-కాంగ్రెస్‌లో మళ్లీ ఆధిపత్యపోరు?
- పీసీసీ చీఫ్‌కు ముఖ్యమంత్రి చెక్!
- జిల్లాల నేతలతో బొత్స మంతనాలు
- పలుకుబడి పెంచుకునే యత్నం!
- నెంబర్ టూ లేకుండా కిరణ్ జాగ్రత్త?
- అందుకే రాజనర్సింహకు దక్కని హోం!
- డీఎస్‌కు షరతులతో కూడిన ఎమ్మెల్సీ
- ఒక వ్యక్తికి ఒకే పదవి సూత్రం?
- ఢిల్లీలో సీఎం ప్రతిపాదన
హైదరాబాద్, అక్టోబర్ 27 ():రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పునరావృతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీమాంధ్ర నేతల మధ్యనే ఈ పోరు తీవ్రంగా కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఊపందుకుంది. ప్రభుత్వంలో తనకు కీలక బాధ్యత అప్పగిస్తారని, పీసీసీ అధ్యక్షునిగా తాను ఉన్నందున అదే స్థాయిలో ప్రభుత్వంలోనూ తన ప్రాధాన్యం పెరుగుతుందని ఆశించిన బొత్సకు ముఖ్యమంత్రి ఆదిలోనే చెక్ పెట్టటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరించాలని, ఏ ఒక్కరి జోక్యాన్ని లేదా ప్రాధాన్యాన్ని అంగీకరించేది లేదనే విధంగా సీఎం పావులు కదుపుతున్నారని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన బొత్సను దూరం పెడుతున్నారని చెబుతున్నాయి. అధిష్ఠానం ఒత్తిడితో దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయన కోరిన హోం శాఖను ఆయనకు అప్పగించకపోవడానికీ ఇదే కారణమని అంటున్నారు. కొత్తగా కౌన్సిల్‌కు ఎన్నికైన డీ శ్రీనివాస్ నుంచి కూడా ప్రతిబంధకాలు ఎదురుకాకుండా ముందస్తు షరతులతోనే ఆయన అధిష్ఠానంతో మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. భవిష్యత్తులో సీఎం కుర్చీ ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి వ్యవహారశైలి నచ్చక ఇప్పటికే అరవై రోజులుగా సచివాలయం ముఖం చూడలేదు. మంత్రిగా తన బాధ్యతలను ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు.
అయితే, పీసీసీ అధ్యక్షునిగా ఎక్కువ సమయం గాంధీభవన్‌లో ఉండి అన్ని జిల్లాల నేతలతో మాట్లాడుతూ తన పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించని బొత్సతో తెలంగాణ ప్రాంత నేతలు కూడా సన్నిహితంగా మెలుగుతుంన్నారు. వారి నుంచి తెలంగాణ పర్యటనలకు ఆహ్వానం కూడా పొందుతున్నారు. ఇది తనకు ప్లస్ పాయింట్‌గా అధిష్ఠానం వద్ద బొత్స చెప్పుకొనేందుకు వీలు కలిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జోరులో ఆర్టీసీ సమ్మెను వాయిదా వేయించేందుకు సంఘ నాయకులతో చర్చలు జరిపి ముందస్తు ప్రయత్నం చేసి కేంద్రం వద్ద బొత్స మార్కులు కొట్టేసే యత్నం చేశారు. అయితే, తరువాతి పరిణామాల్లో సీఎం చొరవ తీసుకుని ఇతర శాఖల ఉద్యోగులు, కార్మికుల సమ్మెను విరమింప చేయటంతో అధిష్ఠానం వద్ద ఆయన కూడా క్రెడిట్ కొట్టేశారు. సకల జనుల సమ్మె విషయంలో పోటాపోటీలు ఎలా ఉన్నా ప్రభుత్వ వ్యవహారాల్లో ఇతర నేతల జోక్యాన్ని సీఎం ఏమాత్రం సహించటం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సీన్ రివర్స్.. :కేంద్రం స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ నిర్వహిస్తున్న పాత్ర లేదా వైఎస్ హయాంలో రాష్ట్రంలో రోశయ్య నిర్వహించిన పాత్ర తనకు లభిస్తుందని బొత్స ఆశించారు. రోశయ్యకు వైఎస్ అధిక గౌరవం ఇచ్చి, అన్నా అని పిలుస్తూ దాదాపు అన్ని కమిటీలకు రోశయ్యనే అధ్యక్షునిగా ఎంపిక చేసేవారు. ప్రభుత్వంలో లేదా మంత్రివర్గంలో ద్వితీయ స్థానం కల్పించారు. దీంతో దాదాపు అందరు మంత్రులు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా రోశయ్య ఆధ్వర్యంలో పని చేసేవారు. తరువాతి దశలో వైఎస్ అకాల మరణం తరువాత రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కటంతో మంత్రులంతా ఆయన వద్ద భయభక్తులతోనే పని చేశారు. ఒకరిద్దరు వ్యతిరేకించినా రోశయ్య వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. కేబినెట్‌లో రెండో స్థానం లభించటం, తరువాతి దశలో అత్యంత కీలకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తాయి. అందుకే బొత్స కూడా అదే స్థాయిని ఆశించి భంగపడ్డారని వాదన ఉంది. అందుకే ఎక్కువ రోజులు సచివాలయానికి గైర్హాజరయ్యారని, ఒక దశలో హైదరాబాద్‌లో ఉండి కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ కిరణాలు కార్యక్షికమ సమీక్షకు బొత్స రాలేదని విమర్ళలున్నాయి. ఇరువురి మధ్య క్రమంగా పెరుగుతున్న అగాథం ఎటు దారి తీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. ఈలోపు మరో అధికార శిబిరం ఏర్పడే అవకాశముందని, అది డీ శ్రీనివాస్ రూపేణా ముందుకు రావచ్చని భావిస్తున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో డీ శ్రీనివాస్‌కు చోటు ఖాయమని, అది కూడా అత్యంత కీలకమైన శాఖ ఆయనకు కేటాయించే అవకాశముందని అప్పుడే ఊహాగానాలు బయల్దేరాయి.
డీఎస్‌కు హోం శాఖ కట్టబెడతారని కొందరు అంచనా వేస్తుండగా, అసలు కేబినెట్‌లోకి ఆయన రాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. ఆ షరతుపైనే డీఎస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన అడ్డు చెప్పలేదని భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజనర్సింహ హోం శాఖ ఆశించినా కిరణ్ నెరవేర్చలేదు. దీనికి రాజనర్సింహ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినా కిరణ్ పట్టించుకోలేదు. హోం శాఖ ఇస్తే కేబినెట్‌లో ద్వితీయ స్థానం ఇచ్చినట్టవుతుందని భావించే కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ కూడా రాజనర్సింహ వద్ద ఉంటే అది కచ్చితంగా మరో అధికార శిబిరంగా మారుతుందన్న అంచనాతోనే ముఖ్యమంత్రి ముందు జాగ్రత్త పడ్డారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ 2014 ఎన్నికల వరకూ ఏకఛవూతాధిపత్యం కొనసాగించాలన్న కోరిక నేపథ్యంలోనివేనని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంవూతికి చెక్ పెట్టేందుకే ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షునిగా బొత్సను అధిష్ఠానం నియమించినట్లు వార్తలొచ్చాయి. తెలంగాణకు చెందిన అత్యంత సీనియర్ నేత డీఎస్‌కు తాజాగా ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో కిరణ్ ఏకఛవూతాధిపత్యం ఆయన కోరుకున్నట్లుగా 2014 వరకూ కొనసాగుతుందా? అనేది వేచి చూడాల్సిన అంశమే!
ఒక వ్యక్తికి ఒకటే పదవి...
ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలనే విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో అధిష్ఠానం వద్ద ప్రతిపాదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పీసీసీ అధ్యక్షునిగా మాత్రమే బొత్సను కొనసాగించాలని, మంత్రిగా కూడా బొత్స కొనసాగితే పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో తన సమయాన్ని వెచ్చించలేరని ముఖ్యమంత్రి హస్తిన నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్టుగా సమాచారం. 2014లో వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికల వరకు పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేయటానికి బొత్సకు అధిక సమయం అవసరమని, కార్యకర్తలకు బొత్స అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే బొత్సను మంత్రివర్గం నుంచి తప్పించటం మంచిదని కూడా కిరణ్ ఢిల్లీలో వివరించారని అంటున్నారు. ఈ విషయం బొత్సకు కూడా తెలిసిందని, దీంతో వారి మధ్య కోల్డ్‌వార్ మరింతగా పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,
Read more...