తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ అవే ప్రకంపనలు
- ఐదో రోజూ అదే తీరు
- సోమవారానికి వాయిదా
- వెల్‌లోకి దూసుకెళ్ళిన కేసీఆర్, విజయశాంతి
- ప్లకార్డులతో టీ కాంగ్రెస్ ఎంపీల నినాదాలు
- ఆజాద్ సూచన బేఖాతరు
- తెలంగాణే ముఖ్యం.. బలికాలేమని స్పష్టీకరణ
- తెలంగాణ ప్రాధాన్యం వివరించిన టీ ఎంపీలు
న్యూఢిల్లీ, నవంబర్ 25 (టీన్యూస్):పార్లమెంటును వరుసగా ఐదో రోజూ తెలంగాణ ప్రకంపనలు కుదిపేశాయి. గత నాలుగు రోజులుగా తెలంగాణ నినాదాలతో హోరెత్తిన లోక్‌సభ శుక్రవారం కూడా దద్దరిల్లింది. తెలంగాణ అంశంపై నిర్మాణాత్మక చర్చ జరగనంతవరకు స్పీకర్ పోడియాన్ని వీడేదిలేదంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి పట్టుపట్టడంతో సభ సోమవారానికి వాయిదాపడింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ ప్రాంత ఎంపీలు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టగా, రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర పక్షాలు గళమెత్తాయి. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ టీ కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాధం, రాజయ్య, పొన్నం ప్రభాకర్, వివేక్, మధు యాష్కీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తుంటే, టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడులపై చర్చ జరగాల్సిందేనని విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ మొదటిసారి వాయిదా పడింది. సభ పునఃవూపారంభమైన తర్వాత, శరద్ పవార్‌పై జరిగిన దాడికి విచారం వ్యక్తం చేసిన స్పీకర్, దానిపై చర్చను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనపై జరిగిన దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు.
Read More
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=3&ContentId=48176
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Sima Andra, AP News, MP, Political News , Lok Sabha
0 comments:
Post a Comment