Sunday, December 25, 2011
Condition of poor Muslims in India worse than Dalits
The union minister alleged that corruption in Uttar Pradesh was at its peak and blamed the chief minister Mayawati for it. "Though union government wants to set up projects, the state is not making land available and corruption is at its peak," Jaiswal said.
క్రిస్మస్‌కు ముస్తాబైన మెదక్ చర్చి
కిరణ్‌కు కొత్త టీం!
- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.
.
హైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
కిరణ్‌కుమార్‌డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.
వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్‌కుమార్‌డ్డి సర్కార్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్‌కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.
ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్‌ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.
అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్‌కుమార్‌డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్‌కుమార్‌డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్‌కుమార్‌డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్‌ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.
కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్‌లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్‌కుమార్‌డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.
తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.
ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్‌కుమార్‌డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్‌కుమార్‌డ్డి కోరినట్టు చెబుతున్నారు.
ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్‌కుమార్‌డ్డి వాదిస్తున్నారు.
Take By: T News
కదులుతోంది.. చంద్రబాబు దండు యాత్ర
- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్‌లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్‌కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం
( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్‌కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!
దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్‌కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!
రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్‌లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్‌కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.
అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్‌ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌కు సంకేతాలు పంపిస్తుంది.
చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.
పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్‌ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్‌కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్‌కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్‌కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.
ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.
అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!
Take By: T News :