Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, December 19, 2011

తీగలు తెంపిన రతనాల వీణ! ( Nizam In Telangana)

- నాడు వేల పరిక్షిశమలతో విలసిల్లిన నేల
- ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిజాం ప్రోత్సాహం

- లక్షల మందికి ఉపాధి వనరులు
- బలపడిన స్థానిక పారిక్షిశామిక వర్గం
- స్పిన్నింగ్.. ప్రింటింగ్.. షుగర్.. పేపర్ ఐరన్.. బటన్.. గ్లాస్..కెమికల్.. ఫిరంగులు..వీఎస్‌టీ.. డీబీఆర్.. ఆజంజాహి
- ఆనాటి కాలానికే అందివచ్చిన ప్రగతి
- ఆర్టీసీ ఏర్పడిందీ ఆనాడే
- స్టేట్ బ్యాంక్ ఘనతా అప్పటిదే


Industry-telangnaa-News talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, డిసెంబర్ 18 (): తెలంగాణ.. కోటి రతనాల వీణ! నిజంగానే.. నిజంగానే ఇది రత్నగర్భ. సిరులు పొంగిన నేల. సింగరేణి బొగ్గు గనులను గర్భంలో దాచుకుంది. పారిక్షిశామికంగా విలసిల్లింది. ప్రపంచస్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఇది ఇప్పటి మాట కాదు. గత వైభవ వాస్తవ చరిత్ర. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం.. నిజాం హయాంలో సాధించిన ఘనత. భాగ్యనగరం హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతమంతా పారిక్షిశామికంగా నాటి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందింది.

హైదరాబాద్‌ను అభివృద్ధి పర్చింది మేమేనని ఇటీవల మైకులు మింగి మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు చూడజాలని వాస్తవమది. ఇంతకుముందు.. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం.. హైదరాబాద్ అభివృద్ధికి ఆమడదూరంలో కునారిల్లిందా?.. ఆదుకునేవారేలేరని అంగలార్చిందా? ఆత్మగౌరవాన్ని తాకట్టుబెట్టి పరాధీనమయిందా?.. ఎంతమాత్రం కాదు. పారిక్షిశామికంగా హైదరాబాద్ నాడు భాగ్యనగరంగానే విలసిల్లింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు (1956) ముందే..

ఆ మాటకొస్తే భారతదేశ స్వాతంవూత్యానికి పూర్వమే నాటి తెలంగాణ.. నిజాం సంస్థానంలో అన్ని రకాలుగా ప్రగతి పథంలో పయనించింది. నాడే పలు రకాల పరిక్షిశమలు తమ ప్రత్యేకతను చాటిచెప్పాయి. కొన్ని ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రఖ్యాతిని దక్కించుకున్నాయి. వేల పరిక్షిశమలు లక్షల మంది ప్రజలకు ఉపాధి కల్పించాయి. ప్రభుత్వ సహకారంతో, ప్రోత్సాహంతో పారిక్షిశామిక రంగం ముందుకు దూసుకుపోయింది.

స్పిన్నింగ్ మిల్ నుంచి కెమికల్ లేబోరేటరీ దాకా.. ఆర్టీసీ నుంచి ప్రాగా టూల్స్ దాకా.. హైదరాబాద్ దక్కన్‌లో వజీర్ సుల్తాన్ టొబాకో నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ దాకా పలురకాల పరిక్షిశమలు విస్తరించాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలతో తెలంగాణ విలసిల్లింది. ఇది చారివూతక వాస్తవం. తవ్విచూస్తే సజీవ సాక్ష్యాలకు కొదువలేదు. 1947లో ఈ దేశానికి స్వాతంత్య్రం వస్తే.. అంతకు ముందు ఏడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి అనుపమానం. 1871లో సింగరేణి బొగ్గు గనులతో మొదలుపెడితే 1947దాకా పారిక్షిశామిక రంగం బహుముఖంగా విస్తరించింది. 

1873లో మొదటి స్పిన్నింగ్ మిల్లు ప్రారంభం కాగా, 1876లో ఫిరంగుల ఫ్యాక్టరీ, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులోకి వచ్చాయి. 1910 దశకంలో సోడా, ఐరన్ ఫ్యాక్టరీలు, దక్కన్ బటన్ ఫ్యాక్టరీ, 1919లో వీఎస్‌టీ ఫ్యాక్టరీ నెలకొన్నాయి. రెండో దశకంలో కెమికల్ లాబోరేటరీ, దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, డీబీఆర్ మిల్స్; మూడో దశకంలో వరంగల్ ఆజంజాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్లులతో ప్రగతి శోభ చేకూరింది. 1932లో రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) స్థాపన మరో ముందడుగు. ఇక స్వాతంత్య్రం వచ్చిన నాలుగో దశాబ్దానికి వస్తే, మొదటి అర్ధ భాగంలోనే 1941లో గోల్కొండ సిగట్ ఫ్యాక్టరీ నెలకొంది. 1942లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఏర్పాటు గణనీయ పరిణామం. ఆ ఏడాదే స్థాపితమైన హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్, 1943లో ఏర్పడిన ప్రాగా టూల్స్ ఘనతను చాటేవే. 

1946లో హైదరాబాద్ ఆస్బెస్టాస్, 1947లో హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్ట్ పారిక్షిశామిక ప్రగతిలో భాగం. ఆనాడు భాగ్యనగరంతోపాటు తెలంగాణ ప్రాంతమంతటా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కృషి కొనసాగింది. అందులో భాగమే.. డీబీఆర్ మిల్స్, వరంగల్ ఆజంజాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్ మెటల్స్ తదితర సంస్థల ఏర్పాటు. ఈ జాబితాకు అంతులేదు. తమ ప్రాంత ప్రగతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం నాటి నిజాం ప్రభుత్వం చిత్తశుద్ధితో పారిక్షిశామిక విస్తరణకు ప్రయత్నించింది. అందుకు అవసరమైన విభాగాలను నెలకొల్పి ప్రోత్సాహకాలు కల్పించింది. తత్ఫలితంగా స్థానిక పారిక్షిశామికవర్గం బలపడింది. సాలార్‌జంగ్, బాబూఖాన్, లాహోటి, అల్లాద్దీన్, పన్నాలాల్ పిట్టి తదితర పారిక్షిశామిక కుటుంబాలు పరిక్షిశమల విస్తరణలో ఆసక్తి చూపి ఉపాధి వనరుల పెంపుదలలో దోహదపడ్డాయి.

1956లో సమైక్యరాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో పరిక్షిశమలు కోస్తా ప్రాంతం కంటే ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే నిజాం రాజులు హైదరాబాద్ చుట్టూ పరిక్షిశమల ఏర్పాటుకోసం దృష్టి కేంద్రీకరించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. 19వ శతాబ్దంలో తెలంగాణలో జంపఖానాలు, తివాచీలు, నూలుబట్టలు, ఇనుప వస్తువులు, ఉక్కు, కత్తులు, తుపాకులు, టస్సర్ పట్టుబట్టలు, కాగితం పరిక్షిశమలుండేవి. రుద్రమదేవి కాలంలోనే బట్టల పరిక్షిశమకు వరంగల్ ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఇంగ్లండు దేశస్థుడు మార్కోపోలో రుద్రమదేవి కాలంలోని బట్టలను చూసి సాలెపురుగు దారాలని భ్రమపడ్డారని చరివూతకారులు పేర్కొన్నారు. నిజాం హయాంలో 1851 కాలంలోనే వరంగల్ తివాచీలు, జంపఖానాలు ఇంగ్లాండులో జరిగిన వస్త్ర ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 

దీనినిబట్టి ఆనాడే నైపుణ్యమైన వస్తువుల తయారీలో ఎంత ముందంజలో ఉన్నది అర్థమవుతుంది. వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఇంగ్లీష్‌వారి వ్యాపారం వల్ల అప్పటికే హైదరాబాద్ రాజ్యంలో వెలసిన పరిక్షిశమలు 1800 నుంచి 1850 మధ్య కాలంలో క్షీణదశకు చేరుకున్నాయని ఆంధ్రుల సాంఘిక చరివూతలో సురవరం ప్రతాపడ్డి రాశారు. మొత్తంగా నిజాం ప్రభుత్వ హయాంలో ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి కొనసాగింది. హైదరాబాద్ చుట్టూరా తెలంగాణ జిల్లాలో అపారమైన ఖనిజ వనరులున్నాయి.

ఆధునిక భావాలు కలిగిన సాలార్‌జంగ్ ప్రవేశంతో పారిక్షిశామిక ప్రగతి వేగం పుంజుకుంది. నిజాం రాజులు హైదరాబాద్ రాజ్యాన్ని పారిక్షిశామికీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని సర్కారు భాగస్వామ్యంతో అనేక పరిక్షిశమలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ పారిక్షిశామిక వేత్తలను ప్రోత్సహించారు.హైదరాబాద్ చుట్టూ పరిక్షిశమల భద్రత కోసం 1912లో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖను ఏర్పాటుచేయగా, అభివృద్ధి కోసం 1918లో రెవెన్యూశాఖ అనుసంధానంతో ప్రత్యేకంగా ఇండవూస్టీస్ అండ్ కామర్స్ విభాగాన్ని నెలకొల్పారు. దీనిని మరింత విస్తృతం చేస్తూ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేశారు. 

ఈ శాఖ 1927 వరకు పరిక్షిశమల స్థాపనకు ఉదారంగా రుణ సదుపాయాలను కల్పించింది. పరిక్షిశమల ఏర్పాటుకు నిజాం రాజు కల్పించిన ప్రోత్సాహకాల ఫలితంగా 1924, 25 నాటికి 507 ఫ్యాక్టరీలు వచ్చాయి. హైదరాబాద్ నగరంలోనే 121 నెలకొన్నాయి. వాటిలో 116 రైస్, ఫ్లోర్, దాల్‌మిల్లులను విద్యుత్ శక్తితో నడిపారు. 1928లో టింబర్ సీజనింగ్ ప్లాంట్‌ను మింట్ వర్క్‌షాప్ స్థలంలో ఏర్పాటుచేశారు. 1928 నాటికే ఎన్నో సర్కారు, ప్రైవేట్ పరిక్షిశమలను స్థాపించారు. పరిక్షిశమలకు రుణాలివ్వడానికి నిజాం ప్రభుత్వం 1929లోకోటి రూపాయలతో ఇండవూస్టీయల్ ట్రస్ట్ ఫండ్ (ఐటీఎఫ్) ఏర్పాటు చేసింది. ఈ సంస్థ తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించేది. దీనికోసం ప్రత్యేకంగా ఒక డైరెక్టర్‌ను నియమించారు. ఫలితంగా చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు వేయి పరిక్షిశమలు హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడ్డాయి. పరిక్షిశమల ఏర్పాటులో అలనాటి ప్రభువర్గంలోని సాలార్‌జంగ్, బాబుఖాన్, లాహోటి, అల్లాద్దీన్, దొరాబ్జీ, చినాయ్, తయాబ్జీ, లాయక్‌అలీ, పన్నాలాల్ పిట్టి కుటుంబాలకు చెందినవారు ప్రభుత్వ రాయితీలు పొంది పరిక్షిశమలను నిర్వహించారు.

సింగరేణితో సిరుల ప్రస్థానం
niZams talangana patrika telangana culture telangana politics telangana cinema
1871లో సింగరేణి బొగ్గు గనులతో మొదలైన భారీపరిక్షిశమల ప్రస్థానం.. స్పిన్నింగ్ మిల్లు, ఫిరంగుల ఫ్యాక్టరీ, గ్లాస్ ఫ్యాక్టరీ, కెమికల్ లాబోరేటరి, ప్రాగాటూల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్, సిగట్, ఆస్‌బెస్టాస్, హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్.. ఇలా అన్ని ఉత్పాదక రంగాలలో కొనసాగింది. పరిక్షిశమల ఉత్పత్తి ద్వారా హైదరాబాద్ ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం రావడంతోపాటు దాదాపు లక్షనుంచి రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఓల్డ్‌మిల్స్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీ 1874లో ఏర్పడింది. ఈ పరిక్షిశమలో 1700 మంది కార్మికులు పనిచేయగా, ఏడాదికి రూ.50 లక్షల ఆదాయంతో మంచి స్థితిలో నడిచింది. హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో 1929లో దివాన్ బహదూర్ రాజగోపాల్ (డీబీఆర్) మిల్స్ ఏర్పరిచారు. 

ఇందులో 1600 మంది కార్మికులు పనిచేసేవారు. ఏడాదికి 72 లక్షల ఆదాయం లభించేది. ఈ కంపెనీకి కోర్సుకాటన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని ప్రొఫెసర్ కే ఎస్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. నిజాం సర్కారు ఉదారంగా రుణాలు ఇవ్వడంకోసం కామర్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయడంతో 1927లో రూ.42.6 లక్షల పెట్టుబడితో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ ఏర్పడింది. ఇందులో 400 మంది కార్మికులు పనిచేసేవారు. 

1942లో రూ.62 లక్షల పెట్టుబడితో సనత్‌నగర్ ఏరియాలో హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇందులో మెటల్, స్టీల్ ఫర్నీచర్, బ్యాంకు సేఫ్స్, స్ట్రాంగ్‌రూములు, రెండో ప్రపంచ యుద్ధకాలంలో అవసరమైన అనేక వస్తువులను ఉత్పత్తి చేశారు. ఈ కంపెనీ దినదినాభివృద్ది చెందుతూ 1964లో రెండు లండన్ కంపెనీలైన పార్క్ రాయల్ వెహికల్స్ లిమిటెడ్, ప్రెస్‌స్టీల్ కంపెనీ లిమిటెడ్‌ల సహాయంతో బస్సుబాడీలు, రిఫ్రిజిరేటర్లు తయారుచేయగలిగింది. దీంతోపాటుగా ఆల్విన్ అసెంబుల్డ్ బస్సులు తయారుచేశారు. ఈ విధానం దేశంలో పశ్చిమబెంగాల్, హైదరాబాద్‌లలో మినహా ఎక్కడా లేదు. భారత ఎన్నికల సంఘానికి బ్యాలెట్ బాక్స్‌లను కూడా ఆల్విన్ ఉత్పత్తి చేసింది.

వేల కుటుంబాలకు ఉపాధి వనరులు
వజీర్ సుల్తాన్ టొబాకో (వీఎస్‌టీ) లిమిటెడ్ కంపెనీని చార్మినార్ లేబుల్‌తో 1919లో కోటి రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం ఈ కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడింది. అలాగే గోల్కొండ లేబుల్‌తో హైదరాబాద్ దక్కన్ సిగట్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటైంది. సిగట్ల ఉత్పత్తితో ఈ రెండు అగ్రగామి సంస్థలుగా వెలుగొందాయి. 1943లో జూబిలి సిగట్ కంపెనీని స్థాపించారు. ఈ సిగట్ కంపెనీలలో వర్జీనియా పొగాకును సిగట్లకు, మిగతా పొగాకును బీడీలు చేసేందుకు వాడేవారు. 

1916లో దక్కన్ బటన్ పరిక్షిశమ ఏర్పడింది. అప్పట్లో బనియన్లు, డ్రాయర్లు ఉత్పత్తి చేసే పరిక్షిశమను కూడా ఏర్పాటుచేశారు. ద ఇండియన్ హ్యూం పైప్ కంపెనీ లిమిటెడ్‌ను ఆజామాబాద్‌లో 1933లో ఆరు అదనపు శాఖలతో ప్రారంభించారు. సనత్‌నగర్‌లో ద హైదరాబాద్ ఆస్బెస్టాస్ లిమిటెడ్ సంస్థ 22 లక్షల పెట్టుబడితో 500 మంది కార్మికులతో ఏర్పడింది. సనత్‌నగర్ పారిక్షిశామికవాడలోనే 1947లో బెక్‌లైట్ లిమిటెడ్ లండన్ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్‌లో హైదరాబాద్ లామినేటెడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 

1942లో ఆధునిక అమెరికా మిషన్లతో రూ.42 లక్షల పెట్టుబడితో ద బయో కెమికల్ అండ్ సింథటిక్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇదే ఏడాదిలో రూ.40 లక్షల పెట్టుబడితో 32 ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. 1946లో ఒకేసారి వంద ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. వీటిల్లో 10 వేల మంది కార్మికులు పనిచేసేవారు.

పెట్టుబడులకు ప్రభుత్వ ధీమా
నిజాం ప్రభుత్వం ఇతర పారిక్షిశామికవేత్తలకు భరోసా ఇచ్చే విధంగా, కార్మికులకు రక్షణగా నిలిచే పద్ధతిలో భారీ సంస్థలలో 51 శాతం మేర తన పెట్టుబడులు పెట్టేది. ఆ రకంగానే పలు కంపెనీలను ఏర్పాటుచేసింది. దీంతో అనేక కంపెనీలు లిమిటెడ్ కంపెనీలుగా పనిచేశాయి. ఫలితంగా నిజాం ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం రావడంతోపాటు లక్ష మందికి ఉపాధి లభించింది.

బహుజన పరిక్షిశమలు
హైదరాబాద్ సంస్థానంలో మొదట్లో చేతివృత్తుల పరిక్షిశమలదే పైచేయి. వీటిల్లో బహుజన కులాలకు చెందినవారే ఎక్కువగా పనిచేసేవారు. పలు రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర ఉంది. వరంగల్ జిల్లా కూనసమువూదము, దిదరుర్తి, కొమరపల్లి, నిర్మల్, జగిత్యాల, అనంతగిరి, లింగంపల్లి, నిజామాబాద్‌లలో ఇనుమును కరిగించి వస్తువులు తయారుచేసేవారు. 

నిర్మల్ వద్ద శ్రేష్టమైన ఉక్కును తయారుచేసేవారు. ఎల్లందల్, ఇబ్రహీంపట్నం, కోనాపూరు, చింతలపేట తదితర స్థలాల్లో మంచి ఉక్కు తయారయ్యేది. 1890వరకు హైదరాబాద్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లలో విరివిగా కత్తులు తయారుచేసేవారు. ఖమ్మం జిల్లాలోని జగదేవపూరులో బంగారు నీరు పోసిన కత్తులు తయారుచేసేవారు. గద్వాలలో తుపాకులు తయారయ్యేవి. రోహిలాలు పట్టే పెద్ద తుపాకులను వనపర్తి, గద్వాల, నిర్మల్‌లో చేసేవారు. నూలు, పట్టు కలిపిన మష్రూ బట్టలను హైదరాబాద్‌తోపాటు కరీంనగర్ జిల్లాలోని మాధాపురంలో నేసేవారు. నిజామాబాద్ జిల్లా ఇందూరు, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లోని కోయిలకొండలో కాగితాన్ని ఉత్పత్తి చేసేవారు. ఇవన్నీ సహజ సిద్ధంగా దొరికే సంపదతో స్థానిక బహుజన ప్రజలు తయారుచేసేవారు. ఈ విధంగా గ్రామాలలో ఈ పరిక్షిశమలన్నీ చేతి వృత్తుల వారికి జీవనోపాధి కలిగించేవి. కాలక్షికమంలో చేతి వృత్తుల పరిక్షిశమ క్షీణించింది. యూరప్ ప్రభావంతో నిజాం కాలంలో భారీ పరిక్షిశమలు వచ్చాయి.


నిజాం హయాంలో తెలంగాణలో ఏర్పడిన కొన్ని పరిక్షిశమలు:
1871               సింగరేణి బొగ్గు గనులు
1873               మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876               ఫిరంగుల ఫ్యాక్టరీ, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910               సోడా, ఐరన్ ఫ్యాక్టరీలు
1916               దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919               వీఎస్‌టీ ఫ్యాక్టరీ
1921               కెమికల్ లాబోరేటరీ
1927               దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929               డీబీఆర్ మిల్స్
1931               వరంగల్ అజంజాహి మిల్స్
1932               ఆర్‌టీసీ స్థాపన
1937               నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939               సిర్పూర్ పేపర్ మిల్
1941               గోల్కొండ సిగట్ ఫ్యాక్టరీ
1942               హైదరాబాద్ స్టేట్ బ్యాంక్,  హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్ 1943 ప్రాగా టూల్స్
1946               హైదరాబాద్ ఆస్‌బెస్టాస్
1947               హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్ట్


ఆనాడే అంతర్జాతీయ ఖ్యాతి
నిజాం కాలంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో పరిక్షిశమలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడిన పరిక్షిశమలు ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. టెక్స్‌టైల్స్ రంగం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఆనాడు డిఫెన్స్ పరికరాలు తయారుచేయడంలో ప్రాగా టూల్స్ కీలక పాత్ర వహించింది. చెరుకు పంటకు హైదరాబాద్ సంస్థానం కీలకం కావడంతో నిజాంషుగర్స్‌ను ఏర్పాటు చేసి 39 ఫ్యాక్టరీలను నెలకొల్పారు. తెలంగాణతోపాటు కర్ణాటకలోని రెండు జిల్లాలకు, మరట్వాడలోని 3 జిల్లాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది.
- బాల్‌డ్డి, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్


తెలంగాణలో భారీగా ఖనిజ సంపద ఉన్నట్లు క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం 1వ శతాబ్దం మధ్యనే గుర్తించినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 14 వ శతాబ్దంలో వూట్జ్ స్టీల్‌తో కత్తులు, తల్వార్లు తయారుచేసేవారు. అరబ్బు చక్రవర్తులు ఈ తల్వార్లను దిగుమతి చేసుకున్నారు. నిజాం రాజు అజాంజాహి కాలంలో మోడరన్ ఇండవూస్టీలు వచ్చాయి. 1956కన్నా ముందు తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం పారిక్షిశామికంగా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. నిజాం సర్కారు పరిక్షిశమలు ప్రతి జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. 1910 నుంచి 1940 వరకు పరిక్షిశమల అభివృద్ధి వేగంగా జరిగింది.
- ఎన్.వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్


కుత్‌బ్‌షాహిల కాలంలోనే గోల్కొండ డైమండ్ మైనింగ్ కంపెనీ మణికొండలో 60వేల మంది కార్మికులతో పనిచేసేది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన తావర్నీయర్, డాక్టర్ డెర్నియర్‌లు తమ రచనలో తెలిపారు. పారిక్షిశామికీకరణలో ఎంత ముందున్నామో తెలిపేందుకు ఈ ఒక్క సంఘటన చాలు. నిజాం రాజు పరిక్షిశమల కోసమే సనత్‌నగర్‌ను నెలకొల్పారు. ఆనాడు పరిక్షిశమల అభివృద్ధి కారణంగా తెలంగాణలోనే ఎనిమిది విమానాక్షిశయాలు ఏర్పాటయ్యాయి. చ్నై, విజయవాడల కంటే ముందుగానే హైదరాబాద్‌కు ప్రత్యేక రైల్వే వ్యవస్థ ఉన్నది. 1910లోనే థర్మల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు అయింది. 150 ఏళ్ల నుంచే బొగ్గు ఉత్పత్తి మొదలైంది. చేనేత రంగంలో నిపుణులైన కార్మికులు ఒక్క తెలంగాణలోనే ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి నిపుణులైన కార్మికులను బొంబాయి, బీవండిలకు తీసుకెళ్లేవాళ్లు.

ఎన్ని రకాల పరిక్షిశమలో..
నిజాం కాలంలో పలు రకాల పరిక్షిశమలు విస్తరించాయి. టెక్స్‌టైల్స్, మింట్, ఇంజనీరింగ్, రైల్వేస్, వాటర్ పంపింగ్ స్టేషన్, విద్యుత్, బ్రీవరేజెస్, ప్రింటింగ్, సబ్బులు, ఉండ్ అండ్ కార్పెంటరీ, జైలుఫ్యాక్టరీ, ఇండవూస్టియల్ స్కూల్స్.. ఇలా రకరకాల పరిక్షిశమలు అప్పటి అవసరాలకు, ప్రగతికి ప్రతీకలుగా నిలిచాయి. అవన్నీ ప్రభుత్వం రంగంలో ఏర్పడిన పరిక్షిశమలు కావడం గమనార్హం.

ప్రైవేట్ యాజమాన్యంలోనూ అదే స్థాయిలో టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, మెటల్స్, ఫుడ్ డ్రింక్ అండ్ టొబాకో, ఉడ్ అండ్ గ్లాస్, కెమికల్ అండ్ డ్రగ్స్ తదితర పరిక్షిశమలు వచ్చాయి. 1932లో ఆరులక్షల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ ఏర్పడింది. 1943లో రూ. తొమ్మిది లక్షల పెట్టుబడితో హైదరాబాద్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించారు. 1943లోనే హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాగాటూల్స్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీలు రెండో ప్రపంచ యుద్ధానికి కావాల్సినంతగా ఉత్పత్తి చేసి, ఆర్థికంగా బలపడ్డాయి.
- పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు

Continue Read 2 Part click this link






Take By: T News

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP