Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, June 29, 2012

తిక్కా .లెక్కా ..అన్నీ కుదిరాయి..!


gabbarsing 

ఓ హీరోతో సినిమా తెరకె క్కించాలంటే ఆ దర్శకుడు పెద్ద మేధావి కావాల్సిన అవసరం లేదు. ఆ హీరోని అభిమానిస్తూ.. ఆ హీరో అభిమాని అయితే చాలు’ ఇది ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో చిరంజీవి అన్న మాటలు.. సరిగ్గా అదే అభిమానాన్ని గుండెల్లో దాచుకొని ‘గబ్బర్‌సింగ్’ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు హరీష్ శంకర్. గత పది సంవత్సరాల నుంచి సరైన విజయం లేక, విజయ దాహం తీరక ఎదురుచూస్తున్న పవన్‌కు, ఆయన అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాలనుకున్న ఈ యువ దర్శకుడికి తోడుగా నిలిచాడు నిర్మాత బండ్ల గణేష్. పవన్ నాకు ఓ వ్యసనం అంటూ తన అభిమానాన్ని వెల్లడించిన ఈ నిర్మాత పవన్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు తన సినిమానే కరెక్ట్ అనుకున్నాడు. 

అందుకే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొంది ఘన విజయం సాధించిన ‘దబాంగ్’ను పవన్‌తో ‘గబ్బర్‌సింగ్’ పేరిట నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా రీమేక్ చేశాడు. పవన్ అంటే ప్రాణం ఇచ్చే దర్శకుడు, నిర్మాత కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలించిందో తెలుసుకుందాం..!

కథ: కొండవీడు గ్రామంలో నివసించే ఓ రైస్‌మిల్ యజమాని (నాగినీడు) తన భార్య మరణంతో, భర్త మరణించి కొడుకు ఉన్న ఓ మహిళని (సుహాసిని) పెళ్ళి చేసుకుంటాడు. ఆమె కొడుకే వెంకటరత్నం నాయుడు (పవన్ కళ్యాణ్), మొదట్నుంచీ సవతి తండ్రి వివక్షని తట్టుకోలేక చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి హాస్టల్‌లో వుండి చదువుకొని తన ఊరికే పోలీస్ అధికారిగా తిరిగి వస్తాడు వెంకటరత్నం నాయుడు. ‘షోలే’ చిత్రంలోని విలన్ పాత్రధారి అయిన ‘గబ్బర్‌సింగ్’ను ఆరాధించే వెంకటరత్నం నాయుడు తన పేరును ‘గబ్బర్‌సింగ్’గా మార్చుకుంటాడు. అంతేకాదు పోలీస్ అధికారిగా తనదైన ‘తిక్క’తో తనకున్న లెక్కతో పనిచేస్తుంటాడు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ను గబ్బర్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌గా పేరు మార్చేస్తాడు. ఇక అదే గ్రామంలో పేరుమోసిన రౌడీషిటర్ సిద్ధప్ప నాయుడు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ అతన్ని ముప్పు తిప్పలు పెడుతుంటాడు గబ్బర్‌సింగ్. ఎమ్మెల్యే కావాలని కలలు కంటూ దానికోసం సిద్దప్ప నాయుడు చేసే దుశ్చర్యలను అడ్డుకుంటుంటాడు. ఇక గబ్బర్‌సింగ్‌ను అడ్డుతొలగించాలని సిద్ధప్ప నాయుడు వేసే ప్లాన్స్‌ను తిప్పికొట్టి తన శైలిలో రెచ్చిపోతుంటాడు గబ్బర్‌సింగ్. ఈ క్రమంలోనే భాగ్యలక్ష్మీ (శ్రుతిహాసన్)తో ప్రేమలో పడతాడు..! ఇక అడుగడుగునా తన ఆధిపత్యానికి అడ్డంకిగా తయారైన గబ్బర్‌సింగ్‌ను సిద్ధప్ప ఏం చేశాడు? భాగ్యలక్ష్మితో అతని ప్రేమ ఫలించిందా..? గబ్బర్‌సింగ్ సిద్ధప్పకు ఎలా బుద్ధి చెప్పాడు? అతని ఆగడాల నుంచి కొండవీడు ప్రజలను ఎలా రక్షించాడు? అనేది మిగిలిన కథాంశం.

‘ఖుషీ’ తర్వాత పవన్ ఫుల్ జోష్‌తో నటించిన సినిమా ఇది. అతని నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెంటిమెంట్, వినోదం, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ తనదైన శైలిలో నటించాడు. పవన్ స్టయిల్, గెటప్, నడకతీరు చూసి ఇక అభిమానులైతే థియేటర్స్‌లో పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత డాన్స్ మూమెంట్స్‌తో కూడా ప్రేక్షకులను అలరించాడు పవన్‌కళ్యాణ్. శృతిహాసన్ నటనలో ఇంకా ఓనమాలు దిద్దుకుంటున్న హీరోయిన్‌గా కనిపించింది. నాగినీడు, సుహాసిని తమ పాత్రల పరిధి మేరకు ఒదిగిపోయారు. పవన్ తర్వాత ఈ సినిమాకు ప్రాణం పెట్టింది మాత్రం దర్శకుడు హరీష్‌శంకర్ అని చెప్పుకోవాలి. పవన్‌కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీష్ హీరో పవన్‌ను ఎలా చూపిస్తే అభిమానులు ఖుషీ అవుతారో అచ్చంగా అలాగే చూపించాడు. 

ముఖ్యంగా ఆయన రాసిన సంభాషణలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ ‘ట్రెండ్‌ని ఫాలో అవను, ట్రెండ్‌ను సెట్ చేస్తా’ వంటి సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ‘పాపులారిటీదేముంది పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, నేను ఆకాశం లాంటి వాడ్ని, నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ అనే సంభాషణలు పవన్ నోట పలుకుతుంటే అభిమానులు థియేటర్స్‌లో క్లాప్స్ కొడుతున్నారు. ఈ సంభాషణలే మున్ముందు ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేస్తాయి. ఈ చిత్రానికి వున్న మరో బలం దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం.

 సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే పాటలను విజువల్‌గా మరింత బాగా తీసుంటే బాగుండనిపిస్తుంది. జయనన్ విన్సెంట్ ఛాయాగ్రహణం డీసెంట్‌గా వుంది. ఓవరాల్‌గా గబ్బర్‌సింగ్ పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. సమ్మర్ సీజన్ కావడంతో ఇక ‘గబ్బర్‌సింగ్’కు వసూళ్లకు అడ్డు వుండదని చెప్పొచ్చు.

Read more...

బి.ఇడి సీటు చాలా హాటు!


బి.ఇడి ఎంట్రన్స్‌ను తేలికగా తీసుకున్నవారు ఇప్పుడు కౌన్సిలింగ్‌లో సీటు కోసం కుస్తీ పట్టవలసి ఉంటుంది. సోషల్ స్టడీస్‌లో, బయోలాజికల్ సైన్స్, మేథమేటిక్స్ గ్రూపుల్లో ప్రతి సీటుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీపడుతుంటే ఇక ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా, ఐ.ఎ.ఎస్.ఇ. , కాకతీయ కాంపస్‌లలో సీటు రావాలంటే ర్యాంకు ఎంత కనిష్టంగా వుంటే అంత సులువు అవుతుందని తెలిసిందే. 2011 కౌన్సిలింగ్ ముగింపు ర్యాంకుల ఆధారంగా విశ్లేషణ.

బి.ఇడి సోషల్ స్టడీస్ మెథడాలజీలో 19,500 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 59,605. ఇక బి.ఇడి మేథమేటిక్స్ మెథడాలజీలో 16,250 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 25,257. బయోలాజికల్ మెథడాలజీలో 13,000 సీట్లు వుండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 37,375. ఇక ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో 9,750 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 11,237, చివరగా బి.ఇడి ఇంగ్లీష్ మెథడాలజీలో 6,500 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 3193. బి.ఇడి సీట్లు, సంబంధిత బి.ఇడి మెథడాలజీ సీట్లు, ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను బట్టి చూస్తే ఇంగ్లీష్ మెథడాలజీ మినహాయిస్తే అన్ని మెథడాలజీలలో అందుబాటులో ఉన్న సీట్లకంటే అర్హత గల అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక గత ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,92, 389) కంటే, ఈ ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,36,667).

57 వేలు తగ్గినప్పటికీ నిర్థిష్ట మెథడాలజీలల్లో పోటీ కనిపించటం విశేషం. డియస్సీ రిక్రూట్‌మెంటులో ఎస్.జి.టి. పోస్టులకు బి.ఇడి. అభ్యర్థులను అనుమతించకపోవటంతో బి.ఇడి కోర్సుపై గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తక్కువ మోజు కనబరుస్తున్నారనేది తాజా ఎడ్‌సెట్ పోటీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా ఆయా మెథడాలజీ బి.ఇడి కోర్సుల సీట్లకంటే పోటీపడే అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనించాల్సిన విషయమే.


 Drawe00 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


కేంపస్‌లో సీటు పొందాలంటే?
ఎడ్‌సెట్ పరీక్షలో బెస్ట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఎక్కువగా కోరుకునేవి యూనివర్సిటీ బి.ఇడి కోర్సులనే. ఉన్నత విద్యకు, ఉత్తమ సదుపాయాలకు యూనివర్సిటీలే కేంద్రాలు. అందుకే ఇవి అఫర్ చేసే బి.ఇడి సీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. హాస్టల్ వసతి అదనపు ఆకర్షణగా అభ్యర్థులు కేంపస్ బి.ఇడిలకు మొగ్గు చూపుతుంటారు. గత ఏడాది జరిగిన ఉస్మానియా వర్సిటీ కేంపస్ కాలేజీ బి.ఇడి.అడ్మిషన్స్‌లో బి.ఇడి సీట్లు కైవసం చేసుకున్న టాప్ ర్యాంకర్ల వివరాలు పరిశీలిస్తే బి.ఇడి మ్యాథ్స్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ వుండగా, అలాగే ఫిజికల్ సైన్స్‌లో 26వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 1వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 16వ ర్యాంకర్, ఇంగ్లీష్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ అభ్యర్థులున్నారు.

అలాగే కాకతీయ యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి. కాలేజీలో సీట్లు సాధించిన ర్యాంకర్ అభ్యర్థులు బిఇడి మ్యాథమెటికల్ మెథడాలజీలో 367వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 86వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 14వ ర్యాంకర్, చివరగా ఇంగ్లీష్ మెథడాలజీ బి.ఇడిలో 26వ ర్యాంకర్ సీట్లు కైవసం చేసుకున్నారు. ఇదే పంథాలో టాప్ 100 నుంచి 500 ర్యాంకుల మధ్యన గల ర్యాంకర్లు ఆయా యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి కాలేజీలలో సీట్లు పొందగలరు. ఉదాహరణకు బి.ఇడి. కేంపస్ సీట్లు ఇంకా ప్రైవేటు బి.ఇడి సీట్లు మొత్తం సంఖ్యలో 15శాతం సీట్లు యూనివర్సిటీయేతర అభ్యర్థులు మెరిట్ ర్యాంకుతో రాష్ట్రంలో ఎక్కడైనా బి.ఇడి. సీటును కోరుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో బి.ఇడి. సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ జిల్లాలు), ఆంధ్రా వర్సిటీ (కోస్తాంధ్ర జిల్లాలు), శ్రీవేంకటేశ్వర వర్సిటీలలో (రాయల సీమ జిల్లాలు) భర్తీ అవుతాయి.

 edcet0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


100 సీట్లు గల బి.ఇడిలో 85 సీట్లు స్థానికులకు రిజర్వ్ చేయగా 15 సీట్లు స్థానికులు లేదా స్థానికేతరులు ఎవరైనా మెరిట్‌తో ఎంపిక అవుతారు. సాధారణంగా కేంపస్ బి.ఇడి సీటు డిమాండ్ ఉస్మానియా వర్సిటీకి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజధానిలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడకు వచ్చి కోర్సు చేస్తే బహుముఖ అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయం అభ్యర్థుల్లో వుంది. దానితో ఉస్మానియా బి.ఇడి కోర్సు పట్ల ఇతర యూనివర్సిటీ అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. యూనివర్సిటీ కాలేజీ బి.ఇడి. అభ్యర్థులకు ప్రముఖ కార్పోరేట్ సంస్థలో ప్లేస్‌మెంట్స్ ఇస్తుండటంతో కేంపస్ కోర్సులకు డిమాండ్ ఉంటోంది.

ఐ.ఎ.ఎస్.ఇ అంటే క్రేజ్
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐ.ఎ.ఎస్. ఇ.) ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు అభ్యర్థుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఉదా॥ మాసాబ్‌ట్యాంకులోని ఐ.ఎ.ఎస్.ఇ. విద్యా సంస్థ 1959లో ఏర్పాటైన పురాతన కాలేజీగా ఖ్యాతి గడించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ బి.ఇడి. కాలేజీల్లో ఒకటైన కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు ర్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. పటిష్టమైన విద్యాబోధన అందించే సీనియర్ క్వాలిఫైడ్ లెక్చరర్లు ఐ.ఎ.ఎస్.ఇ.;సి.టి.ఇ.లలో ఉండటం, అత్యంత తక్కువగా ఫీజు చెల్లించి బి.ఇడి ని సొంతం చేసుకునే అవకాశం ఉంటున్న దృష్ట్యా ఇక్కడి బి.ఇడి కోర్సులకు డిమాండ్ ఉంటోంది.
మాసాబ్‌ట్యాంక్‌లోని ఐ.ఎ.ఎస్.ఇ.లో 2011 బి.ఇడి సీట్లు పొందిన టాప్ ర్యాంకర్లను పరిశీలిస్తే, మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 46వ ర్యాంక్, ఫిజికల్ సైన్స్‌లో 208వ ర్యాంక్, బయోలాజికల్ సైన్స్‌లో 25వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 46వ ర్యాంకర్ చివరగా ఇంగ్లీష్ మెథడాలజీలో 30వ ర్యాంక్ అభ్యర్థులు అడ్మిషన్లు కైవసం చేసుకున్నారు.

 B.Ed0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


ప్రఖ్యాత బి.ఇడి. కాలేజీలు
రాష్ట్రంలో బి.ఇడి మొత్తం కాలేజీలు 605, ఇందులో మొత్తం సీట్లు 65వేలు ఉన్నాయి. ఫీజుల పరంగా సౌలభ్యం ఇతర సదుపాయాలపరంగా సౌకర్యం గల కేంపస్, గవర్నమెంట్ బి.ఇడి.కాలేజీల సంఖ్య పట్టుమని 15 మించడం లేదు. ఇందులో మొత్తం బి.ఇడి సీట్లు సంఖ్య 2వేలకు మించదు. పోటీకీ సమీపంలో గల ఎయిడెడ్ కాలేజీలలో ఫీజులు సాధారణంగానే ఉన్న దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు సదరు బి.ఇడి. కోర్సుల వైపు చూస్తున్నారు.

ఎక్కువభాగం బి.ఇడి సీట్లు ప్రైవేట్ బి.ఇడి కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ బి.ఇడి. కాలేజీలు కేంపస్ కాలేజీలతో పోటీపడేలా బి.ఇడి కోర్సును ఆఫర్ చేస్తూ అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఫీజులు మాత్రం కాస్త భారీగానే చెల్లించాల్సిందే. గత ఏడాది ప్రైవేటు కాలేజీలలో బి.ఇడి సీటు పొందాలంటే రూ. 16,500 ట్యూషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా, కేంపస్ బి.ఇడి కాలేజీలలో రూ.8,000 ఉండగా ఐ.ఎ.ఎస్.ఇ విద్యా సంస్థల్లో రూ.3000లతో బి.ఇడి కోర్సు చేసే అవకాశం ఉంటున్నది.
ఇంకా ఎస్.సి. , బి.సి, ఎస్.టి.కి చెందిన నిర్థిష్ట రూ.లక్ష రూపాయల కుటుంబ వార్షికాదాయం గల వారికి బి.ఇడి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వం నుంచి కాలేజీలకు రీయం బర్స్‌మెంటు లభించటం అభ్యర్థులకు తెలిసిందే.

Take By: T News

Read more...

రాయల రచ్చ


rayalatelangana-ఎందుకొస్తున్నదీ ప్రస్తావన?
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?


తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
- ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ జేఏసీ చైర్మన్


ఆంధ్రతో విలీనం చేసిన తెలంగాణ ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. నేను రాయల తెలంగాణకు సానుకూలమంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మొద్దు.
- గండ్ర వెంకటరమణాడ్డి, చీఫ్‌విప్


హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా):రాయలసీమలోని ప్రజల నుంచి ఇప్పటివరకు రాయల తెలంగాణ డిమాండ్ వినిపించకపోయినా కేవలం ఇద్దరు, ముగ్గురు సీమ నేతలు తరచూ ఈ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హస్తినలో కదలిక వచ్చినప్పుడల్లా ఆ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు ముందుకు నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు సైతం ఆ ప్రతిపాదనలకు గళం కలుపుతుండటం గమనార్హం. సీఎం మార్పు ఉంటుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని రాష్ట్ర మంత్రి జానాడ్డి గురువారం నల్గొండ జిల్లాలో వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం రాయల తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అనంతరం మాట మారుస్తూ రాయలతెలంగాణను ఏర్పాటు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నదని మాత్రమే తాను చెప్పానని అన్నారు.

అసలు రాయల తెలంగాణ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నది? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికా? లేక తెలంగాణకు పీటముడి వేయడానికా? తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలోనే ఈ ప్రతిపాదనలు రావడంపై రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణవాదుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలు తమ డిమాండ్‌పై ఎంతో కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే, సమయం, సందర్భం లేకున్నా కొందరు రాయల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటుండటంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ ప్రతిపాదన వెనుక వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప మరో కారణం లేదనే విషయం స్పష్టమవుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు ఏనాడైనా రాయల తెలంగాణ కోరుకున్నారా? ఆ దిశగా ఉద్యమాలు, ఆందోళనలు చేశారా? .. అలాంటి దాఖలాలే కనిపించవు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాయల తెలంగాణ ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తాము రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే ఉండదని తెలంగాణవాదులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిరసన కార్యక్షికమాలకు కూడా పిలుపునిచ్చింది. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని మరోమారు స్పష్టం చేసింది.

ఆ ముగ్గురి వల్లే..
రాయల తెలంగాణ ప్రస్తావన రావడానికి ఆ ముగ్గురే కారణం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మజ్లిస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని, భవిష్యత్తులో తమ ఉనికితోపాటు ముస్లింలకు ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన మజ్లిస్ పార్టీని వెంటాడుతున్నది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదని, తెలంగాణలోని 10 జిల్లాలతో ఆ రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయవచ్చని మజ్లిస్ భావిస్తోంది. మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ కోణంలోనే రాయల తెలంగాణ వైపు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒవైసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా తొలుత సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మంత్రి టీజీ వెంక మాజీ మంత్రి జేసీ దివాకర్‌డ్డి ఇప్పుడు పదే పదే రాయల తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని టీజీ వెంక రాయల తెలంగాణకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కడప జిల్లాకు చెందిన జగన్ లాంటి నేతలతో తన రాజకీయ ఎదుగుదల, పదవులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, భవిష్యత్తులో తాను కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగేందుకు వీలుకలుగుతుందని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఈ మధ్య గట్టిగా వాదిస్తూ చీటికి మాటికి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇటు తెలంగాణలో, అటు సీమలోని ఆ రెండు జిల్లాల్లో రాజకీయ నేతలు ఎవరు కూడారాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేయడం లేదు.

సంస్కృతి వేరు.. సమస్యలు జోరు
తెలంగాణ ప్రాంత ప్రజల, సీమలోని రెండు జిల్లాల ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర వేర్వేరు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య నీటి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నీటి వినియోగంపై మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏ రకంగానూ సబబు కాదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాయల తెలంగాణ ఏర్పాటుతో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం అందులో సరిగ్గా సగమవుతుంది. అంటే రాయల తెలంగాణ, ఆంధ్రాలో 21 మంది చొప్పున ఎంపీలు, 147 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉండేందుకు వీలు కలుగుతుందే తప్ప తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.

జనం వ్యతిరేకిస్తారు: పయ్యావుల కేశవ్
రాయల తెలంగాణ అనేది బాధ్యత లేని నేతల ప్రతిపాదన అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను సామాన్య జనం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో పయ్యావుల ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

గండ్రకేమన్న హైకమాండ్ చెప్పిందా: సారయ్య
వరంగల్ సిటీ, జూన్ 28 (టీ మీడియా): ‘రాయల తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏమన్న గండ్ర వెంకటరమణాడ్డితో చెప్పిందా? ఆయన ఏమన్న హైకమాండ్‌తో మాట్లాడారా’ అని మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని గండ్ర చెప్పారని విలేకరులు సారయ్య దృష్టిగాతేగా ఆయన పై విధంగా స్పందించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌ను, ఏ తెలంగాణ అన్నది కాదు తెలంగాణ మాత్రం వస్తుందని వివరించారు. నేను రాయల, ఆంధ్రా అని చెప్పడం లేదు, తెలంగాణ మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు.

రాయల తెలంగాణకు కేంద్రం ఓకే: గండ్ర
-సాయంవూతానికి మాటమార్చిన చీఫ్‌విప్
-విలీనమైన తెలంగాణే కోరుతున్నామని వివరణ

వరంగల్,  ప్రతినిధి: అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలతెలంగాణ ఏర్పడినా హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వస్త్తున్న ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం, కర్నూలుతో కలుపుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తమకు సమచారం ఉందన్నారు. కృష్ణాజలాల విషయంలో, అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదం పొందాలంటే కచ్చితంగా సంఖ్యాబలం కావాలని అన్నారు. బహుశా ఆ కారణంగా కేంద్రం ఆ రెండు జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ ప్రతిపాదనకు వస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ మండిపడటంతో సాయంవూతానికి గండ్ర మాటమార్చారు. గతంలోనే ఎంపీలు ఒవైసీ, కేసీఆర్ రాయల తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిందని చెప్పారని గుర్తు చేశారు. తాను సైతం అదే ప్రతిపాదన ఉందని మాత్రమే చెప్పానని వివరించారు. తమకు పాత హైదరాబాద్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

Take BY: T News

Read more...

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP