Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, September 6, 2010

In Pics : Protest at OU campus against APPSC exam


Hairsh Rao Run in Sangareddy : This photo take by: Eenadu, Surya, Andrajyothi

OU Campus

In Pics : Protest at OU campus against APPSC exam




















Read more...

‘Viva La’ Telangana !




Telangana Students! You did it again. You made Telangana proud. You did what you promised to do.

You made mockery of this barbaric attempt of conducting this ‘sham’ APPSC exam by the shameless ‘trio’ of Rosiah, Venkatram Reddy and Aravind Rao. You have upheld the ‘atmagouravam’ of Telangana people by your courage and sacrifices. All the people of Telangana salute to you for this magnificent achievement. It adds another feather to your cap, embellished with the incredible achievements of giving a new lease of life to Telangana struggle on your own, help registering a stunning victory in Telangana by elections. But, let us not rest on these laurels. The enemy is cunning and can go to any length to deny us the fruits of our struggle. Let us be on our guard, and continue our struggle relentlessly. The shameless attempt of the government to say that the exam is conducted normally is an indicator to this. This should be rubbished by all means and bring the truth that Telangana students boycotted the exam voluntarily.

By now, it is very clear that this Government do not represent the interests of four crore people of Telangana. We are under the yoke of a ‘Democratic Dictatorship’, which is worse than a feudal regime, in the middle ages. The Chief Minister is a modern day ‘Nero’, fiddling the tunes of ‘Andhraragam’, while Telangana is burning, ably assisted by his lieutenants like fraudulent Venkatrama Reddy and vainglorious Aravindrao in the carnage. There is no change in the mindset of Andhra colonialists despite our peaceful efforts and killing ourselves fighting against most palpable organized exploitation in a democracy. We should understand that it is futile to expect any change of heart in these hard-boiled exploiters. We have tolerated this long enough. Now enough is enough, let us start our final battle.

Let us give a dressing down to the people of Telangana, who want to sub-serve the interests of Andhras. They are traitors to us. Seek andhras who are in Telangana and want to make Telangana their home. They should be fighting along with us for separate state and be partners in our future. They are going to be our compatriots. Tell the andhras who do not try to understand the injustices done to Telangana and are not comfortable being in a Telangana State to go where ever they like. They are ‘persona nongrata’ here. Do not allow them to play any ‘Trojan horses’ . Drive away those unscrupulous andhras, who are plundering the resources of Telangana and their helpers, out of Telangana, without any reservation. They are our avowed enemies. We have a very long way to go in rebuilding our Telangana, ravaged by these ruffians. We have no time to lose any more. It is now or never!


By:Simplytelangana

Read more...

అందరి చూపు డిసెంబర్‌ వైపే


రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. అన్ని ప్రాంతాల్లోని అన్ని వర్గాలూ డిసెంబర్‌లో, ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడ బోయే పరిణామాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. ప్రధానంగా.. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు ఉత్కంఠ తో ఊపిరిబిగపట్టి ఫలితం కోసం ఎదురుచూస్తు న్నారు. డిసెంబర్‌ తర్వాత రాష్ట్రంలో ఏం జరగబో తోందన్న అంశం రాజకీయ పార్టీల భవితవ్యాన్నీ తేల్చనుంది. అన్నింటికన్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు, విస్తరణ వ్యవహారం కూడా డిసెంబర్‌తోనే ముడిపడి ఉండటం మరో ఆసక్తికర అంశం.

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలయిన కాంగ్రెస్‌ -తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది? టీఆర్‌ఎస్‌ వ్యూహం ఎలా మారబోతోంది? సర్వ త్రా ఇవే ప్రశ్నలు. ఈ గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక రంగంలో గందరగోళం. పెట్టుబడులపై తర్జనభర్జన. అమ్మకాలు, కొనుగోళ్లు స్తంభించిన వైనం. ప్రతిదానికీ ఆచితూచి నిర్ణయం. ఇదీ.. రాష్ట్రంలో పై నుంచి కిందవరకూ ఉన్న పరిస్థితి.ప్రత్యేక-సమైక్యవాద ఉద్యమాల నేపథ్యంలో హైకోర్టు నుంచి పంచాయతీ వరకూ నిలువునా చీలిన మానసిక భావన రాష్ట్రంలోని అన్ని రంగా లపై పెను ప్రభావం చూపుతోంది.

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టులో స్వేచ్ఛగా అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనూ ఉద్యో గులు రెండుగా చీలిపోయారు. రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించవలసిన మంత్రులు ప్రాం తాల వారీగా విడిపోయి, ఒకరి ప్రాంతాల నేతలపై మరొకరు ధ్వజమెత్తుతున్నారు. దాదాపు అన్ని ఉద్యోగ సంఘాల్లోనూ ప్రాంతాల వారీగా చీలిక ఏర్పడింది. జర్నలిస్టు సంఘాలూ చీలిపోయాయి.

ప్రధానంగా.. రాజకీయపార్టీల్లోనూ స్పష్టమైన విభజన వచ్చింది. కాంగ్రెస్‌-తెలుగుదేశం పార్టీలు తెలంగాణ-సీమాంధ్రగా విడిపోయి పోరా టాలు చేస్తుంటే, స్థానిక ప్రజల మనో భావాలు దెబ్బతింటాయన్న భయంతో ఆయా నాయ కత్వాలు రెండు ప్రాంతాల ఉద్యమాలను ప్రోత్సహించవలసిన అనివార్యపరిస్థితి ఏర్ప డింది. పిసిసి అధ్యక్ష పదవీకాలం పూర్తవుతు న్నప్పటికీ, డిసెంబర్‌ వరకూ ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అయోమయ పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడును పూర్తి చేసుకుని నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర కమిటీని ప్రకటించలేని గందరగోళంలో ఉంది. చివ రకు మునిసిపల్‌ ఎన్నికలు కూడా నిర్వహించ లేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ డిసెంబర్‌లో శ్రీకృష్ణ మిటీ ఇచ్చే నివేదిక ప్రభావమేనని స్పష్టమవుతోంది.

srikirhsnaaరాష్ట్ర రాజకీయాలు ఇంత అనిశ్చితికి గురయ్యేందుకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌ పార్టీ చివరకు తాను తవ్వుకున్న గోతిలో తానే పడనుంది. రెండు ప్రాంతాల్లోని పార్టీ నేత లకు స్వేచ్ఛ ఇచ్చి, వ్యూహాత్మకంగా వాదాలను రగిలించిన కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంపై నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేకపోతోంది. ముఖ్యంగా.. తనను ధిక్కరించి వ్యవహరి స్తోన్న జగన్‌ సంగతి తేలేవరకూ రాష్ట్ర విభ జనపై ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. జగన్‌ పార్టీ నుంచి తనంతట తాను వెళ్లిపోతాడా? లేక పార్టీ నుంచి తానే పంపించాలా? జగన్‌ వెళితే పార్టీ చీలుతుందా? ప్రభుత్వం కూలుతుందా? ఒకవేళ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సాయం తీసుకుంటే ఆ పార్టీ నుంచి జగన్‌ వైపు వెళ్లేది ఎంతమంది? తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో పార్టీ భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్‌ సతమత మవుతోంది. గతంలో ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాక పోవడం వల్లే ఆ పార్టీ రాష్ట్ర భవిష్యత్తుపై తర్జన భర్జన పడుతోంది.

డిసెంబర్‌తో శ్రీకృష్ణ కమిటీ గడువు పూర్తి కానుంది. గడువు కంటే ముందే నివేదిక ఇస్తామని శ్రీకృష్ణ విస్పష్టంగా చెబుతున్నారు. ఆ కమిటీ రాష్ట్ర విభజనకు సంబంధించినది కాకపోయినా, మూడు ప్రాంతాల్లోని ప్రజల మనోభావాలకు అద్దం పట్టే కమిటీగానే భావించవలసి ఉంది. దానికితోడు అది తన పర్యటనల్లో వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న వ్యాఖ్యలు కూడా గందరగోళంగా, అనుమా నాస్పదంగా కనిపిస్తున్నాయి. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రాష్ట్రానికి సంబం ధించి ఒక నిర్ణయం తీసుకునేందుకు కమిటీ నివేదిక అక్కరకొస్తుందన్నది నిర్వివాదం.

ఇప్పుడు అన్ని పార్టీలు, వర్గాలు, ప్రాంతాల్లో ఆ అంశమే ప్రధాన చర్చగా మారింది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ ముఖ్యమంత్రి మార్పు, విస్తరణ ఉండకపోవచ్చంటున్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. ఆ నివేదికలో అంశాలు తెలంగాణకు సానుకూలంగా ఉంటే.. సమైక్యాంధ్రను కొనసాగిస్తూనే, తెలంగాణకు చెందిన సీనియర్‌ నే తకు సీఎం పదవి అప్పగించవచ్చని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దానికి సైతం అంగీకారం కుదర పోతే హైదరాబాద్‌ను కేంద్రపాలిక ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తెలంగాణలో లబ్థి పొందే వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు. ఇవన్నీ.. కాంగ్రెస్‌ తనకు రాజకీయంగా లాభం చేకూరుతుందనుకున్న నిర్ణయానికి వస్తేనే అని కాంగ్రెస్‌ సీనియర్లు విశ్లే షిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే డిసెంబర్‌ వరకూ ముఖ్యమంత్రి రోశయ్యకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చంటున్నారు.

ఈ అంశంలో శ్రీకృష్ణ కమిటీతో పాటు.. గవర్నర్‌ నరసింహన్‌ నివేదిక కూడా కీలకంగా మారింది. గత కొద్ది నెలల నుంచి రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీ లిస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని సమాంతర పాలన నడుపుతున్న గవర్నర్‌, రాష్ట్ర విభజనపై కేంద్రానికి ఎలాంటి సూచనలు చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ అంశమే ప్రధానంగా మారింది కాబట్టి, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సిఫార్సు చేస్తారా అన్న ప్రశ్నలూ వినిపించకపోలేదు. స్వతహాగా ఐపిఎస్‌ అయిన గవర్నర్‌ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న ధోరణినే ప్రదర్శిస్తున్నారు. శనివారం తనను కలిసేం దుకు వచ్చిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేతలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా... జగన్‌ వ్యవహారమే కాంగ్రెస్‌కు నిర్ణయం తీసుకునేందుకు ఒక అవరోధంగా పరిణమించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లోగా నాయకత్వం జగన్‌ వ్యవహారాన్ని తేల్చే ఉద్దేశంతో ఉందని, దానిని దశల వారీగా పూర్తి చేస్తుందంటున్నారు. తొందరపడి జగన్‌పై వేటు వేయడం వల్ల ఆయన సీమాంధ్రలో బలమైన నేతగా ఆవిర్భవిస్తారన్న ఆందోళన కూడా లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. జగన్‌ను వదిలించుకోవాలనుకుంటే.. ముందు ఆయన మద్దతుదారులందరినీ బయటకు పంపించి, ఆ తర్వాత జగన్‌పై వేటు వేయాలన్నది ఒక ఆలోచన అంటున్నారు. సీమాంధ్రలో అటు తెలుగుదేశం, ఇటు జగన్‌ లబ్ధి పొందకుండా చూసే వ్యూహంలో భాగంగానే తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తోందని సీనియర్లు చెబుతున్నారు.

అటు తెలుగుదేశం పార్టీకీ డిసెంబర్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఇప్పటికే రెండుగా చీలిన ఆ పార్టీ కూడా కొత్త సంవత్సరంలో కేంద్రం ఏం నిర్ణయం తీసు కుంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. తెలంగాణ- సమైక్యాంధ్ర నే తలు ఇప్పటికే ఎవరి ఉద్యమాల్లో వారు మునిగిపోయారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని అటకెక్కించి చాలా కాలమయింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరినీ నియంత్రించే పరిస్థితిలో లేరు.

ఒకవేళ రాష్ట్రం విడి పోయినా.. రెండు ప్రాంతాల్లోనూ అధికారం లోకి రావాలన్న వ్యూహంతో ఉన్న చంద్రబాబునాయుడు వంటి పరిణతి చెందిన వ్యూహరచయిత సైతం,ఈ రాష్ట్రాన్ని కేంద్రం ఏం చేయబో తోంది? డిసెంబర్‌ తర్వాత ఏం జరగబో తోందన్న ఒత్తిడిలో ఉన్నారు. అందుకే ఆయన రాష్ట్ర కమిటీని ప్రకటించలేకపో తున్నారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్‌ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవ హరించాలని తీర్మానించుకున్నారు. అసలు రాష్ట్రంలో తన పార్టీని సమాధి చేసేందుకే కాంగ్రెస్‌ విభజన చిచ్చు తెరపైకి తీసుకు వచ్చిందని భావిస్తోన్న బాబు, ఆ మేరకు ఇరు ప్రాంత నేతలకూ వాస్తవాలు చెప్పి, పార్టీని అదుపులో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో బాబు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు.

ఇక టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా తన పార్టీ భవితవ్యాన్ని నిర్దేశించుకు నేందుకు జనవరి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ జేఏసీల దన్నుతో ఉద్యమాన్ని, ఉద్యమ సహకారం తో పార్టీని బతి కించుకుంటూ వస్తోన్న కేసీఆర్‌, జనవరి తర్వాత ఏం చేయబోతా రన్న ఉత్కంఠ మిగిలిన వర్గాల్లో ఉంది. అదే సమయంలో కేసీఆర్‌కు సైతం పార్టీని ఏ దారి పట్టించాలన్న అయోమయం లేకపోలేదు. కాంగ్రెస్‌తో కలసి నడవాలా? బిజెపితో కలసి ఉద్యమాలు సాగించాలా? సొంతగా పార్టీని పటిష్టం చేసుకోవాలా? విద్యార్థులు, జేఏసీల ప్రభావం ఇదేవిధంగా కొనసాగితే పార్టీ మనుగడ ఏమిటి? అన్న ప్రశ్నలు కేసీఆర్‌ ముందున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్థిక రంగం కూడా స్తంభించిపోయింది. ప్రధా నంగా.. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయింది. ఇల్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. అపార్టుమెంట్ల నిర్మాణాలు సగంలోనే నిలిచి పోయాయి. రాష్ట్రానికి రావలసిన పెట్టుబడుల వ్యవహారం కూడా అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చక్కబడి, కేంద్రం ఒక నిర్ణయా నికి వచ్చిన తర్వాతే విస్తరణ, కొత్త కంపెనీలపై దృష్టి పెట్టాలని నిర్ణయించాయి.

This news take by:http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=61443

Read more...

ఢిల్లీలో తెలంగాణపై ముగిసిన కాంగ్రెస్‌ సారధ్య బృందం ప్రదర్శనలు


ఢిల్లీలో తెలంగాణపై ముగిసిన కాంగ్రెస్‌ సారధ్య బృందం ప్రదర్శనలు

హైదరాబాద్‌,మేజర్‌న్యూస్‌ :ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ క్షేత్ర స్థాయి సమాచారంతో ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్‌ సారధ్య బృంద ం కార్యక్రమాలు ఆదివారంతో ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ప్రదర్శనతో ముగిశాయి. మూడు రోజుల కార్యక్రమాలు బాగా జరగడంతో తమకు సంతృప్తి నిచ్చాయని పీసీసీ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ కాంగ్రెస్‌ సారధ్య బృందం నేతలు జి.నిరంజన్‌, రాపోలు ఆనంద భాస్కర్‌, ఎస్‌.లక్ష్మినారాయణ, ఎస్‌.నర్సింహ్మరెడ్డి తెలిపారు. మూడవ రోజు ఆదివారం సారధ్య బృందం నేతలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేయాలని, తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆ తరువాత వీరు గాంధీ స్మృతి వద్దకు వెళ్ళి నివాళులర్పించారు. ఆ తరువాత గ్రూప్‌-1 పరిక్షలపై నిరసన తెలియజేస్తున్న విద్యార్ధులపై రాష్ట్రంలో జరిగిన లాఠీ చార్జీని వీరు ఖండిస్తూ, పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ గాంధీ స్మృతి వద్ద ప్రదర్శన నిర్వహించారు. మూడు రోజుల పాటు తెలంగాణ కోసం ఢిల్లీలో ప్రదర్శనలు, పార్టీ పెద్దలతో భేటీలు నిర్వహించిన అనంతరం సారధ్య బృందం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తురంతో ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయలు దేరనున్నది.

-Suryanews

Read more...

ఉద్రిక్తతల మధ్య గ్రూప్‌-1

Read more...

ఉద్రిక్తతల మధ్య గ్రూప్‌-1

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ఃగ్రూప్‌-1 పరీక్షల వివాదం తెలంగాణా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. పరీక్షలను అడ్డుకుంటామని ఆది నుంచి చెబుతూ వచ్చిన నేతలు అక్క డక్కడ అడ్డుకునేందుకు యత్నించారు. ముందస్తు పోలీసు పహారా మధ్య పరీక్షలు ఎట్టకేలకు ముగిశాయనిపించారు. ఎపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ -1 పరీక్షల్లో తెలంగాణా వాటా ప్రకటించేంతవరకు పరీక్షలు నిర్వహించరాదనీ, గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న తెలంగాణా వాదులు తాజాగా పరీక్షల నాడు తెలంగాణా ప్రాంతంలో ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు పరీక్షల నిర్వహణ ఉండగా, ఉదయం నుంచే ఆందోళనల పర్వం ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్శిటీ మరోసారి రణరంగంగా మారింది. తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, మందా జగన్నాథంతో పాటు పలువురు తెలంగాణా నేతలు విద్యార్థులకు మద్ధతు ప్రకటించడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. ఉదయం నుంచి ఉస్మానియా యూనివర్శిటీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినా బీఇడీ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కొందరు పరీక్షా పత్రాలను తీసుకుని బయటకు వచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

అయితే వాటిపై 2010 పరీక్షా పత్రాలని ఉన్నప్పటికీ, ఎపీపీఎస్పీ వర్గాలు మాత్రం అది పాత పరీక్షా పత్రం అంటూ కొట్టిపడేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్ళవర్షం కురిపించడంతో పోలీసులు ఆందోళనకారులను నిరోధించేందుకు బాష్పవాయు ప్రయోగం చేశారు. అదే సమయంలో విద్యార్థులకు మద్ధతుగా వచ్చిన గుత్తా, మందా, వివేక్‌, మధుయాష్కీలను పోలీసులు అరెస్టు చేసి బంజారా హిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉస్మానియా యూనివర్శిటీ వద్ద తూర్పు మండలం డీసీపీ మహేశ్‌చంద్ర లడ్డా, జాయింట్‌ కమిషనర్‌ అమిత్‌గర్గ్‌, ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఏబీవీపీ కార్య కర్తలు పుల్లారెడ్డి కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో పిడీఎస్‌యూ ర్యాలీ నిర్వహించగా, నల్గొం డలోని మహాత్మాగాంధీ కళాశాల, గౌతమి కళాశాల వద్ద టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన నిర్వ హించారు. హైదరాబాద్‌లోని తార్నాక, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో ఉన్న బిగ్‌బజార్‌ షోరూమ్‌పై ఆందోళనకారులు రాళ్ళతో దాడిచేశారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో బస్సులపై రాళ్ళురువ్వారు. నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

మూడంచెల భద్రత

ఎపిపిఎస్సీ గ్రూప్‌ -1 పరీక్షలు యధావిధిగా ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా వచ్చారు. 1.90 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, కేవలం 61వేల మంది వరకే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు ముందస్తుగానే హైదరాబాద్‌లో నాయిని నర్సింహారెడ్డిని, మెదక్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులను గృహనిర్బంధం చేశారు. కరీంనగర్‌ జిల్లాలో పరీక్షాకేంద్రాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న గంగుల కమలాకర్‌, విజయరమణారావు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను అడ్డుకుని, అరెస్టు చేశారు. పోలీసులతో తోపులాట సమయంలో ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పెదవికి గాయమైంది. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకులు విజయరామారావు, ప్రభాకర్‌లను పోలీసులు ముందస్తుగానే గహ నిర్భంధంలో ఉంచారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, సంగారెడ్డి పరీక్షా కేంద్రంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును, ఆదిలాబాద్‌లో తెలుగుదేశం శాసనసభ్యుడు జోగిరమణలను అరెస్టు చేశారు. మంచిర్యాలలో అరవిందరెడ్డి, కావేటి సమ్మయ్యలను గృహనిర్భంధంలో ఉంచారు. వరంగల్‌ ఎంపీ రాజయ్య, ఎంఎంల్‌ఏ వినయభాస్కర్‌లను అరెస్టు చేశారు.

బాధ్యులపై చర్యలు : ఖాన్‌

ఉస్మానియా యూనివర్శిటీ బిఇడి కళాశాల వద్ద జరిగిన పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ ఎ.కే.ఖాన్‌ స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలోని బీఇడి కళా శాల మినహా మిగిలన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాం తంగా ముగిసినట్లు చెప్పారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

karimnagarగ్రూప్‌-1 పరీక్షల వాయిదా కోరుతూ మెదక్‌ జిల్లా నారా యణఖేడ్‌ మండల పరిధిలోని పలుగు తండాలో శనివారం అమరణ నిరాహార దీక్షకు దిగిన రవిందర్‌నాయక్‌ అనే యువకుడు ఆదివారం ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నిం చాడు. శనివారం తనంతట తానుగా పాఠశాల భవనంలోకి వెళ్లి నిర్బంధించుకొని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన అతన్ని అధికారులెవరు పట్టించుకోకపోవడంతో తండాలోని గిరిజనులు ఆదివారం దీక్షను మాన్పించడానికి ప్రయత్నిం చారు. దాంతో అతను కొడవలితో ఆత్మహత్యాయత్నానికి పూనుకోగా చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతడిని గిరిజనులు జూకల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథ మ చికిత్స చేయించి 108కు సమా చారం అందించగా నారాయణ ఖేడ్‌ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. ప్రభుత్వాస్పత్రికి చేరు కున్న రవిందర్‌నాయక్‌ను ఆస్పత్రిలోనే పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవిందర్‌నాయక్‌ను టీఆర్‌ఎస్‌ ఇంచార్జి ఎం. భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మారుతి పటేల్‌, పండరియాదవ్‌ తదిత రులు పరామర్శించారు.

మహబూబ్‌నగర్‌లో బంద్‌ పాక్షికం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 1 పరీక్షలు పోలీసుల పహార నడుమ ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చెదురు మదరు సంఘటనలు మినహా 10 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలను నిలిపి వేయా లని కోరుతూ విద్యార్థి జెఎసితో పాటు టిఆర్‌ఎస్‌, టిడిపి, బాజాపా ఇచ్చిన తెలంగాణ బంద్‌ జిల్లాలో పాక్షికంగా జరిగింది. బంద్‌ ప్రభావం జిల్లా కేంద్రంలో కనిపించగా ఇతర ప్రాంతాల్లో పెద్దగా కనిపించలేదు. బంద్‌ సందర్బంగా ఉద యం నుంచే పోలీసులు గట్టి బందోభస్తు ఏర్పాటు చేశారు. గ్రూఫ్‌ 1 పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా నిర్వహిం చేందుకు జిల్లా కలెక్టర్‌ పురుషోత్తం రెడ్డితో పాటు ఎస్పీ జి.సు దీర్‌బాబులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా లో గ్రూఫ్‌ 1 పరీక్షకు 4,171 మంది అభ్యర్థులు హాజరు కావా ల్సి ఉండగా 1904 మంది అభ్యర్థులు మాత్రమే హాజరైనట్లు జిల్లా కలెక్టర్‌ పురుషోత్తం రెడ్డి అధికారికంగా వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు నిరసనగా పాలమూరు జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్‌ డిగ్రీ కళాశాలలో పరీక్షకు హాజరైన పురేందర్‌నాథ్‌ అనే విద్యార్థి తన హాల్‌ టికెట్‌తో పాటు జవాబు పత్రాన్ని కూడా చించి వేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీకాంత్‌ అనే అభ్యర్థి పరీక్ష రాసేది లేదంటూ చేయి కోసుకున్నాడు. జడ్చర్లలో ఒక విద్యార్థి సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. బంద్‌ సందర్భంగా ఉదయమే పోలీసులు టిఆర్‌ఎస్‌ నేతలు విఠల్‌రావు ఆర్యా, బెక్కెం జనార్దన్‌తో పాటు విద్యార్థి జెఎసి నాయకులను అరెస్టు చేశారు.

కరీంనగర్‌ నిరసనల వెల్లువ

గ్రూప్‌-1 పరీక్ష వాయిదా వేయాలనే డిమాండ్‌తో ఆది వారం కరీంనగర్‌ జిల్లాలో నిరసన కార్యక్రమాలు వెల్లువె త్తా యి. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, టిడిపి, బిజెపి శ్రేణులు నిర్వహించిన ఆందోళనలతో జిల్లా కేంద్రం అట్టుడికిపోయింది. ఈ సందర్భంగా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ముందు జాగ్రత్త చర్యగా శని వారం సాయంత్రం నుంచే 144 సెక్షన్‌ విధించారు. పరీక్ష నిర్వ హణ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అభ్యర్థులు శనివారం రాత్రే జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలో 13 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించగా, 36.3 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజర య్యారు. మొత్తం 7,282 మంది దరఖాస్తు చేసుకోగా 2,633 మంది మాత్రమే పరీక్ష రాసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ంలోని వివిధ పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళన నిర్వహించి, లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తోపులాటలో కరీంనగర్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళన నిర్వహించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు విజయర మణారావు, గంగుల కమలాకర్‌లతో పాటు టిఆర్‌ఎస్‌, టిడిపి, కాంగ్రెస్‌, బిజెపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మంలో ప్రశాంతం

ఖమ్మం , మేజర్‌న్యూస్‌: ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన గూప్‌-1 పరీక్షలు స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 23 మంది పరీక్షా కేంద్రాలలో 43.3 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 5529 మంది అభ్యర్థులకు గాను 2398 మంది పరీక్షలకు హాజర య్యారు. పరీక్షలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు తదితర ప్రాంతాల్లో 200 మంది న్యూడెమొక్రసి, పిడిఎస్‌యూ, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేశారు.

నల్గొండ జిల్లాలో ..

నల్లగొండ, మేజర్‌న్యూస్‌: పోలీసుల పహార నడుమ జిల్లా కేంద్రంలో పరీక్ష తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరిగింది. నల్లగొండ కేంద్రంగా 5556 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోగా 2494 మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారు. గ్రూప్‌-1 పరీక్ష విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పలువురు అభ్యర్ధులు పరిక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద తమ హాల్‌ టికెట్లను చింపివేశారు. లిటిల్‌ఫ్లవర్‌ జూనియర్‌ కళాశాల సెంటర్‌లో 38 మంది అభ్యర్ధులు మినహా మిగిలిన వారు పరీక్షను బహిష్కరించారు. మిర్యాలగూడకు చెందిన జెల్ల రామ్మోహన్‌ స్థానిక విద్యాగ్రామర్‌ పరిక్షా కేంద్రంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆత్మహాత్య యత్నం చేయడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర అసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. పరిక్షను సజావుగా నిర్వహించేందుకు శనివారం రాత్రి తెరాస, తెలంగాణ అనుకూల పార్టీలు, విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు మందస్తు అరెస్టులు చేశారు.

- Suryanews

Read more...

ఉద్రిక్తతల మధ్య గ్రూప్‌-1






Telangana issue, APPSC exams, Students, Bandh
This Photo take By: Surya, Eenadu,

Read more...

Telangana bandh begins, students target buses

Police remove protesting pro-Telangana students outside the examination center at Osmania University in Hyderabad on Sunday. The students were demanding the Govt to scrap the preliminary exam to Group 1 services of APPSC .

The Telangana bandh called by students of Osmania University against the conduct of APPSC exams today evoked partial response in the State capital and elsewhere, even as protesters targeted State-owned buses and pelted stones at them.

The day-long bandh, called by Osmania University students and supported by political parties like the Telangana Rashtriya Samithi, began at 9.30 AM.

As soon as the bandh began, protesters and students targeted State-run Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) buses in capital Hyderabad, Karimnagar and other cities in the sensitive Telangana region.

A bus was set on fire in Karimnagar and stones were also pelted at several buses at various places in the region.

The students gave the bandh call in protest against the Andhra Pradesh Public Service Commission exams scheduled for today and threatened to disrupt them. They are demanding a 42 quota for students from the Telangana region in the APPSC jobs.

But, the exams began at various centres across the state amid elaborate security arrangements.

The state police had thrown a three-tier security layer around the examination centres to prevent any disturbance by the protesters.

The police have imposed prohibitory orders against gathering of people in the vicinity of the examination centres in the Telangana region.

Meanwhile, students and political leaders from non-Telangana region have demanded that the examination be held as scheduled as it was already postponed twice.

TRS activists and other Telangana supporters held sit-in in front of bus stations in Warangal, Karimnagar, Nalgonda and other districts. However, the city buses were operating almost normally in Hyderabad.

Police have taken TRS activists and other Telangana supporters into preventive custody.

Senior TRS leader N Narasimha Reddy was taken into custody at his residence in Hyderabad. Talking to reporters, he condemned the police action.

Meanwhile, the four students from Osmania University, who began an indefinite hunger strike yesterday, continued their protest.

They have demanded that the State Ministers, ruling Congress and TDP MLAs from Telangana region put pressure on State government to cancel the examination or quit their posts if they fail to do so.

- Hindi

Keywords: Telangana issue, APPSC exams, Students, Bandh

Read more...

ఉద్రిక్తతల నడుమ గ్రూప్ 1 'పరీక్ష'

ఉద్రిక్తతల నడుమ గ్రూప్ 1 'పరీక్ష'

(సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్) తెలంగాణ ప్రాంతానికి 42 శాతం వాటా కేటాయించకుండా పరీక్ష నిర్వహించరాదన్న డిమాండ్‌తో టిఆర్ఎస్‌తో పాటు జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్‌లు ఆందోళనకు దిగాయి. పరీక్షను అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ నేత హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ,జేఏసీ పశ్చిమ కన్వీనర్ అశోక్‌కుమార్ తదితరులను ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు అరెస్టు చేశారు.

ఇటువంటి పరిస్థితులవల్లే ఈ పరీక్షలకు కేవలం 43.67 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ, కేరీ బాప్టిస్ట్, భారతీయ విద్యామందిర్, కరుణా హైస్కూలులో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాలలో 1550 మంది అభ్యర్థులకుగానూ 677 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరయిన వారిలో భారతీయ విద్యామందిర్ కేంద్రంలో అభ్యర్థి బిలోక్‌చంద్ ఓఎంఆర్ షీట్‌పై జై తెలంగాణా నినాదాలు రాసి బయటకు వచ్చారు.

సెయింట్ ఆంథోని కేంద్రంలో అభ్యర్థి, మెదక్ మండలం ఫరీద్‌పూర్‌కు చెందిన లంబాడీ శ్రీనివాస్ ప్రశ్నాపత్రాలను చించి బయటకు వచ్చారు. కరుణా హైస్కూల్ కేంద్రంలో అభ్యర్థులు బి.కిషన్, సతీష్‌లు తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వనందుకు నిరసనగా పరీక్ష రాయకుండానే వచ్చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ టి.విజయకుమార్, ఎస్పీ సుందర్‌కుమార్ దాస్‌ల ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించిన తర్వాతే పరీక్షా కేంద్రాల మార్గాల వైపు పోలీసులు అనుమతించారు.

పరీక్ష కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు, డాగ్‌స్క్వాడ్, అంబులెన్స్‌లను కూడా ఏర్పరిచారు. అయినా పరీక్షను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే టి.హరీష్‌రావు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి ఆటోలో వచ్చారు. కరుణా స్కూలు కేంద్రం సమీపంలో ఆటో దిగి, జై తెలంగాణ నినాదాలుచేస్తూ కేంద్రంలోకి పరుగులు తీస్తుండగా పోలీసులు అడ్డుకుని, ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందే తెల్లవారుజామునే టీఆర్ఎస్, జేఏసీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంద్రకరణ్, సంగారెడ్డి రూరల్, సంగారెడ్డి టౌన్, చిద్రుప్ప పోలీస్ శిక్షణా కేంద్రాలలో ఉంచారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
ఏపీపీఎస్‌సిీ పరీక్షను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఐబి నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా, కొత్త బస్టాండ్ వద్ద ర్యాలీ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు ధర్నా, రాస్తారోకో చేశారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో డీసీసీ ప్రదాన కార్యదర్శి బొంగుల రవి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శేక్ సాబేర్, ప్రదాన కార్యదర్శి రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు శివరాజ్, కసిని శ్రీకాంత్, కసిని విక్రాంత్‌రెడ్డి , పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్‌యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

43.67 శాతం మంది హాజరు
జిల్లాకేంద్రంలో కొనసాగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 పరీక్షకు 43.67 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. నాలుగు కేంద్రాలలో మొత్తం జిల్లాలో 1550 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 677 మంది పరీక్ష రాశారు. మరో 873 మంది గైర్హాజరయ్యారు. కరుణ హైస్కూల్‌లోని ఏ కేంద్రంలో 300కు 132 మంది హాజరు కాగా, బి సెంటర్‌లో 300 మందికి 149 మంది హాజరయ్యారు. అలాగే మరో సెంటరయిన సెయింట్ ఆంథోనీస్ స్కూల్ ఏ సెంటర్‌లో 300 మందికి 120, బి కేంద్రంలో 300 మందికి 120 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Read more...

గ్రూప్-1 హాజరు 35 శాతమే...

గ్రూప్-1 హాజరు 35 శాతమే...

హైదరాబాద్, సెప్టెంబరు 5 : పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాల్లోపే గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకయింది. ఆందోళనకారుల నిరసనలతో గందరగోళం మధ్య పరీక్ష ముగిసింది. ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించరాదనే కనీస సూత్రాన్ని ప్రభుత్వం పాటించలేదని ఉపాధ్యాయసంఘాలు మండిపడ్డాయి. జీవన్మరణ సమస్య అయిన పరీక్ష విషయంలో ప్రభుత్వం గందరగోళంగా వ్యవహరించడంతో నిరుద్యోగులు అష్టకష్టాలుపడ్డారు. బంద్‌కు పిలుపునివ్వడం... ఉద్రిక్త వాతావరణం ఉండటంతో పలువురు పరీక్ష కేంద్రానికి రావడానికి ఇష్టపడలేదు.

మరోవైపు పరీక్ష రాయడానికి వచ్చినవారు అర్ధంతరంగా వెనుదిరగాల్సిన పరిస్థితి. ఓయూ బీఎడ్‌కాలేజీలో 340 మంది అభ్యర్థులకు సెంటర్ కేటాయించగా, అందులో 141 మంది హాజరయ్యారు. ఆందోళనకారులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లి... పరీక్ష రాస్తున్నవారిని బయటికి తీసుకొచ్చి, జవాబు, ప్రశ్నాపత్రాలను తగులబెట్టారు. పరీక్షలు రాసిన వారు 35 శాతం కూడా దాటలేదు.

ఏపీపీఎస్సీ మొండివైఖరి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్-1 విషయం లో ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించకపోవడంతో మునుపెన్నడూలేనివిధంగా ఆందోళనల మధ్య పరీక్ష ముగిసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటికే రెండుసార్లు అర్థంతరంగా పరీక్షలు వాయిదా వేసిన ఏపీపీఎస్సీ, ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ మొండివైఖరి అనుసరించడంతో ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఉద్రిక్తతల నడుమ పరీక్ష ముగిసింది.

పలు ప్రాంతాల్లో విద్యార్థులు మధ్యలోనే నిష్క్రమించారు. చైతన్యపురిలోని శ్రీచైతన్యకాలేజీలో ఓ విద్యార్థిని తాను పరీక్ష రాయకుండా తోటి విద్యార్థికి చెందిన హాల్‌టికెట్‌ను కూడా చించేసింది. సరూర్‌నగర్ చెరకుతోట కాలనీలోని పరీక్షా కేంద్రంలో మరో అభ్యర్థి నలుగురు విద్యార్థులకు చెందిన హాల్‌టికెట్లు చించారు. హైదరాబాద్‌లో 128 కేంద్రాలను పరీక్షకు ఎంపిక చేశారు. 62 వేల మంది అభ్యర్థులకు గాను 19 వేల మంది దాకా పరీక్షలు రాశారు. మొత్తం గణాంకాలు పరిశీలిస్తే 35 శాతం కూడా దాటకపోగా, ఏపీపీఎస్సీ మాత్రం 45.5 శాతం మంది పరీక్షలు రాశారని ప్రకటించింది.

వారి భవిష్యత్తు మాటేమిటీ
ఓయూ బీఎడ్ కాలేజీతో పాటు చైతన్యపురి, సరూర్‌నగర్‌లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షను సరిగ్గా రాయలేకపోయినవారితో పాటు గందరగోళం మధ్య పరీక్షలు రాసిన జిల్లా అభ్యర్థుల భవిష్యత్తు డైలమాలో పడింది. నెలరోజుల ముందు 90 శాతం మార్కులు వస్తాయని గ్యారంటీ ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాములు అనే నిరుద్యోగి వాపోయారు. గతంలో ఇంటర్వ్యూదాకా వెళ్లి... ఉద్యోగాన్ని మిస్అయి పోయిన అతను... ప్రస్తుతం ప్రిలిమ్స్ దాటుతానా లేదా అనుమానం వ్యక్తం చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరీక్షను రద్దు చేయడమే దీనికి పరిష్కారమని పలువురు సూచిస్తున్నారు.

- Andrajyothi

Read more...

పరీక్షగా ముగిసింది తెలంగాణలో ఉద్రిక్తత


పరీక్షగా ముగిసింది
తెలంగాణలో ఉద్రిక్తత

రాష్ట్రవ్యాప్తంగా 50శాతం అభ్యర్ధులు హాజరు
తెలంగాణలో 35శాత మే
ఓయూ బీఈడీ కాలేజీ మినహా అన్ని చోట్లా నిర్వహణ ఉస్మానియాలో టెన్షన్ టెన్షన్
ఆందోళనకారుల రాళ్ల వర్షం
పోలీసుల బాష్పవాయు ప్రయోగం
పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల అరెస్టు
పరీక్ష కేంద్రం వైపు హరీశ్ పరుగులు..
అడ్డుకున్న పోలీసులు
రద్దు చేయాలన్న టీఆర్ఎస్ జేఏసీ
తగిన బద్ధి చెప్పారన్న సీమాంధ్ర నేతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 5 : పరీక్ష... అభ్యర్థులకు, పోలీసులకు, ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యమకారులకూ ఇది పరీక్ష! నినాదాలు, వివాదాలు, అరెస్టులు, రాళ్లు, బాష్పవాయు గోళాలు, అనేక గందరగోళాల మధ్య ఈ పరీక్ష ముగిసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ మూడోసారి మాత్రం యథాతథంగా జరిగింది. అదే సమయంలో పరీక్ష రద్దు చేయాలంటూ తెలంగాణ నేతల నుంచి కొత్త డిమాండ్ మొదలైంది. ఈ పరీక్ష తెలంగాణలో ఎంత రణగొణధ్వనుల మధ్య జరిగిందో... సీమాంధ్రలో అంత ప్రశాంతంగా జరిగింది.

తెలంగాణలోనూ చెదురుమదురు సంఘటనలు మినహా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ అరవిందరావు తెలుపగా... 'పరీక్ష మొదలైన పది నిమిషాలకే ప్రశ్నపత్రం బయటికి వచ్చింది. ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో తుస్సుమంది. దీనిని వాయిదా వేయాలి' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎద్దేవా చేశారు. బంద్ మధ్య, తుపాకులు పెట్టి మరీ పరీక్ష నిర్వహించినందున ఇది చరిత్రలో 'బ్లాక్ డే'గా నిలిచిపోతుందన్నారు. ఆందోళనకారులు 51 బస్సులను ధ్వంసం చేశారు.

పోలీసులు 1720 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో రెండు మాల్స్‌పైనా ఉద్యమకారులు రాళ్లు రువ్వారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణలో ఆందోళనల ఫలితంగా 35 శాతం మాత్రమే పరీక్ష హాలుకు వచ్చారు. సీమాంధ్రలో హాజరు శాతం 65గా నమోదైంది.

అత్యధికంగా విశాఖలో 68 శాతం అభ్యర్థులు పరీక్షలు రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థుల కోసం రాజధానిలో జరిగిన పరీక్షకు 45 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. వరంగల్‌లోని తేజస్వి హైస్కూల్ కేంద్రంలో 500 మంది అభ్యర్థులకు 11 మంది మాత్రమే వచ్చారు. మొత్తంమీద... ఉస్మానియా వర్సిటీలోని బీఈడీ కాలేజీ (ఐఏఎస్ఈ) పరీక్షా కేంద్రంలో మినహా, మిగిలిన అన్నిచోట్లా ఎగ్జామ్ యథాతథంగా జరిగింది. ఈ కేం ద్రంలోని అభ్యర్థులు ప్రశ్నపత్రాలను చించి వేయడం, ఆందోళనకారులు లోపలికి ప్రవేశించి గందరగోళం సృష్టించడంతో పరీక్ష జరపలేకపోయారు.
తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లో గట్టి పోలీసు భద్రత మధ్య పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మధు యాష్కీగౌడ్, జి.వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు విద్యార్థులతో కలిసి ముందుకు కదిలారు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

ఇతర జిల్లాల్లోనూ ఆందోళనకు దిగిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హల్‌చల్ సృష్టించారు. ఆటోలో వచ్చిన ఆయన ఉన్నట్టుండి కిందికి దిగి పరీక్ష కేంద్రం వైపు పరుగులు తీశారు. అతి కష్టం మీద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ, విద్యార్థి నేతలను పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు.

పరీక్ష ముగిసిన తర్వాత విడుదల చేశారు. కనీసం పది శాతం మంది కూడా సజావుగా పరీక్ష రాయలేకపోయారని, ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. మెజారిటీ అభ్యర్థులు పరీక్షకు దూరంగా ఉన్నందున దీనిని రద్దు చేయాలని, సమస్యను పరిష్కరించాకే నిర్వహించాలని, నాలుగు నెలలు వాయిదావేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పరీక్ష జరుపుకొంటామని తెలిపారు. అటు సీమాంధ్ర నేతలు మాత్రం సరిగ్గా భిన్నంగా స్పందించారు. అక్కడి నేతలు వద్దంటున్నా అభ్యర్థులు ధైర్యంగా పరీక్షలు రాశారని, ఇకనైనా తెలంగాణ నేతలకు జ్ఞానోదయం కలగాలని, మూర్ఖపు చేష్టలు మానుకోకపోతే అభ్యర్థుల ఉసురు తగులుగుతుందని హెచ్చరించారు.

- Andrajyothi

Read more...

ఆంధ్ర x తెలంగాణ నేతల అభిప్రాయాలు

ఆంధ్ర x తెలంగాణ నేతల అభిప్రాయాలు

ఆంధ్రా వాళ్లు గాజులు తొడుక్కుని లేరు: రాయపాటి (ఎంపీ-గుంటూరు) పరీక్షలు రాసేందుకు వెళ్లిన అభ్యర్థులపైనా, పరీక్ష కేంద్రాలపైనా దౌర్జాన్యాలకు దిగడం చాలా అన్యాయం, దుర్మార్గం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రత్యేక ఏపీపీఎస్సీ పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అంతేగానీ ఇలా పదేపదే దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు. ఆంధ్రావాళ్లేమీ గాజులు తొడుక్కొని లేరు. ప్రస్తుతానికి మేం సంయమనం వహిస్తున్నాం. ఏం చేయాలో అదే చేస్తాం.

తెలంగాణలోనూ పరీక్షలు రాశారు: వెంకట్రామిరెడ్డి (ఎంపీ-అనంతపురం)
నాయకులు వద్దంటున్నా విద్యార్థులు మాత్రం తెలంగాణ ప్రాంతంలో మొక్కవోని ధైర్యంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలను రాయడం అభినందనీయం.విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం నేతలపై తిరుగుబాటు చేయడమే.

తెలంగాణ నేతలకు జ్ఞానోదయం కలగాలి: లగడపాటి(ఎంపీ విజయవాడ)
ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరైన తెలంగాణ విద్యార్థులను చూసి ఇప్పటికైనా ఆ ప్రాంత నాయకులకు జ్ఞానోదయం కలగాలి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలోని అన్ని జిల్లాల్లో సగటున 45% మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని 10% మంది ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గ్రూప్-1 మీద ఎవరితోనైనా నేను చర్చలకు సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి రోశయ్య ఎంతో సమర్థంగా వ్యవహరించారు.

అభ్యర్థుల ఉసురు తగిలిపోతారు: జోగిరమేశ్, మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు
ఓయూలో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులను బయటకు తీసుకురావడానికి ఒక ఎంపీ ప్రయత్నించడం సిగ్గుచేటు. తెలంగాణ ఎంపీలు కేసీఆర్ చెప్పినట్లుగా ఆడుతున్నారు. ఆయనతో కలిసి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మూర్ఖత్వపు చేష్టలు మానుకోకపోతే అభ్యర్థుల ఉసురు తగిలిపోతారు.

రగడకు కారణం ఆ నలుగురే: గాదె వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
గ్రూప్-1 పరీక్షల రగడకు తెలంగాణ ఎంపీలు మధు యాష్కీ, వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథంలే కారకులు. గ్రూపు-1 పోస్టుల్లో ప్రాంతాల వారీగా రిజర్వేషన్లు లేవు. ప్రశాంతంగా జరుగుతున్న పరీక్షలపై రగడ సృష్టించి, విద్యార్థులను బలిపశువులను చేస్తున్నారు.

పరీక్ష జరిగిన తీరు బాధాకరం: కేకే(ఎంపీ-రాజ్యసభ)
ఏపీపీఎస్సీ పరీక్ష జరిగిన తీరు చాలా బాధాకరం. సీఎం రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. విద్యార్థులతో చర్చలు జరిపి, వారి అనుమానాలను నివృత్తి చేసి పరీక్షలు జరిపి ఉంటే ఇంకా బాగుండేది.

మాడి మసైపోతారు: పొన్నం ప్రభాకర్(ఎంపీ-కరీంనగర్)
తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేస్తే సీమాంధ్ర నేతలు మాడిమసైపోతారు. విపరీత ధోరణి మానుకోవాలి. మరో 4 నెలల పాటు గ్రూప్-1 పరీక్షను వాయిదా వేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పరీక్షను జరుపుకొంటాం.

అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరు: మధుయాష్కీ(ఎంపీ-నిజామాబాద్)
అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరని మరోసారి రుజువైంది. తెలంగాణ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా యూనివర్సిటీకి వెళ్లిన తెలంగాణ ప్రాంత ఎంపీలను ప్రభుత్వం అరెస్టు చేసింది. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా ఉధృతంగా నిర్వహిస్తాం.

సమస్యలు పరిష్కరించాక పరీక్షలు జరపాల్సింది: దేవేందర్‌గౌడ్, టీడీపీ
సమస్యను శాంతియుతంగా పరిష్కరిద్దామన్న ఉద్దేశమే ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి వ్యవహార శైలి కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. సమస్యలను పరిష్కరించాక పరీక్ష నిర్వహించి ఉంటే బాగుండేది.

తెలంగాణ సర్వీస్ కమిషన్ కావాలి: ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ
పంతాలు, పట్టింపులతో ఏపీపీఎస్సీ ప్రాంతీయ వివక్ష పెంచుతోందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం దానికి తగదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ శనివారం అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని, తెలంగాణకు ప్రత్యేకంగా సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహించి ఫలితాలు వెల్లడి అయినా నియామకాలు లేవని, కానిస్టేబుల్ ఫలితాలు కూడా ఇంతవరకు వెల్లడి కాలేదన్నారు.


This News Take By: Andrajyothi

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP