కిరణ్‌కు కొత్త టీం!
- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.
.
హైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
కిరణ్‌కుమార్‌డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.
వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్‌కుమార్‌డ్డి సర్కార్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్‌కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.
ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్‌ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.
అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్‌కుమార్‌డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్‌కుమార్‌డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్‌కుమార్‌డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్‌ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.
కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్‌లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్‌కుమార్‌డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.
తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.
ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్‌కుమార్‌డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్‌కుమార్‌డ్డి కోరినట్టు చెబుతున్నారు.
ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్‌కుమార్‌డ్డి వాదిస్తున్నారు.
Take By: T News
0 comments:
Post a Comment