయన సోనియాకు సమర్పించే అవకాశాలున్నట్లు పూర్వ పీఆర్పీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామచంవూదాపురం, నర్సాపురం రెండు స్థానాల్లో కాంగ్రెస్ తనవల్లే గెలిచిందని, మిగతాచోట్ల పీఆర్పీ శ్రేణులకు కాంగ్రెస్ సహకరించలేదని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఐకమత్యం లోపించిందని, విలీనమైనా కూడా పీఆర్పీ శ్రేణులను ఇప్పటికీ ద్వితీయక్షిశేణి నేతలుగానే పరిగణిస్తున్నారని, నామినేటెడ్ పదవులు భర్తీచేయకపోవడం వంటి పరిణామాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన అధినేత్రి దృష్టికి తీసుకెళుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవి విషయం కూడా తేల్చుకోనున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగానియమించినప్పటికీ ఇంకా మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నాన్చుతుండటం చిరులో అసంతృప్తికి కారణమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అన్ని స్థానాల్లో గెలిపిస్తే చిరంజీవికి మంత్రి పదవి కచ్చితంగా వచ్చేదని, ఇప్పుడు పార్టీ ఓటమితో ప్రస్తుతానికి ఆ పదవి కూడా డౌటేనని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరుకు రాజ్యసభ, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి పదవితోపాటు రాష్ట్రంలో ఆ పార్టీ నేతలకు రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చేందుకుగతంలో ఢిల్లీ పెద్దలతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటిలో కేంద్ర మంత్రి పదవి తప్ప మిగతావన్నీ చిరు సాధించుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. చిరు ప్రభావం ఎంతమాత్రం కనిపించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. చిరు ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన తిరుపతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోగా అక్కడ ఓటమికి కాంగ్రెస్ వారే కారణమని చిరు నిందలు వేయడం పార్టీ వర్గాలకు విస్మయం కలిగించింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వంటి పరిణామాలు చిరుకు కేంద్ర మంత్రి పదవి విషయంలో మైనస్ కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read more...

సీతయ్యపై వేటు.. సింహాకు.. సీటు

-‘సింహాద్రి’ దూకుడుకు చిన్నబాబుతో కళ్లెం
-నారావారి కొత్త సినిమా షురూ!
-బాలయ్య, లోకేష్‌కు టీడీపీలో రెండోస్థానం
-త్వరలో ప్రధాన కార్యదర్శి పదవులు
-ఉప ఎన్నికల్లో పోయిన పరువు నిలబెట్టుకునే ప్రయత్నం
-హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టే యోచన


ఓ వైపు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో కోలుకోలేని దెబ్బ.. మరో వైపు ఉప ఎన్నికల పుణ్యమాని సీమాంవూధలో తిరగబడ్డ సీను.. ఏం చేయాలో తోచని చంద్రబాబు ఇప్పుడు పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు..! రీళ్లు తిరిగేస్తున్నారు..! రెండో శ్రేణి నాయకత్వాన్ని తెరపైకి తెచ్చేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు..!! ‘సింహా’తో ఊకొట్టించి.. ‘సీతయ్య’ను ఉలిక్కిపడేలా చేద్దామనుకుంటున్నారు. పనిలో పనిగా ‘సింహాద్రి’ దూకుడుకు చిన్నబాబుతో కళ్లెం వేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. టీడీపీలో రెండు ప్రధాన కార్యదర్శి పదవులు సృష్టించి, వాటిలో బావమరిది బాలకృష్ణ, కుమారుడు లోకేష్‌బాబును కూర్చోబె కసరత్తు చేస్తున్నారు. మామాఅల్లుళ్లు బాలయ్య, లోకేష్‌కు పార్టీ రెండో శ్రేణి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తన అధ్యక్ష పీఠానికి ఢోకా ఉండదని.. ఇదే దెబ్బకు తండ్రీకొడుకులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జోరుకు బ్రేక్ పడుతుందని, వారిని దూరంగా జరపొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు..! బాలయ్య, లోకేష్‌కు దాదాపుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఖరారైన ప్రకటన వెలువడటమే తరువాయి అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా వారి నయా చిత్రానికి మామ ఎన్టీఆరే ఆదర్శమని తెలుస్తోంది..! నాడు ఎన్టీఆర్ తన అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంక పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు అప్పగించి.. తాను అప్పుడప్పుడు మాత్రమే పార్టీని చూసుకునేవారు. అదే తరహాలో ఇప్పుడు బాబు ముందుకు వెళ్తున్నారు..!!

హైదరాబాద్, జూన్ 24 ():టీడీపీలో రెండో శ్రేణి నాయకత్వం మళ్లీ తెరపైకి రానుంది..! రెండు ప్రధాన కార్యదర్శి పదవులకు రంగం సిద్ధమవుతోంది..!! ఈ స్థానాల్లో తన బావమరిది, సినీ హీరో బాలకృష్ణను, కుమారుడు లోకేష్‌ను కూర్చోబె చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణలో.. అటు సీమాంవూధలో పార్టీ కోలుకోలేని స్థాయికి దిగజారింది. శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడమే పార్టీకి ప్రధాన దెబ్బ అని ఆ శ్రేణులు భావిస్తున్నాయని, అందరినీ మెప్పించేందుకే బాలయ్య, లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరికీ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవులు దాదాపు ఖరారైనట్లు పేర్కొంటున్నాయి. బాలయ్య, లోకేష్ రాకతో ఓ వైపు తన అధ్యక్ష పీఠం బీటలు వారకుండా ఉంటుందని.. మరోవైపు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దూకుడుకు కళ్లెం వేయొచ్చని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ ఇప్పుడు పుంజుకొని 2014లో తిరిగి అధికారంలోకి వస్తుందన్న భరోసా టీడీపీ శ్రేణుల్లో కనిపించడం లేదు. పార్టీలో ద్వితీయక్షిశేణి(నంబర్ 2) నాయకత్వం లేకపోవడంతో నానాటికి పరిస్థితి దిగజారుతున్నదని తెలుగుతమ్ముళ్లు కలవరపడుతున్నారు. తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపేందుకు, ఉప ఎన్నికల్లో పోయిన పరువును నిలబెట్టుకునేందుకు చంద్రబాబు పార్టీకి కొత్త హంగులు అద్దే పనిలో పడ్డారు. ఇప్పటికే బాలకృష్ణ పలుమార్లు మీడియాతో మాట్లాడుతూ పార్టీ తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా పని చేస్తానని ప్రకటించారు.

మామ తరహాలోనే..: టీడీపీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉన్న కాలంలో ఇంటి అల్లుళ్లయిన చంద్రబాబు, దగ్గుబాటి వెంక సెకండరీ నాయకులుగా వెలుగు వెలిగారు. వీరిద్దరూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు నిర్వహించారు. కుటుంబ సభ్యులే ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉండటంతో అప్పట్లో ఎన్టీఆర్ దాదాపుగా పార్టీ రోజువారీ కార్యకలాపాలన్నీ అల్లుళ్లకే అప్పగించారు. కీలకమైన వాటిల్లో మాత్రమే ఎన్టీఆర్ జోక్యం చేసుకునేవారు. తాజాగా చంద్రబాబు కూడా తన మామ ఎన్టీఆర్‌ను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. మామ పాలసీలోనే పార్టీని ముందుకు నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. తన కొడుకు లోకేష్‌కు ఇప్పటికే రాజకీయాలపై తర్ఫీదు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల సమయంలో లోకేష్‌తో కలిసి ఒక మానిటరింగ్ కమిటీని వేసి రోజు వారీగా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు సమీక్షించే వారు. లోకేష్ అప్పుడప్పుడు తనకు సహాయం చేస్తున్నాడని ఇటీవల చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే లోకేష్, బాలయ్య ప్రత్యక్ష రాజకీయ తెరంగేట్రం దాదాపుగా ఖరారైన విశ్లేషకులు అంటున్నారు.

పోయిన పరువు దక్కేనా..?
ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ వస్తున్న టీడీపీపై శ్రేణుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. 2014లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే చరిష్మా బాబుకు లేదన్న చర్చ జరుగుతోంది. దీనికితోడు ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్షికమాల పర్యవేక్షణ చంద్రబాబు ఒక్కడికి ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీకి చెందిన ఓ నేత అన్నారు. జనంలో బాబు పలుచపడిపోయారని అభివూపాయపడ్డారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో.. ఉన్న క్రెడిబులిటీ కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందని సదరు నేత అన్నారు. పైగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ కంటే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కొన్నింట్లో డిపాజిట్లు కూడా దక్కలేదు.

ఈ పరిణామాలు తమ అధినేతను తీవ్రంగా కుంగదీశాయని సదరు నేత తెలిపారు. దానికి తోడు ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో టీడీపీ తమ్ముళ్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో 30ఏళ్ల క్రితం ఆవిర్భవించిన టీడీపీ.. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చిందన్న ప్రచార ప్రభావం తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయారు. కాంక్షిగెస్ గెలిచిన రెండు స్థానాల్లోనూ టీడీపీ ఓట్లు బదిలీ అయ్యాయని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవడంతో పాటు ఉన్న వాళ్లలో సీనియర్లను నమ్మి రెండో స్థానం అప్పగించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. చంద్రబాబు ఎవరినీ నమ్మరని, ఆయననూ ఎవరూ నమ్మరని మరో నాయకుడు అభివూపాయపడ్డారు.

సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు నేతలు విడివిడిగా మాట్లాడుతూ.. పార్టీలో తాము ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. రెండో స్థానంలోకి వెళ్లే అవకాశం ఉన్నా వెళ్లలేని పరిస్థితి అని పేర్కొన్నారు. దూరం దూరంగా ఉంటేనే బాబు నమ్ముతారని, అందుకే తాము ఎడం పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. పార్టీలోని సీనియర్లపై బాబుకు నమ్మకం లేకపోవడం.. బాబుపై సీనియర్లకు నమ్మకం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం లోటు కనిపిస్తోంది. ఈ లోటును తీర్చేందుకు బాబు.. తన బావమర్ది బాలయ్య, కుమారుడు లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెస్తున్నట్లు సమాచారం. బాలయ్య కూతుర్నే లోకేష్ మనువాడిన విషయం తెలిసిందే. ఈ రకంగా తన కుటుంబానికే పెద్దపీట వేయాలన్న యోచనలో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. బాబు ప్రయత్నం.. పోయిన పార్టీ ప్రతిష్టను ఏ మేరకు నిలబెట్టగలుగుతుందన్న చర్చ ఆ వర్గాలో సాగుతోంది.

హరికృష్ణ, జూ.ఎన్టీఆర్‌కు కళ్లెం!
బాబు వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్లున్నట్లు తెలుస్తోంది. పార్టీకి కొత్త హంగులు అద్దే పేరిట బాలయ్య, లోకేష్‌ను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. ఇదే తరుణంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్‌పెట్టే విధంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా బాబుపై హరికృష్ణ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడంతో ఎన్టీఆర్ మరో కుమారుడైన హరికృష్ణను దూరం పెట్టొచ్చని బాబు భావిస్తున్నారు. ఇదే తరుణంలో తన కుమారుడు లోకేష్‌ను తెరపైకి తీసుకురావడంతో జూనియర్ ఎన్టీఆర్ దూకుడుకు కూడా కళ్లెం వేయొచ్చని ఆయన యోచిస్తున్నట్లు ఓ నేత అన్నారు. బాలయ్య, లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడంతో తనపై ఎలాంటి అంతఃపుర కుట్ర కూడా జరగదని, ఉన్నంతకాలం పార్టీ అధ్యక్షపదవితో పాటు.. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం కదలకుండా ఉంటుందన్న ధీమాతో చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Take By : T News

Read more...

Saturday, June 23, 2012

ముందున్నది...ఉపద్రవం

నోరుతెరిచి నడిరోడ్డుపైకి పొంగిన నాలా పాదచారికి ప్రాణగండమవుతుంది.. జలదిగ్బంధనంలో నీటమునిగిన పల్లె పగలూరాత్రి తెలియక విలవిల్లాడుతుంది.. ఏటా కట్ట తెంచుకునే చెరువు ఊరిమీదికి ఉరిమి దూకుతుంది.. లోలెవల్ వంతెనలపై నుంచి వాగులు సాగిపోతుంటే, రాకపోకలు రోజులు లెక్కిస్తూ నిలిచిపోతాయి.

చినుకు పడ్డప్పుడల్లా అక్కడ ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. భారీ వర్షం పడితే ఇక పరిస్థితి భయానకమే. ఏజెన్సీ ఏరియానేకాదు దాదాపు అన్ని డివిజన్లలోనూ అదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో పదే పదే ఉపద్రవాలు ముంచు కొస్తున్నాయి. ఏటా వర్షాకాలం వచ్చిందంటే తలెత్తే ప్రమాదకర పరిస్థితికి సర్కారు తాత్కాలిక మరమ్మతులతోనే పరిష్కారాన్ని ముగిస్తోంది. అందుకే జిల్లాయంత్రాంగం ముందు సవాళ్లుగా నిలుస్తున్న ఈ సీజన్‌లోని ప్రమాదకర ప్రాంతాలపై టీ-

మీడియా ఫోకస్.......మాటేసిన దస్రూమాటు..
ములుగు, దేవగిరిపట్నం ప్రధాన రహదారిపై గల దస్రూమాటు పొంగితే దేవగిరిప ట్నం అవతలి గ్రామాలైన 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. ఇక్కడ హైలెవల్ వంతెన నిర్మించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లక్నవరం ముందు భాగంలోని పెద్ద వాగు పొంగితే అంకన్నగూడెం, జగ్గన్నగూడెం గ్రామాల జలదిగ్బంధం అవుతాయి. ఇక్కడ ఐటీడీఏ అధికారులు రూ. 35 లక్ష లు ఖర్చు పెట్టి లోలెవల్ బ్రిడ్జి నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జి వర్షాకాలంలో ఎప్పుడూ నీళ్లల్లో మునిగిపోయే ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకల కోసం నాటు పడవలను వాడకతప్పని పరిస్థితి.

కొమ్ములవంచ రిజర్వాయర్‌కూ ఏటా గండ్లే..
నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారులో ఆకేరు వాగుపై 1964లో అప్ప టి రెవెన్యూ శాఖా మంవూతిగా పని చేసిన నూకల రాంచంవూదాడ్డి, పబ్లిక్ వర్క్ శాఖామంత్రి ఏసీ.సుబ్బాడ్డిలు ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు కుడికాల్వ కింద నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయపురం, రామన్నగూడెం, ముంగిమడుగు శివారులో 1100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఎడమ కాల్వ ద్వారా నెల్లికుదురు మండలం మదనతుర్తి, మునిగలవీడు, నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట గ్రామాల్లో 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆకేరు వాగును ని ర్మించారు. 2006లో అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి కడియం శ్రీహరి రూ.1.0కోట్లు కేటాయించి కుడికాల్వ పనులు చేపట్టారు. సిమెంట్ కాల్వకు బుంగ, ఆనకట్టకు ఉన్న షటర్(తూము)లు తుప్పు పట్టి వచ్చిన నీరంతా నిల్వ ఉండకుండా వృథాగా పోతున్నప్పటికీ ప్రతీ ఏటా ఐబీ అధికారులు నామమావూతపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోయే పరిస్థితులు ఉన్నాయి.

మారేడు పొంగితే అంతే..
వెంకటాపురం మండలంలోని లక్ష్మీదేవిపేట, బూర్గుపేట గ్రామాల మధ్య గల మా రేడుగూడెం చెరువు మత్తడి పొంగిపొర్లితే పెద్దాపురం వైపు గల సుమారు 12 గ్రామా లకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ ఏళ్ల తరబడి లోలెవల్ వంతెన దర్శనమిస్తోంది. ఇటీవల వెంకటాపురం చెల్పూర్ ప్రధాన రహదారికి సుమారు రూ. మూడు కోట్లతో నూతన తారు రోడ్డును వేశారు. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు కాజ్‌వేను నిర్మించడం మరిచారు.

గుండ్లవాగుతో కడగండ్లే..
గోవిందరావుపేట మండలంలో గుండ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తే అమృతండా, చం ద్రూతండాల గిరిజనులకు భాహ్య ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అలాగే పస్రా సమీ పంలోని దయ్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తే నార్లాపురం, మేడారం పరిధిలోని 1 గ్రామాలకు ప్రధాన రహదారి బంద్ అయినట్లే. ప్రతీసారి మేడారం జాతరకు అధికారులందరూ ఇదే లోలెవల్ కాజ్‌వే మీది నుంచి పోతారు... వస్తారు. కానీ ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలనే ఆలోచనే వారికి తట్టదు. జంపన్నవాగు పొంగితే ముత్తాపురం మూలకు పడుతది.

రేగొండ మండలంలోని భాగిర్థిపేట క్రాస్‌రోడ్డు సమీపంలో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్‌వేతో ప్రతీయేటా సమస్యలు ఎదురవుతున్నాయి. కాజ్‌వేకు దగ్గర్లోనే చెరువు ఉండడంతో వర్షాకాలంలో చెరువు నిండడం మూలంగా నీరుబయటకు వచ్చి కాజ్‌వే మీదుగా వెళ్తుంటుంది. కాజ్‌వేపై నీరు ఉధృతంగా వెళ్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిత్యం వందలాది లారీలలో బొగ్గు తరలిపోతుండడంతో వర్షాకాలంలో లారీలు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే విధిలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారికి ఎంతో కొంత చెల్లించి ద్విచక్ర వాహనాలను మాత్రం కాజ్‌వే నుంచి దాటించుకుంటారు.

భయంభయంగా లోతట్టు ప్రాంతాలు
వరంగల్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు, 20 లోతట్టు కాలనీలు వణికిపోతుంటాయి. శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో ప్రతీ వర్షాకాలంలో ఈ కాలనీలు ముంపునకు గురికావాల్సి వస్తోంది. కచ్చా డ్రైనేజీలు నిర్మించి తాత్కాలిక పనులు మాత్రమే బల్దియా చేపడుతోంది.నిధుల కొరత, సాంకేతిక సమస్యలు సాకుగూ చూపుతూ అధికారులు శాశ్వత పరిష్కారాన్ని పక్కనబెడుతున్నారనేది ప్రధాన విమర్శ.

ఆకేరు పొంగితే రాకపోకలు ఆగుడే..
లోలెవల్ బ్రిడ్జి మూలాన వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు కొన్ని రోజుల పాటు రాకపోకలు స్తంభిస్తాయి. తొర్రూరు కేంద్రం నుండి నెల్లికుదురు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ ప్రాంతాలకు ఈ రహదారి మీదుగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. దశాబ్దాలకాలంగా ఈ సమస్య ప్రతీ వర్షాకాలంలో తలెత్తుతున్నా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే నెల్లికుదురు మండలం మదనతుర్తి శివారులోని మొండివాగు సైతం రోడ్డుపైనే ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీని కారణంగా నెల్లికు దురు నుండి మహబూబాబాద్ వైపు ఎవరు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల నూతనంగా బీటి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ హైలెవల్ బ్రిడ్జిని మాత్రం నిర్మించలేదు. దీంతో ఈ రెండు రహదారులపై నెలకొన్న సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

Take By: T News

Read more...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమే

-ఈ విషయం పార్టీ పెద్దలే అనుకుంటున్నారు
- శ్రేణుల్లో సమన్వయం లోపించింది
- కొందరు నేతల వల్లే తిరుపతిలో ఓటమి
- కాంగ్రెస్‌లో పీఆర్పీ శ్రేణులకు గుర్తింపేది?
- ఎంపీ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు


హైదరాబాద్, జూన్ 22 ():వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమేనని, అధికారంలోకి రావడం కష్టమేనని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లు ఎంపీ, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయకపోవడం, కొందరు నేతలు సహకరించకపోవడం.. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ ఓటమికి కారణమన్నారు. తిరుపతితో పాటు మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో పూర్వపు పీఆర్పీ నాయకుల్ని, శ్రేణుల్ని కలుపుకొని పనిచేయలేకపోయాయని చెప్పారు. అందుకే ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదని, వివక్షకు గురవుతున్నారన్నారు. అయినప్పటికీ పీఆర్పీ మాజీ నేతలందరూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారని తెలిపారు. సమన్వయంతో, ఐకమత్యంగా కృషి చేస్తే 2014లో కాంగ్రెస్ తిరిగి అధికారంలో రావడానికి ఎదురే ఉండదన్నారు. ఉప ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంవూదాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన తోట త్రిమూర్తులు శుక్రవారం స్పీకర్ వద్ద ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలతో చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సమన్వయ లోపం ఉన్నా తన అభిమానులు, ఆత్మబంధువులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలిందన్నారు. కానీ కొందరు కావాలని పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం తర్వాత ఆ ప్రయోజనాలు పొందడానికి కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పూర్వపు పీఆర్పీ శ్రేణులకు పార్టీలో సముచిత భాగస్వామ్యం కల్పించడం, అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా పార్టీ శక్తిమంతమవుతుందని అభివూపాయపడ్డారు. పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించినట్లయితే పార్టీకి నూతన శక్తి లభిస్తుందని, తేజోవంతం అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించారు. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపడుతున్న అనేక మంచి కార్యక్షికమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగే పార్టీ యంత్రాంగాన్ని అందరూ భాగస్వామ్యంతో పటిష్టంగా రూపొందించుకోవాలని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశాలపై దృష్టి పెట్టిందని, ఒకవూటెండు నెలల్లోనే పార్టీ బలోపేతం కావడానికి క్షేత్రస్థాయి నుంచి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

chiruజగన్ సెంటిమెంట్ పనిచేయలేదు
జగన్ అరెస్టు, విజయమ్మ కన్నీళ్లతో ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పెల్లుబుకిందని చాలా మంది విశ్లేషణలు చేసినా రామచంవూదాపురం, నర్సాపురంలో అవేమీ పనిచేయలేదని చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇక్కడ సమన్వయంతో పనిచేయడమే కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణమని చెప్పారు. పూర్వపు పీఆర్పీ అభ్యర్థులైన ఇక్కడి అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో చక్కటి సమన్వయం సాధించి పనిచేయడం వల్లే అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున రామచంవూదాపురం నుంచి పోటీ చేసిన తోట త్రిమూర్తులు స్వల్ప తేడాతో ఓడిపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. అయితే మూడేళ్లు తిరిగేసరికి అతని గెలుపునకే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా వచ్చాయని, మంచి మెజారిటీతో త్రిమూర్తులు గెలువడం సంతోషదాయకమన్నారు.

సమావేశం తర్వాత మీడియాతో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతల అనైక్యతే కారణమా? అని అడిగిన ప్రశ్నకు... కాంగ్రెస్ తన పూర్తి బలాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే ఫలితాలు మెరుగ్గా వచ్చేవని అభివూపాయపడ్డారు. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్ధి ఎం వెంకటరమణ బహిరంగంగానే తనకు కొందరు నాయకులు సహకరించలేదంటూ కన్నీళ్ల పర్యంతమైన ఘటనను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారా? అని అడిగిన ప్రశ్నకు.. పార్టీని బలోపేతం చేయడానికి సమన్వయ కమిటీ సభ్యుడిగా తన సూచనలు, సలహాలు ఇవ్వడం తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. కాగా, రామంచవూదాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన విధానానికి భిన్నంగా ఈ సారి తన విజయానికి కుల, మత, వర్గాలకు, చివరకు పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేశారని పేర్కొన్నారు. తనపై నియోజకవర్గ ప్రజలు చూపించిన నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

Take By: T News

Read more...

ఇప్పుడు వీస్తున్నది.. తెలంగాణ గాలి



- విడిపోవడంపై అంచనాకొచ్చిన సీమాంధ్ర నేతలు
- అక్కడా ఇక్కడా బతకాలంటే.. తెలంగాణే మార్గం!
- జగన్ జోరును అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం
- రాష్ట్ర ప్రకటనతో తెలంగాణలో నెట్టుకురావచ్చు
- ఉప ఫలితాలతో మెట్టు దిగుతున్న సీమ నేతలు
- జూలైలో ఉద్యమానికి రెడీ అవుతున్న తెలంగాణ
అవును.. 

ఇప్పుడు తెలంగాణ గాలి వీస్తున్నది! ఉద్యమక్షిశేణుల్లోనే కాదు.. సాక్షాత్తూ తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దల్లోనూ..! ఒక టీజీ వెంక ఒక ఏరాసు ప్రతాప్‌డ్డి.. ఒక బొత్స సత్యనారాయణ.. ఇవి ఇంకా తొలి స్వరాలే! రాష్ట్ర విభజనకు వ్యతిరేకత నుంచి.. మా హక్కులు దక్కితే చాలు అన్నంత స్థితికి.. అక్కడి నుంచి.. 

తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరనే ఆందోళనను వ్యక్తం చేసే స్థాయికి పడిపోయిన నేతల మాటల తీవ్రత! రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుని.. 2014 ఎన్నికల్లో అందివస్తే అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన! ఉప ఎన్నికల్లో సమైక్యవాదం విలువలేకుండా పోయిన వేళ.. సీమాంవూధలో భవిష్యత్ కళ్లకు కడుతుండగా.. కనీసం తెలంగాణలోనైనా పార్టీని బతికించుకునేందుకు ఆఖరి అస్త్రం! తెలంగాణలో బట్టకడితే.. సీమాంవూధలోనూ ఏదో విధంగా బతికేద్దామని ఆశ! అందుకు ఉన్న ఏకైక ఆస్కారం.. తెలంగాణపై ‘నిర్ణయం’! అందుకే మారుతున్న స్వరం!!

హైదరాబాద్ జూన్ 19 () : ఇక తెలంగాణ నిర్ణయాత్మక దశకు చేరుకుందా? రాష్ట్రపతి ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ తీసుకోబోయే ప్రధాన విధానపరమైన నిర్ణయాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉండబోతున్నదా? తెలంగాణ వ్యతిరేకులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాటలను కేంద్రం పక్కనపెట్టబోతున్నదా? అవుననే అంటున్నారు.. సాక్షాత్తూ సీమాంధ్ర నేతలు! పరకాల ఉప ఎన్నిక ఫలితం ఆసరాగా మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఆశించిన కేసీఆర్ మాటలు.. నిజమవుతాయని భావించే విధంగా ప్రస్తుత సీమాంధ్ర నేతల మాటలు వినిపిస్తున్నాయి! ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమైక్యవాదం ఆత్మరక్షణలో పడిపోయింది! సీమాంధ్ర నియోజకవర్గాల్లో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ముక్కలవడం ఖాయమన్న నేతలు.. జనం తమ వాదనను వినిపించుకోకపోవడాన్ని గుర్తించినట్లున్నారు.

ఉప ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిళ్లు తెచ్చారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఇక్కడ సీమాంవూధలో కాంగ్రెస్ ఖతం అవుతుందని హెచ్చరించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేతల తీరూ మారింది. తెలంగాణ ఇస్తారేమోనన్న భయం వేస్తోందనే స్థాయిలో సీమాంధ్ర నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఇస్తే ఇచ్చారు.. కనీసం మా హక్కులనైనా కాపాడండి అని అదే నేతలు వేడుకుంటున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం సీమాంవూధలో పోటీ చేసిన 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 2చోట్ల గెలిచి 7చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణలో పోటీ చేసిన ఒక్క స్థానంలో డిపాజిట్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచింది. ‘2014లో ప్రధాని రేసులో రాహుల్‌గాంధీ ఉంటారని తేలిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ గత రెండు సాధారణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీలనిచ్చిన ఏపీపై ఆశ పెట్టుకుంది. కానీ.. సీమాంవూధలో నష్టం జరిగిపోయింది. ఇక మిగిలింది తెలంగాణే. ఇక్కడ ఆశలు ఇంకా సజీవం.

ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణపైనే. సీమాంవూధలో పార్టీకి భవిష్యత్తు లేదని, చిరంజీవి వచ్చినా చిరు ప్రయోజనం కూడా లేదని తెలిపోవడంతో అధిష్ఠానం తెలంగాణపై నాన్చడం ఆపేసి, తేల్చడం ఎంచుకుంది’ అని సీమాంధ్ర ప్రాంత ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే తేల్చే మొట్టమొదటి అంశం తెలంగాణేనని అక్కడినుంచి తెలంగాణ నేతలకు సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలు తెలంగాణపై ఒకవేళ తేల్చితే తమతో మాట్లాడిన తరువాతే తేల్చాలని, తమ డిమాండ్లు, వాటాలు తేల్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కాళ్లబేరానికి వస్తున్నారు. రాయలసీమ మంత్రులు టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌డ్డి ఢిల్లీ పెద్దలను కలిసి సందర్భంలో వారికి అధిష్ఠానం నుంచి పలు ప్రశ్నలు ఎదురైనట్లు సమాచారం. ‘మీ మాటలు నమ్మి నష్టపోయింది చాలు’ అంటూ తలంటుపోసినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో ఎందుకు ఓడిపోయామనే దానిపై సమాధానం చెప్పుకోలేకపోయారని తెలిసింది.

తెలంగాణ ఏర్పాటు ఖాయమంటూ టీజీ, ఏరాసు వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనివేనని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పరకాల విజయం నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సైతం తమ గొంతు వినిపిస్తూ.. సీమాంధ్ర నేతల వాదనలు వారి ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డీలాపడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే చేపట్టే అంశాలేవీ లేవని, చాలా కాలంగా పెడింగ్‌లోఉన్న తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని తెలంగాణ నేతలకు సర్దిచెబుతున్నారు. ‘ఢిల్లీ నుండి వస్తున్న సంకేతాలు చూస్తుంటే మరో మూడు నెలలు ఆగాలనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్రం ఇస్తామన్నట్లుగా మా ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణ తేల్చకుంటే జరిగే నష్టాన్ని అధిష్ఠానం అంచనా వేసింది. అందుకే రాష్ట్రం ఇచ్చే విషయంలో మాకు సంకేతాలు పంపుతోంది’ అని తెలంగాణనేత ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. జైల్లో ఉన్న జగన్‌ను వెళ్లి కలిశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్దతివ్వాలని హైకమాండ్ అభ్యర్థన మేరకే ఆయన జగన్‌ను కలిసినట్లు సమాచారం.

ఈ పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతోంది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీజేఏసీ సిద్ధమవుతున్న తరుణంలో నెలాఖరు తరువాత తెలంగాణ వేడి గల్లీ నుండి ఢిల్లీకి తాకుతుందని, అప్పుడు రాష్ట్రం ఇవ్వడం తథ్యమనే సంకేతాలను తెలంగాణ నేతలిస్తున్నారు.

సీమాంధ్ర నేతల్లో జగన్ గుబులు

సీమాంధ్ర నేతల స్వరం మారడం వెనుక జగన్ ఆధ్వర్యంలోని వైస్సార్సీపీ ఇటీవలి ఘన విజయాలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల నాటికి సీమాంవూధలో సైతం అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి దాపురించే ప్రమాదం కనిపిస్తుండడంతో పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది. దీంతో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలకడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో పార్టీకి పునరుజీవ్జవం తథ్యమని ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చాక సీమాంవూధలో ఏదో ఒకటి చేసి నెట్టుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణకు బదులు రాయల తెలంగాణను ముందుకు తెస్తున్నారు.

ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆఖరి ప్రయత్నంగా లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాయల తెలంగాణ ఏర్పాటుతో రాయలసీమలో జగన్ జోరును కడప, చిత్తూరు జిల్లాలకే పరిమితం చేయడం ద్వారా సంఖ్యాబలం విషయంలో ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేని పరిస్థితి తలెత్తకుండా నిరోధించగలమనే అభివూపాయం వారి మాటల్లో వినిపిస్తున్నది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, మరో మాజీ మంత్రి, కొందరు సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యమైన పక్షంలో అనంతపురం, కర్నూలు.. ఈ రెండు జిల్లాలు కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కోస్తాంధ్ర నేతల్లో సైతం అత్యధికులు రాష్ట్ర విభజనకే తలూపే పరిస్థితి కనిపిస్తోంది.

ఉత్తరాంవూధతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంత వరకు కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. కనుక తెలంగాణ ఏర్పాటు చేసినా, రాయల తెలంగాణ ఇచ్చినా ఆంధ్రాలో కొంత వరకు పార్టీని బతికించుకోవచ్చని వారు అభివూపాయపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజావూపతినిధులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రకటిస్తే అక్కడ, ఇక్కడ పార్టీ ఉంటుందన్న నమ్మకం, ధీమా వారిలో కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ఇదే వాదన వినిపించేందుకు వారు సమయాత్తమవుతున్నట్లు సమాచారం.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP