ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణ పరిశ్రమ -2 (Telangana History - Nizam in Telangana)
ఇదీ ధ్వంస రచన
- వేల మంది కార్మికులు రోడ్లపైకి
- కొత్త పరిక్షిశమల్లో ఉద్యోగులు సీమాంధ్ర జిల్లాలవారే
- తోడైన సరళీకరణ విధానాలు
- మాయమైన తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతం
- విధ్వంసానికి గురైన కార్మికవాడ
ఐడీపీఎల్‌లో ఉన్నతోద్యోగులుగా చేరిన డాక్టర్ అంజిరెడ్డి తదితరులు డగ్స్ తయారీకి కావాల్సిన ఫార్ములాను చౌర్యం చేసి, సొంత ఫార్మాస్యూటికల్ సంస్థలు ఏర్పాటు చేసుకొని క్రమంగా దీనిని దివాలా తీయించారన్న ఆరోపణలున్నాయి. ఐడీపీఎల్‌ను పునరుద్ధరించే అవకాశాలున్నా.. బలవంతంగా ఉరి వేశారు. ఫలితంగా సామాన్య ప్రజల ఆరోగ్య ప్రదాయిని అంతమైంది.
హైదరాబాద్ చుట్టూ ఏర్పాటైన
భారీ పరిశ్రమలకు భూమిని సేకరించేటప్పుడు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు, అనుబంధ కాంట్రాక్టులను కూడా భూములు కోల్పోయిన స్థానికులకు ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ ఈ నిబంధన ఏ ఒక్క పరిశ్రమలోనూ అమలు కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం 1964, 1989లలో రెండు సార్లు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చినా ఫలితం లేకపోయింది.తెలంగాణకు కొంగు బంగారాల్లా భాసిల్లిన అనేకానేక పరిక్షిశమలు.. ఇప్పుడు అంతర్థానమయ్యాయి! ప్రపంచ బ్యాంకుకు అవల్‌దర్జా జీతగాళ్లుగా మారిన ముఖ్యమంవూతుల చేతిలో దగాపడ్డాయి. పాలకుల కుట్రలకు తోడు ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు తోడై.. తెలంగాణ పరిక్షిశమల గొంతునులిమాయి! వాటి సమాధులే పునాదులుగా సీమాంధ్ర బడాబాబుల పారిక్షిశామిక సామ్రాజ్యాల భువన భవనాలు ఎదిగాయి! ఐడీపీఎల్, ఆల్విన్, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్, డీబీఆర్ మిల్స్, ఆజంజాహీ మిల్స్ ఒక అనేకానేక పరిక్షిశమలు.. అన్నీ లాభాల్లో, ఉత్పత్తుల నాణ్యతలో ప్రఖ్యాతిగాంచినవే! దేశంలో ఆమాట కొస్తే ఆసియాలోనే అతి పెద్ద కర్మాగారాలు కొన్ని! వేల మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించినవి! హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆనాడే నిలబెట్టిన ఘనత వహించినవి! తెలంగాణ పేరును దిగంతాలకు వ్యాప్తి చేసిన అద్భుతాలు! ఏవీ ఇవన్నీ? ఎక్కడకు పోయాయి?
దేశంలోనే మొట్టమొదట సారి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, హైదరాబాద్ నగరాన్ని వెలుగులతో నింపిన హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్.. ఇప్పుడు ఐమాక్స్ జిలుగుల కింద సమాధి అయి ఉంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన నిజాం షుగర్స్.. పాలకుల దుర్నీతికి బలైపోయింది. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్ మిల్స్.. దొంగల బారిన పడి మొండిగోడలతో మిగిలింది! భారీ లాభాల్లో ఉన్న హైదరాబాద్ ఆల్విన్.. అడ్డికిపావుశేరు ధరకే ఓల్టాస్ కంపెనీకి సొంతమై.. తరువాత రియల్టర్లపాలైంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన ఐడీపీఎల్ గుండెలపై ప్రైవేట్ ఫార్మా కాళ్లు నిగడదన్ని ఎదిగింది!
ఆసియాలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లు ఆజంజాహి నేడు చెత్త కంపెనీ రాంకీ ఖాతాలోకి వెళ్లింది! వస్త్రాలు ఉత్పత్తి చేయాల్సిన ఫ్యాక్టరీ స్థలం నేడు రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మారింది! సనత్‌నగర్, ఆజామాబాద్, కాటేదాన్, ఉప్పల్ పారిక్షిశామిక ప్రాంతాలు ఇప్పుడు కళ తప్పాయి! ఇది తెలంగాణ పారిక్షిశామిక సామ్రాజ్యం కుప్పకూలిన తీరు! వలస వచ్చి పాగావేసిన సీమాంధ్ర బడాబాబులు, వారికి వెన్నుదన్నులిచ్చిన పాలకులు తెలంగాణ పరిక్షిశమల ఆయువు తీసిన వైనం! పాత కంపెనీలు బొందపెట్టి..
కొత్త కంపెనీలు తెచ్చారు సరే.. నిబంధనల ప్రకారం రావాల్సిన ఉద్యోగాలైనా దక్కాయా? అంటే అవీ సీమాంధ్ర జిల్లాల వాసులకే వశమయ్యాయి! ఉన్న ఉపాధి పోయి.. కొత్త ఉపాధి లేక ఇప్పుడు తెలంగాణ యువత నిరాశా నిస్పృహలతో రగిలిపోతున్నది! పోనీ పారిక్షిశామికరంగంలో తెలంగాణ ఔత్సాహికులు ఎదిగారా అంటే అదీ లేదు! ఇదీ.. కోటి రతనాల వీణ ధ్వంసమైన తీరు! పాలకుల దుర్నీతి తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతంపై వేయి పడగపూత్తి విషం చిమ్మిన విధం! వేల మందికి నీడనిచ్చిన తెలంగాణ పరిక్షిశమల చెట్టు కొమ్మలను ఒక్కొక్కటిగా నరికిపారేసిన దారుణం!
చితికిన ఐడీపీఎల్ బతుకులు
-కొందరి స్వార్థం - వేల మందికి శాపం
-ఐడీపీఎల్ సమాధులపై ప్రైవేట్ ఫార్మా సామ్రాజ్యాలు
కొందరు వ్యక్తుల స్వార్థం.. ఈ సంస్థలో పని చేసే సుమారు 6వేల మంది కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసింది. ఇది హైదరాబాద్ నగరంలో బాలానగర్‌లోని ఐడీపీఎల్ వ్యథ. భారతదేశంలో దీనితో పాటు ప్రారంభమైన మద్రాస్, రిషికేష్, గుర్గావ్ సంస్థలు నేటికీ సవ్యంగా నడుస్తుండగా హైదరాబాద్ సంస్థ మాత్రం ప్రారంభమైన మూడు దశాబ్దాలకు మూతపడింది.
అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1961 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నాలుగుచోట్ల ఐడీపీఎల్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 1967లో బాలానగర్‌లో హైదరాబాద్ యూనిట్ ప్రారంభమైంది. రష్యన్ కొలాబరేషన్‌తో ప్రారంభించిన ఈ సంస్థ ఎన్నో రకాల బల్క్ డ్రగ్స్‌ను దేశవిదేశాలకు సరఫరా చేసింది. జాబ్ ఓరియం ప్రారంభించిన ఈ యూనిట్ అనతికాలంలోనే లాభాల బాటలో పయనించి మిగిలిన యూనిట్లకు మదర్ యూనిట్‌గా మారింది. మందుల తయారీ, టానిక్‌ల తయారీలో పదేళ్లపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఊహించిన దానికంటే అధికస్థాయిలో పేరువూపఖ్యాతులు గడించింది.
ఆ తరువాత ఈ సంస్థలోకి ఆంధ్రా ప్రాంత ఉన్నతోద్యోగులు (జీఎం స్థాయి) రంగ ప్రవేశం చేశారు. అప్పటికే ఈ సంస్థలో సీనియర్ కెమిస్టుగా పనిచేస్తూ అపార పరిజ్ఞానం సంపాదించిన డాక్టర్ అంజిడ్డి తన పలుకుబడిని ఉపయోగించి డిజైన్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ (డీడీపీ) విభాగం హెడ్‌గా మార్పించుకున్నాడని చెబుతారు. నెమ్మదినెమ్మదిగా ఈ సంస్థ టెక్నాలజీని అనుసరించి ఓ సంస్థను నిర్వహించడానికి కావలసినంత టెక్నాలజీని సమకూర్చుకున్నాడు.
ఆ తరువాత ఐడీపీఎల్‌కు 1981-82లో రాంరాం చెప్పి మరో ఉన్నతోద్యోగి చంద్రశేఖర్‌డ్డితో కలిసి ఏకంగా ఎస్‌ఓఎల్ పేరిట ఓ లేబొరేటరీని స్థాపించాడు. 1984లో పూర్తిస్థాయిలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీపేరుతో భారీ పరిక్షిశమను స్థాపించాడు. కాగా ఐడీపీఎల్‌లో ఉన్న ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఆర్డర్లకు తగిన ఉత్పత్తిని అందించలేకపోయారు. ఇదే అదునుగా డాక్టర్ రెడ్డీస్ బాటలోనే రాంప్రసాద్ రెడ్డి అరబిందో లేబొరేటరీస్‌ను ప్రారంభించారు. సీమాంవూధులైన ఉన్నతోద్యోగులు ఈ పరిక్షిశమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వచ్చిన ఆర్డర్లను కొత్తగా ఆవిర్భవించిన పరిక్షిశమలకు గుట్టుచప్పుడు కాకుండా మళ్లించి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పడు అధికారంలో ఉన్న కొందరు మంత్రిస్థాయి నేతలు డాక్టర్ రెడ్డీస్, అరబిందో సంస్థలకు సహకారం అందించి, ఐడీపీఎల్ పతనానికి పరోక్షంగా కారకులైనట్లు మాజీ ఐడీపీఎల్ ఉద్యోగులు చెబుతున్నారు.
ఆంధ్రవూపదేశ్‌కు, ప్రత్యేకించి తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ పరిక్షిశమ దిగజారిపోతున్నా పట్టించుకోలేదని, పైగా ఆయన కూతురుకు చెందిన ఓ డ్రగ్ పరిక్షిశమకు సహకారమందించాల్సిందిగా ఉన్నతోద్యోగులకు పరోక్షంగా సందేశమందినట్లు వారు పేర్కొన్నారు. పరిక్షిశమ మూతపడి ఓ వైపు కార్మికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు కోట్ల రూపాయల విలువచేసే ఐడీపీఎల్ ఖాళీ భూమిని కైవశం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ పరిక్షిశమ స్థాపనకు ప్రభుత్వం కేటాయించిన 891 ఎకరాల్లో కొందరు ముస్లింలకు చెందిన పట్టాస్థలాలు ఉన్నాయని, ప్రస్తుతం పరిక్షిశమ నడవడం లేనందున, నాడు వాటికి నష్టపరిహారం చెల్లించనందున వారికి చెందిన భూమిని తిరిగి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేయించి, వెనుక తానుండి మంత్రివర్యులు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
తెలంగాణ కలికితురాయి నిజాం షుగర్స్
నిజాం షుగర్స్‌ను నాటి సీఎం చంద్రబాబు సీమాంధ్ర పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మివేయగా, అధికారంలోకి రాకముందు అది అక్రమమని ఘోషించిన రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ స్వాధీనానికి వీసమెత్తు ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. నిజాం షుగర్స్‌ను తీసుకున్న డెల్టా పేపర్ మిల్స్ యాజమాన్యం జాయింట్ వెంచర్ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లఘిస్తున్నప్పటికీ కిరణ్ సర్కార్ మౌనం వహిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది.
ఇదీ గత వైభవం: 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ దేశంలోనే ప్రభుత్వరంగంలో ఏర్పాటయిన అతిపెద్ద ఫ్యాక్టరీగా నిలిచింది. బోధన్ పరిసరాల్లో చెరుకును సొంతంగా పండించటానికి అప్పటి నైజాం పాలకుల హయాంలో సుమారు 16 వేల ఎకరాల వ్యవసాయక్షేవూతాలను ఈ ఫ్యాక్టరీకి సమకూర్చటం మరో ప్రత్యేకత. ఆంధ్రాలో చక్కెర ఫ్యాక్టరీలంటే తెలియని రోజుల్లోనే తెలంగాణలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మొదట వెయ్యి టన్నుల సామర్థ్యంతో ప్రారంభించారు. 1952లో రెండవ యూనిట్ ఏర్పాటు చేశారు. బోధన్‌లో నిజాం షుగర్స్ మదర్ యూనిట్‌గా పిలిచే శక్కర్‌నగర్ యూనిట్ ఆర్జించిన లాభాలతో రాష్ట్రంలో 7 చక్కెర ఫ్యాక్టరీలు, 3 ఆల్కహాల్ డిస్టిలరీలు, నాగార్జునసాగర్‌లో మెషినరీ డివిజన్ స్థాపించారు.
శక్కర్‌నగర్ యూనిట్ లాభాలతో నిజాం షుగర్స్ ఆధ్వర్యంలో 1970 దశకంలో హిందూపూర్, మిర్యాలగూడ, జహీరాబాద్‌లో కొత్త చక్కెర ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 1980 దశకంలో బొబ్బిలి, సీతానగరంలో ఖాయిలాపడిన చక్కెర ఫ్యాక్టరీలను, పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు డిస్టిలరీని నిజాం షుగర్స్ అధీనంలోకి తీసుకొచ్చారు. అనంతరం మెట్‌పల్లిలో కొత్తగా మరో చక్కెర ఫ్యాక్టరీని నిజాం షుగర్స్ నిర్మించింది. చివరగా 1988లో మెదక్‌లో కొత్తగా నిజాం షుగర్స్ యూనిట్ ఏర్పడింది. ఆనాడు బోధన్ ఫ్యాక్టరీకి 40 కిలోమీటర్ల దూరం మేరకు ఫ్యాక్టరీకి రెండు వైపులా లైట్ రైల్వే లైన్ ఉండేది.
సీమాంధ్ర పెత్తనంలో నష్టాలు ప్రారంభం
ఆంధ్రా పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసిన హిందూపూర్, లచ్చాయిపేట్, సీతానగరం యూనిట్లు నిజాం షుగర్స్‌కు ఎనలేని నష్టాలను తీసుకువచ్చాయి. ఈ నష్టాల భారాన్ని శక్కర్‌నగర్ మదర్ యూనిట్ మోయాల్సివచ్చింది. 1990 దశకంలో మిర్యాలగూడ యూనిట్‌తో పాటు నష్టాల్లో ఉన్న పై యూనిట్లను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేశారు. చంద్రబాబు హయాంలో నిజాంషుగర్స్ పరిస్థితి మరింత క్షీణించింది. లాభాల్లో ఉన్న శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్ యూనిట్లను నష్టాల్లోకి నడిపించే ప్రయత్నం చంద్రబాబు హయాంలో జరిగింది.ముఖ్యంగా తెలంగాణలోని ప్రభుత్వరంగ కార్మికులు, చెరుకు రైతులకు నిజాం షుగర్స్ ఒక అండగా ఉంటూ ప్రైవేట్ ఫ్యాక్టరీలకు పోటీ సంస్థగా ఉందన్న సత్యాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా 2002లో నిజాం షుగర్స్‌లోని నాలుగు యూనిట్లను డెల్టా పేపర్ మిల్స్ అనే సీమాంధ్ర కంపెనీకి అప్పగించింది. జాయింట్ వెంచర్ పేరిట జరిగిన ఈ ప్రైవేటీకరణ మార్పులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. రూ.600 కోట్లు విలువ చేసే యూనిట్లను కేవలం రూ.68 కోట్లకు డెల్టా పేపర్ మిల్స్‌కు అక్రమంగా నిర్వహించిన స్విచ్ చాలెంజ్ టెండర్ల ద్వారా అప్పగించారని విమర్శలున్నాయి.సభాసంఘం నివేదిక తుంగలోకి: వైఎస్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారంపై సభాసంఘాన్ని నియమించింది. రెండేళ్ళ పాటు విచారణ జరిపిన సభాసంఘం..
స్విచ్ చాలెంజ్ పద్ధతిని తప్పుపట్టింది. జాయింట్ వెంచర్‌ను రద్దుచేసి నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. అధికారంలోకి రాకముందు నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్.. అధికారంలోకి వచ్చాక సిఫారసులను పట్టించుకోకపోవడం శోచనీయం. జాయింట్ వెంచర్‌లో నిబంధనలను కూడా ప్రైవేట్ యాజమాన్యం ఉల్లంఘించిందని సభాసంఘం తేల్చినప్పటికీ ఏ ఒక్క సిఫారసునూ అమలు చేయలేదు. ఫలితంగా ప్రైవేట్ యాజమాన్యంలో కార్మికులు, చెరుకు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
ఆల్విన్ అవస్థలు!
-గడియారాలు, బస్ బాడీలతో ప్రఖ్యాతి
-అధికార దుర్వినియోగంతో పతనం
-పట్టించుకోని పాలకులు
( జీడిమెట్ల)నైజాం పాలనలో మెటల్ ఇండస్ట్రీస్‌గా మొదలై.. కాలానుగుణంగా వివిధ ఉత్పత్తులను దేశానికి అందిస్తూ ఓ వెలుగు వెలిగిన ఆల్విన్ పరిశ్రమ అధికార దుర్వినియోగానికి కుప్పకూలిపోయింది. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే 12వేల మంది కార్మికులను రోడ్డు పాలు జేసింది. 1942లో అప్పటి నిజాం పాలనలోని నిజాం పారిశ్రామిక అభివృద్ధి ట్రస్ట్.. అల్లావుద్దీన్ అండ్ కంపనీ సహకారంతో ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి దినదినా భివృద్ధి చెందింది.
1952లో భారతదేశ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను తయారు చేసి అందించిన ఘనత ఆల్విన్‌దే. ఆ తర్వాతి కాలంలో బస్ బాడీ యూనిట్‌గా రూపాం తరం చెంది 1963లో ఏపీఎస్‌ఆర్టీసీకి డెబుల్ డెక్కర్ బస్సును తయారు చేసి మరో ఘనతను సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్విన్‌ను ప్రభుత్వ రంగ పరిశ్రమగా ప్రకటించింది. ఆపై 1981లో మూడవ యూనిట్‌గా జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎనలేని ఖ్యాతిని గడిచింది.
అనంతరం 1983లో నిసాన్ సమన్వయంతో రిప్రిజిరేటర్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది. పలురకాల వాహనాలనూ ఉత్పత్తి చేసింది. సుమారు 48ఏళ్లపాటు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్పత్తి రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ 1990లో జీఎంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ అధికార దుర్వినియోగానికి బలవడం మొదలైంది. దీనికి తోడు అప్పటి కార్మిక సంఘ నేతలు సైతం వంతపాడటం కూడా ఆల్విన్‌పాలిట శాపమైందన్న విమర్శలున్నాయి.
పరిశ్రమపక్కనే ప్రస్తుతం ఓ క్లబ్ నిర్వహిస్తున్న వ్యక్తి పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో కాంట్రాక్టర్‌గా రంగప్రవేశం చేసి, సదరు జీఎంతో దోిస్తీ చేస్తూ పనులు చేయకుండానే అక్రమాలకు పాల్పడుతూ ఈ పరిశ్రమ పతనానికి పరోక్షంగా కారకుడయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడేళ్ళ కాలంలోనే మూతపడే స్థాయికి చేరి 1993వ సంవత్సరంలో కార్మికులను రోడ్డున పడేసింది. ఆ తరువాత 1994వ సంవత్సరంలో బీఐఎఫ్‌ఆర్ ద్వారా వివిధ కంపెనీలకు భాగస్వామ్యం పంచి కొందరు కార్మికులకు ఉపాధి కల్పించినప్పటికీ సరైన న్యాయం చేయడంలో సీమాంధ్ర ప్రభుత్వం విఫలమైంది.
దగాపడిన డీబీఆర్
-అప్రకటితంగా కంపెనీ మూసివేత
-అధికారులతోనూ కుమ్మక్కు
-ఫ్యాక్టరీని నడుపుతున్నామని అబద్ధాలు
-20 ఏళ్లుగా కంపెనీకి కార్మికులే కాపలా
-జీవితాలను కోల్పోయిన అభాగ్యులు
హైదరాబాద్, డిసెంబర్ (: నిజాం నవాబులు సాగునీటి వ్యవస్థతో పాటు, పారిక్షిశామీకరణపై కూడా దృష్టి సారించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిక్షిశమలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఔత్సాహికులను ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే దివాన్ బహదూర్ రాంగోపాల్ చేత స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయించారు. అలా ఏర్పడిందే హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్‌మిల్స్.
షాపూర్‌షనైకి చెందిన 24.16ఎకరాల ఇనాం భూమిని దివాన్ బహదూర్ రాంగోపాల్ 99 ఏళ్లు లీజుకు తీసుకొని 1922 నాటికి పరిక్షిశమను నిర్మించి ఉత్పత్తిని మొదలు పెట్టారు. 1984 వరకు ఇది బ్రహ్మాండంగా పని చేసింది. ఆ తర్వాత దివాన్ బహదూర్ కంపెనీని నడపటానికి ఇష్టం లేక లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. గోతికాడి నక్కల్లా కాచుక్కూర్చున్న సీమాంధ్ర దోపిడీదారులు వారికి ప్రతినిధిగా ఆనాటి సీఎం ఎన్టీరామారావు, గోదావరిజిల్లాకు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి డీబీఆర్‌మిల్‌ను 1984లో లీజుకు తీసుకున్నారు. తేరగా కంపెనీని చేజిక్కించుకున్న కృష్ణంరాజు ఏనాడూ ఫ్యాక్టరీని పద్ధతిగా నడపలేదు సరికదా ఎలా మూసివేయాలన్న దిశగానే పావులు కదిపాడు.
ఇదే ముడిసరుకుతో 1991 వరకు ఫ్యాక్టరీని నడిపినట్లు చేశారని కార్మికులు చెప్పారు. రకరకాల లిటిగేషన్లు పెడుతూ పని చేయించకుండా చేశాడని, ఇతని ప్రవర్తనతో ఆనాడు చాలా మంది కార్మికులు పనిలోనుంచి వెళ్లి పోయారని తెలిపారు. ఫ్యాక్టరీని నడపని కృష్ణంరాజు 1992 ఫిబ్రవరిలో ఓ అర్ధరావూతిపూట ఫ్యాక్టరీకి తాళం వేశాడు. అడ్రస్ లేకుండా పోయాడు. అంతే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కృష్ణంరాజు నేరుగా ఫ్యాక్టరీ వద్దకు రాలేదు. కానీ ఫ్యాక్టరీలో ఉన్న రూ.100 కోట్ల విలువైన మిషనరీని రాత్రి పూట తరలించుకు పోయాడు. కానీ ఇప్పటికీ పరిక్షిశమ నడుస్తున్నదనే కృష్ణం రాజుఅడ్డంగా వాదిస్తున్నారు.
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ప్రస్తుతం భూమి విలువ గజం రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. అంటే డీబీఆర్ మిల్స్ మొత్తం భూమి విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుంది. మరో వైపు ఈ ఫ్యాక్టరీ తనదంటూ సీమాంవూధకు చెందిన ఆర్‌ఆర్‌అసోసియేట్స్ అధినేతగా చెప్పుకునే రంగాడ్డి ప్రవేశించారు. ఈయనను కృష్ణంరాజే కావాలని కార్మికుల బెడద వదిలించుకోవడానికి తీసుకువచ్చాడా... లేక రాయలసీమ డాబుతో తనే కైవసం చేసుకోవడానికి వచ్చాడా అన్న విషయాలపై సర్వత్రా సందేహాలు వెలువడుతున్నాయి.
ఇది ఇలా ఉండగానే బిగ్‌బజార్‌కు చెందిన యజమాని మాల్‌పాణి డీబీఆర్‌ఫ్యాక్టరీలో ఆరు ఎకరాల భూమి తనదని కె్లైమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిర్మాణ పనులు చేయడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. వీరికి తోడుగా సీపీఐ, ఐఎఫ్‌టీయులు నిలబడడంతో వారు వెనక్కు తగ్గారు. ఆ తరువాత డీబీఆర్ ఫ్యాక్టరీ భూమి ప్రభుత్వానిదని ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడ నోటీస్‌లు అంటించారు. ‘మా నాన్న మిల్లులో పని చేశాడు. అర్ధాంతరంగా ఫ్యాక్టరీ మూసివేయడంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. నాన్న ఫ్యాక్టరీ కోసం కాపలా కాస్తూనే చనిపోయాడు. ఈ మిల్లు కోసం అమ్మ ఎదురు చూస్తూ చనిపోయింది.
ప్రస్తుతం నేను అనాథనయ్యాను’ కార్మికుడిగా తలెత్తుకొని బతికిన. ఇప్పుడు అడ్డమీది బతుకైంది. జీవితం దుర్భరంగా మారింది. నాకు నాలుగు ఆపరేషన్లు అయ్యాయి. ప్రస్తుతం 65 ఏళ్లు. ఇంకా ఎదురు చూసే ఓపిక పోయింది. ఫ్యాక్టరీ మూత పడడంతో పిల్లలను చదివించుకోలేకపోయా. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మంచి భవిష్యత్‌ను ఇవ్వలేని తండ్రిగా మిగిలాను.
Any Comments
Read 1 Part click this link
Take By: T News - http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=54538
0 comments:
Post a Comment