డీఎస్ ఓటమి కోసం మైసమ్మకు బలిదానంమొక్కు తీర్చుకున్న తెలంగాణ విద్యార్థి
ఉద్యమంలో రాలిన మరో ప్రాణంబీటెక్ గ్రాడ్యుయేట్ ఇషాన్ ఆత్మార్పణంతెలంగాణ ద్రోహులుగా 9 మంది పేర్లతో లేఖఉస్మానియా వర్సిటీలో ఉద్వేగం, ఉద్రిక్తతభారీగా తరలివచ్చిన నేతలు 12 మంది కొత్త ఎమ్మెల్యేలుకంటతడి పెట్టిన కేసీఆర్, విద్యాసాగర్‌రావుహైదరాబాద్‌లో భారీ ర్యాలీగన్‌పార్క్‌కు అంతిమ యాత్రమిన్నంటిన అమర్ రహే నినాదాలులేఖపై విచారణకు ఎర్రబెల్లి డిమాండ్కాకతీయ జేఏసీ ఆగ్రహం నివాసం దిగ్భంధం
హైదరాబాద్: ఒక విజయం... ఆ మరుసటి రోజే పెను విషాదం! తెలంగాణ ఉద్యమంలో మరో విద్యార్థి ప్రాణం రాలిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో వేణుగోపాల్ రెడ్డి తరహాలో మరో మృతదేహం కనిపించింది.
ఈసారి... బలిదానం చేసింది పి.ఇషాన్ రెడ్డి అనే బీటెక్ గ్రాడ్యుయేట్. 'డీఎస్ ఓడితే ప్రాణాలు బలి ఇస్తానని మైసమ్మ తల్లికి మొక్కుకున్నా! ఇలా చేస్తున్నందుకు గర్విస్తున్నా' అంటూ ఆ యువకుడి మృతదేహం పక్కనే ఒక సూసైడ్ నోట్! తెలగాణ ద్రోహులంటూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన 9 మంది నేతల పేర్లు! ఇది సంచలనం సృష్టించింది.
తెలంగాణ వాదులను కలచి వేసింది. శుక్రవారం ఉస్మానియా క్యాంపస్ మరోసారి ఉద్రిక్తతకు నిలయంగా మారింది. కేసీఆర్‌తో సహా పలువురు నేతలు, ఉద్యమకారులు, ఉప ఎన్నికల్లో గెలిచిన 12 మంది కొత్త ఎమ్మెల్యేలు క్యాంపస్‌కు వచ్చారు.
ఇషాన్ మృతదేహాన్ని చూసి కేసీఆర్, విద్యాసాగర్ రావు కంటతడి పెట్టారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ బోరున విలపించారు. అంతిమ యాత్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వరకు జరపాలని ఇషాన్ తన లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు మాత్రం ఇందుకు ససేమిరా అన్నారు.
చివరికి... మానవ హక్కుల కమిషన్ అనుమతితో తెలంగాణ వాదులు ఇషాన్ చివరి కోరిక తీర్చారు. కమిషన్ ఆదేశాల ప్రకారం అంతిమయాత్రలో పాల్గొనేవారు వాహనాల్లోనే వెళ్లాలని పోలీసులు పట్టుబట్టినా ఉద్యమకారులు పట్టించుకోలేదు. పోలీసులను పక్కకు నెట్టేసి 'జై తెలంగాణ' అని నినదిస్తూ ముందుకు సాగారు.
ఉస్మానియా వర్సిటీ ప్రధాన ద్వారం తర్వాత చౌరస్తాలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎత్తి పక్కకు విసిరేశారు. మూడు గంటలకుపైగా సాగిన యాత్రలో అడుగడుగునా 'అమర్ రహే' నినాదాలు మిన్నంటాయి. గన్‌పార్క్ వద్ద ఇషాన్ మృతదేహాన్ని ఉంచి నేతలు నివాళులర్పించారు. ఆ తర్వాత ఆయన మృత దేహాన్ని మెదక్ జిల్లా బసంత్‌పూర్‌కు తరలించారు.
రాసినట్లుగా చెబుతున్న లేఖపై విచారణ జరపాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ పోరులో తాము వెనుకబడలేదని, అయినప్పటికీ తమను ద్రోహులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిపై కాకతీయ యూనివర్సిటీ విదార్థి జేఏసీ మండిపడింది.
శనివారం సాయంత్రం సుమారు 200 మంది విద్యార్థులు హన్మకొండలోని ఎర్రబెల్లి ఇంటిని రెండు గంటలపాటు దిగ్బంధించారు. ఇషాన్ మృతిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇషాన్ ఆత్మాహుతి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ విజయోత్సవాలను రద్దు చేసుకున్నారు.
take by: Andhrajyothy
Read more...