-పెద్దపల్లికి రానున్న కిషన్‌జీ భౌతికకాయం
-రెండు రోజుల్లో వచ్చే అవకాశం
-స్వయంగా ప్రకటించిన బెంగాల్ సీఎం మమత
-ఏర్పాట్లు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ సీఎస్
-భౌతికకాయం ఎప్పుడొచ్చేదీ తెలిశాకే అంత్యక్షికియలపై నిర్ణయం
-కిషన్‌జీ అన్న ఆంజనేయులు వెల్లడి
-బంధువులు, సన్నిహితుల రోదనలతో బ్రాహ్మణవీధి
-కోల్‌కతా చేరుకున్న కోటన్న అన్న పిల్లలు
-మిడ్నాపూర్‌లో భౌతికకాయం.. గుర్తించేందుకు వెళ్లిన దీప, ప్రదీప్, వీవీ
-నేడు పోస్టుమార్టం జరిగే అవకాశం: బెంగాల్ డీజీపీ పుర్కాయస్థ వెల్లడి
-సుచిత్ర కోసం ముమ్మరంగా వేట..మిడ్నాపూర్‌లో జాడలు!
కోల్‌కతా, మిడ్నాపూర్, నవంబర్ 25 :బెంగాల్ అడవుల్లో ఎన్‌కౌంటరయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన ఆంధ్రవూపదేశ్‌లోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలించనున్నారు. బెంగాల్‌లో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆయన భౌతికకాయాన్ని ఆంధ్రవూపదేశ్‌కు పంపించనుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘మృతదేహాన్ని పంపుతాం’’ అని మమత చెప్పారు. కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన స్వరాష్ట్రానికి పంపుతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆమె పై విధంగా స్పందించారు. కిషన్‌జీ మృతదేహాన్ని కోల్‌కతాకు తీసుకువచ్చి, ఇక్కడి నుంచి ఆంధ్రవూపదేశ్‌కు పంపనున్నట్లు అదనపు డీజీపీ ఎస్ పుర్కాయస్థ చెప్పారు. అంతకు ముందు కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన అన్న కుమార్తె దీప, కుమారుడు ప్రదీప్ గుర్తించనున్నారు. ఇందుకోసం వారు ఆంధ్రవూపదేశ్ నుంచి శుక్రవారం కోల్‌కతా చేరుకున్నారు. వీరి వెంట విరసం నేత వరవరరావు కూడా ఉన్నారు. ప్రస్తుతం కిషన్‌జీ భౌతికకాయం మిడ్నాపూర్ సదర్ ఆస్పవూతిలో ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన బురిసోల్ గ్రామం నుంచి తొలుత ఝర్‌క్షిగామ్ ఆస్పత్రి మార్చురీకి కిషన్‌జీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడి నుంచి మిడ్నాపూర్‌కు పంపారు. భౌతికకాయాన్ని గుర్తించేందుకు వరవరరావుతో కలిసి దీప, ప్రదీప్‌లు శుక్రవారం రాత్రే మిడ్నాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. పోస్టుమార్టం జరిగిన తర్వాత కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబీకులకు అప్పగించనున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం రెండు రోజులు పడుతుందని అంటున్నారు. బహుశా ఆదివారం లేదా సోమవారం కిషన్‌జీ మృతదేహం వస్తుందని భావిస్తున్నారు.
ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత అంత్యక్షికియలపై ఒక ప్రకటన చేస్తామని కోటేశ్వరరావు అన్న ఆంజనేయులు తెలిపారు. పెద్దపల్లిలోని ఆయన నివాసం అంతా కోటేశ్వరరావు, ఆయన తమ్ముడు వేణుగోపాల్ సోపతిగాళ్లతో నిండిపోయింది. కోటన్నగా పిలుచుకునే కోటేశ్వరరావు ఇక లేరన్న సంగతి తెలుసుకుని వచ్చిన మల్లోజుల స్నేహితులు, బంధువులతో పెద్దపల్లిలోని బ్రాహ్మణ వీధి విషణ్ణవదనం దాల్చింది. కోటేశ్వరరావు అన్న అంజనేయులు, ఆయన కొడుకు సంతోష్‌లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ బూటకమని, న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొడుకు మరణవార్తను తట్టుకోలేకపోయిన తల్లి మధురమ్మ మంచం పట్టారు. పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. కొడుకు ఆఖరి చూపుల కోసం కన్నీరుమున్నీరవుతూ ఎదురు చూస్తున్నారు. కాగా, కోల్‌కతాకు కిషన్‌జీ భౌతికకాయాన్ని తీసుకువచ్చే సమయంలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేయనున్నట్లు డీజీపీ పుర్కాయస్థ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి, మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మొదటి పది మంది వీవీఐపీల భద్రతను మరింత పెంచనున్నట్లు పుర్కాయస్థ చెప్పారు. పోస్టుమార్టం శనివారం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సమర్ ఘోష్ ధ్రువీకరించారు.
కిషన్‌జీ బంధువులతో మాట్లాడిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని ఆంధ్రవూపదేశ్‌కు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందుకోసం ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే.. సాధారణ ప్రొసీజర్లు ఉంటాయని చెప్పారు. పోస్టుమార్టం ఎక్కడ జరపాలనే విషయంలో ఇంకా ఆలోచన చేస్తున్నామని హోం శాఖ కార్యదర్శి జీ డీ గౌతమ చెప్పారు. పోస్టుమార్టం జరిగేటప్పుడు ఒక ఫోరెన్సిక్ బృందం ఉంటుందని, అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని కోటేశ్వరరావు అన్న ఆంజనేయులు రక్త నమూనాలను స్థానిక పోలీసులు సేకరించారు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన అప్రమత్తతలో భాగంగా కిషన్‌జీ స్వగ్రామంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికోసం కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దింపారు. కిషన్‌జీ భౌతికకాయాన్ని గుర్తించి, స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు వరవరరావు, దీపారావు, ప్రదీప్ ఆంధ్రవూపదేశ్ నుంచి శుక్రవారం ఉదయం బయల్దేరి కోల్‌కతా చేరుకున్నారు. వారితో పాటు పలువురు మావోయిస్టు సానుభూతిపరులు కూడా వచ్చారు. కిషన్‌జీని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపే ముందు ఆయనను చిత్ర హింసలకు గురి చేశారని వరవరరావు ఆరోపించారు. రాష్ట్ర సచివాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కిషన్‌జీని అమానుషంగా చిత్రహింసలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఆయన శరీరంపై అనేక లోతైన గాయాలు ఉన్నాయి. పట్టుబడిన 24 గంటల తర్వాత ఆయనను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం నిబంధనల ప్రకారం ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక రాజకీయ కార్యకర్తగా పరిగణించి ఆయన భౌతికకాయాన్ని గౌరవవూపదంగా ఆయన కుటంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
తొలుత వరవరరావు, ఆయన వెంట వచ్చిన వారిని కోల్‌కతా విమానాక్షిశయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. కొంత వాగ్వాదం తర్వాత వారిని నగరంలోకి అనుమతించారు. ఇదిలా ఉండగా.. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శితో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అప్రమత్తతను ప్రకటించారు. మరోవైపు.. తప్పించుకున్న మహిళా మావోయిస్టు సుచిత్ర కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో దొరికిన ఒక పర్స్.. సుచివూతదిగా భావిస్తున్నారు. దీంతో తాజా వేటను భద్రతా దళాలు ప్రారంభించాయి. సుచిత్ర కోసం సీఆర్పీఎఫ్‌కు చెందిన 167, 184వ బెటాలియన్‌లు, సీఐఎస్‌ఎఫ్, కోబ్రా దళాలు దాదాపు వెయ్యి మంది కూంబింగ్ జరుపుతున్నారు. ఈ ఆపరేషన్‌లో పోలీసు జాగిలం బ్రునో కూడా ఉంది. గాయపడిన మావోయిస్టులు చికిత్స కోసం వస్తారనే ఆలోచనతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పవూతుల వద్ద నిఘా పెట్టారు. కిషన్‌జీని నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపారని మావోయిస్టు పార్టీ బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకాష్ కూడా ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా శని, ఆదివారాల్లో రెండు రోజుల బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చారు.
అది బూటకపు ఎన్‌కౌంటరే..
కిషన్‌జీ బూటకపు ఎన్‌కౌంటర్‌లోనే మరణించారని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు విమర్శించాయి. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ఏకంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సీపీఐ నేత గురుదాస్‌దాస్ గుప్తా లేఖ రాశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత మోహన్‌సింగ్ కూడా ఇదే అభివూపాయం వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని మమత ప్రభుత్వం గతంలో ఆజాద్ ఎన్‌కౌంటర్‌ను తలపించేలా కిషన్‌జీని హతమార్చిందని సీపీఐ ఎంఎల్ నేతలు రాజ్ కుమార్ సింగ్, కృష్ణ అధికారి పాట్నాలో ఆరోపించారు. జంగల్‌మహల్లో స్థానికుల మద్దతుతోనే మల్లోజుల ఎన్‌కౌంటర్ జరిగిందని బెంగాల్ నటి అపర్ణాసేన్ అభివూపాయం వ్యక్తం చేశారు.
మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించండి:కేసీఆర్
కిషన్‌జీ భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు బేషరతుగా అప్పగించాలని ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కిషన్‌జీ భౌతికకాయాన్ని కరీంనగర్ జిల్లాలోని ఆయన స్వగృహనికి తరలించే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు.
Take By: T News
Tags: Telangana News, AP News, Political News, Kishenji death, Maoist leader, Suchitra Mahato, Jungalmahal encounter
Read more...