Saturday, March 5, 2011
Peaceful gathering at Indian High Commission, London
TDF UK & Europe requests your presence for a peaceful gathering near Indian High Commission, London.
We hereby invite all Telangana Non-Resident Indians living in UK to gather in order to show solidarity to the million people marching in Hyderabad, India to achieve separate state for Telangana. All Telangana Non Resident Indian groups across the world showing solidarity to this million march by doing peaceful gathering/demonstrations at their respective places.
So, we as TDF UK & Europe are gathering near India House in London for peaceful demonstration & try to submit the request petition to High Commissioner of India, London based on availability.
Place: India House, Aldwych, London WC2B 4NA
Date: 10th March 2011, 9 AM to 11 AM.
take By: simply telangana
సీఎం కిరణ్, చంద్రబాబు కుమక్కయ్యారు : హరీష్‌రావు
హైదరాబాద్, మార్చి 5 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుమక్కయ్యి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి చూస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికల్లో కిరణ్, బాబు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు తన భుజాన వేసుకున్నారని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్ రెడ్డిపై చంద్రబాబు ఈగ కూడా వాలనివ్వటంలేదని, ప్రభుత్వం పడిపోకుండా కొమ్ముకాస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభ సీమాంధ్ర సభగా మారిందని, తెలంగాణ ఎమ్మెల్యేలు లేకుండానే సభ నిర్వహిస్తున్నారని హారీష్‌రావు విమర్శించారు.
కోదండరామ్ సహా... జేఏసీ నేతల రాజీనామా ?
నైతిక సూత్రాలను అనుసరించి రాజకీయ జేఏసీ, ఇతర తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ నేతలు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలను తమ పదవులకు రాజీనామాచేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్న తాము మాత్రం ఉద్యోగాలు చేసుకుంటూ, జీతాలు తీసుకుంటు న్న వైనంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జేఏసీ నేతలు.. నైతిక ధర్మం పాటిస్తూ తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామిరెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో పనిచేసినప్పుడు గానీ, జనశక్తి సానుభూతిపరుడిగా ఉన్నప్పుడు గానీ కేవలం మేధావులకే ఆయన పేరు పరిచయం. తెలంగాణ ఉద్యమం ఉధృతమయిన సమయంలో జానారెడ్డి, కేసీఆర్ కలసి కోదండరామిరెడ్డిని రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ప్రతిపాదించిన తర్వాతే ఆయన పేరు బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో దాదాపు ప్రతి ఒక్కరికీ కోదండరామిరెడ్డి పేరు పరిచయమయింది.
ఆ మేరకు ఇటీవలి కాలంలో జరుగుతున్న ఉద్యమాల్లో ఆయన అంత విస్తృతంగా పర్యటించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎమ్మెల్యే, ఎంపీల కంటే ప్రస్తుతం కోదండ రామిరెడ్డికే ఎక్కువ ఇమేజ్ ఉందన్నది నిర్వివాదం. అయితే, ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తు, నెలవారీ జీతం తీసుకుంటున్న కోదండరా మిరెడ్డి, ఆయన కమిటీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న గెజిటెడ్ స్థాయి అధికారులు తాము ప్రభు త్వ ఉద్యోగాలకు రాజీనామా చేయకుండా, మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశమయింది.
అది క్రమంగా విమర్శలకు దారితీస్తోంది. తనకు జీతం తీసుకునే హక్కు ఉందని, ప్రభుత్వం తనకు పుణ్యానికి జీతం ఇవ్వడంలేదని ఇటీవల ప్రొఫెసర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోదండరామిరెడ్డితో పాటు జేఏసీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించకుండా, జిల్లా పర్యటనలు చేస్తూనే ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చిన జీతాలు తీసుకుంటు న్నారన్న విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఉద్యమంలో భాగంగా ఒక రిని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేసే ముందు.. తాము రాజీనామాల ద్వారా త్యాగం చేయడం ఉద్యమకారుల నైతిక ధర్మమని వివిధ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్య మంలో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలు ఆటంకమని భావించినందుకే తాను ఉద్యోగా నికి రాజీనామా చేశానని తెలంగాణ బీసీ ఫ్రంట్ కన్వీనర్ కస్తూరి జయప్రసాద్ చెప్పారు. ‘ఉద్య మాలు చేసే వారు మరొకరికి ఆదర్శంగా ఉండాలి. అంటే ముందు తాము ప్రభుత్వ ఉద్యో గాలకు రాజీనామాలు చేస్తేనే ఇతరులను రాజీ నామా చేయాలని అడిగే నైతిక హక్కు ఉంటుంది.
ఇప్పుడు కోదండరామిరెడ్డి సహా జేఏసీ నేతలు ఒకవైపు జీతాలు తీసుకుంటూ ఇంకొ కరిని రాజీనామా చేయమని డిమాండ్ చేయడం అనైతికం. ముందు జేఏసీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేసి, ఇతరులను రాజీనామా చేయమని డిమాండ్ చేయాలి. అప్పుడే వారిని ప్రజలు విశ్వసిస్తార’ని జయప్రసాద్ వ్యాఖ్యానించారు. అయితే, కేసీఆర్ రాజీనామా చేయమని కోరితే తప్ప జేఏసీ నేతలు రాజీనామా చేయరేమోనని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అటు ప్రజల్లో కూడా తాము రాజీనామా చేయకుండా, జీతాలు తీసుకుంటూ ఇతరులను త్యాగం చేయాలన్న డిమాండ్‌పై వ్యతిరే త వస్తోందన్న వాస్తవాన్ని గ్రహించిన రాజకీయ జేఏసీ, ఇతర జేఏసీ నాయకులు తెలంగాణ కోసం తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం నైతిక ధర్మంగా గుర్తించారు. ఆ మేరకు ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించ నున్నట్లు తెలిసింది.తాము కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి, తెలంగాణ కోసం ఉద్యోగాలు త్యాగం చేశామన్న సంకేతాలు పంపించడం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా.. ముందు రాష్ట్ర స్థాయి జేఏసీ నేతలు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీ నామా చేయాలని, ఆ తర్వాత జిల్లా స్థాయి నేతలు రాజీనామా చేయాలని ప్రకటించనున్నారు.
గతంలో టీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని వివిధ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అదేవిధంగా జేఏసీ నేతలు సైతం తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొనాలన్న ప్రజల కోరిక మేరకు కోదండ రామిరెడ్డి సహా మిగిలిన జేఏసీ నేతలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని తీర్మానించారు.