జౌర ఏక్ ధోకా!
తెలంగాణపై మళ్లీ కాంగ్రెస్‌ది అదే మోసం కళ్ళకు కనిపించని ఉద్యమ తీవ్రత.. త్యాగాలు.. బలిదానాలు
సీమాంధ్ర నేతలకు తలొగ్గిన వైనం ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమన్న ప్రజలు
ఫిర్ ఏక్‌బార్.. అదే ధోకా.. అదే కాంగ్రెస్.. అదే తెలంగాణ అంశం.. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ మళ్ళీ పచ్చి మోసం.. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నామని, త్వరలోనే ఇచ్చేస్తామనే రీతిలో వ్యవహరించి ఆ సమస్యను మళ్ళీ మొదటికి తెచ్చింది. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నది. అదే మా సంప్రదాయమని నొక్కి చెబుతున్నది. ఇచ్చిన మాటను తుంగలో తొక్కుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంవూతితో ప్రకటన చేయించిన కాంగ్రెస్, విషయాన్ని అనేక మలుపులు తిప్పి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఇన్నాళ్లు ఆడుకున్నది.
తెలంగాణ ప్రాణాలతో చెలగాటమాడింది. చివరికి సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి తెలంగాణపై వెనుకడుగు వేస్తోంది. ఆరు దశాబ్దాలుగా ఉన్న ప్రజల డిమాండ్‌ను, జరుగుతున్న ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలను కళ్లు ఉండికూడా చూడలేకపోతున్నది. అహింసాయుతంగా తెలంగాణ ప్రజలు వెలిబుచ్చిన ఆకాంక్షను ప్రజాస్వామ్య స్ఫూర్తితో అర్థం చేసుకోలేకపోయింది. తెలంగాణకు సానుకూలంగా ఉన్నామని నటిస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న అధికార పక్షం ఇప్పుడు ప్లేటు ఫిరాయించిందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
హైదరాబాద్, నవంబర్ 13(): తెలంగాణ రాష్ట్రం ఇస్తే మరిన్ని సమస్యలే నంటూ ప్రధానితో కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయించింది. అంతకు రెండు, మూడు రోజుల ముందు రెండో ఎస్సార్సీ అంటూ పార్టీ నేతలతో పాట పాడించింది. అంతకు ముందు తెలంగాణ, సీమాంధ్ర నేతలతో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ ఆజాద్‌తో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. అది ముగిసిన తరువాత జాతీయ స్థాయిలో యూపీఏ భాగస్వామ్య పక్షాల అభివూపాయ సేకరణ అవసరమని చెప్పింది. రాష్ట్ర విభజనపై అతి త్వరలోనే నిర్ణయమని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇలా నమ్మించడాలు తెలంగాణ విషయంలో నిజానికి ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అధిష్ఠానానికి అందజేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ మేరకు కాంగ్రెస్ 2004 ఎన్నికలకు ముందు సీడబ్ల్యూసీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి తీర్మానం చేసింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌తో 2004లో కలిసి ఎన్నికలకు వెళ్ళడం ద్వారా తెలంగాణకు తాను సానుకూలంగా ఉన్నాననే సంకేతాలిచ్చింది. ఎన్నికల సమయంలో కరీంనగర్, సికింవూదాబాద్‌లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని, తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ప్రకటించారు. ఆ తరువాత పార్టీ ప్రణబ్ కమిటీ వేసింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమం, కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. 2009 ఎన్నికల సమయంలో పార్టీ ప్రణాళికలో తెలంగాణ ఆంశాన్ని తీసుకొచ్చింది. అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు.
ఆ తరువాత తెలంగాణపై తేల్చేందుకు జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీ వేసింది. ఏడాది పాటు కమిటీ నివేదిక పేరిట కాలయాపన చేసింది. నివేదిక వచ్చిన తరువాత మళ్ళీ ఆజాద్‌తో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. అది ముగిసిన వెంటనే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించాకే నిర్ణయం ఉంటుందన్నది.
మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు సైతం తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమేనంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర దశకు చేరుకోవడం, ఉద్యోగ సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతుండడం, టీఆర్‌ఎస్ బలపడుతున్న దాఖలాలు కనిపించడంతో తెలంగాణ పోరాటానికంటూ టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీని వేసుకున్నారు. తాము కూడా అధిష్ఠానంతో తెలంగాణ కోసం పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమావేశాలు, హస్తిన పర్యటనలతో ఇదిగో తెలంగాణ వచ్చేస్తుంది, అదిగో రేపో, మాపో నిర్ణయం రానున్నది,సానుకూల సంకేతాలు వస్తున్నాయి, పార్లమెంట్ సమావేశాలకు ముందే తెలంగాణపై ప్రకటన ఉంటుందని తెలంగాణ వాదులను నమ్మిస్తూ వచ్చారని ఆ పార్టీ వర్గాలే ఇప్పుడు నిప్పులు చెరగుతున్నాయి.
రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం వైపు నుంచి వచ్చిన ప్రకటనలు, వ్యాఖ్యలతో తెలంగాణపై కాంగ్రెస్ మళ్ళీ రూటు మార్చిందనే విషయం పక్కాగా తేలిపోయింది. ప్రధాని, దిగ్విజయ్‌సింగ్, రషీద్ అల్వీ, ఆజాద్‌ల తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పట్లో తెలంగాణ ఇచ్చేది లేదని కాంగ్రెస్ తన వైఖరిని పరోక్ష సంకేతాల ద్వారా స్పష్టం చేసింది. ఇది తాజాగా జరిగిన మోసం.
గతంలో కూడా రెండు మార్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసగించింది. 1969లో ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమాన్ని తన వ్యూహాలు, ఎత్తుగడలతో నీరుగార్చింది. ఆ తరువాత 1972లో మరో సారి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అప్పట్లో తెలంగాణ డిమాండ్‌తో ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) 1971లో తెలంగాణలోని 11 పార్లమెంట్ స్థానాల్లో విజయఢంకా మోగించి కాంగ్రెస్‌ను తెలంగాణ దెబ్బ చూపించింది. అయితే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ తరువాత టీపీఎస్ నేతలకు పదవులు, ప్రలోభాలతో చీల్చి తనవైపుకు తిప్పుకున్నారు. చివరకు టీపీఎస్‌కు నాయకత్వం వహించిన మర్రి చెన్నాడ్డికి పదవి ఇవ్వడంతో అప్పటి వరకు తెలంగాణపై గట్టిగా ఉన్న ఆయన కూడా ఆ తరువాత మెత్తపడి ఇందిరమ్మకు జై పలికారు. అయితే టీపీఎస్ ఎంపీ ఎస్పీగిరి మాత్రం అప్పట్లో ఈ ప్రలోభాలకు తలొగ్గకుండా తెలంగాణ వాదానికే కట్టుబడి ఉన్నా ఫలితం లేక పోయింది.
ఎప్పుడు తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైతే అప్పుడు సానుకూలంగా ఉన్నట్లు వ్యవహరిస్తూనే సొంత పార్టీలో, బయట తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతలను పదవుల ఆశ చూపించి ఉద్యమాలను దెబ్బతీసే ప్రయత్నాలు కాంగ్రెస్ చేసిందనే ఆరోపణలు లేకపోలేదు. తాజా ఉద్యమంలో సైతం టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీలో చీలిక తెచ్చి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడంలో విజయం సాధించిన అధిష్ఠానం ఉద్యమాన్ని అంతే స్థాయిలో దెబ్బతీసే ప్రయత్నాలు సాగించింది. కాంగ్రెస్‌పై నమ్మకం లేకనే ఆ పార్టీ తెలంగాణ నేతలు ఎంత చెప్పినా జనం వారిని విశ్వసించలేని పరిస్థితి వచ్చింది. తెలంగాణపై కాంగ్రెస్ తాజా వైఖరితో కాంగ్రెస్ మోసం మరోసారి బయటపడిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలే ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. ప్రధాని వ్యాఖ్యలతో యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందనే భావం ప్రజలకు కలుగుతున్నదని ఆ పార్టీ ఎంపీలే అంగీకరించడం గమనార్హం.
సమైక్య వాదులకు కాంగ్రెస్ అధిష్ఠానం తలొంచి, తెలంగాణకు మోసం చేసిందని మరి కొందరు రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను నిశ్చేష్టులను చేశాయని మరి కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరితో తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం ప్రధాని మన్మోహన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మరో వైపు టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్టీ తాజా వైఖరిపై భవిష్యత్తు కార్యచరణ కోసం సోమవారం భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన టీ వాదులు తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
ప్రధాని మన్మోహన్ చదువుకున్న మూర్ఖుడిలా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. ప్రధానికి కింగ్‌ఫిషర్‌పై ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజలపై లేదు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కో ఖతం కరో, తెలంగాణ హాసిల్ కరో అనే నినాదంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

- కే తారక రామారావు, టీఆర్‌ఎస్ నేత
రెండో ఎస్సార్సీ ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యం కాదు. యూపీఏ-1 హయాంలోనే ఎస్సార్సీ ప్రతిపాదనను మేం తోసిపుచ్చాం. ఇక ప్రధాని ప్రకటన చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదు. తెలంగాణపై ఇదేం నాన్చుడు ధోరణి.. విషయం త్వరగా తేల్చాలి.

- ప్రకాశ్ కరత్, సీపీఎం నేత
తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్
పార్టీ పెనంలోంచి సగం పొయ్యిలో, మరో సగం తీహార్ జైల్లో పడుతుంది. తెలంగాణ విషయంలో ప్రధాని
ఇలా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదు. దీంతో యూపీఏ తెలంగాణ ఇవ్వదని తేలిపోయింది.

-విద్యాసాగర్ రావు, బీజేపీ నేత
ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని అవమానపర్చారు. ప్రజాస్వామిక సంప్రదాయాలను ప్రధాని అగౌరవపర్చారు.
తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిందే.

- స్వామిగౌడ్, ఉద్యోగ జేఏసీ నేత
0 comments:
Post a Comment