న్యూఢిల్లీ/హైదరాబాద్, మేజర్‌న్యూస్: తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ కోర్ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానున్నది.పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు చిదంబరం, ఎ.కె.ఆంటోని, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ పాల్గొనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోతే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదని, అదే విధంగా కాంగ్రెస్ నేతలు రాజకీయ జీవితానికి చమరగీతం పాడాల్సి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోర్ కమిటీ సభ్యులకు తెలియజేయనున్నారు.
తెలంగాణకు సానుకూలంగా ప్రకటన చేయక పోతే ఇక రాజీనామాలే తప్ప మరో గత్యంతరం లేదని వారు కోర్ కమిటీకి స్పష్టం చేయనున్నారు. అంతకు ముందు సోమవారంమధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాయంత్రం సీడబ్ల్యూసీ సభ్యుడు, ఎంపి డాక్టర్ కె.కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ఢిల్లీ పెద్దలతో చర్చించాల్సిన విషయా లు, తెలంగాణలో పార్టీ పరిస్థితి వంటి ఆంశాలపై చర్చించారు. ఆ తరువాత కేకే చోరవతోనే సోని యా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేతో రాత్రి 7 గంటల ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.
దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు తెలంగాణలో పార్టీ పరిస్థితిని, తమకు ఎదురవుతున్న సమస్యలను, ప్రతిపక్షాలు, ప్రత్యేకించి టిఆర్‌ఎస్, తెలంగాణ వాదుల దాడులను పటేల్‌కు వివరించినట్లు సమాచారం. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు కోరినట్లు తెలిసింది. అలాగే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను పార్టీ అధినేత్రి సోనియాకు వివరించే వరకు ఢిల్లీని వదిలేది లేదని వారు స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరతామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ మేరకు పార్టీ ఎంపీలు కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుం టున్నారని వారు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో సమావేశంలో ఉండగానే పటేల్ పార్టీ అధినేత్రి సోనియాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో మంగళవారం కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధినేత్రి సోనియా పటేల్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఆ తరువాత పటేల్ ఈ సమాచారాన్ని కోర్ కమిటీ సభ్యులకు చేరవేయ డమే కాకుండా మంగళవారం భేటికి సిద్ధంగా ఉం డాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు. కోర్ కమిటీ సమావేశం తరువాతే పరిస్థితులను బట్టి టిజిసి నేతలకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ లభించే అవకాశాలున్నట్లు ఎఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి.
కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ కి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృం దం ఒకటి సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. ఈ బృందంలో 25 మంది ఎమ్మెల్యేలు, ఏడుగు రు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 32మంది ఉన్నారు.ఢిల్లీ బయలు దేరి వెళ్ళడానికి ముందు తమను కలిసిన మీడియా ప్రతినిధులతో పలువురు ఎమ్మె ల్యేలు మాట్లాడారు. ఎవరిఒత్తిళ్ళకు తలొగ్గి తాము ఢిల్లీకి వెళ్ళడం లేదని వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఇవ్వాల్సిందేనని అధిష్ఠానాన్ని కోరుతా నని ఆయన అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ ఎమ్మె ల్యే టి.నర్సారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ వెళ్ళి తెలం గాణ కోసం పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తా మని అన్నారు. తెలంగాణ ఇవ్వక పోతే పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగే ప్రమాదం ఉందని వివరిస్తా మని చెప్పారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య మాట్లాడుతూ తెలంగాణపై పార్టీ అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకే హస్తిన వెళుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల అధిష్ఠానం సానుకూలంగా దిగిరాక పోతే ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తాము అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీలోనే కార్యచరణ రూపొందించు కుంటామని
take By:
Suryaa
Read more...