Thursday, November 3, 2011
డర్టీ పిక్చర్‌పై హై కోర్టులో పిటిషన్
హైదరాబాద్: ప్రముఖ కథానాయిక విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ విడుదలను నిలిపివేయాలంటూ సిల్క్‌స్మిత సోదరుడు నాగవరప్రసాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరి జీవిత చరిత్రను అసభ్యకరంగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా సినిమాను నిర్మించారని డైరెక్టర్, నిర్మాతపై మండిపడ్డారు. తమని సంప్రదించకుండా తన సోదరి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని సినిమాను నిర్మించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. డర్టీ పిక్చర్‌ను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags: T News, hmtv, tv9, Telangana agitation, statehood demand, Komati Reddy, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Daccnwood
విలీనంపై...బూర్గుల ఏమన్నారు?
- ఇవిగో వాస్తవాలు
- నాటి బూర్గుల భయం..
- నేటి వాస్తవ రూపం
- వికీసోర్స్‌లో నాటి బూర్గుల లేఖ
- విలీనానికి తెలంగాణ వ్యతిరేకమని వెల్లడి.. జీవన విధానం దెబ్బతింటుందని జనం భయం
- ఉద్యోగాల్లో అసమానతలపై అనుమానం..
- విలీనంపై ఆంధ్రలో గట్టిగా లేరు
- కానీ తెలంగాణలో బలమైన వ్యతిరేకత
: నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలుగు జాతి ఒకే రాష్ట్రంలో కలిసి ఉండాలని భావించే సమైక్యరాష్ట్రానికి అంగీకరించారని చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? నేతి బీరలో నెయ్యంత! నిజమే.. తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో కలిసి సమైక్య రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తెలంగాణ అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటుందని ఆనాడే బూర్గుల కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు తన విశ్లేషణను అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు యూఎన్ ధేబర్‌కు లేఖ రూపంలో వివరించారు. విలీనంపై తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవికతను ఆయన ఆ లేఖలో స్పష్టంగా వెల్లడించారు. ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావానికి కొద్ది నెలల ముందు ఆయన ఈ లేఖ రాశారు. ఆ లేఖ బూర్గుల కుటుంబీకుల వద్ద ఇప్పటికీ ఉంది.
దానిని రామకృష్ణారావు తనయుడు విజయ్ వికీసోర్స్‌తో పంచుకున్నారు. విశాలాంధ్ర మద్దతుదారులు ఏం చెబుతున్నారు? విలీనంపై తెలంగాణ వారు ఎందుకు భయపడుతున్నారు? అన్నదానిపై ఆ లేఖలో బూర్గుల స్థూలంగానే అయినా స్పష్టంగా వెల్లడించారు. ఆనాడు బూర్గుల తన లేఖలో తెలంగాణవాళ్లు ఏవైతే భయాలు వ్యక్తం చేశారని చెప్పారో.. అవే వాస్తవాలుగా మారడం విశేషం. లేఖ సారాంశం ఇలా ఉంది...
‘‘శ్రీ యూఎన్ దేభర్ గారికి, ఇప్పుడు నేను రాస్తున్న ఈ లేఖ మధ్యంతర నివేదికలాంటిది. త్వరలోనే పూర్తి స్థాయి లేఖ రాస్తాను. నేను, శ్రీ భార్గవ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించాం. ఉన్న తక్కువ సమయంలో మేం గమనించిన విషయాలపై అంచనాను ఇస్తున్నాను. ఈ సమస్యపై (విలీనం) తెలంగాణలో గణనీయమైన ఆందోళన ఉందనడంలో సందేహం లేదు. ప్రావిన్స్ మొత్తంలో ఈ ఆందోళన ఉంది.
నా అంచనా ప్రకారం ఇక్కడ మెజా ర్టీ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఓ బలమైన సెక్షన్ ప్రజలు విశాలాంవూధకు సానుకూలంగా ఉన్నారు. కానీ మెజార్టీ ప్రజలు ఎస్సార్సీ సిఫారసు చేసిన విధంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలని కోరుతున్నారు. దీనిపై నేను తర్వాత పూర్తి స్థాయి విశ్లేషణ ఇస్తాను. ఏది ఏమైనా మెజార్టీ ప్రజల అభివూపాయం ప్రత్యేక తెలంగాణవైపు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి మంచి చెడ్డలను స్థూలంగా ఇప్పుడు వివరిస్తాను. విశాలాంధ్ర మద్దతుదారులు కింది అంశాలను ప్రస్తావిస్తున్నారు.
హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉన్నది ఉన్నట్లుగానే ఉంచాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతం భాష పరంగా ముక్కలుగా ఉన్నందున, అందులో రెండు ప్రధాన ముక్కలు వారి సొంత భాషా ప్రాంతాలకు వెళ్లిపోయినందున, మూడవ ముక్క తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో కలవాలి... విశాలాంధ్ర నినాదం చాలా కాలం నుంచి ఉంది. ఇది భావోద్వేగపూరితమైన డిమాండ్. విశాలాంధ్ర ఏర్పడితే భూస్వామ్య సమాజం పోతుందనేది వారి ఆకాంక్ష.. సాంస్కృతిక సమక్షిగతను కోరుకునేవారు తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలు కలిసి ఉండాలని భావిస్తున్నారు.... పెద్ద రాష్ట్రంలో పదవుల సంఖ్య, శాఖల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది కాబట్టి ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. ఒకే గవర్నర్ ఉంటారు. ఒకటే హైకోర్టు ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే ఉంటుంది. ఇలా అన్ని శాఖలు కూడా.. పెద్ద రాష్ట్రంలో భారీ ఎత్తున పారిక్షిశామిక అభివృద్ధికి అవకాశం ఉంటుందనే నమ్మకం.
ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనుకునేవారి అభివూపాయాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశాలాంధ్ర భావన గణనీయంగా బలహీనపడిందని వారు విశ్వసిస్తున్నారు. పూర్తి తెలుగు రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే అది మరింత బలహీనపడిపోతుంది. విలీనంపై ఆంధ్ర ప్రాంతంలో బలమైన ఉద్యమం ఏమీ లేదు. కానీ ఆంధ్రతో విలీనంపై తెలంగాణలో బలమైన ఆందోళన ఉంది... తెలంగాణ ఏర్పడితే ఆచరణలో ఇదిఎవరినీ నొప్పించదు. సిద్ధాంతకర్తలు, భావోద్వేగంతో ఉన్న కొందరు ప్రజలు నిరుత్సాహానికి గురవుతారు తప్పించి ఉద్యమాలకు దిగరు... కానీ తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో విలీనమైతే మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది... తెలుగు వాళ్లుగా ఉంటూనే గత 175ఏళ్లుగా తెలంగాణ ప్రజలుగా తమదైన సొంత జీవన విధానాన్ని నిర్మించుకున్నారు.
ఇది ఆంధ్ర ప్రాంత తెలుగువారి జీవనవిధానానికి పూర్తి భిన్నమైనది. విలీనం జరిగితే తమ జీవన విధానం నాశనమవుతుందని ఇక్కడివారు భయపడుతున్నారు. అదే వారి ఆందోళన.... తెలంగాణలో ఎక్కువ మంది ఉర్దూ భాష తెలిసినవారో ఉర్దూ భాష మాట్లాడేవారో ఉన్నారు. వందేళ్లకుపైబడి ఉర్దూ ఇక్కడి ప్రజల జీవనంలో భాగమైంది. పరిపాలన ఉర్దూలోనూ సాగుతుంది. రికార్డులు ఉర్దూలోనే ఉంటాయి. కోర్టు ప్రొసీడింగ్స్ ఉర్దూలో జరుగుతాయి. లాయర్లు, వృత్తి నిపుణులు తమ కార్యకలాపాలు ఉర్దూలో నిర్వహిస్తారు. కనుక విలీనం జరిగితే తమ జీవితంలో ఉర్దూ ప్రాధాన్యం తగ్గిపోతుందని సహజంగానే వారు భయపడుతున్నారు... విద్యావిషయాల్లో ఆంధ్రతో పోల్చితే తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. ప్రత్యేకించి ఇంగ్లిష్ చదువుల్లో వారు బాగా వెనుకబడి ఉన్నారు. అందుకు మౌలిక సదుపాయాలు లేకపోవడమో లేదా తగినంత లేకపోవడమో కారణం కావచ్చు.
దీని వల్ల పెద్ద రాష్ట్రంలో వారికి భీకరమైన ప్రతికూలత ఎదురవుతుందని భయపడుతున్నారు. ఆంధ్రలో వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఉండగా.. హైదరాబాద్‌లో వారి సంఖ్య వందల్లో కూడా లేదు. ఇది ఉద్యోగాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు... ఆర్థిక విషయాలకు సంబంధించి విశాలాంవూధలో తాము బాధితులవుతామని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. సగటు తెలంగాణ ప్రజలు పేదవాళ్లు. ఆంధ్రలోని వారితో పోల్చితే డబ్బు నిల్వలు లేనివాళ్లు. భూములతో పాటు చిన్న, పెద్ద వ్యాపారాల్లో తక్షణ దోపిడీ ఉంటుందని వారి భయం. ఇదే అన్నింటికంటే పెద్ద భయం... భాష ఒకటే అయినప్పటికీ ఉభయ రాష్ట్రాల్లోని తెలుగువారి మధ్య ప్రేమ లేదనడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి.
రజాకర్‌ల సమయంలో, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన వెంటనే జరిగిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలతో మరాఠీ, కన్నడ ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు దయతో ఉండగా.. ఆంధ్ర ప్రాంత అధికారులు మాత్రం కటువుగా వ్యవహరించారు. అనేక పీడకలలు ఉన్నాయి. ఇవి తెలంగాణ ప్రజల మనసులో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.
ఆంధ్ర దయాదాక్షిణ్యాలపై బతకాలని తెలంగాణవాళ్లు కోరుకోవడం లేదు... విశాలాంధ్ర కోసం డిమాండ్ చేస్తున్న కమ్యూనిస్టులు, కమ్యూనలిస్టులు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. పెద్ద రాష్ట్రానికి వారు ప్రకటించిన మద్దతులో చిత్తశుద్ధిలేదు... ఎస్సార్సీ సిఫారసు చేసిన ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నవారంతా తమ ప్రజల ఆకాంక్షలను వెల్లడించేందుకు ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెబుతున్నారు. పరీక్ష పెడితే విలీనాన్ని మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తారని అంటున్నారు. ఇదే అంశంపై ఎన్నికలు పెడితే కమ్యూనిస్టులకు గానీ, కమ్యూనలిస్టులకు గానీ, విశాలాంధ్ర మద్దతుదారులకుగానీ ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేస్తున్నారు... నేను విలీనం జరిగే లాభనష్టాల గుర్చి రేఖామావూతంగా వివరించాను. నా స్వంత అభివూపాయం చెప్పడం ఇప్పుడు తగదు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచినట్లయితే ఉమ్మడి పాలనా వ్యవహారాలకు ఎలాంటి హాని జరగదు. ఉదాహరణకు ఉభయ ప్రాంతాలకు గవర్నర్, హైకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటివి ఉమ్మడిగానే కొనసాగించవచ్చు....’’
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Komati Reddy, Venkat Reddy,
ఎన్ని ఆరోపణలు వచ్చినా దీక్ష ఆగదు -ఆమరణం-2e
- వేలాదిగా తరలివస్తున్న తెలంగాణవాదులు
- తెలంగాణ సాధించేవరకు ఉద్యమం: కోదండరాం
రెండో రోజూ అదే జాతర.. జన జాతరగా తరలివచ్చిన జనం.. అభిమానులు, తెలంగాణవాదుల కోలాహలం.. ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ జేఏసీ నేతల మద్దతు మధ్య మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌డ్డి నల్లగొండ పట్టణంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం రెండో రోజు పూర్తిచేసుకుంది. తను తెలంగాణ కోసం దీక్ష చేస్తుంటే, పార్టీ మారుతానని దుష్ర్పచారం చేస్తున్నారని కోమటిడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దిగివచ్చేవరకు దీక్ష ఆగేదిలేదని స్పష్టం చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మతి స్థిమితం కోల్పోయి తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కొందరు సీమాంవూధులకు తొత్తులుగా మారి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
దీక్ష చేస్తున్న కోమటిడ్డికి రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అభినందనలు తెలిపారు. ఉద్యమ స్వరూపం మారుతుందే తప్ప, తెలంగాణ వచ్చేదాకా పోరు ఆగదన్నారు. సందర్భాన్ని బట్టి ఉద్యమ అస్త్రాలను ప్రయోగిస్తామని చెప్పారు. సకల జనుల సమ్మెతో దోషుపూవరో, ద్రోహుపూవరో తేలిపోయిందన్నారు. నిద్ర నటించిన కేంద్రాన్ని సమ్మెతో తట్టిలేపామన్నారు. ఇక, చంద్రబాబూ మనం ఎందుకు కలిసుండాలో చెప్పగలవా అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సవాలు విసిరారు. తెలంగాణ ద్రోహులపై టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ నిప్పులు చెరిగారు. శవాలపై ప్రమాణాలు చేసినవారు ఇప్పుడు పదవుల కోసం పాకులాడుతున్నారన్నారు. కోమటిడ్డి దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రఘు చెప్పారు. దీక్షా శిబిరం వద్ద కళాకారుల ధూం ధాం ఆకట్టుకుంది.
సకల జనుల సమ్మెతో ద్రోహులెవరో తేలింది
నిద్ర నటిస్తున్న కేంద్రాన్ని తట్టిలేపాం
నల్లగొండ, టీన్యూస్ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మాజీమంత్రి, ఎమ్మెల్యే కోమటిడ్డి వెంకటడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజులు పూర్తి చేసుకుంది. రెండవ రోజు జిల్లావ్యాప్తంగా వేలాది మంది ప్రజలు, అభిమానులు, తెలంగాణవాదులు తరలివచ్చి దీక్షకు మద్దతు తెలిపారు. కోమటిడ్డి వెంకట్‌డ్డిని బుధవారం పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం అభినందిచారు. దీక్షకు సంఘీభావం తెలిపి ప్రసంగించారు. పరిస్థితులకు బట్టి ఉద్యమ స్వరూపం మారుతుందే తప్ప, తెలంగాణ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వాహనానికి గేర్లు మార్చినట్లుగానే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
సందర్భాన్ని బట్టి ఉద్యమ అస్త్రాలను ప్రయోగిస్తామని వెల్లడించారు. తెలంగాణవూపాంత మంత్రులు రాజీనామాలు చేస్తే తెలంగాణ ఎప్పుడో వచ్చేదని, వారి వల్లే ఆలస్యమవుతోందన్నారు. మంత్రి జానాడ్డి రాజీనామా చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశామని, ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు జిల్లాలో తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇంటి చుట్టూ పోలీసు పహారాల మధ్య బతుకుతున్నారని చెప్పారు. జిల్లాలో నిన్న మొన్నటి వరకు జై తెలంగాణ అన్న నేతలు, కోమటిడ్డి రాజీనామా మంత్రి పదవి ఖాళీకాగానే చప్పుడు చేయడం విమర్శించారు. నాయకత్వ లోపంతో 1969 ఉద్యమం వైఫల్యం చెందిందని, ఇప్పుడు తెలంగాణలో నాయకత్వం పుష్కలంగా ఉందన్నారు.
కోమటిడ్డి దీక్షతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతందన్నారు. సమైక్యాంవూధలో బీఫామ్‌లు ఇచ్చేది వలస పాలకులే అయినప్పటికీ, ఓట్లు వేసి గెలిపించేంది తెలంగాణ ప్రజలేనని, ఈ సత్యాన్ని గ్రహించే కోమటిడ్డి, జూపల్లి మంత్రి పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములయ్యారని ప్రశంసించారు. సకల జనుల సమ్మెతో దోషుపూవరో, ద్రోహుపూవరో తెలిసిందన్నారు. నిద్ర నటించిన కేంద్రాన్ని సమ్మెతో తట్టి లేపామని చెప్పారు.
శవాలపై ప్రమాణాలు చేసిన వారంతా ఇప్పుడు పదవుల కోసం పాకులాడుతున్నారని, తెలంగాణ ద్రోహులే ఉద్యమానికి అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఏమాత్రం చీము, నెత్తురు ఉన్నా పదవులను వీడి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలన్నారు. ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్సీ మోహన్‌డ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రఘు మాట్లాడుతూ సమ్మెతో ద్రోహుపూవరో, తెలంగాణ బిడ్డలు ఎవరో తెలిసిపోయింన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. చీము, నెత్తురు ఉంటే ప్రజావూపతినిధులందరూ రాజీనామా చేయాలని, త్యాగాలు చేయకుండా తెలంగాణ సాధించుకోలేమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటడ్డి, సెక్ర ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌డ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి, తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం అధ్యక్షుడు కులదీప్ సహానీ, కార్యదర్శి ఏచూరి భాస్కర్, ఓయూ జేఏసీ నేత గాదరి కిశోర్, ఇంకెనాళ్లు సినిమా హీరో రఫీ తదితరులు ఉన్నారు.
దీక్ష శిబిరం వద్ద కళాకారులు నిర్వహించిన ధూం..ధాం అందరిని ఆకట్టుకుంది. రెండోరోజున రసమయి బాలకృష్ణ, స్వర్ణ, తాటిపాముల శంకర్, బచ్చలకూరి శ్రీనివాస్, నకిరేకంటి సైదులు తమ కళాబృందాలతో పాటలతో ఉర్రూతలూగించారు. ఆమరణ దీక్షకు చేపట్టిన కోమటిడ్డికి మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జనంతో క్లాక్‌టవర్ సెంటర్ కిక్కిరిసిసోయింది. కోమటిడ్డి ప్రత్యర్థి పాల్వయి గోవర్ధన్‌డ్డి నియోజకవర్గమైన మునుగోడు నుంచి రెండవ రోజు దీక్షకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. కోమటిడ్డికి డాక్టర్ మాతృనాయక్ ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు బీపీ, షుగర్ లెవల్ భారీగా పడిపోయాయి.
పాల్వాయికి మతిస్థిమితం లేదు -కోమటిరెడ్డి
తెలంగాణ కోసం దీక్ష చేస్తుంటే, పార్టీ మారుతానని దుష్ర్పచారం చేస్తున్నారని కోమటిడ్డి వెంకట్‌డ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లోనే ఉండి సోనియాను ఒప్పించి తెలంగాణ సాధిస్తానని స్పష్టం చేశారు. కేంద్రం దిగి వచ్చే వరకు దీక్ష ఆగదన్నారు. పాల్వాయి గోవర్ధన్‌డ్డి మతి స్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని, ఓడిపోయిన నేతలంతా తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీమాంవూధులకు తొత్తులుగా మారి ఉద్యమాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.ఎవన్ని ఆరోపణలు చేసినా దీక్షను విరమించేది లేదన్నారు. పాల్వాయి తనపై చేసిన విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారన్నారు.
బాబూ.. ఎందుకు కలిసి ఉండాలి -గుత్తా సుఖేందర్‌రెడ్డి
2009 ఎన్నికలపుడు మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలం అని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఏ విధంగా కలిసి ఉండాలని అంటున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌డ్డి ప్రశ్నించారు. తెలంగాణనేతల నాయకత్వంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామని పిలుపునిచ్చారు. శీతకాల సమావేశాల్లో తెలంగాణపై తేల్చకుంటే పార్లమెంట్‌ను నడవనివ్వమని హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిచోటా సీమాంవూధులు అడ్డు తగులుతున్నారని, ఈ సారి తన్ని గుంజుకుం తప్ప రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదన్నారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామని పిలుపునిచ్చారు.