Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, January 24, 2012

మన తురుంఖన్ తుర్రేబాజ్‌ఖాన్



DSC_9-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema- బ్రిటిష్ కోటపై దండెత్తిన యోధుడు
- సిపాయిల తిరుగుబాటులో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ధీశాలి
- నేడు తుర్రేబాజ్‌ఖాన్ వర్ధంతి

ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ రోజులవి! బ్రిటిష్ సర్కారును గడగడలాడించిన సిపాయిల తిరుగుబాటుకాలమది! సిపాయిల తిరుగుబాటంటే ఢిల్లీ, లక్నో, అవధ్, కాన్పూర్, గ్వాలియర్, ఝాన్సీ.. సాధారణంగా కళ్లముందు కదలాడే దృశ్యాలివే! కానీ.. మహత్తరమైన ఆ పోరాటంలో హైదరాబాద్‌కూ ప్రత్యేక స్థానాన్ని కల్పించిపెట్టాడు తుర్రేబాజ్ ఖాన్! ప్రస్తుత కోఠి ప్రాంతంలో ఉన్న నాటి బ్రిటిష్ కోటపై దండెత్తి.. హైదరాబాద్ సత్తా చాటిన యోధుడు! ఆ వీరుడి వర్ధంతి నేడు!

బానిస బంధనాల నుంచి మాతృభూమిని విముక్తం చేయాలన్న ఆకాంక్ష! వలస పాలనపై ఆనాడే పేలిన తూటా! శత్రువు అపారసైనిక పాటవాన్ని కలిగి ఉన్న శక్తి! కొండను ఢీకొనడమేనన్న సంగతి తెలుసు! కానీ.. పరాయి పాలకులను తరిమికొట్టడమే లక్ష్యం! ఆ లక్ష్యం కోసం ఉద్యమించాడు పఠాన్ తుర్రేబాజ్‌ఖాన్! శత్రువుతో పోరాటంలో మరణం అనివార్యమని తెలిసినా.. అరివీరభయంకరుడై సమరాంగణంలోకి దూకాడు! బ్రిటిష్ రెసిడెన్సీపైకి తన అనుచరగణాన్ని ఉరకపూత్తించిన తుర్రేబాజ్‌ఖాన్.. తూప్రాన్ ప్రాంతంలో శత్రువుతో పోరాటంలో బలయ్యాడు!

scan213-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపఠాన్ తుర్రేబాజ్‌ఖాన్.. పరాక్షికమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి నాయకుడు. ఔరంగాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్‌లో జమేదారు. అప్పటికే బ్రిటిష్ పాలకుల దోపిడీని సహించలేని స్థితికి ప్రజలు చేరుకున్నారు. వివిధ కారణాలతో సిపాయిల్లో సైతం అసంతృప్తి ప్రజ్వరిల్లింది. 1957వ సంవత్సరం వచ్చే సరికి బ్రిటిష్ పాలకులపై దేశవ్యాప్తంగా సిపాయిల్లో తిరుగుబాటు తలెత్తింది. కనీస సమాచార సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే పకబ్బందీ ప్రణాళికతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. యవతీయువకులతో పాటు స్వదేశీ పాలకులు సైతం తెల్లవాడి పాలనపై నిప్పులు కక్కుతున్న రోజులవి. ఆ సమయంలో బానిసత్వం నుంచి విముక్తికి పోరాడేలా తుర్రేబాజ్‌ఖాన్‌కు స్ఫూర్తినిచ్చాడు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్!

ఆ ధార్మిక పెద్దల ప్రభావంతో ఫిరంగీలను హతమార్చాలంటూ హైదరాబాద్ నగర గోడలపై ప్రకటనలు దర్శనమిచ్చాయి. ఆ ప్రకటనలు పెద్ద స్ఫూర్తినే రాజేశాయి. అప్పటికి హైదరాబాద్‌లో నైజాం సంస్థానం కొనసాగుతోంది. ఆ సంస్థానంలోని కొందరు బ్రిటిష్ అధికారులను కొందర సైనికులు హతమార్చారు. ఈ విషయంలో మాట్లాడేందుకు వెళ్లిన రొహిల్లాలను నిజాం నవాబు బ్రిటిష్ అధికారులకు అప్పగించడం సైనికుల్లో మరింత ఆగ్రహం రాజేసింది. వారిని ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయించాలని తిరుగుబాటుదారులు అందరూ నిర్ణయించుకున్నారు. మక్కామసీదులో సమావేశమయ్యారు. మౌల్వీల పిలుపుతో తుర్రేబాజ్‌ఖాన్ హైదరాబాద్ రెసిడెన్సీపై దాడికి ఆ రోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరాడు. మెరికల్లాంటి తన అనుచరులు 500 మందితో కలిసి విరుచుకుపడ్డాడు.

బ్రిటిష్ రెసిడెంట్ కర్నల్ కుత్‌బెర్ట్ డేవిడ్‌సన్ నివాసంపైకి సమీప రెండు ఇళ్లపై నుంచి ఖాన్ అనుచరులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పులు జరిపారు. అక్కడి నుంచి గోడలు బద్దలు కొట్టుకుని ముందుకు ఉరికారు. ఒకవైపు తమ సహచరులు కాల్పులు జరుపుతుండగా.. వారి రక్షణతో పుత్లిబౌలి వద్దకు చేరుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారే దాకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పొద్దున చూసే సరికి ఆ ప్రాంతంలో అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ భీకర పోరులో తుర్రేబాజ్‌ఖాన్ అనుచరులు కూడా కొందరు చనిపోయారు. అయితే చెరలో ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను వారు విడిపించలేక పోయారు. ఈ విఫలయత్నంలో తప్పించున్న ఖాన్.. జూలై 22న బ్రిటిష్, నిజాం బలగాలకు పట్టుబడ్డాడు.

ఆయనకు ద్వీపాంతరవాస శిక్ష పడింది. ఆ శిక్ష అమలయ్యేలోగా 1859 జనవరి 18న జైలు నుంచి తప్పించుకున్నాడు. అప్పటికే సిపాయి తిరుగుబాటను బ్రిటిష్ ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. మళ్లీ తిరుగుబాటుకు తుర్రేబాజ్ సమాయత్తమయ్యాడని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన తలకు నజరానా ప్రకటించింది. అయినా ఆయన దొరకలేదు. కానీ.. కుర్‌బాన్ అలీ అనే నమ్మకవూదోహి చేసిన మోసానికి ఆయన ఆచూకీ బ్రిటిష్ సేనలకు తెలిసిపోయింది. తూప్రాన్‌లో తుర్రేబాజ్‌ఖాన్ ఉన్నాడన్న సమాచారంతో ఆ గ్రామంపైకి 1959 జనవరి 24న బలగాలు దండెత్తాయి. విజయమో వీరస్వర్గమో తేల్చుకునే పోరాటంలో చివరకు తుర్రేబాజ్‌ఖాన్ ఒంటరిగా మిగిలాడు.

చుట్టుముట్టిన సేనల నుంచి తప్పించుకోలేక పోయాడు. అయినా శత్రువు కళ్లుగప్పి తప్పించుకునే ప్రయత్నంలో బ్రిటిష్‌తూటాలకు ఒరిగిపోయాడు. ఆయన మృతదేహాన్ని సంకెళ్లతో కట్టి తెచ్చిన తెల్లవాడు.. నేటి కోటీ ప్రాంతంలో ఒక స్తంభానికి వేలాడగట్టారు. ఈ భయంకరమైన చావును చూసి, మరెవరూ బ్రిటిష్‌కు వ్యతిరేకంగా ఉద్యమించరని పాలకులు కలగన్నారు. కానీ.. తుర్రేబాజ్‌ఖాన్ స్ఫూర్తి అనంతర కాలంలో స్వాతంత్య్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చింది. బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడేందుకు దోహదం చేసింది. మౌల్వీ అల్లావుద్దీన్ మంగళంపల్లి వద్ద బ్రిటిష్ సేనలకు పట్టుబడ్డారు. ఆయనకు 1884లో ప్రవాస శిక్ష పడింది. తుర్రేబాజ్‌ఖాన్ వీరోచిత పోరాటానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం 1957లో కోటీ ప్రాంతంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించింది.

కొత్త నియామకాలలో కాంట్రాక్ట్ కార్మికులకు అవకాశం ఇవ్వాలి: అసదుద్దీన్ ఒవైసీ

సిటీన్యూస్, జనవరి 23 (: ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న వారికి కొత్త చేపట్టే నియామకాల్లో అవకాశాలు కల్పించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం మింట్ కంపౌండ్‌లోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన ఏపీ ఎలక్షిక్టికల్ ఉద్యోగుల ముస్లిం మైనారిటీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీఐ పూర్తి చేసిన వారి కన్నా కాంట్రాక్ట్ కార్మికులే మెరుగ్గాపని చేస్తారని అన్నారు. కార్యక్షికమంలో ఏపీఈఈఎంఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎం భాషా,యూసుఫ్, అబ్బాస్‌అలీ, జీలాన్‌బాషా, ముస్తాక్, నాగరాజు పాల్గొన్నారు.

టెట్ రద్దు కోసం ఐక్య ఉద్యమాలు

నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని యువజన, విద్యార్థి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. టెట్ రద్దు, ఎస్జీటీలో బీఈడీ అభ్యర్థులకు అనుమతి, వయోపరిమితి వంటి అంశాలపై ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించాయి. ఈ నెల 31న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నాయి. సోమవారం ఏఐవైఎఫ్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ, పీవైఎల్ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేఎల్ గౌతంకుమార్, రాములు యాదవ్, ఎన్ లెనిన్‌బాబు, భాస్కర్, ఎం హన్మేశ్ పాల్గొన్నారు.

Take By: T News

తెలంగాణ నిరుద్యోగకి ఆంద్రా సర్కార్ దగా!

- పది జిల్లాల్లో 9వేల మందిపై కేసులు
students1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema- హత్యాయత్నం కేసులు సహా కొందరిపై పదుల సంఖ్యలో..
- పిడమర్తి రవిపై 151 కేసులు
- ముందుకొచ్చిన 1.16 లక్షల ఉద్యోగాలు
- కేసులున్న ఉద్యోగార్థులకు మొండి చెయ్యే
- చురుకైనవారికీ దక్కని పోస్టులు!
- కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ తాత్సారం
- మరో రెండేళ్లు పట్టే అవకాశం
- ఈలోగా జోరుగా నోటిఫికేషన్‌లు
- హడావిడిగా పరీక్షలకు ఏర్పాట్లు
- పట్టించుకోని టీ ప్రజా ప్రతినిధులు
- ఉద్యోగాలను సీమాంవూధకు తరలించే కుట్ర
- కేసులు ఎత్తేసేదాకా పోరాడుతాం
- తేల్చిచెబుతున్న తెలంగాణ విద్యార్థిలోకం

కళ్లముందు ఆశగా కనిపిస్తున్న లక్షాపదహారువేల ఉద్యోగాలు! వాటిని అందుకునేందుకు పోటీ పడినా.. అడ్డుకుంటున్న కేసులు! ఎత్తివేతకు హామీ ఇచ్చిన కేంద్రం.. ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంది! కేంద్రం ఆదేశాలను పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది! ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రాంత నేతలు.. ఇది తమకు సంబంధించిన విషయం కాదని దులిపేసుకుంటున్నారు! తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ హోం శాఖను నిర్వహిస్తున్నా.. జరిగిన న్యాయం లేదు! నిలదీయాల్సిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మనకెందుకుకొచ్చిన వ్యవహారమన్నట్లు చూసీ చూడకుండా పోతున్నారు! మధ్యలో టీ ఎంపీలు కేసుల ఎత్తివేత కోసం నిరసన దీక్షలకు దిగినా..


అది ఉత్తుత్తి దీక్షగా మిగిలిపోయింది! ఉద్యమ శక్తులు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు! చూస్తాం.. చేస్తాం.. ఎత్తేస్తాం.. అన్న మాటలే తప్పించి.. కేసుల ఎత్తివేత ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి! వెరసి.. తెలంగాణ నిరుద్యోగి మరోసారి దగా పడుతున్నాడు! యూనివర్సిటీ దాటుకుని.. ఉపాధి వేటలో పడుతున్న విద్యార్థి.. దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నాడు! 2009 పరిణామాలు మొదలుకుని.. తాజాగా సకల జనుల సమ్మె వరకూ వివిధ సందర్భాల్లో పెట్టిన కేసులు కలవర పెడుతుండగా దాదాపు 9వేల మంది రానున్న 1.16 లక్షల ఉద్యోగాలకు అనర్హులుగా మిగులుతున్నారు! అటు ఉద్యమాన్ని నీరుగార్చడానికి విద్యార్థులపై పుంఖానుపుంఖాలుగా కేసులు తెరిచిన ప్రభుత్వం..

ఇప్పుడు తెలంగాణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగుల నోట్లో మట్టికొ సిద్ధమవుతోంది! ఇన్నాళ్లూ జరిగిన మోసాలను భరించి, ఇక భరించలేక తెగించి కొట్లాడే తత్వాన్ని అలవర్చుకున్న విద్యార్థులు.. తక్షణ సమస్యగా ముందుకొచ్చిన కేసుల ఎత్తివేతపై మరో సమరశీల పోరాటానికి సిద్ధపడుతున్నారు! ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రలపై సమరభేరీ మోగిస్తున్నారు!

హైదరాబాద్, జనవరి 23 (టీ న్యూస్): తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర సర్కార్ మరో ద్రోహం తలపెడుతోందా? లక్షా పదహారువేల ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతూ ఉద్యమాన్ని పలుచన చేయడానికి పావులు కదిపిన ప్రభుత్వం.. అవే ఉద్యోగాలను తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కకుండా కుట్ర చేసిందా? తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. వాటిని ఎత్తేయడంలో ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందా? కేసుల సంగతి తేల్చకుండానే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ముగించేసేందుకు హడావిడి పడుతోందా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరించి, దగ్గరపెట్టుకోవడం గమనిస్తే..

కేసులు లేని విద్యార్థుల భవిష్యత్తుతో సైతం ప్రభుత్వం ఆటలాడుకునేందుకు సమాయత్తమవుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని విద్యార్థి నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారని, మరోసారి తెలంగాణకు అన్యాయం చేసేందుకు సర్కారు సిద్ధమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం వారి ఆటలు కొనసాగనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు.

cuffs-copy-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదశాబ్దాల ఆరాటమైన తెలంగాణ కోసం జరుగుతున్న మలిదశ పోరాటంలో విద్యార్థులు అగ్రభాగాన ఉన్న విషయం తెలిసిందే. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చటానికి విద్యార్థులు పోలీసుల లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి పోరాటాలు చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వేర్వేరు రూపాల్లో నిరసనను తెలియచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాలకులు విద్యార్థులపై కక్షగట్టారని ఉద్యమక్షిశేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాకుండా చేయటానికి శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని చాపకింది నీరులా అమలు చేస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నవారిపై పోలీసులతో విచ్చలవిడిగా కేసులు నమోదు చేయించారని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఉద్యమంలో ముందుంటున్న ఒక్కో విద్యార్థిపై పది నుంచి ఇరవై వరకు కేసులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.

తీవ్రమైనవిగా పరిగణించే రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్‌తోపాటు ఐపీసీ 324, 332, 333, 149, 353, 149, 120(బీ), 147, 148 రెడ్‌విత్ 149, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం చేశారన్న నేరారోపణలపై 307 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారని వివరిస్తున్నారు. ఇలా తెలంగాణ జిల్లాల్లో దాదాపు 9 వేల మంది విద్యార్థులపై కేసులు ఉన్నాయని అంచనా. వీటిని అడ్డం పెట్టుకుని పోలీసులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేయటం, బెయిల్ మీద బయటకు రాగానే మరో కేసులో అరెస్టు చూపించి మళ్లీ జైలుకు పంపించటం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీని లక్ష్యం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు భాగం కాకుండా చేయాలన్నదేనన్నది సుస్పష్టమని వారు పేర్కొంటున్నారు.

ఇచ్చిన మాట బుట్టలోకి
‘డిసెంబర్ 9 ప్రకటన’ చేసిన రోజునే అప్పటి వరకూ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం హామీ ఇచ్చారు. కానీ మళ్లీ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగింది. ఇదే అంశంలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసనతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కేసుల ఎత్తివేతకు మరోసారి హామీ ఇచ్చింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు కూడా పంపింది. అయితే, ఇక్కడి సీమాంధ్ర పాలకులు మాత్రం ఈ దిశలో అవసరమైనంత వేగంగా చర్యలు తీసుకోవటం లేదు. ఈ విషయమై పోలీసుశాఖలోని సీనియర్ అధికారులతో మాట్లాడితే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించినట్టుగానే కేసుల ఎత్తివేత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని కేసులను ఇప్పటికే ఎత్తివేశామని, మిగతావాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు మాత్రం అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావటం లేదు. చట్ట ప్రకారం జరగాల్సిన వ్యవహారం కాబట్టి ఏడాది.. రెండేళ్లు పట్టొచ్చు..అంతకన్నా ఎక్కువ సమయం కావచ్చని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి కావాలనే ఇలా చేస్తున్నారని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా చేయాలన్నదే దీని వెనక లక్ష్యమని ఆరోపిస్తున్నారు. పోలీస్ పహారాలో ఉద్యోగాల భర్తీకి పరీక్షలను ప్రభుత్వం జరిపిస్తుండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

ఉత్తీర్ణత సాధించినా...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు తెలంగాణ విద్యార్థులు హాజరై ఉత్తీర్ణత సాధించినా వారికి కొలువులు దక్కే పరిస్థితి లేదు. దీనికి కారణం వారిపై కేసులను ఎత్తివేయకపోవటమే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసి ఎవరైనా ఉత్తీర్ణత సాధిస్తే వారిపై పోలీసులతో ఎంక్వయిరీ జరిపిస్తారు. అందలో వారిపై ఎలాంటి పోలీసు కేసులు లేవని నిర్థారణ అయితేనే ఉద్యోగం ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. నమోదైన కేసుల నుంచి వాళ్లు నిర్దోషులుగా బయటపడితేనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులే పేర్కొంటున్నారు. కేసుల ఎత్తివేత ప్రక్రియను పరిశీలిస్తే ఇప్పట్లో అది పూర్తయ్యేలా కనిపించటం లేదు. ఫలితంగా తెలంగాణకు చెందిన దాదాపు 9 వేలమంది విద్యార్థులు సమర్థత ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

కేసులు లేనివారిని సైతం...
కేసులు ఎదుర్కొంటున్నవారి పరిస్థితి ఇలా ఉంటే కేసులు లేనివారిని సైతం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారమే తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న వేలాదిమంది విద్యార్థుల వివరాలను ప్రభుత్వం ఇంటెలిజెన్స్, స్పెషల్‌వూబాంచ్ విభాగాల సిబ్బందితో సేకరించి పెట్టుకుంది. వీరిలో మరింత క్రియాశీలకంగా ఉన్నవారిని పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేస్తోంది. 2008లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2011లో నిర్వహించిన ఎసై్స రాతపరీక్షల్లో ఉస్మానియా వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులకు ఇదే అనుభవం ఎదురైంది. ఉద్యమం కారణంగా తాము పరీక్షలకు పూర్తిగా సన్నద్ధం కాలేదని, కొంత గడువు ఇచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఉస్మానియాలో చదువుతున్న విద్యార్థులు పలువురు అప్పట్లో డిమాండ్ చేశారు. వీరిలో దాదాపు 15 మంది విద్యార్థులు ఇదే డిమాండ్‌తో సీఎం, హోంమంత్రి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌తోపాటు పలువురిని కలిసి వినతిపవూతాలు సమర్పించారు.

వీరి విజ్ఞప్తులను పట్టించుకోని ప్రభుత్వం పోలీసుల ద్వారా వారి వివరాలను మాత్రం సేకరించింది. ఆ తరువాత జరిగిన ఎసై్స రాతపరీక్షలకు వీళ్లంతా హాజరయ్యారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోవటం గమనార్హం. మార్కుల షీట్ల కోసం అడిగితే మీరంతా డిస్‌క్వాలిఫై అయ్యారన్న సమాధానమే అధికారుల నుంచి వచ్చింది. ఇలా చెబుతూపోతే మరిన్ని ఉదంతాలున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపైనే తెలంగాణవాదులు మండిపడుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగాల ప్రకటనతో...
ఒకవైపు తెలంగాణ ఉద్యమం నుంచి విద్యార్థులను దూరం చేయటానికి వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తూనే ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. నిన్నమొన్నటి దాకా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితి లేదంటూ చెప్పుకొచ్చిన పాలకులు తాజాగా వేర్వేరు శాఖల్లో 1.16లక్షల ఉద్యోగాలను ప్రకటించారు. ఈ మేరకు ఆయా శాఖల నుంచి హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. సాధారణంగా కేసులు ఉంటే విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలకు అనర్హులవుతారు. ఇదే ఆలోచించిన ప్రభుత్వం.. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామంటూనే జాప్యం చేస్తూ.. మరోవైపు ఉద్యోగాల భర్తీకి మాత్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

- మరోసారి ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు
రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థులపై కేసులు ఎత్తేయకపోవటం దారుణం. విద్యార్థులు మళ్లీ ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తి వేయకుండా శాశ్వతంగా ఉద్యోగాలకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. విద్యార్థులపై అక్రమంగా బనాయించిన కేసులు ఇప్పటివరకు ఎత్తేయకపోవటం పట్ల ఉద్యోగాల భర్తీలో సీమాంవూధులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కేలా కుట్ర చేస్తున్నది. అన్నం పెడతాం రమ్మంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి తలుపులు మూసివేసినట్లుగా ఉంది. విద్యార్థులపై పెట్టిన కేసులు భేషరతుగా వెంటనే ఎత్తివేయాలి.
- చుక్కా రామయ్య, విద్యావేత్త


అన్నా టీంపై పెట్టని కేసులు ఇక్కడెందుకు?
అవినీతిపై పోరాడుతున్న అన్నా బృందంపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు దానిని ఒక సామాజిక ఉద్యమంగా పరిగణించే కేసులు పెట్టలేదు. తెలంగాణ ఉద్యమమూ సామాజిక ఉద్యమమే. అలాంటప్పుడు తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎందుకు పెట్టారు? ప్రభుత్వం ఉద్యోగాలిచ్చే ఆలోచనతో ఉంటే వెంటనే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి. విద్యార్థులు ప్రజల ఆకాంక్ష కోసం ఉద్య మించారు. అక్రమ కేసుల కారణంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించేందుకు వీసాలు లభించటం లేదు. వెంటనే కేసులు ఎత్తివేసి వారికి న్యాయం చేయాలి.
- పీఎల్ విశ్వేశ్వర్ రావు, ఉస్మానియా ఆర్ట్స్ విభాగం మాజీ డీన్


వివక్షకు ఇంతకన్నా
నిదర్శనం ఏం కావాలి?

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా వివక్ష ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగాల భర్తీలో ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకుండా కుట్రలు చేస్తోంది. దశాబ్దాలుగా సీమాంధ్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. కేసులు వెంటనే ఎత్తివేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
- డాక్టర్ పి. మధుసూదన్‌డ్డి, ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్


ఉద్యమాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ కుట్ర
తెలంగాణ విద్యార్థులు భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదిక 8వ అధ్యాయంలో ఉద్యమాన్ని అణివేత నిర్వహణకు సూచించిన అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అందులో భాగంగానే లక్ష ఉద్యోగాలు ఆశ చూపి విద్యార్థులు ఉద్యమాల వైపు చూడకుండా చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వ్యాపార భాగస్వామ్య సదస్సులో ప్రైవేటు రంగంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కూడా సీమాంధ్ర కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఉద్యోగాలు సీమాంధ్ర విద్యార్థులకే లభిస్తాయి. తెలంగాణ వారికి మిగిలింది ప్రభుత్వ ఉద్యోగాలు మత్రమే. ఆ ఉద్యోగాలు కూడా దక్కకుండా విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా భవిష్యత్తులో ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావని విద్యార్థులను భయవూభాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ దీక్ష సమయంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని ప్రకటించి మూడేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేసులు ఎత్తి వేయటం లేదు.
- ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ కన్వీనర్

ఉద్యోగాలతో లింకుపెట్టవద్దు
విద్యార్థులు కేవలం వారి వ్యక్తిగత అవసరాలకు చేసిన ఉద్యమం కాదు. తెలంగాణ ప్రజావూపయోజనాల కోసం వారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించింది. ఇది చాలా దారుణం. వెంటనే వారిపై పెట్టిన కేసులు భేషరతుగా ఎత్తివేయాలి. ఉద్యమాల నుంచి విద్యార్థులు ఉద్యగాల వేటలో పడ్డారు. ఉద్యమ కేసులకు ఉద్యోగాలకు లింకుపెట్టవద్దు. కేసులు ఎత్తివేసి తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమన్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- ప్రొఫెసర్ వినయ్‌బాబు, ప్రిన్సిపల్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ

Take By: T News

About This Blog

తెలుగు బ్లాగుల

my blog directory

Free Counters
CashAdvanceHelp

Total Blog Directory Submit Blog & RSS Feeds
Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!
Submit your website to 20 Search Engines - FREE with ineedhits!
You have not participated at the forum. Use the forum before you use this widget!
Make Money Blogging

Blog Directory Blog Topsites
Submit Blog
Blogs Blog Tools Allie Marie

Blogs Directory


Blog Directory

Blogger Help Templates Widgets SEO Tips Submit Site to Google Link building 

packages
Search engine submissions Politics
billiga hotellrum london Wutzle My Blog!

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service.
Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP