Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, November 19, 2011

వర్ధమాన’ మహావీరుడు గడాఫీ!

 See Down and read News ....


నిజమాడితే ఉన్న ఊరూ, దేశ మూ అచ్చిరాదని పెద్దలు చెబు తారు! బహుశా అలాంటి పరి ణామం ఏదో ఉత్తరాఫ్రికాలోని లిబియా పాలకుడు గడాఫీకి పట్టుకున్నట్టుంది. ఎందుకంటే వర్ధమాన దేశాలకు గడాఫీ తన అనుభవాలు ఆధారంగా రూ పొందించిన సిద్ధాంత రచన ‘గ్రీన్‌బుక్’ మూడు దశాబ్దాల నాడే ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’కు ప్రత్యామ్నాయంగా ముం దుకొచ్చింది. వర్ధమాన దేశాలు, ముఖ్యంగా అరబ్ దేశా లను ఆర్థిక దాస్యం నుంచి విముక్తం చేయడానికి అవతరిం చిన గడాఫీ వ్యూహరచన ఈ చిన్ని పొత్తం. ఆంగ్లో-అమె రికన్ సామ్రాజ్యవాదులు తమ ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడటం కోసం ప్రపంచబ్యాంకును అడ్డం పెట్టు కుని ప్రపంచాన్ని దరిద్రీకరించే విధానాన్ని ‘ప్రపంచీకరణ’ పేరిట ప్రవేశపెట్టిన ‘బ్లూప్రింట్’కు విరుద్ధమైన నమూనా గడాఫీ ‘గ్రీన్‌బుక్’. ఆనాడే గడాఫీ ఆచరణలో పెడుతూ వచ్చిన ‘సంస్కరణలు’, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థలు సుతరామూ సహించలేని సంస్కరణలు.

ఇవి ఆ సంస్కరణలు కావు...
గడాఫీ లిబియాలో ప్రవేశపెట్టిన ఈ ప్రజానుకూలమైన ప్రజాతంత్ర సంస్కరణలు, దేశ స్వరూప స్వభావాలలో మౌలికమైన మార్పును తెచ్చాయి. అయినా సరే, సామ్రా జ్యవాదుల దృష్టిలో నిజం కురచగానూ, ‘బొంకు’ మాత్రం పొడవుగానూ కనిపిస్తుంది! అయితే గమ్మత్తేమంటే ప్రజా తంత్ర ప్రజాహిత సంస్కరణల ద్వారా లిబియా ప్రజలు అనుభవించిన అసలు ‘వసంతా’న్ని కనుమరుగు చేసి సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష జోక్యంతో బరిలోకి దిగి స్థానిక స్వపరిపాలనా వ్యవస్థపై తన ప్రభావంలో ఉన్న ప్రతిపక్షం చేసిన తిరుగుబాట్లకు ‘అరబ్ వసంతం’ (అరబ్ స్ప్రింగ్) అని పేరు పెట్టారు! అంతేగాదు, సామ్రాజ్యవాదుల దృష్టిలో ‘ప్రజాస్వామ్యం’, ‘స్వేచ్ఛ’, ‘నియంతృత్వం’ అన్న పదాలకు అర్థాలు వేరు. ప్రజాహిత పాలనలో ఉన్న నిజమైన ప్రజాతంత్ర వ్యవస్థలూ, పాలకులూ సామ్రాజ్య వాదుల దృష్టిలో ‘నియంతృత్వాలు’, ‘నియంత’లూ. పెట్టుబడిదారీ వ్యవస్థనూ, సామ్రాజ్యవాదుల్ని వ్యతిరేకిం చే సంస్థలూ, దేశాధినేతలూ ‘శాంతి విధ్వంసకులూ’, ‘ఉగ్రవాదులూ’! అందుకే కారల్ మార్క్స్‌ను ఒక ‘విధ్వం సక సిద్ధాంతకర్త’గా, తొలి సోషలిస్టు సోనియెట్ స్థాపకుడు లెనిన్‌ను ‘తిరుగుబాటు దారుడి’గా, జోసఫ్ స్టాలిన్, మావోసేటుంగ్‌లను ‘పచ్చి నియంతలు’ గానూ సామ్రా జ్యవాదులు చిత్రించారు! ఈ కోవలోనే సామ్రాజ్యవాద దుష్టకూటమి తమ పెట్రోల్ దాహార్తిని తీర్చుకొనే యత్నం లో దురాక్రమణ విధానాలను సమర్థించుకోడానికి ఇరాక్ అధినేత సద్దామ్ హుస్సేన్‌ను, లిబియన్ గడాఫీని ‘నియం త’లుగా, ఉగ్రవాద మద్దతుదారులుగా ముద్రవేసి, ప్రచా రం చేసి దారుణంగా హత్య చేసింది.

అలాగే నలభై ఏళ్ల నాడు ప్రజాతంత్ర - సోషలిస్టు చిలీ ప్రజా నాయకుడైన అలెండీనీ ‘నియంత’గా చిత్రించి అమెరికా తన పొట్టన పెట్టుకుంది! కాంగోలోని రాగి నిక్షేపాలను కొల్లగొట్టడం కోసం కాంగో ప్రజల ప్రియతమ నాయకుడైన పాటిస్ లుముంబా ప్రభుత్వాన్ని కూలదోసి, లుముంబానూ హత్య చేశాయి అమెరికా, బెల్జియం, బ్రిటన్‌లు! పశ్చిమా సియా, ఉత్తరాఫ్రికాలలో మొదటిసారిగా రాజకీయ, ఆర్థిక సాంఘిక రంగాల్లో ప్రజాతంత్ర సంస్కరణలకు ఊపిరి పోసిన నేతలు నాసర్ (ఈజిప్టు), మొసాబిక్ (ఇరాన్), సద్దాం హుస్సేన్, గడాఫీ. మన ఇండియా సహా అనేక వర్ధ మాన దేశాల్లో చూస్తున్న జాతీయోత్పత్తుల సగటు విలు వకూ, ఆ దామాషాలో అందవలసిన తలసరి ఆదాయ పంపిణీకి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తెలిసిందే! కానీ లిబియాలోని గడాఫీ పాలనలో నేటి విధ్వంస కాండకు ముందు జాతీయోత్పత్తుల సగటు విలువ సాధించిన వృద్ధి రేటుతో బరాబరిగా లిబియా ప్రజల తలసరి ఆదాయం తులతూగడం ఒక విశేషం!

అది నియంత్రణే... కాదు నియంతృత్వం
‘నియంత’కూ నియంత్రణకూ తేడా ఉంది! అయితే ‘నియంత లేకపోయినా విధానాల అమలుకు ఏ వ్యవస్థలో అయినా ‘నియంత్రణ’ అనివార్యమవుతుందని మరవ రాదు! ప్రజాహిత సంస్కరణల అమలుకు, నూతనంగా రాజకీయ స్వాతంత్య్రం పొందిన వర్ధమాన దేశాల ఆర్థికా భ్యున్నతికి ఈ నియంత్రణ అవసరం! ప్రపంచ సామ్రాజ్య వాద పెట్టుబడిదారీ వ్యవస్థ మూలంగా ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభాల నుంచి తాము బయటపడటం కోసం ప్రవేశపెట్టే ప్రజావ్యతిరేక సంస్కరణలు సంపన్న వర్గాల ‘చేతి ఎత్తు బిడ్డలు’గా మారిన వైనాన్ని గమనిస్తూ వచ్చిన గడాఫీ అందుకు విరుద్ధమైన వ్యూహరచనకు దిగాడు. ఇస్లామిక్ సమాజ పరిధుల్ని దృష్టిలో ఉంచుకునే, ఆమో దయోగ్యమైన పద్ధతుల్లో మూఢవిశ్వాసాల నుంచి లిబి యా ప్రజలను విముక్తం చేసి, ఆధునిక పురోగామి వ్యవస్థ నిర్మాణానికి ‘ఇస్లామిక్ సోషలిజం’ స్థాపించాలని కలలు కన్నాడు! ఈ కలలు కొందరికి ‘కల్లలు’గా కనిపించవచ్చు గాని లిబియా ప్రజా బాహుళ్యంలో హెచ్చు మందికి కష్ట పడి సాధించుకోదగిన నూతన సామాజిక వ్యవస్థగానే గడాఫీ ఆలోచనలు కనిపించాయి. గతంలో సూయెజ్ కాల్వను ఈజిప్టు ప్రయోజనాల దృష్ట్యా జాతీయం చేయ డానికి ఆ దేశాధినేతగా, అలీన దేశాల అగ్రనాయకులలో ఒకరుగా నాసర్ నిర్ణయించినప్పుడు ఆయనపైన ఆంగ్లో- అమెరికన్లు కత్తికట్టారు. అలాగే లిబియాను క్రమంగా ఆధు నికం చేస్తూ అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందించడం కోసం, గడాఫీ ప్రజాతంత్ర సోషలిస్టు వ్యవస్థ స్థాపన కోసం ఒక బ్లూప్రింట్‌ను 1976-79 మధ్యకాలంలో విడు దల చేసి పెద్ద సంచలనం కలిగించాడు! ఈ బ్లూప్రింటే ‘గ్రీన్‌బుక్’, దాని సారాంశం ‘ఇస్లామిక్ సోషలిజం’!

గడాఫీకి ప్రేరణ రూసో, మావో
మానవ సమాజాన్ని పురోగామి దిశగా మళ్లించడానికి వివిధ కాలాలలో దోహదం చేసిన పలువురు సుప్రసిద్ధ సామాజిక, తాత్విక సిద్ధాంత కర్తల భావాలతో ప్రభావితు డైన గడాఫీ ఈ ‘గ్రీన్‌బుక్’ను లిబియా పాలనా వ్యవస్థలో తాను రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాలలో ప్రవేశపెట్ట దలచిన విధానాలకు ప్రతిరూపంగా, సిద్ధాంత రచనగా రూపొందించాడు. ఈ సిద్ధాంత రచనకు రూసో రచనలూ, అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు ఉద్దీపనంగా ఉన్న ‘ఫెడరలిస్టు’ పత్రాలూ, ఆధునిక కాలంలో నాసర్ ఆలోచ నలు, నవ చైనా నిర్మాత మావోసేటుంగ్ ‘లిటిల్ రెడ్‌బుక్’ సూత్రాలూ గడాఫీకి ప్రేరణనిచ్చాయి. గడాఫీ ‘గ్రీన్‌బుక్’ మూడు భాగాలు. అటు పెట్టుబడిదారీ విధానానికి, ఇటు కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే విశ్వసించి, ఈశ్వర జిజ్ఞాసతో నిమిత్తం లేని కమ్యూనిజానికీ సంబంధం లేని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ (తృతీయ ప్రపంచ వ్యవస్థా సిద్ధాంతం... లేదా ‘థర్డ్ యూనివర్సల్ థియరీ’)ను గడాఫీ గ్రంథం అభిలషిస్తోంది! ‘గ్రీన్‌బుక్’ తాలూకు మొదటి భాగం పేరు ‘ప్రజల సత్తాకత’ (ప్రజలే నిర్ణాయకశక్తి). రెం డవ భాగం మకుటం ‘దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం సోషలిజం’. ఇది 1978లో వెలువడింది. ఇక మూడవ భాగం పేరు ‘తృతీయ ప్రపంచ సిద్ధాంతం-దాని సామా జిక పునాది’. గడాఫీ ప్రతిపాదనలు కొన్ని ‘కలగా పులగం’గా కనిపించినప్పటికీ అతని భావాలలోని అభ్యు దయకర ధోరణులను ఎవరూ విస్మరించలేరు. ఉదాహ రణకు ‘‘వేతన కూలీలు తమను బాడుగకు కుదుర్చుకునే బుగతకు (ఆసామికి) బానిసలు. వీళ్ల విమోచనకు మార్గం ఏమిటి? అసలు వేతన బానిస వ్యవస్థనే రద్దు చేయడం ద్వారా బానిస సంకెళ్ల నుంచి ప్రజల్ని బయటపడవేసి, సమాజంలో వర్గాలు, పాలనా రూపాలు, మానవ నిర్మిత చట్టాలూ పుట్టకముందున్న మానవ సంబంధాలను శాసిం చిన సహజమైన ప్రకృతి సూత్రాలను ఆశ్రయించి గౌరవిం చాలి’’ అని గడాఫీ సూత్రీకరించాడు! ఆయనదే మరొక సూత్రీకరణ ‘‘ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చు కోవడానికి మాత్రమే సంపాదించాలిగాని అంతకు మించి సంపాదించరాదు’’. అయితే మానవుడి అవసరానికి, విలాసానికి మధ్య లేదా అవసరానికీ హద్దు మీరిన ఆబకూ మధ్య ఎక్కడ విభజనరేఖను గీయాలో ఆయన నిర్వచిం చలేదని కొందరి సంశయం.

స్త్రీ పక్షపాతి గడాఫీ...
స్త్రీల పట్ల, వారి సమస్యల పట్ల, నీగ్రోలు, తదితర శ్వేతేతర జాతుల పట్ల గడాఫీ అభిప్రాయాలు ఎంతో ఆర్ద్రతతో కూడి ఉంటాయి. నిత్యజీవనంలో విద్య, సంగీతం, ఇత్యా ది కళారూపాలంటే అతనికి వల్లమాలిన అభిమానం. ప్రభుత్వ నిర్వహణ సమస్యకు పరిష్కారం చూపే యత్నం లో ఆచరణలో నియంతృత్వ దశ నుంచి నిజమైన ప్రజా స్వామ్యయుగం వైపుగా ప్రజలు పయనించాల్సిన మార్గా న్ని సూచనప్రాయంగా గడాఫీ తన ‘గ్రీన్‌బుక్’లో పేర్కొ న్నాడు. స్త్రీల పట్ల, వారి సమస్యల పట్ల గౌరవ భావంతో స్పందించే స్వభావం గల గడాఫీ పురుషులు అర్థం చేసుకో లేని స్త్రీల జీవశాస్త్ర సంబంధమైన వేదనా సందర్భాలను కూడా నిర్మొహమాటంగా ప్రకటించాడు! విద్యావిధానం లో పాత పద్ధతులు పోవాలనీ, ఇందుకోసం ‘ప్రపంచ స్థాయిలోనే సాంస్కృతిక విప్లవం’ రావాలనీ ఆయన కోరు కున్నాడు. సాంస్కృతిక రంగంలో సమూలమైన ప్రక్షాళన జరిగితే గాని మానవునిలో ప్రవేశిస్తున్న కృత్రిమమైన వికా రాలు, నీచాభిరుచులు, సంకుచిత మనస్తత్వం, ఉన్మాదపు ఆలోచనల నుంచి మానవుడి మనస్సును విముక్తి చేయ లేమని గడాఫీ భావించాడు!

గడాఫీ భావాలు ‘పచ్చన’...
శ్వేత జాతీయులు ప్రపంచంలోని అన్ని ఖండాలలోని సువిస్తారమైన ప్రాంతాలను తమ వలసలుగా మార్చు కోవడానికి చేయని చెడు లేదు, తినని గడ్డి లేదు! ఇప్పుడే వరసమారిపోయి నల్లజాతులు ప్రపంచాన్ని ప్రభావితం చేయబోతున్న తరుణం ఇది. ఆధునిక యుగంలో ఏ సమా చారన్నయినా వ్యక్తి తన సొంతం చేసుకుని గుత్తాధికారం చెలాయించడాన్ని ప్రజాస్వామ్యం అనుమతించదు, ఏదో ఒక పద్ధతిలో స్వీయాభిప్రాయాన్ని ప్రకటించుకోడానికి వ్యక్తులకు సహజమైన హక్కు ఉంటుంది. బలవంతపు విద్య స్వేచ్ఛను అణగదొక్కుతుంది. ఫలానిది మాత్రమే నీవు చదవాలని బలవంతపెట్టడం నియంతృత్వ చర్య. వ్యవసాయ భూములకు వెళ్లే మార్గాలను, రహదారులను చెడగొట్టి, స్పోర్టింగ్ క్లబ్బులు నిర్మించరాదు. చిన్నపిల్లల్ని నర్సరీల్లో బలవంతంగా చేర్పించడం నియంతృత్వపోకడ. అది పిల్లల స్వేచ్ఛను, సహజమైన వాతావరణంలో పెంప కాన్ని దెబ్బతీస్తుంది. ‘పూట బత్తెం పుల్ల వెలుగు’గా బతు కులీడ్చే జీవులున్న చోట మానవుడు బానిస కిందనే లెక్క, సోషలిస్టు సమాజంలో ఇతరులకు కారును అద్దెకివ్వడం కోసమని ఏ వ్యక్తీ ప్రైవేట్ కారును కొనుక్కోజాలడు. ఎం దుకంటే, ఈ పద్ధతి ఇతరుల అవసరాల్ని నియంత్రిస్తుంది కాబట్టి. కాగా ప్రజాస్వామ్యవ్యవస్థ అనేది సమన్వయ పూర్వకమైన వ్యవస్థ. ఇందుకుగాను బలమైన పునాదులు అవసరం. ఆ పునాదులు సమకూర్చే సంస్థలు మౌలిక ప్రజాసంబంధాల సంస్థ (బేసిక్ పీపుల్స్) పీపుల్స్ కాన్ఫ రెన్సెస్, పీపుల్స్ కమిటీలు (ప్రజాసంఘాలు) వీటికి మిం చి ప్రజాస్వామ్య సమాజం ఏముంటుంది? ప్రజలు పాల్గొ నని బహిరంగసభలు, సమావేశాల మాదిరిగా ప్రజలు పాల్గొనకుండా కేవలం అలంకారప్రాయంగా ఉండే పార్ల మెంటుకు విలువలేదంటాడు గడాఫీ.


‘ప్రత్యక్ష’ ప్రజాస్వామ్యం అతని అభిమతం
అంతేకాదు, ప్రజాబాహుళ్యం పేరు చెప్పి వారి ప్రతినిధు లుగా ఏ కొద్ది మందో ఎన్నికయ్యే ప్రక్రియను ‘నిజమైన ప్రజాస్వామ్యం’గా భావించలేమనీ, అందువల్లనే పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమయిందనీ, అలాగే ఆదివాసీ, వర్గవ్యవస్థలు కూడా విఫలమయ్యాయనీ గడాఫీ తన ‘గ్రీన్‌బుక్’లో పేర్కొన్నా డు. కనుక సమస్యల పరిష్కారానికి ప్రజా బాహుళ్యం పాల్గొనే ‘పాప్యులర్ సభలూ’, ‘ప్రజా సంఘాల’ నిర్మాణ మే శరణ్యమనీ ఆయన భావన. అంతేగాదు. అమెరికా పెట్టుబడిదారీ సమాజం కుటుంబ నియంత్రణ విధానాన్ని వర్ధమాన దేశాల్లో ప్రవేశపెట్టడం ద్వారా శ్వేతేతర జాతుల జనాభా పెరక్కుండా నియంత్రించిందన్నది గడాఫీ నిశ్చితాభిప్రాయం.

ప్రజల ప్రత్యక్ష పాత్ర ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది గాని కొద్ది మంది ‘ప్రజాప్రతినిధుల’ మూలంగా ప్రజాస్వామ్యం బతకదు! భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క పౌరుని హక్కు. ఒకవేళ పౌరుడు తన అభిప్రాయం వెలిబుచ్చడంలో హేతు విరుద్ధంగా ప్రవర్తించినా భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అతనికి ఉం డాలి. గడాఫీ తన ‘గ్రీన్‌బుక్’లో వెలిబుచ్చిన భావాల పిండితార్థం ఇదీ! అసూయ అనే అంధకారంలో కొందరు ఏక నలుపునే చూస్తారట. అలాగే భిన్న కోణాలు గల గడాఫీ వ్యక్తిత్వంలో ఉన్న మంచిని సామ్రాజ్యవాదులు చూడ నిరాకరించారు. ప్రజల ఆలోచనలను ఏకపక్షంగా ప్రభావితం చేయగల బలమైన ప్రచార సాధనాల ద్వారా తమ ‘శత్రువు’ను దుష్టశక్తిగా చిత్రించడంలో సఫలీకృతు లయ్యారు. మెజారిటీ ప్రజల శ్రేయస్సును కోరుకొనే శక్తి మంతులైన దేశాధిపతులను, ప్రపంచానికి ‘పెద్దన్న’గా చలామణి అవుతున్న అమెరికా తన దురాక్రమణ విధా నాల ద్వారా అంతం చేస్తుందని గడాఫీ దారుణహత్య మరోసారి తిరుగులేని విధంగా రుజువు చేసింది!


‘గ్రీన్‌బుక్’ సారం సమత!
  • లిబియా పౌరులందరికీ ఉచిత విద్యుచ్ఛక్తి.

  • బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు కాబట్టి పౌరులు చట్టాల ప్రకారం వడ్డీ లేకుండా రుణాలు తీసుకోవచ్చు.
    ప్రజలకు నిలువ నీడ కోసం గృహవసతి పొందే హక్కు.

  • కొత్తగా పెళ్లయిన జంటలు ఇల్లు కొనుక్కుని, సంసారం పెట్టుకోడానికిగాను వారికి 50,000 డాలర్లను ప్రభు త్వం నుంచే పొందే హక్కు.

    ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు పొందే హక్కు.
    వ్యవసాయం చేసుకోదలచిన వారికి వ్యవసాయ ప్రయోజనాల నిమిత్తం ఉచితంగా భూమిని పొందే హక్కు.

  • పౌరులకు విద్య, వైద్య సదుపాయాలు స్థానికంగా లభించనప్పుడు వారిని ఇతర దేశాలకు ప్రభుత్వం 
  • పంపిస్తుంది. ఇందుకుగాను వారికి నెలవారీ జీవన భృతి కింద 2,300 డాలర్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది.

  • పౌరులు కారు కొనుక్కుంటే కారు రేటులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది.

  • అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 0.14 డాలర్లు.

  • లిబియాలో చెల్లించాల్సిన విదేశీ రుణాలు ఏవీలేవు, 150 బిలియన్ డాలర్ల మేర విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయి.

  • యూనివర్సిటీ పట్టభద్రులై విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్లిన తరువాత వారికి ఉద్యోగం దొరికే దాకా సగటు జీతాన్ని ప్రభుత్వం ఇస్తుంది.


  • పెట్రోల్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదా యంలో కొంత భాగాన్ని ప్రతీ పౌరుడి బ్యాంకు అకౌం టుకు ప్రభుత్వం జమచేస్తుంది.
  • ప్రతీ లిబియన్ మహిళకు పుట్టిన బిడ్డ పోషణ నిమిత్తం ప్రభుత్వం 5,000 డాలర్లు ఇస్తుంది.

  • 40 రొట్టెల ఖరీదు 0.15 డాలర్లుగా ఉంటుంది.

  • లిబియా ప్రజల్లో 25 శాతం మంది యూనివర్సిటీ పట్ట భద్రులు లేదా సర్టిఫికెట్లు పొందిన వారు.

  • లిబియా తన మానవ వనరులను వినియోగించుకుని నదుల వంటి జలవనరులను నిర్మించడం ద్వారా అత్యంత విస్తారమైన జల వ్యవస్థను ఏర్పాటు చేసు కుంది, తద్వారా ఎడారి దేశమైన లిబియాలో ఎక్కడికి వెళ్లినా నీరు సమృద్ధిగా లభిస్తుంది.
     

Take By: sakshi


Tags:
T News, hmtv, tv9,  Telangana agitation, statehood demand, Sakshi, Gaddafi, Libya





Read more...

హయాది నగర్

దో మినార్..
పేరు హయాత్ బక్షీ మసీదు..
నగర శివారులో ఉన్న మరో మక్కా ఇది.
కాలంతో కనుమరుగై.. చరివూతలో సమాధి అయింది.
హయాత్‌కు ఆయుష్షుకు సంబంధం ఉంది.
ఆ యాదితో ఆయుష్షు పోసే ప్రయత్నమే ఈ వాహ్.. హైదరాబాద్.
తొమ్మిదో నంబర్ జాతీయ రహదారి..
టీచర్స్‌కాలనీ, ఆర్టీసీ కాలనీ, లెక్చరర్స్ కాలనీ...


minar-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతర్వాత ఆటో నగర్. ఆర్టీసీ కాలనీలో ఆ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులే ఉంటారు. అలా అని ఆటోనగర్‌లో ఆటోడ్రైవర్లు ఉండరు. దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్‌లో ఇదో పేరెన్నికగల ప్రాంతం. వాహనాల స్పేర్‌పార్ట్స్, మాడిఫికేషన్, రిపేరింగ్.. అన్నింటికీ ఇది కేరాఫ్ అడ్రస్. రకరకాల వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. ఆటోనగర్‌కు ‘ఆటోవాలా’కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆప్రాంతంలో అడుగుపెట్టగానే వాళ్లే దర్శనమిస్తారు. చిన్నచిన్న ఆర్డర్‌ల కోసం ఎదురు చూస్తూ బతుకుపోరు సాగిస్తుంటారు.
ఆటోనగర్ దాటిన తర్వాత వనస్థలి జింకలపార్క్. దీంట్లో ఈ మధ్యే జంతు ప్రతిమల ప్రదర్శనని ప్రారంభించారు. ఆ తర్వాత హయాత్‌నగర్. (హయత్‌నగర్‌గా వాడుకలో ఉంది) ఆయుష్షుకు హయాత్‌నగర్‌కు సంబంధమేమిటి? అని ఆలోచిస్తుండగా ఎన్‌హెచ్-9కు కుడివైపున అల్లంత దూరం నుంచి రెండు మినార్లు కనిపించాయి. వెళ్లిచూస్తే అదో పెద్ద మసీదు. ఐదెకరాల విస్తీర్ణం. మరో మక్కామసీదులా ఉంది ఆ ప్రాంతం. గోల్కొండలోని కుతుబ్‌షా మసీదుని గుర్తుకు తెస్తుంది ఆ నిర్మాణం. హైదరాబాద్ శివారులో ఇలాంటి ఓ చారివూతాత్మక కట్టడం ఉందని చాలామందికి తెలియదు.

దీన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారు? ఎందుకు కట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం లోపలికి వెళ్లాను.. మధ్యాహ్నం ‘నమాజ్’ నడుస్తోంది. ఆ ప్రార్థనలు అయిపోగానే స్థానికులతో కాసేపు మాట్లాడితే విషయం తెలిసింది.

బేగం నజరానా
గోల్కొండ సుల్తాన్ వంశస్థురాలు హయాత్‌బక్షీ బేగం. కులీకుతుబ్ షా వంశస్థుల్లో నాలుగో కుతుబ్ మహ్మద్ కులీ ముద్దుల కూతురు. ఒక ఆదర్శ మహిళ. సుల్తానులకు రాజకీయ సలహాదారుగా కీలకపాత్ర పోషించింది. మహ్మద్‌కులీ ఆమెను తన మేనల్లుడు సుల్తాన్ మహమ్మద్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ఆయన ఐదో కుతుబ్‌గా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత వీరి కుమారుడు అబ్దుల్లా కులీ కుతుబ్ రాజ్యాధికారం చేపట్టాడు. గోల్కొండ సామ్రాజ్యం నుంచి రాజ్యపాలన చేసిన ఈ ముగ్గురు నవాబుల వెనక బక్షీ ఉండేది. శత్రువుల దాడిని పసిగట్టి ముందస్తు ప్రణాళిక రచించడంలో ఆమె దిట్ట. ఔరంగాజేబు గోల్కొండపై దండయాత్ర చేసిన సమయంలో ‘చుట్టరికం’ చేసుకుందామని చర్చలు జరిపింది. ఆమె జరిపిన చర్చలు ఆ యుద్ధవాతావరణాన్నే మార్చేశాయి. యుద్ధంలో ఓడిపోయే ప్రమాదముందని ముందుగానే పసిగట్టి ఆమె పక్కా ప్రణాళికతో రంగవూపవేశం చేసింది. తండ్రి, భర్త, కుమారుడు... వీరి కాలంలో ఇటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం.. సుల్తాన్ మహమ్మద్ 12 సంవత్సరాల పాటు తన కొడుకును చూడలేదట. అప్పుడు హయాత్‌బక్షీ అన్నీ తానై అబ్దుల్లాను పెంచింది. ఓ సారి ఎవరికీ కనిపించకుండా పోయాడు. అబ్దుల్లా కోసం అందరూ వెతుకుతుండగా ఒక వృద్ధుడు తీసుకొచ్చి బక్షీకి అప్పగించాడట. అప్పుడు తన కుమారుడికి ఆయుష్షు ప్రసాదించినందుకు ఏం కావాలో కోరుకొమ్మని బేగం అడిగిందంట. అందుకు ఆ వృద్ధుడు ‘హైదరాబాద్‌కు తూర్పున ఒక పెద్ద మసీదును నిర్మించా’లని కోరాడట. అలా సుల్తాన్ మహమ్మద్ కాలంలో ఈ మసీదును నిర్మించారు. అప్పట్నుంచి దీనిని హయాత్‌బక్షీ మసీదుగా.. ఈ ప్రాంతాన్ని హయాత్‌నగర్‌గా పిలుస్తున్నారు.

ఏనుగుల బావి
bavi-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅరబ్ నిర్మాణశైలిలో ఉన్న ఈ మసీదుకు ఐదు ఆర్చ్‌లు, రెండు మినార్‌లు ఉన్నాయి. మధ్యలో ప్రార్థనలు చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లా హాలు ఉంది. దీనికి తూర్పున కింది భాగంలో నీటి ట్యాంకు ఉంది. మసీదు చుట్టూ 140 ఆర్చ్‌ల్లాంటి గదులున్నాయి. వీటిని సరాయ్‌లు అని పిలుస్తారు. ఈ సరాయ్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. మసీదుకు ఎడమవైపునున్న సరాయిల పక్కన పెద్దబావి ఉంది. దీన్ని ‘హథీబౌలీ’ అని పిలుస్తారు. హథీ అంటే ఏనుగు. బౌలీ అంటే బావి. మసీదు కింద పెద్ద తోట ఉండేది. ఏనుగుల ద్వారా నీటిని తోడించి తోటకు నీళ్లు మళ్లించేవారట. అందుకే దీనికి హథీబౌలీ అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఈ మసీదు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఒకవూపాంత చరివూతకు సాక్షిగా నిలుచున్న ఈ కట్టడం పరిరక్షణకు పురావస్తు శాఖ కృషి చేయాల్సిన అవసరం ఉంది.

రింగురోడ్డులా..
హయత్‌నగర్ చుట్టున్న ప్రాంతాల పేర్లపై కూడా గోల్కొండ సుల్తాన్‌ల ప్రభావం ఉన్నట్లు అనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వలయంలా పరుచుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ హయాత్ కుమారుడు అబ్దుల్లా పేరు మీద ఏర్పడింది. బక్షీ మసీదు ప్రేరణతో మజీద్‌పూర్, రాజనర్తకి తారామతి పేరుతో తారామతిపేట, అనాజ్‌పూర్, లష్కర్‌గూడ, జాఫర్‌గూడ వంటి గ్రామాలు మరికొన్ని ఉదాహరణలు. హయత్‌నగర్ దాటాక ఎన్‌హెచ్-9కు కుడిపక్కన ‘సంఘీటెంపుల్’ ఉంది. దాని పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీ. పేదల భూములు కొట్టి పెద్దలకు పంచిపెడితే పుట్టిందే ఈ సిటీ.. సంఘీనగర్. భళేమంచి చౌకబేరం దొరికిందని ఐదు, పదికే వేల ఎకరాలు కొల్లగొట్టి.. రైతులను కూలీలుగా మార్చిన స్థావరాలివి. ఫిల్మ్‌సిటీ నుంచి వస్తుండగా ఔటర్‌రింగ్‌రోడ్‌పై వడ్ల ధాన్యం ఆరబోసిన రైతులు కనిపించారు. వారిని పలకరిస్తే అధికారుల అన్యాయం, పాలకుల పాపం తెలిసొచ్చింది. రింగ్‌రోడ్‌లో భాగంగా బంగారు భూములు కోల్పోయిన రైతులు వారు. ఎకరం, రెండెకరాలే ఉన్నప్పటికీ అంతా రోడ్డు పాలు అయింది. ఎకరం పదహారు లక్షలకు అమ్ముకున్నారు కానీ.. వారికి సగం డబ్బులు ముట్టాయి. మిగిలిన డబ్బుల కోసం.. ధర్నాలు, ముట్టడిలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రోడ్డులో వడ్లు ఆరబోసిన చోటే వారి ‘కళ్లం’ ఉండేదేమో.. పూర్తిగా నష్టపరిహారం పొందలేదు కాబట్టి నడిరోడ్డుపై వడ్లతో నిరసన చేసే హక్కు వారికుంది కదా! అనిపించింది. హయత్‌నగర్ చుట్టుపక్కల ప్రజల బతుకులు రింగ్‌రోడ్డులా గింగిరాలు తిరుగుతున్నట్లు అనిపించింది. రియల్‌ఎస్టేట్ వారి కొంప ముంచింది. ప్రభుత్వం కోట్ల ఆశచూపి.. కోర్టుల చుట్టూ తిప్పుకుంటోంది.

మిగిలింది మసీదే..
చారివూతక కట్టడమైన హయాత్ బక్షీ బేగం మసీదు కింద ఉన్న భూమినంతా కోల్పోయాం. ఇక మిగిలింది ఈ మసీదే. దీనై్ననా రక్షించుకోవాలనేదే మా ఆకాంక్ష. 2000 మంది నమాజ్ చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ప్రస్తుతం పురావస్తు శాఖ దీని వ్యవహారాలు చూసుకుంటోంది. ఇంతకు ముందు వక్ఫ్‌బోర్డ్ కింద ఉండేది. మసీదులోని సరాయి గదులు, మసీదు మినార్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి వాటిని పునరుద్ధరించాలి. అందుకయ్యే నిధులను మంజూరు చేయాలి. గతంలో కొంత అభివృద్ధి జరిపినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
- మీర్జా సలీమ్ బేగ్
హయాత్‌బక్షీ బేగం మసీదు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడ


Read more...

ఖరీఫ్‌లో ఇదీ ఆంధ్రా దొపిడీ తరీఖా

- సీమాంవూధకు 350 టీఎంసీలు.. తెలంగాణకు 100 టీఎంసీలు
- పాలమూరుకు దక్కింది 11 టీఎంసీలే.. సీమాంధ్ర జల దోపిడీకి తాజా సాక్ష్యం
- సాగర్, శ్రీశైలం నీళ్లు పారేది అటే.. రబీకి మరో 200 టీఎంసీలూ సిద్ధం
- బీళ్లవుతున్న తెలంగాణ చేలు.. ఖరీఫ్‌లో ఎండిన పంటలు
- రబీకి నీళ్లివ్వలేమన్న సర్కార్.. సీమాంవూధకు మాత్రం సరఫరా

Formar-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaమా నీళ్లు మాగ్గావాలె! ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వెనుక ఉన్న కీలక డిమాండ్! తెలంగాణలో కట్టిన జలాశయాల నుంచి సీమాంవూధకు నీళ్లు తరలించుకుపోతున్నారంటూ దశాబ్దాలుగా ఇక్కడి రైతు పెడుతున్న ఘోష! ఎప్పటికప్పుడు ఈ జల దోపిడీ సాగుతూనే ఉంది! ఈ ఖరీఫ్ సీజన్ కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి జల దోపిడీకి, తెలంగాణ ప్రాంత రైతుల పట్ల వివక్షకు నిదర్శనంగా నిలిచింది! కృష్ణా నికరజలాల నుంచి ఈ ఖరీఫ్ సీజన్‌లో సీమాంధ్ర రైతులు 350 టీఎంసీల నీటిని వినియోగిస్తే.. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు లభ్యమైనది కేవలం 100 టీఎంసీలు! అంటే తెలంగాణ తన వాటా ప్రకారం 48 టీఎంసీలు కోల్పోతే.. కోస్తాంధ్ర తన వాటాకు మించి 19 టీఎంసీలు, రాయలసీమ తన వాటాకు రెట్టింపు నీళ్లు పొందాయన్నమాట! అంతే కాదు.. రబీ సీజన్‌లోనూ తెలంగాణ రైతుకు సున్నమే మిగలనుంది! తెలంగాణకు రబీకి నీళ్లందించలేమంటూ అనేక కారణాలు చెబుతున్న సీమాంధ్ర సర్కారు... సీమాంధ్ర ప్రాంతానికి మాత్రం 200 టీఎంసీలు పారించేందుకు ప్రయత్నాలు చేస్తోంది!
(టీ న్యూస్8, నల్లగొండ, మహబూబ్‌నగర్)ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా జిలాల పంపిణీలో సీమాంధ్ర, తెలంగాణ రైతుల పట్ల భారీ వివక్షను చూపింది కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్‌లో 350 టీఎంసీల నీటిని సీమాంవూధకు తరలించగా.. తెలంగాణకు దక్కింది మాత్రం 100 టీఎంసీలు మాత్రమే! ఇది చాలదన్నట్లు నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి రబీకి తరలించనున్న 250 టీఎంసీల నీటిలో ఆంధ్ర ప్రాంత ఆయకట్టుకే 200 టీఎంసీలు పారించే ప్రయత్నాల్లో సీమాంధ్ర సర్కారు ఉంది. నిజానికి కృష్ణానదీ జలాల్లో మొత్తం రాష్ట్రానికి నికరజలాలు ఏడాదికి 811 టీఎంసీలు. ఇందులో తెలంగాణ ప్రాంతం వాటా 297 టీఎంసీలు. కోస్తాంధ్ర వాటా 362 టీఎంసీలు, రాయలసీమ వాటా 152 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఆరు నెలలకు లెక్క వేస్తే.. తెలంగాణకు ఖరీఫ్‌లో 148 టీఎంసీలు రావాల్సి ఉంది. కోస్తాంవూధకు 181 టీఎంసీలు, రాయలసీమకు 76 టీఎంసీలు పారాల్సి ఉంది. కానీ.. 181 టీఎంసీల వాటా ఉన్న కోస్తాంవూధకు 200 టీఎంసీలు పారాయి.

76 టీఎంసీలు వాటా కలిగిన రాయలసీమకు ఇప్పటికే 195 టీఎంసీలు పారాయి. కానీ.. తెలంగాణకు మాత్రం ఈ ఖరీఫ్ సీజన్‌లో అందినవి కేవలం 100 టీఎంసీలే! అంటే రావాల్సినవాటిలో 48 టీఎంసీలు రాకుండా పోయాయన్నమాట. అంటే ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందనుకుంటే.. తెలంగాణకు ఈ సీజన్‌లో 4.8 లక్షల ఎకరాలకు నీరందలేదన్నమాట. పైగా.. వేర్వేరు కారణాలు చూపుతూ రబీ సీజన్‌కు తెలంగాణ ప్రాంతానికి నీరిచ్చేది లేదని ప్రభుత్వం తెగేసి చెబుతున్నది. అంటే నికరంగా తెలంగాణ ఈ ఏడాది కోల్పోతున్నది 196 టీఎంసీలన్నమాట! ఓవైపు తెలంగాణకు నిర్బంధ క్రాప్‌హాలిడే విధించి.. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి నీటిని సీమాంధ్ర సర్కారు తన ప్రాంత రైతులకు దోచిపెడుతున్నది.

srishilam-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ భూములను పడావు పడేసి.. సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షిస్తున్నది. ఈ క్రమంలోనే రబీకి కూడా సీమాంధ్ర ప్రాంతానికి 200 టీఎంసీల నీటిని తరలించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నదని నిపుణులు విమర్శిస్తున్నారు. పడావు పడిన తెలంగాణ ఈ ఖరీఫ్ సీజన్‌లోనే సీమాంధ్ర పాలకుల కుటిల నీతి వల్ల పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కేవలం 100 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారు. ఫలితంగా రబీ సీజన్‌లో దాదాపు నాలుగు లక్షలపైచిలుకు ఎకరాల భూమికి నీరందలేదు. ఇందులో లక్షన్నర భూమి పడావు పడగా, మిగతా భూమిలో వేసిన పంటలు ఎండిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం వాస్తవంగా సాగర్ ఎడమ కాలువ కింద మూడుజోన్లకు కలిసి 9.50 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉండగా, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో 6.05 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో కేవలం 3.78 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇందులోనూ లక్ష ఎకరాల పంట నీరు అందక ఎండిపోయింది.ఎలిమినేటి మాధవడ్డి ప్రాజక్టు కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 1.50 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేశారు. ఇందులో 70 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. సాగర్ ప్రాజెక్టులో నిండుగా నీరున్నా రాష్ట్ర ప్రభుత్వం రబీకి నీరు ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఇప్పటికే ఖరీఫ్‌లో పంటపూండిపోయి కుదేలైన రైతాంగం నెత్తిన పిడుగుపడినట్లయింది.

ఆర్డీస్8 అంతా భ్రమ
రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్8) ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 87,480 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ.. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు 21వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 3.86 టీఎంసీల నీటిని మాత్రమే ఆర్డీఎస్8 ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రైతులకు విడుదల చేశారు. దీంతో పాతిక వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, మన రాష్ట్రానికి వచ్చే సరికి కేవలం 12 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు లభ్యమవుతోంది.

జూరాల నీరు ఎవరి కోసం?
మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని కుడి, ఎడమ కాలువలకు కలిపి 1,04,741 ఎకరాలకు 11.98 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉన్నది. ఎడవ కాలువ ద్వారా ఐదు మండలాల్లోని 69,082 ఎకరాలకు, కుడి కాలువ ద్వారా నాలుగు మండలాల్లోని 35,657 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉన్నది. ఆగస్టు రెండో వారం నుంచి ఆయకట్టుదారులకు నీరు విడుదల చేశారు. ఆగస్టులో 2.21 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 2.66 టీఎంసీలు, అక్టోబర్‌లో 3.77 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నవంబర్‌లో 2.53 టీఎంసీలు, డిసెంబర్‌లో 15 రోజుల కోసం 0.885 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

పోతిడ్డ్డిపాడుతో వట్టిపోతున్న శ్రీశైలం
sagar-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఏ కేటాయింపులు లేని పోతిడ్డిపాడు ద్వారా రాయలసీమకు మూడు నెలలుగా ప్రతి రోజూ 50 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు150 టీఎంసీల నీటిని తీసుకు జూలై, ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్ధ్యం 308 టీఎంసీలైతే, ప్రస్తుతం 167 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.దీంతో ఈ ఏడాది అప్పుడే వట్టిపోతోంది.

కేటాయింపులు లేకున్నా సాగర్ నీళ్లన్నీ ఆంధ్రకే
ఈ ఏడాది జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండింది. సాగర్ గేట్లు ఎత్తడం ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 203 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఇది కాకుండా కుడి కాలువ ద్వారా 103 టీఎంసీలు, సాగర్ ప్రాజెక్టు పవర్ హౌజ్ ద్వారా కృష్ణా డెల్టాకు 67 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా మూడో జోన్‌కు 25 టీఎంసీల నీరు తరలించుకపోయారు. ప్రాజెక్టు కిందనున్న ఆంధ్ర ప్రాంత ఆయకట్టుకు 200 టీఎంసీల నీరు వినియోగించుకోగా, 200 టీఎంసీల నీరును సముద్రం పాల్జేశారు. సాగర్ ప్రాజెక్టు కింద ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సుమారు 75 టీఎంసీల నీరు, ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు ద్వారా మరో 15 టీఎంసీల నీరు మాత్రమే వినియోగించడం జరిగింది. మొత్తం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాగర్ ప్రాజెక్టు నీటిలో కేవలం 90 టీఎంసీల నీరు మాత్రమే వినియోగమైంది. ఇదిలావుంటే ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో 550.80 అడుగుల (297టీఎంసీలు) నీరు ఉంది.

నిండుకుండలా సీమ రిజర్వాయర్లు
పోతిడ్డిపాడు ద్వారా ఇప్పటికే దాదాపు 150 టీఎంసీలను సీమాంవూధకు తరలించుకుపోయారు. శ్రీశైలంపై అధారపడి నిర్మించిన సోమశిల (78 టీఎంసీలు), కండలేరు (68 టీఎంసీలు), బ్రహ్మంగారి మఠం (30 టీఎంసీలు), వెలిగోడు (15 టీఎంసీలు), గండికోట (15 టీఎంసీలు) రిజర్వాయర్లను పోతిడ్డిపాడు ద్వారా నింపారు. శ్రీశైలం నుంచి మరో 50 టీఎంసీల నీరు రాయలసీమకు తరలించుకుపోయి రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన శ్రీశైలం ప్రాజెక్టును సీమాంధ్ర సర్కార్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుగా మార్చేసింది. కృష్ణానీటిని దిగువకు రాకుండా అడ్డుకుంటోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని కృష్ణానీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తూ నల్లగొండ, ఖమ్మం జిల్లాలను ఎండ బెడుతోంది.

Read more...

నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి రెండేళ్లు మినహాయింపు

హైదరాబాద్: రాష్ట్రంలో మెడిసిన్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఊరట లభించింది. జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నుంచి రాష్ట్రానికి రెండేళ్ల మినహాయింపును ఇస్తూ సీఎం కార్యాలయానికి కేంద్రం నుంచి సమాచారం వచ్చింది.

Read more...

తెలంగాణను ఎస్సార్సీతో ముడిపెట్ట్టొద్దు

- ఆ డిమాండ్ ప్రత్యేకమైనది
- రెండో ఎస్సార్సీ ఇతర రాష్ట్రాల డిమాండ్ల కోసమే
- ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ వివరణ


rasheed-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 18 ():కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీ వేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ అభివూపాయమైనప్పటికీ తెలంగాణ అంశం దీని పరిధిలోకి రాదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ స్పష్టం చేశారు. తెలంగాణ అంశాన్ని విడిగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణతో సహా ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లకు ఎస్సార్సీయే పరిష్కారం చూపిస్తుందని ఆయన గతంలో చేసిన ప్రకటనపై ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరవూపదేశ్ విభజనపై ఓ ప్రశ్నకు బదిలిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే మాయావతి యూపీ విభజన అంశాన్ని లేవనెత్తారని విమర్శించారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందే రాష్ర్ట విభజన అంశాన్ని ముందుకు తేవడాన్ని ఆయన తప్పుబట్టారు.

మాయావతి అధికారంలోకి ఉన్న ఐదేళ్లలో యూపీ భవిష్యత్తు, అభివృద్ధి గురించి పట్టించుకొనివుంటే చాలా బాగుండేదని విమర్శించారు. దేశంలో యూపీ తరహాలో మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లున్నాయని, వాటన్నింటిని పరిశీలించేందుకు ఎస్సార్సీ వేయాలన్నది తమ పార్టీ అభివూపాయమని చెప్పారు. భాష, ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలన్నింటితో సహా రాష్ట్రాల విభజన ఏ ప్రతిపాదికన జరగాలో కమిషన్ పూర్తి స్ధాయిలో సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందించగలదని వివరించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే తెలంగాణ అంశం ఈ పరిధిలోకి రాదని, దానిని ప్రత్యేకంగా చూడాలన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. 


Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP