- చంద్రబాబు చక్కర్.. నందమూరి ఫ్యామిలీ డ్రామా
- నట, రాజకీయ వారసత్వంపై రచ్చకెక్కుతున్న ఆధిపత్య పోరు
- ఓవైపు ‘అధినాయకుడు’ మరోవైపు ‘నందీశ్వరుడు’
- ఒంటరవుతున్న జూనియర్
- పేరు మార్చుకున్న తారకరత్న
- ఇకపై ఇండవూస్టీలో మరో ఎన్టీఆర్
- బాబుకు దూరమైన జూనియర్
- స్టూడియోఎన్ నుంచి లోకేష్ ఔట్!
- బాలకృష్ణ మద్దతూ బాబుకే
- చక్రం తిప్పుతున్న చంద్రబాబు?
నందమూరి-నారా కంబైన్స్
సమర్పించు..! ప్రముఖ రాజకీయ చాణక్యుడి మార్గ‘దర్శకత్వం’లో! సినిమాలో రాజకీయం..
రాజకీయంలో సినిమా కలగలిసిన సరికొత్త స్క్రీన్‌ప్లే!
రాజకీయ, నట వారసుపూవరు? ఇదీ స్టోరీ లైన్! సినిమా పేరు
‘ఆధిపత్య పోరు’! నటీనటులు పాతవారే. కాకపోతే కొత్త పాత్రల్లో! మొన్నటిదాకా అక్కరకొచ్చిన పాత్ర.. ఇప్పుడు భారంగా తయారైంది! ఆ క్యారెక్టర్ పక్కకు పోయి.. అదే పేరుతో మరో క్యారెక్టర్ ముందుకు వచ్చింది. మరికొన్ని క్యారెక్టర్ల తీరూ మారిపోయింది. కొంతకాలంగా షూటింగ్ జోరుగా
సాగుతోంది! ప్రస్తుతం క్లయిమాక్స్ పనులు పూర్తి చేసుకుంటూ.. వీలైనంత త్వరలో
రచ్చకెక్కనుంది.
తలవని తలంపుగా బాలకృష్ణ పర్యటనలకు వెళ్లి తొడలు కొట్టడంలోని ఆంతర్యమేంటి? తారక రత్న తన పేరును ఎన్టీఆర్ అని మార్చుకోవడం వెనుక కిటుకేంటి? తన మామ చానల్‌లో ఆధిపత్యం వహిస్తున్న నారా లోకేష్‌ను జూనియర్ ఎన్టీఆర్ తప్పించడం వెనుక మతలబులేంటి? మొన్నటి ఎన్నికల ముందు అక్కున చేర్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ను నందమూరి వంశం దూరంగా ఉంచడంలో రాజకీయం ఏమిటి? కొత్త రాజకీయ చిత్రంలో నారా చంద్రబాబు పాత్రేంటి? ‘అధినాయకుడు’, ‘నందీశ్వరుడు’తో చంద్రబాబు ఆడిస్తున్న చదరంగంలో జూనియర్ ‘దమ్ము’ నిరూపించుకుంటాడా? అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆధిపత్య పోరు’!
(-హైదరాబాద్) మొన్నటిదాకా తమదంతా ఒకే కుటుంబం అని చెప్పుకున్న నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు విభేదాలు బట్టబయలవుతున్నాయి. చాలా కాలందూరం పెట్టి.. మళ్లీ దగ్గరకు తీసుకున్న హరికృష్ణ రెండో భార్య తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ దూరం పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే నట సమ్రాట్ నందమూరి తారక రామారావుకు నట వారసుడిని తానేనని రుజువు చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు.
బాలకృష్ణ తర్వాత సినిమా రంగంలో మూడోతరం ఎవరూ క్లిక్ కాకపోవడం కూడా జూనియర్‌కు కలిసొచ్చింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సలహా మేరకు రాజకీయ బాధ్యత భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు. తన పదునైన ఉపన్యాసాలతో భారీగానే జనం దృష్టిని ఆకర్షించాడు. దీంతో చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టగల చరిష్మా ఉన్నవాడిగా జూనియర్ నిలుస్తాడన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇదే అంశం నందమూరి వంశంలో ఇతర యువతారలకు గిట్టడం లేదని తెలుస్తోంది. ఫలితంగానే జూనియర్‌ను పక్కనపె తతంగం నడుస్తోందని సినీ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి!
కలిసొచ్చిన తాత పోలికలు
జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ చిత్రంతో బాలనటుడిగా రంగవూపవేశం చేశారు. అచ్చుగుద్దినట్లు తాత పోలికలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను చూసుకొని ప్రేక్షకులు ఆదరించారు. సినిమా సినిమాకీ ఎదుగుతూ, అతి తక్కువ కాలంలోనే సినీ పరిక్షిశమలో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. నందమూరి అభిమానులు చేత యంగ్‌టైగర్‌గా పిలుపించుకుంటూ తిరుగులేని హీరోగా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే మొదట్లో జూనియర్‌ను నందమూరి కుటుంబం పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. కానీ.. హీరోగా మంచి గుర్తింపు రావడంతో అనివార్యంగా అతడిని కుటుంబంలో కలుపుకోవాల్సి వచ్చిందని పరిశీలకులు చెబుతుంటారు.
తర్వాతి కాలంలో జూనియర్.. నందమూరి కుటుంబంలో ప్రముఖ స్థానాన్నే పొందాడు. ఇదంతా ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కృషిగానే పేర్కొంటుంటారు. ఏడాది పాటు శ్రమించిన చంద్రబాబు.. జూనియర్‌ను నందమూరి ఫ్యామిలీలో ఒకడిని చేయగలిగారని అంటారు. ఇందులో ఆయన రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నవాదన లేకపోలేదు. దానిని నిరూపించే ఘటనలు అనంతరకాలంలో జరిగాయి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి కుటుంబంతో సంబంధాలు సరిగ్గా లేవు. హరికృష్ణ మొదటి భార్య తనయుడు కళ్యాణ్‌రామ్‌తో జూనియర్‌కు సత్సంబంధాలు లేవని చెబుతుంటారు. కుటుంబాల మధ్య రాకపోకలు కూడా వుండేవి కావు. జూనియర్‌కు, బాలకృష్ణకు మధ్య కూడా అంత బలమైన సాన్నిహిత్యం ఉన్నట్లు దాఖలాలు లేవు. బాలకృష్ణ కూతురికి, చంద్రబాబు కొడుకుకి నిశ్చితార్థం జరిగిన రోజు మధ్యలోనే జూనియర్ బయటికి వచ్చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలకు దారి తీసింది.
ఇటువంటి పరిస్థితుల్లో 2009 ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటే ప్రయోజనం ఉంటుందని భావించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేకసార్లు మాట్లాడటం ద్వారా అందర్నీ ఒక్క దగ్గరకు చేర్చారు. ఇక తాత స్థాపించిన టీడీపీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కార్యక్షికమాల్లో పాల్గొని మామయ్య చంద్రబాబు నాయుడు మెప్పు కూడా పొందాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయించడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. మొత్తంగా జూనియర్ కూడా నందమూరి ఫ్యామిలీలో ఇమిడిపోయారని ఆయన అభిమానులూ, టీడీపీ శ్రేణులూ సంతోషించాయి. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తమలో ఒకడిగా ఆత్మీయంగా మెలిగిన జూనియర్‌ను ఇప్పుడు మెల్లమెల్లగా అటు సినీ రంగంలో ఒంటరిని చేసేందుకు, భవిష్యత్ రాజకీయ చిత్రం నుంచి తొలగించేందుకు పావులు కదులుతున్నాయని తెలుస్తోంది.
‘కథ’ మొదలైంది ఎక్కడంటే...
ఇది దాదాపు ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటన! కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన సమయంలో తనకు అవమానం జరిగిందని ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ అలిగిన సందర్భంలో ఈ ఆధిపత్య పోరుకు బీజం పడిందని చెబుతారు. తండ్రికి జరిగిన అవమానంపై ఆగ్రహించిన జూనియర్.. ఆ రోజు నుంచే ఇకపై టీడీపీతో కానీ, చంద్రబాబుతో కానీ సంబంధాలు కొనసాగించరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో సింగపూర్‌లో ఉన్న చంద్రబాబు.. అక్కడి నుంచే జూనియర్‌కు ఫోన్ చేసి.. బుజ్జగించేందుకు ప్రయత్నించారని, కానీ.. చంద్రబాబు ఫోన్‌ను జూనియర్ ఆన్సర్ చేయలేదని వార్తలొచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య అంతరం పెరిగిందని చెబుతున్నారు.
బాలకృష్ణ సైతం ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మారారని సమాచారం. రామారావు పేరు పెట్టుకుని సినిమాల్లోకి జూనియర్ రావడం, ఎదగడం జీర్ణించుకోలేకపోయిన నందమూరి కుటుంబీకులు.. జూనియర్‌కు పోటీగా హరికృష్ణ మొదటి భార్య కుమారుడు కల్యాణ్‌రామ్‌ను, ఎన్టీఆర్ మరో తనయుడు మోహనకృష్ణ తనయుడు తారకరత్నను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కళ్యాణ్‌రామ్ సొంతంగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అంటూ తాత పేరు మీద సొంతంగా బేనర్‌ను స్థాపించాడు. నిజానికి అప్పటికి అంత అవసరం లేకపోయినా.. ఏనాటికైనా జూనియర్ ఎన్టీఆర్.. తాత పేరుతో బేనర్ స్థాపించి.. ఆ క్రెడిట్ కూడా కొట్టేస్తాడేమోనన్న అనుమానంతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో బేనర్ స్థాపించాడన్న వాదన ఉంది.
ఇక తారకరత్న విషయానికొస్తే అతనితో ఒకే రోజు 9 చిత్రాలు ఓపెనింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేయించాలని చూశారు. అయితే అందులో ఒకటి రెండు మినహా మిగతా చిత్రాలన్నీ అటకెక్కాయి. ఆ తర్వాత తారకరత్న పెద్దగా ప్రయత్నాలు చేసింది లేదు. ఈ మధ్య పూర్తిగా దృష్టి కేంద్రీకరించి.. నందీశ్వరుడు పేరుతో సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇకపై తన పేరు నందమూరి తారక రామారావుగా మార్చుకుంటున్నట్లు తారకరత్న ప్రకటించడం ఈ కుటుంబంలో రోజు రోజుకు రగులుతున్న చిచ్చుకు, ఆధిపత్య పోరుకు పరాకాష్టగా నిలిచింది. తారకరత్న పేరు మార్పిడి విషయంలో నందమూరి కుటుంబ సభ్యుల ప్రోద్బలం కూడా ఉందని సమాచారం.
బాలకృష్ణ తర్వాత నందమూరి వంశంలో తదుపరి స్థానం జూనియర్ ఎన్టీఆర్‌దేని అందరూ అంటుండటం కూడా నందమూరి కుటుంబీకులు తారకరత్న పేరు మార్పుపై ప్రభావం చూపిందని పరిశీలకులు అంటున్నారు. అటు బాలకృష్ణ తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని, 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని చేసిన ప్రకటన కూడా ఈ ఆధిపత్య పోరులో భాగమేనని తెలుస్తోంది. రాజకీయవారసుడు కూడా జూనియరేనన్న ముద్ర పడిపోక ముందే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బాలకృష్ణ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటనను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
డైలమాలో ఎన్టీఆర్ కెరీర్
నందమూరి కుటుంబం నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భవిష్యత్‌లో జూనియర్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే గత దసరాకు బాలకృష్ణ శ్రీరామరాజ్యం విడుదలకు సిద్ధమవుతుండగా జూనియర్ ఆ సినిమాకు పోటీగా తన ‘ఊసర విడుదల చేయాలని నిర్ణయించుకోవడంతో శ్రీరామరాజ్యం నవంబరులో విడుదలైందని సమాచారం. సినిమా కథ బాగున్నా.. ఊసర చిత్రానికి రామారావు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత లభించడంతో అది యావరేజీ చిత్రంగా నిలిచింది. శ్రీరామరాజ్యం చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణం జూనియర్ అని తెలిసిన నందమూరి అభిమానులు ఈ చిత్రానికి నందమూరి వ్యతిరేక ప్రచారాన్ని చేశారని తెలిసింది. ఇక ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో బాలకృష్ణ నటనకు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ లాంటి వారే ప్రశంసల వర్షం కురిపించినా జూనియర్ నుంచి ఆ చిత్రం గురించి కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం.
పైఎత్తుల్లో జూనియర్
తనను నందమూరి కుటుంబం మళ్లీ వెలి వేస్తోందని గమనించిన జూనియర్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తన మామ నార్నే శ్రీనివాసరావుతో కలిసి తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లు సమాచారం. ఫలితంగానే స్టూడియో ఎన్ బాధ్యతల నుంచి లోకేష్‌ను తప్పించారని ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ను తప్పించిన జూనియర్.. స్టూడియోఎన్‌ను తన ఆధీనంలో తీసుకున్నారని చెబుతున్నారు. ఈ పరిణామం చంద్రబాబు, బాలకృష్ణలకు మరింత ఆగ్రహం కల్గించిందని సమాచారం. త్వరలోనే జూనియర్ మరో చానల్‌ను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ పరిక్షిశమలో చర్చ జరుగుతోంది. స్టూడియో ఎన్‌లో ఇవాల్టికివాళ చంద్రబాబు నారావారిపల్లె పర్యటనకు పెద్దగా ప్రచారం కూడా ఇవ్వలేదు.
గత కొద్దికాలం నుంచే ఈ చానల్‌లో చంద్రబాబు ప్రచారం తగ్గినట్లు చెబుతున్నారు. అయితే మెలితిప్పిన మీసంతో ‘నందీశ్వరుడు’ అంటూ హంగామా చేసిన మాత్రాన తారకరత్న అలియాస్ కొత్త ఎన్టీఆర్‌కు ఒరిగేదేమీ లేదని, ఎవరు అవునన్నా కాదన్నా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేంత వరకు బాలకృష్ణ తర్వాత మళ్ళీ ఆ చరిష్మా జూనియర్‌కే ఉంటుందని పరిక్షిశమ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తాజా పరిణామాలు నందమూరి కుటుంబంలో ఆధిపత్యపోరు సాగుతున్నదన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇదంతా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశీస్సులతో జరుగుతున్నదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Take By : T News
Read more...