Great Cartoon .................................. Just Think
Source: T News
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 31(): ‘ పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లుగా పిన్న వయస్సులోనే గణిత సూత్రాలను ఔపోసన పట్టిన బేబీ హర్షితాడ్డి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు ను నమోదు చేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెంది న హర్షితాడ్డి(10) ఐదో తరగతి చదువుతూనే ఇంటర్మీడియట్ గణిత సూత్రాలను అలవోకగా చెప్పేస్తోంది.
శనివారం సిద్దిపేటలో ఎస్‌ఎంఎస్ కళాశాలలో ఎర్పాటు చేసిన కార్యక్షికమంలో వంద నిముషాల్లో వంద గణిత సమస్యలను పరిష్కరించి ఔరా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానాలు తెలిపి ఆశ్చర్య పరిచింది.
కార్యక్షికమంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు దక్షిణ భారత సమన్వయ కర్త వెంకటాచారి, డాక్టర్.జి.శ్రీనివాస్, ప్రముఖ గణిత శాస్త్ర నిపుణులు రాజేందర్, కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్యలు పాల్గొన్నారు.
ధరూర్, డిసెంబర్ 31): మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు దగ్గర ఒక మెగావాట్ సామర్థ్యంతో నిర్మిచిన ఫొటో ఓల్టాయిక్ సోలార్ పవర్ ప్రాజెక్టులో శనివారం విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. కార్యక్షికమానికి జెన్‌కో డైరెక్టర్ ఆదిశేషు, ఉన్నతాధికారుల రావాల్సి ఉండడంతో చివరి నిమిషంలో వాయిదా పడటంతో ప్రాజెక్టు ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అధికారికంగా విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ప్రాజెక్టు యూనిట్ ద్వారా ఉత్పత్తిని ఎనర్జీ మీటర్‌లో పరిశీలించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (): రాజకీయాల్లో ముస్లింల పాత్ర పెరగాలని, తద్వారా మాత్రమే వారికి సరైన న్యాయం జరుగుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అభివూపాయపడ్డారు. రంగనాథమిశ్రా, సచార్ తదితర కమిటీలు ఇచ్చిన సూచనలు అమల్లోకి రాకపోవడంవల్ల ముస్లింలలో పేదరికం పెరుగుతోందని అన్నారు. ఉర్దూ భాష అభివృద్ధి, పరిరక్షణ కోసం ముస్లింలు కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. ముస్లింల పేదరికమే ఉర్దూ భాష అభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారిందని పేర్కొన్నారు.
‘ప్రపంచ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్’లో భాగంగా శనివారం జూబ్లీహాలులో జరిగిన కార్యక్షికమానికి బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీడీపీ హయాంలో 15 జిల్లాల్లో ఉర్దూ రెండవ భాషగా అభివృద్ధి చెందేటట్లు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరల్డ్ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లమా ఇజాజ్ ఫారూఖ్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి చారివూతాత్మక నగరంలో ‘ప్రపంచ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్’ నిర్వహించడం తమకు ఆనందాన్నిచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి మాట్లాడుతూ అందరూ ఉర్దూ భాష అభివృద్ధి చెందాలని ఉపన్యాసాలు ఇస్తున్నారని, కానీ అభివృద్ధి మాత్రం జరగడంలేదని వ్యాఖ్యానించారు. సియాసత్ ఎడిటర్ జహీద్ అలీఖాన్ మాట్లాడుతూ పాలకులు ఉర్దూ భాషను అభివృద్ధి చేస్తారని ఎదురుచూడకుండా భాషాభిమానులు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP