14 కొత్త మునిసిపాలిటీలకు సీఎం ఆమోదం
హైదరాబాద్, నవంబర్ 25(): రాష్ట్రంలో 14 కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌డ్డి శుక్రవారం అమోదం తెలిపారు. రాష్ట్రంలో 57 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. వీటిలో అన్ని రకాల పరిశీలనలు పూర్తయిన తర్వాత 49 మున్సిపాలిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 26 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా 23లో 14 మున్సిపాలిటీలకు సీఎం తాజాగా పచ్చజెండా ఊపారు. మెదక్‌లోని గజ్వేల్, నల్లగొండలోని దేవరకొండ, శ్రీకాకుళంలోని టెక్కలి, తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, విశాఖలోని యలమంచిలి, నర్సీపట్నం, నెల్లూరులోని ఆత్మకూరు, సూళ్లూరుపేట, కడపలోని మైదుకూరు, కర్నూలులోని నందికొట్కూరు, ఆళగడ్డ, ఆత్మకూరు, కృష్ణా జిల్లాలోని నండికొండ, ఉయ్యూరులు కొత్త మునిసిపాలిటీలు ఏర్పడనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వారం రోజులో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 9 మున్సిపాలిటీలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Sima Andra, AP News, Political News,
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Sima Andra, AP News, Political News,
0 comments:
Post a Comment