Saturday, October 27, 2012
China blocks New York Times, alleging ‘smear’ on Premier
ప్రభుత్వ సేవల గురించి తెలుసుకోవడం ఇక సులభతరం కానుంది
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ప్రభుత్వ సేవల గురించి తెలుసుకోవడం ఇక సులభతరం
కానుంది. మీరు పెట్టుకున్న దరఖాస్తు స్థితి ఏంటన్న విషయం తెలుసుకునేందుకు
ఇకనుంచి ప్రతిసారి సంబంధిత కార్యాలయానికి తెలుసుకోవాల్సినవసరం లేదు.
ఎందుకంటే ఈ ఇబ్బందిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం 166 అనే ఒక ఆటోమేటిక్
టెలిఫోన్ నెంబర్‌ను కేటాయించింది. దీనికి డయల్‌చేసి మీ రేషన్‌కార్డు,
విద్యుత్ కనెక్షన్ వంటి తదితర సేవలను గురించిన సమాచారం ఇట్టే
తెలుసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.
ఇది డిసెంబర్‌లో నుంచి అందుబాటులోకి
రానుంది. ఇంతకు ముందు ఇలాంటి సేవలు అందించేందుకు 51969 ఫోన్ నెంబర్
ఉన్నప్పటికీ దీనికి ఫోన్ చేసే అవకాశం లేకుండా కేవలం ఎస్సెమ్మెస్ ద్వారా
మాత్రమే సేవలు పొందేందుకు వీలు ఉండేది. ఈ నెంబర్‌తో ఎస్సెమ్మెస్ ద్వారా
సమాచారం పొందాలన్నా, పంపించాలన్నా కొంత పరిధిలోనే సాధ్యమయ్యేది.
Eid Mubarak
తెలంగాణవాది రాజిరెడ్డికి కన్నీటి వీడ్కోలు
bowthikadeham
- కూకట్‌పల్లిలో ముగిసిన అంత్యక్షికియలు
- అంతిమయావూతలో పోలీసుల అత్యుత్సాహం
- టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో హల్‌చల్
- బైఠాయించిన కోదండరాం,జేఏసీ నేతలు
- పోలీసులను వెనక్కిపంపాలని డిమాండ్..దిగివచ్చిన ఏసీపీ
- దారిపొడవునా రాజిడ్డికి ఘన నివాళి
హైదరాబాద్ సిటీబ్యూరో/కేపీహెచ్‌బీకాలనీ/బాలానగర్, అక్టోబర్ 26 (టీ మీడియా): తెలంగాణ మలిదశ ఉద్యమంలోసీమాంధ్ర పాలకుల కవ్వింపు చర్యలకు, పోలీసుల బాష్పవాయుగోళాలకు బలైన కూకట్‌పల్లి వాసి గుడి రాజిడ్డి అంత్యక్షికియలు శుక్రవారం అశ్రునయనాల నడుమ ముగిశాయి. అంతిమయాత్రలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బా ష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్‌ను చేతబట్టి బం దోబస్తు పేరిట హల్‌చల్ చేశారు. తెలంగాణవాదులు భగ్గుమనడంతో పోలీసులు తోకముడవక తప్పలేదు. తరలివచ్చిన తెలంగాణ లోకం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన గుడి రాజిడ్డి సెప్టెంబర్ 30న నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన తెలంగాణ మార్చ్‌లో పాల్గొని, పోలీసులు ప్రయోగించిన బాష్పవాయుగోళాల ధాటికి అస్వస్థతకు గురై గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లిలో ఫేజ్-3లోని నివాసంలో రాజిరెడ్డి మృత దేహానికి రాత్రి నుంచే తెలంగాణవాదులు నివాళుల ర్పించారు. శుక్రవారం ఉదయం జేఏసీ చైర్మన్ కోదండరాం, కన్వీనర్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పెద్దపల్లి ఎంపీ వివేక్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీమంత్రి నాయిని నర్సింహాడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్, టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, టీన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీవూపసాద్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య, టీజీవో సంఘం శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు, కాంగ్రెస్ ఇన్‌చార్జి వడ్డేపల్లి నర్సింగరావు, బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు మాధవరం కాంతారావు, కసిడ్డి భాస్కర్‌డ్డి, కూకట్‌పల్లి జేఏసీ చైర్మన్ విద్యా కన్వీనర్ అంబటి శ్రీనివాస్, టీజేఎఫ్ కన్వీనర్ ఆర్‌కే దయాసాగర్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల భద్రయ్య, గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాం డూరి నరేంవూదాచార్య, జిల్లా యువజన నాయకులు చలపతిరావు, మహిళా అధ్యక్షురాలు శారద, ప్రధాన కార్యదర్శి జ్యోతితో పాటు టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, రాజిడ్డి బంధువులు, మిత్రులు భారీగా తరలివచ్చారు. రాజిడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన భార్యను, పిల్లలను ఓదార్చారు. ‘అమర్‌హై రాజన్న.. జై తెలంగాణ జైజై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు.
kavitha
పోలీసుల అత్యుత్సాహం
రాజిడ్డి అంతిమయావూతలో పాల్గొనేందుకు తెలంగాణవాదులు భారీగా తరలిరావడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బందోబస్తు పేరిట టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో ప్రత్యక్షమయ్యారు. దీంతో తెలంగాణవాదులు మండిపడ్డారు. తెలంగాణ మార్చ్‌లో సీమాంధ్ర సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించినందుకే రాజిడ్డి మృతిచెందాడని, తిరిగి ఆయన అంతిమయావూతలో టియర్‌గ్యాస్‌తో రావడమేమిటని జేఏసీ చైర్మన్ కోదండరాం నిలదీశారు. ఇలా ఇంకెంతమంది ప్రాణాలను బలితీసుకుంటారని కూకట్‌పల్లి ఏసీపీ మల్లాడ్డిని ప్రశ్నించారు. తుపాకులు, టియర్‌గ్యాస్‌తో బందోబస్తు చేస్తున్న పోలీసులను వెంటనే తిరిగి పంపాలని ఏసీపీకి సూచించారు. ‘పోలీసులు గో బ్యాక్’ అంటూ కేపీహెచ్‌బీ టెంపుల్‌బస్టాప్ వద్ద కోదండరాం, జేఏసీ నేతలు, తెలంగాణవాదులు బైఠాయించారు. ‘అంతిమ యాత్రలో పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు, కానీ కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని ఏసీపీ మల్లాడ్డిని తెలంగాణవాదులు హెచ్చరించారు. దీంతో ఏసీపీ.. టియర్‌గ్యాస్ పోలీస్ బృందాన్ని తెలంగాణవాదులకు కనిపించకుండా దూరంగా తరలించారు.
raji-reddy
దారిపొడువునా అశ్రునివాళి
కూకట్‌పల్లిలోని 3వ ఫేజ్‌లోగల నివాసం నుంచి రాజిడ్డి అంతిమయాత్రం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మృతదేహాన్ని తరలించేందుకు సమాయాత్తవగా, భార్య సరస్వతి, కుమారులు వంశీకృష్ణాడ్డి, సాయికృష్ణాడ్డిలు బోరునవిలపించారు. వారి రోదన అందరినీ కలచివేసింది. అశ్రునయనాల నడుమ, తెలంగాణ నినాదాలతో అంతిమయాత్ర ముందుకు సాగింది. దారిపొడువునా రాజిడ్డికి జనం నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో రాజిడ్డి భౌతిక కాయానికి దహనసంస్కారాలు పూర్తయ్యా యి. ఆయన చితికి పెద్దకుమారుడు వంశీకృష్ణాడ్డి కుమారుడు నిప్పంటించాడు. రాజిడ్డి మరణవార్తను ఆయన మిత్రులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు తమతో కలిసి తిరిగిన రాజిడ్డి లేకపోవడం తీరనిలోటని మిత్రులు వాపోయారు.
raji-reddy.1
ఓయూలో రాజిరెడ్డికి నివాళి
హబ్సిగూడ: తెలంగాణ అమరవీరుడు రాజిరెడ్డికి శుక్రవారం ఓయూలో విద్యార్థులు నివాళులర్పించారు. టీఎస్, ఓయూ జేఏసీల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ రాజిరెడ్డి మరణంపై, తెలంగాణ మార్చ్‌లో పోలీసుల చర్యలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చి పోలీసులతో కవ్వింపు చర్యలకు పాల్ప డిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రత్యేక రాష్ట్రం సాధించేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పారు. రాజిరెడ్డికి నివాళులర్పించిన వారిలో ఓయూ జేఏసీ నాయకులు తిరుమలి కొండల్, టీఎంవీఎస్ రాష్ట్ర కన్వీనర్ గద్దల అంజిబాబు తదితరులు ఉన్నారు.
రాజిడ్డి మృతికి సంతాపంగా కేపీహెచ్‌బీ బంద్
కేపీహెచ్‌బీకాలనీ/బాలానగర్: రాజిడ్డి మరణంతో కేపీహెచ్‌బీ ఒక్కసారిగా శోకసమువూదంలో మునిగిపోయింది. రాజిడ్డి కొంతకాలంగా కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. సహజంగానే ఆయనకు ఇక్కడి వ్యాపార, వాణిజ్యవర్గాలతో సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరితో చనువుగా మెదలడంతో ఆయన మృతిని స్థానిక వ్యాపార, వాణిజ్యవర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. సంతాపసూచకంగా కేపీహెచ్‌బీ బంద్‌కు పిలుపునిచ్చాయి.
kodanda-ram
ముమ్మాటికీ సర్కారీ హత్యే
- కాలంచెల్లిన టియర్‌గ్యాసే కారణం
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: కోదండరాం
- సీఎం, డీజీపీపై హత్యానేరం కేసు పెట్టాలి
- నినదించిన కిషన్‌డ్డి, బోయినపల్లి
హైదరాబాద్ సిటీబ్యూరో: తెలంగాణ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని జేఏసీ చైర్మ న్ కోదండరాం మండిపడ్డారు. ఉద్యమంలో హింస ఎక్కడా జరగలేదని, ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదన్నారు. రాజిడ్డి అంతిమయావూతలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌లో ప్రభుత్వం జరిపిన దాడిలో వంద మందికిపైగా గాయపడ్డారని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాలంచెల్లిన టియర్‌గ్యాస్‌తోనే రాజిడ్డి మరణించాడని,ఇది ప్రభుత్వ హత్యేనన్నారు. బాధ్యులపై హత్యా నేరం నమోదు చేసి,మృతిపై విచారణ జరపాలన్నారు.
మలిదశలో ఇదే మొదటి హత్య: కిషన్‌డ్డి
ఉద్యమంలో 1969 తర్వాత ప్రభుత్వం చేసిన మొద టి హత్య రాజిడ్డిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌డ్డిదే బాధ్యత అని, మొదటి ముద్దాయి అని పేర్కొన్నారు. సీఎంపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రూ. 50లక్షల ఎక్స్‌క్షిగేషియా ఇవ్వాలి: వినోద్
మార్చ్‌కు అనుమతి ఇచ్చినా, జరగనివ్వనని ఆనాడు డీజీపీ దినేశ్ చెప్పారని, వస్తే కాల్చేస్తామని బ్యానర్లు కట్టించారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్ మండిపడ్డారు.బ్యానర్లలో చెప్పినట్లే రాజిడ్డిని డీజీపీ బలిగొన్నారని న్యాయస్థానానికి వెళ్లి దుర్మార్గాన్ని నిరుపిస్తామన్నారు. రాజిడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌పూగేషియో ఇవ్వాలన్నారు.
నేతలు నాటకాలు కట్టిపెట్టాలి: కే నారాయణ
రాజిడ్డి మరణం తర్వాతనైనా తెలంగాణ నేతలు నాటకాలు కట్టిపెట్టి రాష్ట్ర సాధన కోసం కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు. రాజిడ్డి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నా రు.రాజిడ్డి కుటుంబానికి సాయం చేస్తామన్నారు.
రాజిడ్డి స్ఫూర్తితో రాష్ట్రం సాధిద్దాం: అల్లం నారాయణ
1969లో పోలీసుల దాష్టీకానికి 369 మంది బలైతే, మలిదశ పోరాటంలో సీమాంవూధ నేతలు,డీజీపీ, సీఎం దాష్టీకానికి బలైన మొదటి వీరుడు రాజిడ్డి అని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. రాజిడ్డి కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజిడ్డి అమరత్వం స్ఫూర్తిగా తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.
న్యాయ విచారణ జరిపించాలి: దేవీవూపసాద్‌రావు
రాజిడ్డి మృతిపై న్యాయవిచారణ జరిపించాలని టీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీవూపసాద్‌రావు డిమాం డ్ చేశారు. రాజిడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీజీవో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. రాజిడ్డిది ముమ్మాటికి హత్యేనని జేఏసీ కన్వీనర్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. రాజిడ్డి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ‘తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నాన్చుడు పద్ధతి పెడితే.. మేము దంచుడు పద్ధతి పెట్టాల్సి వస్తుంది’ అని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహడ్డి హెచ్చరించారు. గాయకుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతు ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
- T News