అబ్బుర పరిచిన ‘మహాయోధ’
రవీంవూదభారతి, నవంబర్ 20 (): చరివూతకారులు చెబుతున్నట్లుగా వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి కాదని, ఝల్కారీబాయి నిజమైన వీరనారి అని చెబుతూ రవీంవూదభారతిలో ఆదివారం ప్రదర్శించిన ‘మహాయోధ’ నాటకం సభికులను కట్టిపడేసింది. ఈ నాటక ప్రదర్శనను ఆద్యంతం ఉత్కం ప్రేక్షకులు వీక్షించారు. ఝల్కారీబాయి ధీరత్వాన్ని, పోరాటపటిమను చూసి వారు విస్మయానికి లోనయ్యారు. ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయిగా ద్విపావూతాభినయం చేసిన రైల్వే ఉద్యోగి సత్యవాణి నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ నాటకానికి సౌదా అరుణ దర్శకత్వం వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్థానంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడింది ఝల్కారీబాయి అని నేటి ప్రపంచానికి తెలియజేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నత కుటుంబంలో జన్మించి ప్రాణాలకు భయపడి, ఆమె పోలికలతోనే ఉన్న ఝల్కారీ బాయిని రక్షణగా ఏర్పాటు చేసుకున్న విషయం భారత సైనికులకు కూడా తెలియదని వివరించారు. ఝాల్కారీబాయి స్వగ్రామంలోని ఆదివాసుల ద్వారా వివరాలు సేకరించి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని దర్శకురాలి భర్త సౌదా మీడియాకు తెలిపారు.
మీడియాను దూషించిన సౌదా..
మహాయోధ నాటక ప్రదర్శనను చిత్రీకరిచేందుకు పలు చానళ్ల ప్రతినిధులు రవీంవూదభారతికి వచ్చారు. విరామ సమయంలో వారు నాటకంపై ప్రముఖుల అభివూపాయాలను సేకరిస్తుండగా.. ‘మీకు బుద్ధి, జ్ఞానం ఉందా.. మీపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ మీడియాపై దర్శకురాలి భర్త సౌదా విరుచుకుపడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు నాటక ప్రదర్శనను బహిష్కరించారు.