రోజూ ఒక్క పూట బడే..?
ఆత్మకూర్.ఎస్)పాఠశాల భవనంలో కళాశాలను నిర్వహించడం వల్ల విద్యార్థులు వలసలు వెలుతున్నా అధ్యాపకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్ కళాశాల భవనం నిర్మించి ఎనిమిది నెలలైనా ఉపాధ్యాయులు, లెక్చరర్లు కుమ్మకై్క కళాశాలను తరలించకుండా ఒక్క పూట చదువు చెప్పి తప్పించు కుంటున్నారు. దాదాపు 550మంది విద్యార్థులున్న నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో నేడు 200ల మంది కూడా మిగలలేదు. ఒక పూట పాఠశాల మరోక పూట కళాశాల కారణంగా బోధన కష్టమవుతుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు, కలెక్టర్‌కు విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నూతన కళాశాలలో వసతులు ఉన్నప్పటికీ ఎదో ఒక్కటి సాకు చెప్పి ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ కళాశాలను తరలించకుండా అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు.
కళాశాల తరలిస్తే లెక్చరర్లు, ఉపాధ్యాయులు రెండు పూటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాపారాలకు అలవాటు పడిన అధ్యాపక బృందం విధులు నిర్వహించడం కష్టమౌ తది. అందుకే కళాశాల తరలింపును వారు అంతర్గతంగా అడ్డుకొంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కళాశాల తరలించకపోవడం వలన ఒక పూట పాఠశాల చదువుతో న్యాయం జరగడం లేదని ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఇతర పాఠశాలలకు వలసలు వెళుతున్నారు. ప్రభుత్వ హాస్టల్‌లో వందకుపైగా ఉన్న విద్యార్థులు వలసల కారణంగా ఇప్పుడు 27 మంది మిగిలారు. కళాశాలలోను ఇదే తంతు జరుగుతోంది. నాణ్యమైన విద్య అందించలేని కళాశాల అధ్యాపక బృందం పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారు. దాని కారణంగా ప్రతిభ గల విద్యార్థుల భవిష్యత్ అధ్వాన్నంగా మారుతోంది.
కళాశాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నాసిరకం తలుపులు, కిటికీలు, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్‌లు అమర్చడంతో ఇటీవల కళాశాల భవనం పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ జి.మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి పనులు మరోసారి చేశారు. కళాశాలను నూతన భవణంలోకి మార్చాలని రెండు పూటలా పాఠశాల, కళాశాల నడపాలని కొంతమంది జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే కళాశాలను తరలించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
0 comments:
Post a Comment