30 of world’s 50 wealthiest Arabs are Saudis
The UAE got only four on the list and Qatar just three.
ఆత్మకూర్.ఎస్)పాఠశాల భవనంలో కళాశాలను నిర్వహించడం వల్ల విద్యార్థులు వలసలు వెలుతున్నా అధ్యాపకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్ కళాశాల భవనం నిర్మించి ఎనిమిది నెలలైనా ఉపాధ్యాయులు, లెక్చరర్లు కుమ్మకై్క కళాశాలను తరలించకుండా ఒక్క పూట చదువు చెప్పి తప్పించు కుంటున్నారు. దాదాపు 550మంది విద్యార్థులున్న నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో నేడు 200ల మంది కూడా మిగలలేదు. ఒక పూట పాఠశాల మరోక పూట కళాశాల కారణంగా బోధన కష్టమవుతుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు, కలెక్టర్‌కు విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నూతన కళాశాలలో వసతులు ఉన్నప్పటికీ ఎదో ఒక్కటి సాకు చెప్పి ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ కళాశాలను తరలించకుండా అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు.
కళాశాల తరలిస్తే లెక్చరర్లు, ఉపాధ్యాయులు రెండు పూటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాపారాలకు అలవాటు పడిన అధ్యాపక బృందం విధులు నిర్వహించడం కష్టమౌ తది. అందుకే కళాశాల తరలింపును వారు అంతర్గతంగా అడ్డుకొంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కళాశాల తరలించకపోవడం వలన ఒక పూట పాఠశాల చదువుతో న్యాయం జరగడం లేదని ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఇతర పాఠశాలలకు వలసలు వెళుతున్నారు. ప్రభుత్వ హాస్టల్‌లో వందకుపైగా ఉన్న విద్యార్థులు వలసల కారణంగా ఇప్పుడు 27 మంది మిగిలారు. కళాశాలలోను ఇదే తంతు జరుగుతోంది. నాణ్యమైన విద్య అందించలేని కళాశాల అధ్యాపక బృందం పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారు. దాని కారణంగా ప్రతిభ గల విద్యార్థుల భవిష్యత్ అధ్వాన్నంగా మారుతోంది.
కళాశాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నాసిరకం తలుపులు, కిటికీలు, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్‌లు అమర్చడంతో ఇటీవల కళాశాల భవనం పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ జి.మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి పనులు మరోసారి చేశారు. కళాశాలను నూతన భవణంలోకి మార్చాలని రెండు పూటలా పాఠశాల, కళాశాల నడపాలని కొంతమంది జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే కళాశాలను తరలించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
- ఎండుతున్న గొంతులు
- ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు
- తెల్లారుజామునే బోరుబావుల వద్ద బారులు
- అడుగంటిన భూగర్భజలాలు
- కరెంటు కోతలతో మరింత కష్టం
- తూతూ మంత్రంగా ట్యాంకర్లతో నీటి సరఫరా
- కానరాని బోర్ల మరమ్మతులు
- ప్రత్యేకాధికారుల పాలనలో అరిగోస
: వేసవి రాక ముందే తాగునీటి కోసం ప్రజలు అరిగోస పడుతున్నారు. వర్షాభావంతో అడుగంటిన భూగర్భజలాలు, వట్టిపోయిన బోరు బావులు, పనిచేయని రక్షిత నీటి పథకాలు, కరెంటు కోతలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి జనం గొంతుపూండేలా చేస్తున్నాయి. గ్రామాల్లో తెల్లారుజామున మూడు గంటలకే ‘పానిపట్టు’ యుద్ధం మొదలవుతోంది.
తాగునీటి సమస్యతో బతుకులు కడతేరుతున్నాయి. తాగునీటి కోసం వెళ్లిన ఓ తల్లి ఇంటికొచ్చే సరికి ఐదునెలల పసికందు గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి మృతి చెందిన హృదయవిదారకమైన సంఘటన రెండురోజుల క్రితం రంగాడ్డి జిల్లా చేవెళ్లలో చోటుచేసుకుంది. వేసవి రాకముందే ప్రజల గొంతెండుతోంది. ప్రత్యేకాధికారుల పాలన నీటిఎద్దడిని ఏమాత్రం తీర్చలేకపోతోంది. జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరున్నా వాటిని ప్రజలకు అందించడంలో పాలకులు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.భాగ్యనగరం ప్రజల క‘న్నీళ్ల’ కథ అంతులేనిది. 87లక్షల జనాభాకు సరిపడా నీరందించలేని పరిస్థితి. రోజుకు 459 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ)నీరు అవసరం ఉండగా జలమండలి అధికారులు కేవలం 340 ఎంజీడీలు మాత్రమే అందిస్తున్నారు. ఇందులోనూ ప్రాంతాల వారీగా వివక్ష ప్రదర్శిస్తున్నారు. రోజుకు మనిషి 165 లీటర్లు అందించాల్సి ఉండగా ప్రముఖులకు 500 లీటర్లు, మురికివాడలకు 100 లీటర్లతో సరిపెడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌లో విలీనమయిన 12 మున్సిపాలిటీ ప్రాంత ప్రజల గోస వర్ణనాతీతం. అంతర్జాతీయ నగరంగా ఎదిగామని చెప్పుకునే ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు వారానికోకసారి నీరు సరఫరా చేస్తోంది. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నగరానికి గోదావరి, కృష్ణా మూడో దశ పథకాలు చేపడుతున్నామంటూ ప్రతి సమావేశంలోనూ ఊదరగొట్టే నేతలు ఈ పథకాల పనితీరు చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి. గోదావరి ప్రాజెక్టు మూడేళ్లలో 25శాతం పనులు జరగగా కృష్ణా మూడోదశ మాత్రం ఇంక కాగితాలపైనే నలుగుతోంది. ఇవన్నీ వెరసి కాలనీలకు అతీతంగా ఇక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
తాగునీటికి తహ తహ
వరంగల్ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాలేదు. సెప్టెంబర్ నుంచి వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో నీటిమట్టం తగ్గిపోయి గ్రామాల్లోని చేతి పంపులకు నీరు అందక రెండు వేల చేతి పంపులు పూర్తిగా పనిచేయడంలేదు. మరో వెయ్యి చేతి పంపుల్లో డిసెంబర్ రెండోవారం నాటికే నీరు అందక పనిచేయడంలేదు. భూగర్భ జలాల నీటి మట్టం సాధారణ నీటి మట్టంకన్నా నాలుగు మీటర్లకు అడుగంటాయి. గ్రామాల్లో కరెంటు కోత తీవ్రంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్‌లో కూడా మంచినీటి ఎద్దడి ఏర్పడంతో మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. పాఖాల, రామప్ప చెరువుల్లో నీరు అడుగంటడంతో సమక్షిగనీటి పథకాలు మూలకు పడనున్నాయి. ఎస్సాస్పీ నీటిని రెగ్యులర్‌గా విడుదల చేస్తేనే సమగ్ర నీటి పథకాలు పనిచేసే పరిస్థితి ఉంది. ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదలచేసింది.
వారానికి ఒకసారే ఇంటి ఎదుట కల్లాపి
నల్లగొండ జిల్లాలో మంచినీటి కోసం ప్రజలు అప్పుడే అవస్థలు పడాల్సి వస్తోంది. చండూరు మండలంలోని గుండ్రపల్లిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వారం రోజులకు ఒక సారి మాత్రమే ఇంటిముందు కల్లాపి చల్లుకుంటున్నారు. వంటకు నీరు దొరికితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గంలో స్కీం బోర్లన్నీ ఎండిపోయాయి. కృష్ణా జలాలు అందడం లేదు. మిర్యాలగూడ ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. వేముపల్లిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బేతవోలు చెరువు నుంచి మండలానికి నీరు అందుతున్నా అవి మురికిగా వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొండపాడు ప్రాజెక్టు పూర్తై పైప్‌లైన్ పూర్తి కాలేదు. సూర్యాపేటలో 70 శాతం ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. భువనగిరి, యాదగిరిగుట్టలో కూడా అదే పరిస్థితి.
వేసవి రాకముందే నీటికి కటకట
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి రాకముందే మంచినీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. గాంధారి మండలం బీర్లమార్ తండా, కొత్తబజార్ తండా, జ్జెపల్లి, ఉత్తూనూరు, బుర్గర్, జువ్వాడి, బ్రహ్మణిపల్లి, కర్ణగడ్డతండాలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. బుర్గుల్‌లో బోర్లలో నీరు రాకపోవడంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. బ్రాహ్మణపల్లిలో పూర్తిగా ఫ్లోరైడ్‌నీరు ఉండటంతో మంచినీటి ట్యాంకుకు వెళ్లే పైప్‌లైన్లు చెడిపోయినాపట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండలంలోని కొల్లూర్, దేశాయిపేట్, తిర్మలాపూర్‌లో నీటి పైప్‌లైన్ అస్తవ్యస్తంగా తయారైంది. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం తడిహిప్పర్గా, అంతాపూర్‌లో పైప్‌లైన్ ధ్వంసమై, ఉన్న బోర్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ట్యాంకులు నిర్మించినా కనెక్షన్ ఇవ్వకపోవడంతో వృథాగా పడిఉన్నాయి.
దాహార్తి తీర్చని ట్యాంకర్ల సరఫరా
రంగాడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 705 గ్రామ పంచాయతీలున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 1,472 ఉండగా10,532 చేతిపంపులున్నాయి. ఇందులో సగానికి పైగా చేతిపంపులు వర్షాభావంతో వట్టిపోయాయి. త్రీఫేజ్ కరెంటు సపె్లై లేకపోవడంతో చాలా చోట్ల బోర్లున్నా గొంతుతడవటం లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా ఇవీ దాహర్తిని తీర్చలేకపోతున్నాయి. వ్యవసాయ బోర్లు కిరాయికి తీసుకుని మరీ నీటిని అందిస్తున్నా ఎద్దడి తీవ్రతను తగ్గించలేకపోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో సమస్య తీవ్రంగా ఉంది. తెల్లవారుజామున మూడు గంటలకే నీటికోసం క్యూ కడుతున్నారు. రెండురోజుల క్రితం చేవెళ్ల మండలం అల్లవాడలో భీమమ్మ నీళ్లకు వెళ్లగా ఐదు నెలల కుమారుడు భానువూపసాద్ ఏడ్చి ఏడ్చి ప్రాణాలోదిలిన విషయం తెలిసిందే.
గుక్కెడు నీటికోసం కిలోమీటర్ల దూరం
మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్ట ప్రాంతాల్లో ఇప్పటికే వారానికి ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడు కావడంతో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు సైతం ఎండిపోవడంతో పశువులకు కూడా నీళ్లు కరువవడంతో రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. జిల్లాలోని 1,545 గ్రామాల్లో 17,132 చేతిపంపులు ఉండగా, అందులో సగం ఇప్పటికే పనిచేయడం లేదు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ప్రభాకర్ తెలిపారు. కరువు నివారణ పథకం కింద రూ. 4 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.
అస్తవ్యస్తంగా మంచినీటి వ్యవస్థ
ఆదిలాబాద్ జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ వెయ్యి గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. జిల్లావ్యాప్తంగా 2,463 రక్షిత మంచినీటి పథకాలు, 20,309 బోరుబావులుండగా మూరుమూల ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ లేకపోవడంతో కొన్ని పనిచేయకపోగా మరికొన్ని చెడిపోయాయి. ముథోల్ మండలం బిద్రెల్లిలో మంచినీటి సరఫరా నిలిచివడంతో రెండుకిలోమీటర్ల దూరంనుంచి నీరు తెచ్చుకుంటున్నారు. బాసర నుంచి పైప్‌లైన్‌ద్వారా గ్రామానికి నీరు రావాల్సి ఉండగా గ్రామశివారులోని బోరు మోటర్ చెడిపోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది.
తలాపునే గోదారి.. తీరని దాహం
ఖమ్మం జిల్లాలో మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. ఏళ్ల నాటి బోర్లు మొరాయిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వాటికి కనీస మరమ్మతులు లేక కొన్నిచోట్ల పనికిరాకుండా పోయాయి. జిల్లాలో తాగునీటికి 20కిపైగా మండలా ప్రజలు అల్లాడుతున్నారు. తలాపున గోదావరి ఉన్నా నీటి కష్టాలు మాత్రం తీర్చే నాథుడే కరువయ్యాడు. దాదాపు ప్రతి పంచాయతీలో ఐదు నుంచి 10కిపైగా బోరు మోటార్లు రిపేరులో ఉన్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో వేళాపాళా లేని నీటి సరఫరా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. రాత్రి వేళల్లోనూ నీటిని సరఫరా చేస్తుండటంతో ఇబ్బందిగా మారింది.
తాగునీటి సరఫరా అంతంతే
కరీంనగర్ జిల్లాలో మొత్తం 2,260 హాబి పూర్తిగా తాగునీరు అందుతున్న గ్రామాలు 295 మాత్ర మే. 81 గ్రామా ల్లో తాగునీటి వ్యవస్థేలేదు. మిగ తా గ్రామాల్లో పాక్షికంగా తాగునీరు అందుతోంది. 2,158 రక్షి త మంచినీటి పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. 20,988 బోరు బావుల్లో వెయ్యి పనిచేడంలేదు. జిల్లాలోని మంథని, సిరిసిల్ల డివిజన్‌లతోపాటు హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. వేములవాడ, కొండగట్టులోనూ సమస్య తీవ్రంగా ఉంది.
మెతుకుసీమలో పథకాలు అసంపూర్ణం
ప్రత్యేకాధికారుల పాలనలో మెదక్ జిల్లాలోని గ్రామాలు తాగునీటికి అల్లాడుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ప్రత్యేక మంచినీటి పథకాలున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అవాంతరాలతో ప్రజల గొంతెండుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 212 కోట్లతో నిర్మాణంలో ఉన్న 26 మంచినీటి పథకాలు నత్తనడకన నడుస్తుండటంతో ప్రజల దాహార్తి తీరడంలేదు. సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు మినహా జిల్లాలోని మిగతా గ్రామీణ ప్రాంతాల్లో చేతి పంపులు, బోరుబావుల ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతోంది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాలకు ఉద్దేశించిన సత్యసాయి మంచినీటి సరఫరా పథకం నిర్వహణ లోపంతో కుదేలైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా స్థానికులకు తాగునీటి గోస తప్పడం లేదు.
Take By: T News
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP