Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, March 26, 2011

వి‘లీనం’... అయ్యేనా ?

న్యూఢిల్లీ, : తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కావడంవల్ల కాంగ్రెస్‌కు వచ్చే లాభనష్టాలేమిటి? లాభం ఉంటే... ఆ లాభం ఏ మేరకు ఉంటుంది? విలీనం వల్ల కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందా? కేసీఆర్‌ బయటినుంచి మద్దతు ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అదే విలీనమై అసందర్భ వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్‌కు ఇబ్బందే కదా? అవి... ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది కదా?... ఇవన్నీ రాష్ర్ట కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌కు కలిగిన సందేహాలు. ఇవే సందేహాలకు ఆయన శుక్రవారం తనను కలిసిన తెలంగాణ ఎంపీల ముందు ప్రస్తావించారు.

టీఆర్‌ఎస్‌ విలీనంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలి సింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆజాద్‌ తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. అనంతరం 11.30 ప్రాంతంలో సీమాంధ్ర ఎంపీలతో విడిగా సమావేశమైనారు. ఇరు ప్రాంతాల ఎంపీలతో ఆయన టీఆర్‌ఎస్‌ విలీనం, కడప మాజీ ఎంపీ జగన్‌పైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో జగన్‌ ప్రభావం ఏ మేరకు ఉందని ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. జగన్‌ కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన బెంబేలు పడాల్సిన పనిలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆయన ఎన్నాళ్లు పార్టీని నడుపుతారో చూద్దాం. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూడకండి అని ఎంపీలకు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ అభ్యర్థులు మూడు స్థానాలను గెలవడం వెనక కాంగ్రెస్‌ నేత హస్తం ఉన్నదన్న అనుమానాలను వ్యక్తం చేశారని తెలిసింది. అంతకు ముందు నిర్మాణ్‌ భవన్‌లోని తన కార్యా లయంలో తెలంగాణ ఎంపీలతో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఆ తరువాత సీమాంధ్ర ఎంపీలతో గంటసేపు సమావేశమయ్యరు. భేటీ అనంతరం తెలంగాణ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులను ఆజాద్‌కు వివరించి లేఖను అందజేశామని తెలియజేశారు.

తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాం..: టి-ఎంపీలు
రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోక ముందే అధిష్ఠానం చొరవ తీసుకుని తెలంగాణ ప్రక్రియప్రారంభించాలని కోరినట్లు ఎంపీలు వెల్లడించారు. ఎం పీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మందజగన్నాథం, పొన్నం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడుతూ ఎన్ని అవాంతరా లు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే నని, తెలంగాణ ఏర్పాటు లేదా పదవీ త్యాగం మినహా మరో తమకు మార్గం లేదని స్పష్టం చేశామని ఎంపీలు వెల్లడించారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజలలో బలంగా ఉందని, ఉద్యమాన్ని నిలువరించ డం. కొనసాగించడం తమ చేతుల్లో లేదని, ఉద్యమాన్ని ప్రజలే స్వచ్ఛందంగా నిర్విహ స్తున్నారని తేల్చిచెప్పినట్లు ఎంపీ జగన్నాథం పేర్కొన్నారు.

ఈ వెనుకబాటు తనాన్ని భరించే శక్తి తమ కు లేదని, సీమాంధ్రులతో కలిసి ఉండే ప్రసక్తే లేద న్నారు. ఇప్పటికే సుమారు 6 వందల మంది విద్యా ర్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలు బలిదానం చేశా రని ఆవేదన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మరే మడతపేచీ లేకుండా బేషరుతుగా డిసెంబర్‌ 9, 2009 చేసిన ప్రకటనకు కట్టుబడి వుండా లని గులాంనబీని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్య మం కారణంగా సొంత నియో జకవ ర్గాలలో పర్యటిం చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ విశ్వసనీయత కు మారుపేరని, ప్రజలు కాంగ్రెస్‌ ప్రభు త్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ప్రజలకు విశ్వా సం కల్గించే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

ఎంపీ సర్వే సత్యనారాణయణ మాట్లాడుతూ సోనియా గాంధీ డిసెంబర్‌ 9 తన జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బహుమతిగా తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసారని, 2011 డిసెంబర్‌ 9 లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సీమాంధ్రులకు అమ్ముడు పోయి ఏక పక్షంగా నివేదిక సమర్పించారని, ఆ నివేదిక సూచనలను పరిగణలోకి తీసుకోవద్దని ఆజాద్‌ను కోరి నట్లు వెల్లడించారు. తెలంగాణ పై స్పష్టమైన వైఖరిని వెల్లడించని కారణంగా కాంగ్రెస్‌ పార్టీ మండలి ఎన్నికలలో తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేసినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సురేష్‌ షేట్కార్‌, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మంద జగన్నాథం, అంజన్‌కుమార్‌ యాదవ్‌, బలరాం నాయక్‌, రాజయ్య, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ గౌడ్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి గురించే చర్చించాం...
తెలంగాణ అంశం చర్చకు రాలేదు: సీమాంధ్ర ఎంపీలు
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితర అంశా లపై ఆజాద్‌తో చర్చించామని సీమాంధ్ర ఎంపీలు పేర్కొన్నా రు. గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన కు అభినందనలు చెప్పామని మూకుమ్మడిగా మీడియా తో అన్నారు. కేవలం రాష్ట్రంలో సంక్షేమ పథకాలపై చర్చించామని, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంలో జోక్యం చేసుకుని మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని కోరిన ట్లు ఎంపీలు వెల్లడించారు.

మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఎంపీలు
మీడియాతో మాట్లాడేందుకు ఏమీ లేదని, ఏదైనా సమాచారం మా సీనియర్‌నాయకుడు నేదురుమల్లి జనార్ధ న్‌ రెడ్డి అందిస్తారంటూ సీమాంధ్ర ఎంపీలం దరూ అక్కడ నుంచి జారుకున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పురేందేశ్వరి, సాయిప్రతాప్‌, పల్లం రాజులు మీడియాకు దూరంగా వెళ్లిపోయారు. ఎంపీ హర్షకుమార్‌ నేనేమి మాట్లాడానో మీకు తెలుసు, ఇంకా మీతో చెప్పేందుకేమీ లేదంటూ దాటవేశారు. సీమాంధ్ర ఎంపీలలో కావూరి సాంబ శివరావు, కిషోర్‌ చంద్రదేవ్‌, ఎప్‌పివై రెడ్డి, చింతా మోహన్‌, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, సబ్బం హరి హాజరు కాలేదు.

ponnallaరాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోక ముందే అధిష్ఠానం చొరవ తీసుకుని తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలి. తెలంగాణ తప్ప మరి దేనికీ మేం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లింది. దాన్ని ఆపడం, లేదా కొనసాగించడం మా చేతుల్లో లేదు
- పొన్నం ప్రభాకర్‌

Read more...

శ్రీ కృష్ణ కమిటీ ఒక నికృష్ట కమిటీ




జస్టిస్ శ్రీకృష్ణా! ఏందీ ఇట్లా జేసినవ్ ఇంత బతుకు బతికి ఇంటెనక పడి చచ్చినట్లు ఇదేంది ఇంత అడ్డగోలు రిపోర్ట్ ఇచ్చినావ్ మా ఆంధ్రోల్లు మంచిగ అరుసుకున్నట్ల గొడ్తుంది మాకు తెలుసు మా ఆంధ్ర లీడర్లు ఇసొంటి దాంట్ల మంచి మొనగాండ్లు ఆల్ ఇండియా లెవల్ల పోటి పెడితే నంబర్ వొన్ పొజిషన్ల ఉంటరు వీళ్ళు గీ పనిల ఎంత మాహెర్లంటే యమ ధర్మరాజసొంటోన్ని కూడా ఎర్రి బాగులోన్ని చేసి నిండా ముంచుతరు అయినా మా కు తెల్వక అడుగుతున్నం గీ ఇంత మాత్రం దానికి ఒక ఏడాదిపాటు రాష్ట్రమంత ఊర్ల పొంటి బా లసంతపోల్లలెక్క ఏషాలేస్కోని గంట కొట్టుకుంట తెగ తిరిగితిరి బైన్లోల్లలెక్క ఎల్లమ్మ కథలు చెప్తిరి రాష్త్రంల అందర్నీ సంతోష పెడత మని ఉత్తర కుమార కోతలు కోస్తిరి అందర్నీ అంటే ఆంధ్రోల్లనని ఇప్పుడర్థమైందనుకో అదేదో పండుగ సంబరమైనట్లు పెద్ద పెద్దోల్లకు విందులిస్తిరి మీడియా వాళ్ళకు మంచి మంచి ‘తోఫా’ లిస్తిరి ప్రజల సొమ్ము 20 (40 ?) కోట్లు ఖర్చు పెడ్తిరి పైకి చెప్పేది అంత, అసలు ఎంత ఖర్చుపెట్టిండ్రో మీ వాళ్ళకు ఎక్కడెక్కడ ఎంతెంత ముట్టిందో ముందు ముందు అంతా తెలుస్తదనుకో౦డ్రి. అయిన అంతా ఆంధ్ర లీడర్లు, గవర్నర్,సి ఎస్, డిజిపి చెప్పినట్లు రాయడానికి ఇంత పగటేశాలె౦దుకు ఇంకొక సంగతి మాకు సరిగ్గ అర్థమైతలేదు నీవు నీ కమిటీ మెంబర్లు ఎంతో సుద్ద పూసలని ఎక్కడెక్కడెనో ఎతికి ఎతికి పట్టుకొచ్చిండ్రు గదా మల్ల ఇప్పుడు ఇట్ల ఇంత మోసం ఎందుకు జేసిండ్రు.
మీ సెక్రెటరి దుగ్గల్, అంత మందు విందులకు, ఇంకా దేనికో అగలేనోన్ని మెంబర్ సెక్రటరీ గ ఎందుకు ఉరుకులాడి ఏసుకోవాల్సి వచ్చింది కృష్ణ, గోదావరి నదులెక్కడున్నవో తెలువని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఎందుకు వచ్చిండు ఊపుకుంట మద్రాస్ కంటే ముందే హైదరాబాద్ లో పవర్ స్టేషన్ ఉందని తెలువని, ఒక ఏడాది తిరిగినా రాష్ట్రం లో ఏ పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోలేక తప్పుల తడకలు రాసిన పవర్ ఎక్స్పర్ట్, రాష్ట్రం లో ముస్లింలు వేరే రాష్ట్రం కోరడం లేదని, అందరు రాష్ట్రం కాదు అభివృద్ధి కోరుకుంటున్న రని అడ్డగోలు అబద్ధాలు రాసిన సామా జిక వేత్తలు, ప్రభుత్వపు తారు మారు తప్పుడు లెక్కలే రైటని ప్రజలిచ్చిన నిజమైన లెక్కల్ని తుంగలో తొక్కి ఫాల్తూ రిపోర్ట్ లిచ్చిన ఎకనామిస్ట్ లను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?
మీ పవర్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ లో ఒక్కటైనా నిజముందని నిరూపిస్తే పది లక్షలు ఇస్తమని ఛాలె౦జ్ చేసినా మీ మెంబర్ల కు ఎవరెవరికి, ఎక్కడెక్కడ, ఎంతెంత ముడుపులు ముట్టినయో, తెర వెనుక ఏ౦ భాగోత౦ జరిగిందో బయట పెడతామని కొందరు చెప్పినా దొంగకు తేలు కుట్టినట్లు కిక్కురుమనకుండా ఉన్నారు ఎందు కు? అవన్నీ నిజమైతేనే గదా? నిప్పు లేనిదే పొగ రాదు అనేది నివొద్దె గదా ?
అయ్యా శ్రీకృష్ణ! నీవు సుప్రీం కోర్ట్ జడ్జివి గదా అని ఎంతోమర్యాదగున్న౦,కాని చూసే కొద్ది చూసే కొద్ది ఇదేంది నీ పనులు ఇంత అధ్వాన్నంగ ఉన్నయి జనం సూడడానికేమో రాష్ట్రమంత పది నెలలు తిరిగి పది గాడిదలు మోసే టంత సమాచారం తెప్పించుకొని అంత బుట్ట దాఖలు చేసి, ఆ పేపర్లు అమ్మితే సుమారైన పైసలొచ్చిఉండొచ్చుఎవరు తిన్నారో ఏమోగాని,మల్ల రిపోర్ట్ రాసే పని లగడపాటి,రాయపాటి,కావూరి,సుబ్బిరామి ల కిరాయి రాతగా౦డ్లకు అవుట్ సోర్సింగ్ చేసినట్టున్నావు అవునుమల్ల, మంచిగ మందు,విందు అన్నీ అరుసుకున్నంక రెట్టకు దెబ్బ తగలకుండ రాసిపెట్టేతోడుంటే ఇంకేం గావాలె
ఆ కిరాయిరాత గాళ్ళు ఆరు అడ్డగోలుసిఫారస్లు చేసిండ్రు దాంట్లో మీరు నాలుగు కొట్టేసినట్టు నాటకం చేసి అయిదోది ఏదో ఇచ్చినట్లు ఇచ్చి ఎన్నోరైడర్లు పెట్టి కుటిల కువాడపు రాజకీయం చేసిండ్రు ఇక ఆరోది పుచ్చిపోయిన పాత చింతకాయ తొక్కు. ఆయనుంటే మంగలోని తో పనేముంది అన్నట్లు
ఇంతకు ముందు ఒప్పుకున్న రక్షణలు ఆంధ్రులు సక్కగ ఏడ్సిఉంటె ఇన్నేండ్ల సంది ఈ గొడవ, లొల్లి ఎందుకుంటది ఎనకటికి నీ అసంటోడే కొ౦డను తొవ్వి ఎలుకను పట్టిండ౦ట వాడేమో తెల్వక తొవ్విండు, మీరేమో ఈ దోపిడీ దొంగల ‘హరామి’ తిని నీతిని, నిజాయితిని ‘ఖులే ఆ౦’ ఖూని చేసి నాటకమాడిండ్రు.
ఇ౦క మీ రిపోర్ట్ ఎనిమిదవ అధ్యాయ మైతే దేశ ప్రజాస్వామ్యానికే పెద్ద షాకు నిచ్చింది ఇదేమి సీక్రెట్ రిపోర్ట్ ?నీలాంటి సుప్రీం కోర్ట్ జడ్జి కమిటీ ఇవ్వవలసిన రిపోర్టా ఇది? నీవెక్కడున్నావు? భారతదేశం లోనా లేక ఎక్కడైనా ‘బనానా రిపబ్లిక్’ లోనా? హైకోర్ట్ జడ్జి గారు కేసు మొదట్లో చేసిన కామెంట్స్ చూసి పరేషాన్ అయినం కాని ఇప్పుడు చూస్తే అయన అన్నది చాల తక్కువ అనిపిస్తున్నది నాలుగున్నర కోట్ల అభాగ్య తెలంగాణ ప్రజలు యాబై నాలుగేండ్ల సంది ఆంధ్ర రాజకీయ నాయకుల చేతుల్లో అరిగోసలు పడి ఒక వెయ్యి మంది ప్రాణ త్యాగం చేసి ఒక పక్క గోడాడుతుంటే నీవు ఆంధ్రోల్లతో కుమ్మక్కై ఈ ఉద్యమం ఎట్లా అణచాలే, రాజకీయంగా ఎవరి గాలి ఎ ట్ల తియ్యాలే న్యూస్ పేపర్లు ఎట్లా మేనేజ్ చెయ్యాలే, స్టూడెన్ట్లని ఎట్లా కొట్టి హిమ్సించాలే ఏం లాఠీలు,తూటాలు వాడాలె , నక్సలైట్లు ,టెర్రరిస్టులు ఎట్ల ఉరికి వస్తరు తెలంగాణ నిండా అని చెప్పిప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చినావు బుధ్ధిఉన్న ఎవడైనా నీ రిపోర్ట్ చూసి తల దిన్చుకోక తప్పదు ఇంత మోసంతో దుర్మార్గంతో అవినీతి తో కూడుకొన్న కమిటీ రిపోర్ట్, స్వతంత్ర భారతం లో రాలేదంటే అబద్ధం కాదు సుప్రీం కోర్ట్ జడ్జి ఇజ్జత్ మూడు కాసులకు తీసేసినవు ఇది ఆంధ్ర రాజకీయ నాయకుల గలీజు రాజకీయ సంస్కృతికి
మీ అవినీతి, ఆత్మవంచనకు అక్షరాల అద్దం పడుతుంది మీరు ఆ ‘థగ్గులు పిండారీ’లతో చేతులు కలిపి చరిత్ర హీనుల య్యిండ్రు
మిస్టర్ శ్రీకృష్ణ! తెలంగాణా ప్రజలు నీ కమిటీ మెంబర్లను నమ్మక పోయి నా నీ బొంబాయి అల్లర్ల రిపోర్ట్ చూసి నీ నిజాయితి మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నీకు సహకరించిండ్రు సమాచార మి చ్చిండ్రు వారి ఆవేదన వెల్ల బోసు కున్నరు కానీ మీరు ఆంధ్ర సామ్రాజ్యవాద దుర్మార్గులకు, అవినీతి పరులకు అమ్ముడుపోయి వారికి వెన్ను పోటు పొడిచావు నీ ఖ్యాతికి నీవే గోరి కట్టుకున్నావు. చరిత్ర నిన్ను క్షమించ దు తెలంగాణా ప్రాంత చరిత్రలో నీవు మరిచి పోలేని చరిత్ర హీనుడిగా మిగిలి పోతావు నీ రిపోర్ట్ తో భారత దేశం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా స్వామ్యాన్ని ఎంత మంచిగ ముందుకు తీసుక పోతున్న వో చాలా బాగ అర్థమైతుంది బయటి ప్రపంచానికి. ఇ౦కపోతే ప్రజల యొక్క ,ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు, తెలంగాణ ప్రజలను ఈ రావణ కాష్ష్టంలోకి బలవంతంగా దొబ్బిన కాంగ్రెస్స్ పార్టీ నీవు నీ కమిటీ సభ్యులు కలిసి ఆడిన ఈ దుర్మార్గపు నాటకాన్ని తెలంగాణా చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటది. ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఈ ద్రో హానికి త్వరలోనే మూల్యం చేల్లిస్తయి . మీరు కూడా మీ జీవిత కాలంలోనే ఈ మీ నికృష్ట రిపోర్ట్ కు సరైన ఫలితం అనుభవిస్తరు నీ ఈ పనికి మాలిన రిపోర్ట్ తో మా ఉద్యమం అగుతందనుకోకు
అందరి నీచ నికృష్ట రాజకీయాలు, ఇప్పుడు బాగా అర్థమయినయి మా జనం గుండెల్లో మంటలు సునామీలయి తున్నాయి
మీ రిపోర్ట్ సంవత్సర కాలంలో, మల్ల మీ ఈ రిపోర్ట్ వల్ల తెలంగాణా ప్రజలకు పూర్తిగా తెలిసి పోయింది ఎవరు తమ వాళ్ళో ఎవరు పరాయి మనుషులో వాళ్ళ శత్రు మూక లు ఎక్కడెక్కడ పొంచి ఉన్నాయో, ఇక నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల జగన్నాథ రథ చక్రాల కింద ఆ మూకల నలిపేయడమే మా తరువాతి కార్య క్రమం.
Thanks Aditya for sharing

Read more...

SKC is a gang of thieves

Cutting across party lines, leaders from Telangana Thursday demanded prosecution of members of the Srikrishna committee for allegedly hurting the sentiments of people of the region in its report on a separate Telangana state.

Reacting sharply to the ‘secret’ eighth chapter of the report, Telangana Joint Action Committee (TJAC) said it would take legal action against the five-member panel formed by the central government and headed by former Supreme Court judge B.N. Srikrishna.

Leaders of the ruling Congress, opposition Telugu Desam Party (TDP) and Telangana Rashtra Samiti (TRS) called for prosecution of the panel members for allegedly making suggestions to New Delhi to suppress the agitation for a separate state.

A day after the Andhra Pradesh High Court directed the central government to make public the eighth chapter of the report, the Telangana leaders said the panel had lost whatever credibility it had by suggesting that the centre should ‘manage’ the media and ‘counsel’ Congress party’s public representatives supporting the demand for Telangana.

‘The members of the committee should be prosecuted for hurting the sentiments of Telangana people through their false report,’ senior TDP leader N. Janardhan Reddy told reporters.

He said legal proceedings would be launched against the officials who fed false information to the committee.
The former minister alleged that the committee members had sold out to leaders of Andhra and Rayalaseema regions opposing the demand for Telangana.

Congress legislator Yadav Reddy termed the panel as a ‘gang of thieves’.

‘Those suggesting ways to suppress the Telangana movement by managing the media and counselling us are nothing but a gang of thieves,’ he said.

Read more...

Telangana MPs set deadline to quit if demands are not met

Separate meetings of Congress general secretary Ghulam Nabi Azad with Congress members of Parliament from Telangana and Andhra-Rayala Seema regions of Andhra Pradesh in New Delhi yesterday has only accentuated the already clear division between the two groups.

While the purpose of the meeting was not clear, both groups further stressed their known positions in support and opposition to Telangana state.

This was the first meeting with MPs from Andhra Pradesh by Azad after he took charge from Veerappa Moily as the party general secretary in-charge of the state affairs.

What should set the alarm bells ringing in Congress is that during their meeting with Azad, the Telangana members of Parliament have set a deadline of June 1 to announce the Telangana state failing which they will resign both from the Parliament and any position in the party.

They told Azad that they will continue only as ordinary members of the Congress party.

The MPs, both from Lok Sabha and the Rajya Sabha — handed over two letters to Azad detailing the present political situation in the state and the problems they were facing in their own constituencies because of the lack of clarity in Congress stand.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP