సీమాంధ్ర బాబుల కరెంటు కబ్జా
- పేపర్లకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులు
- సీమాంధ్ర పెద్దల గుప్పిట్లో విద్యుత్ ఉత్పత్తి
హైదరాబాద్, నవంబర్ 12 (): ఇది సీమాంధ్ర బడాబాబుల కరెంటు కబ్జా కథ! దొరికిన అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు కుమ్మరించేసి ఆంధ్రతో పాటు తెలంగాణనూ ఆక్రమించేసిన రాజకీయ అండదండలున్న ఘనాపాటీల కథ! రోడ్డు కాంట్రాక్టులు, ప్రాజెక్టు నిర్మాణాలను పంచుకుంటున్న సీమాంధ్ర రాజకీయ నాయకత్వం ఇందులోనూ చేయి పెట్టింది. తెలంగాణ ప్రాజెక్టులను తుత్తునియలు చేసి.. సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకున్నవారిలో పలువురు సీమాంధ్ర బడాబాబులతో పాటు.. రాజకీయ నేతలూ ఉన్నా రు. ఇప్పుడు తెలంగాణను అడ్డుకుంటున్న లగడపాటీలు సమైక్యవాదాన్ని వినిపించడం వెనుక ఉద్దేశాలివే! తమ ప్రాజెక్టులకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళనే! విద్యుత్ రంగంలో ఆది నుంచీ సీమాంవూధులదే పెత్తనం. ఒక విధంగా గత మూడు దశాబ్దాలుగా సీమాంవూధులు విద్యుత్ రంగాన్ని కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. విద్యుత్ రంగంలో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాల ఎల్లలుదాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించి.. విదేశాల్లో పెట్టుబడుల స్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి సహజవాయు నిక్షేపాలు, సహజ వనరులను సొంతం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. సమైక్యవాదాన్ని తరచూ ఊదరగొట్టే విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి లాంటి వాళ్ళు ‘కేజీ బేసిన్ ఆంధ్రుల హక్కు’ అంటూనే తెలంగాణ పవర్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులు జరగకుండా కుట్రపన్ని తమ స్వంత ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా చేయించుకుని వ్యాపారం చేస్తున్నారు.
నేటికీ వారిదే పెత్తనం
ఇప్పటికీ విద్యుత్‌రంగంలో అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులుగా, డైరెక్టర్లుగా సీమాంవూధులే అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఒక్క ట్రాన్స్‌కోలోనే రిజిస్టర్ అయిన 21 మంది బడా కాంట్రాక్టర్ల జాబితాలో 19 మంది సీమాంవూధులే. విద్యుత్ సంస్కరణల పేరుతో చంద్రబాబు చేపట్టిన యజ్ఞం సీమాంధ్ర పెట్టుబడిదారీవర్గాలకు వరంగా మారింది. ఫలితంగా ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తి (జనరేషన్) మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోకెళ్ళి వారికి కాసులపంటను పండిస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలను ఖాతరు చేయకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాలు జరిపి కోట్లు గడిస్తున్నారు. భవిష్యత్తులో ప్రయివేటు రంగంలో వచ్చే పవర్‌వూపాజెక్టులు కూడా సీమాంవూధులవే ఉన్నాయి. సీమాంవూధుల లాలూచీ వ్యవహారాలతో ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు అటకెక్కాయి. సీమాంధ్ర పెట్టుబడివర్గాల పవర్‌వూపాజెక్టులకు ఆరంభం నుంచి కాంగ్రెస్, టీడీపీ అండదండలుండడం గమనార్హం.
విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఆంధ్రవూపదేశ్ విద్యుత్‌బోర్డు(ఏపీఎస్‌ఈబీ) నాటి నుంచే సీమాంధ్ర గుత్తేదార్లు, విద్యుత్ ఉత్పత్తిదారులు కుట్రలు కుతంవూతాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో మెజారిటీ డైరెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన దాఖలాలున్నాయి. అప్పట్లో ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ బోసు తనయుడికే ఎక్కువ కాంట్రాక్టులు దక్కాయి. అతడు చేసిన భారీ విద్యుత్ టవర్లు అనతికాలంలోనూ కుప్పకూలిపోవడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. తదనంతరం విద్యుత్ బోర్డులో పని చేస్తున్న వారి బంధువులకు కాంట్రాక్టులు ఇవ్వకుండా కొన్ని చర్యలుచేపట్టాల్సి వచ్చింది. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించుకుంటూ వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా కుట్రపూరితంగా అనుమతులు, ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు అదే సీమాంధ్ర పవర్ ప్రాజెక్టుల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
అతీగతీ లేని తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులు
ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్‌కో పరిధిలోనూ కొత్త ప్రాజెక్టులు రాకుండా, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెరగకుండా సీమాంధ్ర పెట్టుబడి వర్గాలు అడ్డుకుంటున్నాయి. సింగరేణి బొగ్గుతో మణుగూరులో కట్టాల్సిన ప్రాజెక్టును తరలించి విజయవాడ వద్ద వీటీపీఎస్ కట్టారు. సత్తుపల్లిలో 600మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. చుట్టూ బొగ్గు ఉన్నా బొగ్గు కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కరీంనగర్‌జిల్లా నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు, రంగాడ్డి జిల్లాలో శంకరపల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నేదునూరు గ్యాస్ పవర్‌వూపాజెక్టు నిర్మాణం కాకుండా సీమాంధ్ర పెట్టుబడి వర్గాలు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. సకాలంలో నేదునూరు ప్రాజెక్టు పూర్తి అయితే 2100మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. దాంతో ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కోకు పేరు ప్రతిష్ఠలు రావడంతోపాటు తెలంగాణ ప్రాంతం వ్యవసాయ, పారిక్షిశామిక రంగాల్లో ముందుకు దూసుకు పరిస్థితులుండేవి. అయితే కేజీ బేసిన్ నుంచి నేదునూరు ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు ఇస్తే తమ ప్రాజెక్టులు నిర్వీర్యమై పోతాయనే కుట్రతో ఈనాటి వరకు నేదునూరుకు గ్యాస్ కేటాయింపులు జరగకుండా సీమాంవూధులు ఢిల్లీ స్థాయిలో కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా శంకరపల్లి పవర్‌వూపాజెక్టు భూమి కేటాయింపులు ఏనాడో జరిగినా నిర్మాణం ఊసే లేకుండా ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే భూ సేకరణ జరిగింది. తొలుత నాఫ్తా ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా..తదుపరి దానిని గ్యాస్ పవర్ ప్రాజెక్టుగా మార్చారు. అయితే ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు లేవని కొన్నేళ్ళు, నీరు లేదని, ఆ తర్వాత గ్యాస్ పైప్‌లైన్ లేదని మరికొంతకాలం ఉద్దేశపూర్వకంగా జ్యాపం చేశారని ఆరోపణలు ఉన్నాయి. శంకరపల్లిని కాదని దాని కంటే ఎంతో వెనుక వచ్చిన సీమాంధ్ర ప్రాజెక్టులకు కేంద్రం 2003 సంవత్సరంలో గ్యాస్ కేటాయింపులు చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపుల కోసం సీమాంధ్ర పాలకులు కేంద్రానికి కంటి తుడుపుగా లేఖలు రాస్తూ తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతూ వస్తున్నారని తెలంగాణలోని విద్యుత్ నిపుణులు విమర్శిస్తున్నారు.నేదునూరు ప్రాజెక్టు కన్నా ఎంతో వెనుక వచ్చిన సీమాంధ్ర పవర్ ప్రాజెక్టులైన ల్యాంకో కొండపల్లి, జీవీకే, కోనసీమ వంటి వాటికి కేంద్రం గ్యాస్ కేటాయింపులు జరపడమే ఇందుకు నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ల్యాంకోకు గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎంతో మతలబు చోటుచేసుకుందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో పవర్ ప్రాజెక్టు ఏకంగా విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతో ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ మతలబులున్నాయి. అంతే కాకుండా మర్చెంట్ పవర్ ప్రాజెక్టుగా ల్యాంకో ప్రాజెక్టుకు ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫారసు చేసిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ విధంగా వచ్చిన ల్యాంకో ఇటీవల సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడు రాష్ట్రానికి విక్రయాలు జరిపింది. ఫలితంగా కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోగా, పరిక్షిశమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి.
నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమలో ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్ళు లేవని సాకులు చెప్పిన ఆనాటి పాలకులు నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, పోతిడ్డి పాడు నుంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయి. ఆర్టీపీపీ కోసం దాదాపు 200 కి.మీ. మేరకు పైప్‌లైన్ నిర్మించి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.
హిందుజా.. ఆజా...
దాదాపు దశాబ్దం కిందట విశాఖపట్నం జిల్లాలో హిందుజా గ్రూప్ తలపెట్టిన హిందుజా పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వపరంగా కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకున్నా ప్రస్తుత ప్రభుత్వం హిందుజా పవర్‌కు మర్చెంట్ హోదా కల్పించేందుకు యుద్దవూపాతిపదికన చర్యలకు ఉపక్షికమించింది. గతంలో హిందుజాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కాలం చెల్లడంతో వైఎస్ హయాంలో తిరిగి పునర్జీవం కల్పించారు. హిందుజాకు కేటాయించిన భూములు వక్ఫ్ బోర్డుకు చెందినవి కావడం, ఆ భూములకు ధర నిర్ణయించి హిందుజా యాజమాన్యం వాటిని కొనుగోలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Tags: T News, hmtv, tv9, Telangana News,Telangana agitation, statehood demand, Komati Reddy, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood
Read more...