- 12.11.2011
‘తెలంగాణ ఓ సంక్లిష్టమైన సమస్య. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంద్వారా సమస్యను పరిష్కరించలేం. ఒక జాతీయ సమస్యకు కనుగొనే పరిష్కారం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఆమోదించగల ఆచరణాత్మకమైన పరిష్కారం కోసం కసరత్తు చేస్తాం’
- మాల్దీవుల నుంచి తిరిగివస్తూ విమానంలో విలేకరుల సమావేశంలో ప్రధాని
- 20.10.2011
‘తెలంగాణ సమస్య 1950నుంచి ఉంది. తెలంగాణ సమస్య సంక్లిష్టతల కారణంగా సత్వర నిర్ణయం సాధ్యం కాదు. అన్ని పక్షాలకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని పక్షాల మధ్య ఏకాభివూపాయం సాధించి నిర్ణయం తీసుకుంటాం. అద్వానీ పరుషపదాలు మానుకోవాలి’
- దక్షిణావూఫికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రధాని
- 6.10.11
‘ప్రత్యేక తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అభివూపాయంతో నేను ఏకీభవిస్తున్నాను. సంక్లిష్టమైన సమస్యపై ఏకాభివూపాయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ప్రకాశ్ కరత్ రాసిన లేఖకు సమాధానంగా
- 4.10.2011
‘తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు తెలుసు. వాస్తవ పరిస్థితులు మాకు తెలియకుండా ఎవరూ అడ్డుకోలేరు. తెలంగాణాపై సత్వర నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆజాద్‌తో మాట్లాడి ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళతా. సకల జనుల సమ్మె విరమించండి’.
- టీఆర్‌ఏస్ అధినేత కేసీఆర్, 31 మందితో కూడిన ప్రతిని బృందంతో ప్రధాని
- 4.10.2011
మీ సమస్యలు నాకు తెలుసు. మీరు చెప్పే విషయాలను సోనియాకు వివరిస్తాను. రెండు మూడు పాయింట్ల రూపంలో నాకు రాసివ్వండి. కోర్ కమిటీ సమావేశంలో అందరి దృష్టికి ఈ విషయాలను తీసుకు అందులో ఏదో ఒక నిర్ణయం వస్తుంది’.
- టీ కాంగ్రెస్ నేతలతో సమావేశంలో ప్రధాని
- 16.09.11
‘సకల జనుల సమ్మెపై నాకు నివేదికలు అందుతున్నాయి. త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటాం’.
- టీ కాంగ్రెస్ నేతలతో ప్రధాని
- 20.07.11
‘తెలంగాణా అంశాన్ని చూస్తున్న ఆజాద్‌కు మీ అభివూపాయాలను నివేదిస్తాను. అందరితో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకుంటాం. శాంతియుత పద్ధతుల్లో నిరసనలు చేసుకోండి. హింసకు తావులేకుండా వ్యవహరించండి’.
- సీమాంధ్ర నేతలతో సమావేశంలో ప్రధాని
- 10.06.11
‘తెలంగాణలో ఉన్న గంభీరత నాకు తెలుసు. ఆ అంశంపట్ల నాకు చిత్తశుద్ధి ఉంది. తొందరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం’.
- 44 నిముషాలపాటు గోడు వెల్లబోసుకున్న
టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులతో ప్రధాని
- 03.08.11
‘తెలంగాణ అంశాన్ని ఆజాద్ చూస్తున్నారు. ఆయన్ను పని పూర్తి చేయనివ్వండి. సంప్రదింపులు పూర్తయిన తర్వాత విషయాన్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’.
- తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో ప్రధాని
- 11.03.11
‘ఆంవూధవూపదేశ్‌లోని పరిస్థితుల గురించి మాకు తెలుసు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు ఆగండి. పార్టీతో చర్చించి ప్రజలు, రాష్ట్రం, దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకుంటాం’.
- పార్లమెంట్ ఆవరణలో కావూరి సారథ్యంలోని సీమాంధ్ర ఎంపీలతో ప్రధాని
- 17.02.11
తెలంగాణపై ఏకాభివూపాయం కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలతో హోం మంత్రి చిదంబరం ఒక దఫా సమావేశమయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించాం. ఆంధ్రవూపదేశ్‌లో అన్ని పార్టీలతో మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దీంతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం అవుంతుంది. ఇది మంచి ముగింపుకు చేరుకునేలా చూడాల్సి ఉంది.
- విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని
- 25.05.10
ప్రభుత్వం ముందు కొత్త రాష్ట్రాల ప్రతిపాదనలేవీ లేవు. ఆంధ్రవూపదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితులపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పరిశీలను అప్పగించాం. ఆయన ప్రఖ్యాతిగాంచిన న్యాయమూర్తి. ఈ కమిటీ నివేదిక రాకుండా తెలంగాణ అంశంలో స్పందిచలేను’.
- యూపీఏ2 ఏడాది పరిపాలన పూర్తయిన
సందర్భంగా ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రధాని
- 06.03.10
బీజేపీ హయాంలో ఏర్పాటైన మూడు రాష్ట్రాల పరిస్థితి వేరు. అక్కడ ఏకాభివూపాయం రావడంతో రాష్ట్రాల ఏర్పాటు సులభంగా జరిగింది. తెలంగాణ సమస్య వేరు. ఆంధ్రవూపదేశ్ పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ ఏకాభివూపాయం సాధిస్తుంది. సమస్య పరిష్కారానికి మార్గదర్శక ప్రణాళిక సూచిస్తుంది. 2010 డిసెంబర్ 31కి కమిటీ నివేదిక వస్తుంది’.
- వెంకయ్య వ్యాఖ్యలకు సమాధానంగా
రాజ్యసభలో మాట్లాడుతూ ప్రధాని
- 11.01.10
‘ముందు శాంతిసాధన. ఆ తర్వాతే తెలంగాణపై తదుపరి చర్చలు. ఈనెల 5 వ తేదీన 8 పార్టీల నేతలతో జరిగిన చర్చల వివరాలను చిదంబరం నాకు వివరించారు. ఆ విషయంలో జరిగిన చర్చల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో మా మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి’.
- ఫ్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్‌లతో
జరిగిన భేటీలో ప్రధాని
- 17.12.09
తెలంగాణ సమస్య జటిలంగా మారింది. మేం ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఆర్ధికమాంద్యం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాం. ఈ సెగలు అన్ని రాష్ట్రాలకు పాకితే ఆర్థికవ్యవస్థ మరింత దెబ్బ తింటుంది. మేం అన్ని ప్రాంతాల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’.
- సీమాంధ్ర నేతలతో మాట్లాడుతూ ప్రధాని
- 17.12.09
తెలంగాణ చాలా కీలకమైన సమస్య .దీని ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాలపై పడుతుంది. ఏం నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతీయ మనోభావాలను, ఆందోళనలను దష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ఏం చేసినా భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది’.
- జేపీతో సమావేశంలో ప్రధాని
- 16.12.09
ఆంధ్రవూపదేశ్ లో ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేశాయి. అందుకే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయించాం. తెలంగాణ ఇవ్వడం వలన ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని ఊహించాం. అందుకు తగిన సమయం పడుతుందని మేం భావించాం’.
- రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ
సమావేశంలో ప్రధాని
- 05.12.09
‘తెలంగాణలో ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉంటే, అక్కడ కాంగ్రెస్ ఎలా గెలిచింది. ఈ సమస్య 50 ఏళ్ల నుంచి ఉంది. తెలంగాణ ఏర్పాటుకు అనేక సమస్యలు ఉన్నాయి’.
- లాబీయింగ్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్
ఎంపీలను ప్రశ్నించిన ప్రధాని
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
Read more...