‘టెట్’ను తక్షణమే రద్దు చేయాలి
- జీఓ 7ను ఉపసంహరించుకోవాలి
- జీఓ 3ని యథాతథంగా అమలు చేయాలి
- ఎస్జీటీ పోస్టుల్లోనూ అవకాశం కల్పించాలి
- బీఈడీ విద్యార్థుల ధర్నా, రాస్తారోకో
- సచివాలయ ముట్టడికి యత్నం
: ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఈడీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీకి హాజరవ్వాలంటే టెట్‌లో అర్హత సాధించాలనే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టెట్‌ను పూర్తిగా రద్దుచేసి, ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులను బీఈడీ అర్హతతోనే నింపాలని కోరారు. ఎస్టీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని, జీఓ 7ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాలు పరిష్కారమయ్యేంత వరకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిలిపివేయాలని కోరారు. ఆయా డిమాండ్లతో శుక్రవారం పలు జిల్లాల్లో బీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకో చేశారు. పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్‌లో నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో టెట్‌ను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ధర్నాకు నాగం జనార్దన్‌డ్డి, సీపీఎం, జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. నాగం మాట్లాడుతూ ఏసీ గదుల్లో ఉండే ఎవరో ఒక అధికారి నిర్ణయా న్ని ప్రభుత్వం అమలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడు కుంటోందని దుయ్యబట్టారు. టెట్‌తో కొత్తగా జరిగే ప్రయోజనమేమీ లేదని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. గద్వాలలో మంత్రి డీకే అరుణకు నిరుద్యోగ ఉపాధ్యాయులు టెట్‌పై వినతిపత్రం ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా డీఎస్సీ రాసేందుకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
వెంపటి రాజేష్ అనే బీఈడీ విద్యార్థి గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్య గౌడ్ మాట్లాడుతూ టెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులన్నింటినీ నేరుగా రిక్రూట్ చేయాలని, ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అర్హుత గల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని వెంపటి రాజేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరులో టెట్‌ను రద్దు చేయాలంటూ బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో 7 రద్దు చేసి, జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఈడీ నిరుద్యోగులకు ఎస్‌జీటీలో అవకాశం ఇవ్వాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
నిజామాబాద్ జిల్లా కామాడ్డిలో టెట్‌ను రద్దు చేయాలని విద్యావాలంటీర్లు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీలో అందరికీ అర్హత ఇవ్వాలని కోరుతూ మెదక్ జిల్లా సిద్దిపేట, చేగుంటలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చేగుంటలో హైదరాబాద్-మెదక్ రహదారి పై అభ్యర్థులు రాస్తారోకో చేపట్టి టెట్ జీవో ప్రతులను దహనం చేశారు. జీవో 7 రద్దు చేయాలని, పదోన్నతుల కౌన్సెలింగ్ నిలిపేయాలంటూ డిమాండ్ చేస్తూ బీఈడీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకారులు హైదరాబాద్‌లో సెక్ర ముట్టడికి విఫలయత్నం చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టెట్‌ను రద్దు చేయాలని రాష్ట్ర బీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అలవాల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు.
Take By : T News
0 comments:
Post a Comment