వర్ధమాన’ మహావీరుడు గడాఫీ!
See Down and read News ....
నిజమాడితే ఉన్న ఊరూ, దేశ మూ అచ్చిరాదని పెద్దలు చెబు తారు! బహుశా అలాంటి పరి ణామం ఏదో ఉత్తరాఫ్రికాలోని లిబియా పాలకుడు గడాఫీకి పట్టుకున్నట్టుంది. ఎందుకంటే వర్ధమాన దేశాలకు గడాఫీ తన అనుభవాలు ఆధారంగా రూ పొందించిన సిద్ధాంత రచన ‘గ్రీన్‌బుక్’ మూడు దశాబ్దాల నాడే ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’కు ప్రత్యామ్నాయంగా ముం దుకొచ్చింది. వర్ధమాన దేశాలు, ముఖ్యంగా అరబ్ దేశా లను ఆర్థిక దాస్యం నుంచి విముక్తం చేయడానికి అవతరిం చిన గడాఫీ వ్యూహరచన ఈ చిన్ని పొత్తం. ఆంగ్లో-అమె రికన్ సామ్రాజ్యవాదులు తమ ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడటం కోసం ప్రపంచబ్యాంకును అడ్డం పెట్టు కుని ప్రపంచాన్ని దరిద్రీకరించే విధానాన్ని ‘ప్రపంచీకరణ’ పేరిట ప్రవేశపెట్టిన ‘బ్లూప్రింట్’కు విరుద్ధమైన నమూనా గడాఫీ ‘గ్రీన్‌బుక్’. ఆనాడే గడాఫీ ఆచరణలో పెడుతూ వచ్చిన ‘సంస్కరణలు’, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థలు సుతరామూ సహించలేని సంస్కరణలు.
ఇవి ఆ సంస్కరణలు కావు...
గడాఫీ లిబియాలో ప్రవేశపెట్టిన ఈ ప్రజానుకూలమైన ప్రజాతంత్ర సంస్కరణలు, దేశ స్వరూప స్వభావాలలో మౌలికమైన మార్పును తెచ్చాయి. అయినా సరే, సామ్రా జ్యవాదుల దృష్టిలో నిజం కురచగానూ, ‘బొంకు’ మాత్రం పొడవుగానూ కనిపిస్తుంది! అయితే గమ్మత్తేమంటే ప్రజా తంత్ర ప్రజాహిత సంస్కరణల ద్వారా లిబియా ప్రజలు అనుభవించిన అసలు ‘వసంతా’న్ని కనుమరుగు చేసి సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష జోక్యంతో బరిలోకి దిగి స్థానిక స్వపరిపాలనా వ్యవస్థపై తన ప్రభావంలో ఉన్న ప్రతిపక్షం చేసిన తిరుగుబాట్లకు ‘అరబ్ వసంతం’ (అరబ్ స్ప్రింగ్) అని పేరు పెట్టారు! అంతేగాదు, సామ్రాజ్యవాదుల దృష్టిలో ‘ప్రజాస్వామ్యం’, ‘స్వేచ్ఛ’, ‘నియంతృత్వం’ అన్న పదాలకు అర్థాలు వేరు. ప్రజాహిత పాలనలో ఉన్న నిజమైన ప్రజాతంత్ర వ్యవస్థలూ, పాలకులూ సామ్రాజ్య వాదుల దృష్టిలో ‘నియంతృత్వాలు’, ‘నియంత’లూ. పెట్టుబడిదారీ వ్యవస్థనూ, సామ్రాజ్యవాదుల్ని వ్యతిరేకిం చే సంస్థలూ, దేశాధినేతలూ ‘శాంతి విధ్వంసకులూ’, ‘ఉగ్రవాదులూ’! అందుకే కారల్ మార్క్స్‌ను ఒక ‘విధ్వం సక సిద్ధాంతకర్త’గా, తొలి సోషలిస్టు సోనియెట్ స్థాపకుడు లెనిన్‌ను ‘తిరుగుబాటు దారుడి’గా, జోసఫ్ స్టాలిన్, మావోసేటుంగ్‌లను ‘పచ్చి నియంతలు’ గానూ సామ్రా జ్యవాదులు చిత్రించారు! ఈ కోవలోనే సామ్రాజ్యవాద దుష్టకూటమి తమ పెట్రోల్ దాహార్తిని తీర్చుకొనే యత్నం లో దురాక్రమణ విధానాలను సమర్థించుకోడానికి ఇరాక్ అధినేత సద్దామ్ హుస్సేన్‌ను, లిబియన్ గడాఫీని ‘నియం త’లుగా, ఉగ్రవాద మద్దతుదారులుగా ముద్రవేసి, ప్రచా రం చేసి దారుణంగా హత్య చేసింది.
అలాగే నలభై ఏళ్ల నాడు ప్రజాతంత్ర - సోషలిస్టు చిలీ ప్రజా నాయకుడైన అలెండీనీ ‘నియంత’గా చిత్రించి అమెరికా తన పొట్టన పెట్టుకుంది! కాంగోలోని రాగి నిక్షేపాలను కొల్లగొట్టడం కోసం కాంగో ప్రజల ప్రియతమ నాయకుడైన పాటిస్ లుముంబా ప్రభుత్వాన్ని కూలదోసి, లుముంబానూ హత్య చేశాయి అమెరికా, బెల్జియం, బ్రిటన్‌లు! పశ్చిమా సియా, ఉత్తరాఫ్రికాలలో మొదటిసారిగా రాజకీయ, ఆర్థిక సాంఘిక రంగాల్లో ప్రజాతంత్ర సంస్కరణలకు ఊపిరి పోసిన నేతలు నాసర్ (ఈజిప్టు), మొసాబిక్ (ఇరాన్), సద్దాం హుస్సేన్, గడాఫీ. మన ఇండియా సహా అనేక వర్ధ మాన దేశాల్లో చూస్తున్న జాతీయోత్పత్తుల సగటు విలు వకూ, ఆ దామాషాలో అందవలసిన తలసరి ఆదాయ పంపిణీకి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తెలిసిందే! కానీ లిబియాలోని గడాఫీ పాలనలో నేటి విధ్వంస కాండకు ముందు జాతీయోత్పత్తుల సగటు విలువ సాధించిన వృద్ధి రేటుతో బరాబరిగా లిబియా ప్రజల తలసరి ఆదాయం తులతూగడం ఒక విశేషం!
అది నియంత్రణే... కాదు నియంతృత్వం
‘నియంత’కూ నియంత్రణకూ తేడా ఉంది! అయితే ‘నియంత లేకపోయినా విధానాల అమలుకు ఏ వ్యవస్థలో అయినా ‘నియంత్రణ’ అనివార్యమవుతుందని మరవ రాదు! ప్రజాహిత సంస్కరణల అమలుకు, నూతనంగా రాజకీయ స్వాతంత్య్రం పొందిన వర్ధమాన దేశాల ఆర్థికా భ్యున్నతికి ఈ నియంత్రణ అవసరం! ప్రపంచ సామ్రాజ్య వాద పెట్టుబడిదారీ వ్యవస్థ మూలంగా ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభాల నుంచి తాము బయటపడటం కోసం ప్రవేశపెట్టే ప్రజావ్యతిరేక సంస్కరణలు సంపన్న వర్గాల ‘చేతి ఎత్తు బిడ్డలు’గా మారిన వైనాన్ని గమనిస్తూ వచ్చిన గడాఫీ అందుకు విరుద్ధమైన వ్యూహరచనకు దిగాడు. ఇస్లామిక్ సమాజ పరిధుల్ని దృష్టిలో ఉంచుకునే, ఆమో దయోగ్యమైన పద్ధతుల్లో మూఢవిశ్వాసాల నుంచి లిబి యా ప్రజలను విముక్తం చేసి, ఆధునిక పురోగామి వ్యవస్థ నిర్మాణానికి ‘ఇస్లామిక్ సోషలిజం’ స్థాపించాలని కలలు కన్నాడు! ఈ కలలు కొందరికి ‘కల్లలు’గా కనిపించవచ్చు గాని లిబియా ప్రజా బాహుళ్యంలో హెచ్చు మందికి కష్ట పడి సాధించుకోదగిన నూతన సామాజిక వ్యవస్థగానే గడాఫీ ఆలోచనలు కనిపించాయి. గతంలో సూయెజ్ కాల్వను ఈజిప్టు ప్రయోజనాల దృష్ట్యా జాతీయం చేయ డానికి ఆ దేశాధినేతగా, అలీన దేశాల అగ్రనాయకులలో ఒకరుగా నాసర్ నిర్ణయించినప్పుడు ఆయనపైన ఆంగ్లో- అమెరికన్లు కత్తికట్టారు. అలాగే లిబియాను క్రమంగా ఆధు నికం చేస్తూ అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందించడం కోసం, గడాఫీ ప్రజాతంత్ర సోషలిస్టు వ్యవస్థ స్థాపన కోసం ఒక బ్లూప్రింట్‌ను 1976-79 మధ్యకాలంలో విడు దల చేసి పెద్ద సంచలనం కలిగించాడు! ఈ బ్లూప్రింటే ‘గ్రీన్‌బుక్’, దాని సారాంశం ‘ఇస్లామిక్ సోషలిజం’!
గడాఫీకి ప్రేరణ రూసో, మావో
మానవ సమాజాన్ని పురోగామి దిశగా మళ్లించడానికి వివిధ కాలాలలో దోహదం చేసిన పలువురు సుప్రసిద్ధ సామాజిక, తాత్విక సిద్ధాంత కర్తల భావాలతో ప్రభావితు డైన గడాఫీ ఈ ‘గ్రీన్‌బుక్’ను లిబియా పాలనా వ్యవస్థలో తాను రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాలలో ప్రవేశపెట్ట దలచిన విధానాలకు ప్రతిరూపంగా, సిద్ధాంత రచనగా రూపొందించాడు. ఈ సిద్ధాంత రచనకు రూసో రచనలూ, అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు ఉద్దీపనంగా ఉన్న ‘ఫెడరలిస్టు’ పత్రాలూ, ఆధునిక కాలంలో నాసర్ ఆలోచ నలు, నవ చైనా నిర్మాత మావోసేటుంగ్ ‘లిటిల్ రెడ్‌బుక్’ సూత్రాలూ గడాఫీకి ప్రేరణనిచ్చాయి. గడాఫీ ‘గ్రీన్‌బుక్’ మూడు భాగాలు. అటు పెట్టుబడిదారీ విధానానికి, ఇటు కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే విశ్వసించి, ఈశ్వర జిజ్ఞాసతో నిమిత్తం లేని కమ్యూనిజానికీ సంబంధం లేని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ (తృతీయ ప్రపంచ వ్యవస్థా సిద్ధాంతం... లేదా ‘థర్డ్ యూనివర్సల్ థియరీ’)ను గడాఫీ గ్రంథం అభిలషిస్తోంది! ‘గ్రీన్‌బుక్’ తాలూకు మొదటి భాగం పేరు ‘ప్రజల సత్తాకత’ (ప్రజలే నిర్ణాయకశక్తి). రెం డవ భాగం మకుటం ‘దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం సోషలిజం’. ఇది 1978లో వెలువడింది. ఇక మూడవ భాగం పేరు ‘తృతీయ ప్రపంచ సిద్ధాంతం-దాని సామా జిక పునాది’. గడాఫీ ప్రతిపాదనలు కొన్ని ‘కలగా పులగం’గా కనిపించినప్పటికీ అతని భావాలలోని అభ్యు దయకర ధోరణులను ఎవరూ విస్మరించలేరు. ఉదాహ రణకు ‘‘వేతన కూలీలు తమను బాడుగకు కుదుర్చుకునే బుగతకు (ఆసామికి) బానిసలు. వీళ్ల విమోచనకు మార్గం ఏమిటి? అసలు వేతన బానిస వ్యవస్థనే రద్దు చేయడం ద్వారా బానిస సంకెళ్ల నుంచి ప్రజల్ని బయటపడవేసి, సమాజంలో వర్గాలు, పాలనా రూపాలు, మానవ నిర్మిత చట్టాలూ పుట్టకముందున్న మానవ సంబంధాలను శాసిం చిన సహజమైన ప్రకృతి సూత్రాలను ఆశ్రయించి గౌరవిం చాలి’’ అని గడాఫీ సూత్రీకరించాడు! ఆయనదే మరొక సూత్రీకరణ ‘‘ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చు కోవడానికి మాత్రమే సంపాదించాలిగాని అంతకు మించి సంపాదించరాదు’’. అయితే మానవుడి అవసరానికి, విలాసానికి మధ్య లేదా అవసరానికీ హద్దు మీరిన ఆబకూ మధ్య ఎక్కడ విభజనరేఖను గీయాలో ఆయన నిర్వచిం చలేదని కొందరి సంశయం.
స్త్రీ పక్షపాతి గడాఫీ...
స్త్రీల పట్ల, వారి సమస్యల పట్ల, నీగ్రోలు, తదితర శ్వేతేతర జాతుల పట్ల గడాఫీ అభిప్రాయాలు ఎంతో ఆర్ద్రతతో కూడి ఉంటాయి. నిత్యజీవనంలో విద్య, సంగీతం, ఇత్యా ది కళారూపాలంటే అతనికి వల్లమాలిన అభిమానం. ప్రభుత్వ నిర్వహణ సమస్యకు పరిష్కారం చూపే యత్నం లో ఆచరణలో నియంతృత్వ దశ నుంచి నిజమైన ప్రజా స్వామ్యయుగం వైపుగా ప్రజలు పయనించాల్సిన మార్గా న్ని సూచనప్రాయంగా గడాఫీ తన ‘గ్రీన్‌బుక్’లో పేర్కొ న్నాడు. స్త్రీల పట్ల, వారి సమస్యల పట్ల గౌరవ భావంతో స్పందించే స్వభావం గల గడాఫీ పురుషులు అర్థం చేసుకో లేని స్త్రీల జీవశాస్త్ర సంబంధమైన వేదనా సందర్భాలను కూడా నిర్మొహమాటంగా ప్రకటించాడు! విద్యావిధానం లో పాత పద్ధతులు పోవాలనీ, ఇందుకోసం ‘ప్రపంచ స్థాయిలోనే సాంస్కృతిక విప్లవం’ రావాలనీ ఆయన కోరు కున్నాడు. సాంస్కృతిక రంగంలో సమూలమైన ప్రక్షాళన జరిగితే గాని మానవునిలో ప్రవేశిస్తున్న కృత్రిమమైన వికా రాలు, నీచాభిరుచులు, సంకుచిత మనస్తత్వం, ఉన్మాదపు ఆలోచనల నుంచి మానవుడి మనస్సును విముక్తి చేయ లేమని గడాఫీ భావించాడు!
గడాఫీ భావాలు ‘పచ్చన’...
శ్వేత జాతీయులు ప్రపంచంలోని అన్ని ఖండాలలోని సువిస్తారమైన ప్రాంతాలను తమ వలసలుగా మార్చు కోవడానికి చేయని చెడు లేదు, తినని గడ్డి లేదు! ఇప్పుడే వరసమారిపోయి నల్లజాతులు ప్రపంచాన్ని ప్రభావితం చేయబోతున్న తరుణం ఇది. ఆధునిక యుగంలో ఏ సమా చారన్నయినా వ్యక్తి తన సొంతం చేసుకుని గుత్తాధికారం చెలాయించడాన్ని ప్రజాస్వామ్యం అనుమతించదు, ఏదో ఒక పద్ధతిలో స్వీయాభిప్రాయాన్ని ప్రకటించుకోడానికి వ్యక్తులకు సహజమైన హక్కు ఉంటుంది. బలవంతపు విద్య స్వేచ్ఛను అణగదొక్కుతుంది. ఫలానిది మాత్రమే నీవు చదవాలని బలవంతపెట్టడం నియంతృత్వ చర్య. వ్యవసాయ భూములకు వెళ్లే మార్గాలను, రహదారులను చెడగొట్టి, స్పోర్టింగ్ క్లబ్బులు నిర్మించరాదు. చిన్నపిల్లల్ని నర్సరీల్లో బలవంతంగా చేర్పించడం నియంతృత్వపోకడ. అది పిల్లల స్వేచ్ఛను, సహజమైన వాతావరణంలో పెంప కాన్ని దెబ్బతీస్తుంది. ‘పూట బత్తెం పుల్ల వెలుగు’గా బతు కులీడ్చే జీవులున్న చోట మానవుడు బానిస కిందనే లెక్క, సోషలిస్టు సమాజంలో ఇతరులకు కారును అద్దెకివ్వడం కోసమని ఏ వ్యక్తీ ప్రైవేట్ కారును కొనుక్కోజాలడు. ఎం దుకంటే, ఈ పద్ధతి ఇతరుల అవసరాల్ని నియంత్రిస్తుంది కాబట్టి. కాగా ప్రజాస్వామ్యవ్యవస్థ అనేది సమన్వయ పూర్వకమైన వ్యవస్థ. ఇందుకుగాను బలమైన పునాదులు అవసరం. ఆ పునాదులు సమకూర్చే సంస్థలు మౌలిక ప్రజాసంబంధాల సంస్థ (బేసిక్ పీపుల్స్) పీపుల్స్ కాన్ఫ రెన్సెస్, పీపుల్స్ కమిటీలు (ప్రజాసంఘాలు) వీటికి మిం చి ప్రజాస్వామ్య సమాజం ఏముంటుంది? ప్రజలు పాల్గొ నని బహిరంగసభలు, సమావేశాల మాదిరిగా ప్రజలు పాల్గొనకుండా కేవలం అలంకారప్రాయంగా ఉండే పార్ల మెంటుకు విలువలేదంటాడు గడాఫీ.
‘ప్రత్యక్ష’ ప్రజాస్వామ్యం అతని అభిమతం
అంతేకాదు, ప్రజాబాహుళ్యం పేరు చెప్పి వారి ప్రతినిధు లుగా ఏ కొద్ది మందో ఎన్నికయ్యే ప్రక్రియను ‘నిజమైన ప్రజాస్వామ్యం’గా భావించలేమనీ, అందువల్లనే పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమయిందనీ, అలాగే ఆదివాసీ, వర్గవ్యవస్థలు కూడా విఫలమయ్యాయనీ గడాఫీ తన ‘గ్రీన్‌బుక్’లో పేర్కొన్నా డు. కనుక సమస్యల పరిష్కారానికి ప్రజా బాహుళ్యం పాల్గొనే ‘పాప్యులర్ సభలూ’, ‘ప్రజా సంఘాల’ నిర్మాణ మే శరణ్యమనీ ఆయన భావన. అంతేగాదు. అమెరికా పెట్టుబడిదారీ సమాజం కుటుంబ నియంత్రణ విధానాన్ని వర్ధమాన దేశాల్లో ప్రవేశపెట్టడం ద్వారా శ్వేతేతర జాతుల జనాభా పెరక్కుండా నియంత్రించిందన్నది గడాఫీ నిశ్చితాభిప్రాయం.
ప్రజల ప్రత్యక్ష పాత్ర ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది గాని కొద్ది మంది ‘ప్రజాప్రతినిధుల’ మూలంగా ప్రజాస్వామ్యం బతకదు! భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క పౌరుని హక్కు. ఒకవేళ పౌరుడు తన అభిప్రాయం వెలిబుచ్చడంలో హేతు విరుద్ధంగా ప్రవర్తించినా భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అతనికి ఉం డాలి. గడాఫీ తన ‘గ్రీన్‌బుక్’లో వెలిబుచ్చిన భావాల పిండితార్థం ఇదీ! అసూయ అనే అంధకారంలో కొందరు ఏక నలుపునే చూస్తారట. అలాగే భిన్న కోణాలు గల గడాఫీ వ్యక్తిత్వంలో ఉన్న మంచిని సామ్రాజ్యవాదులు చూడ నిరాకరించారు. ప్రజల ఆలోచనలను ఏకపక్షంగా ప్రభావితం చేయగల బలమైన ప్రచార సాధనాల ద్వారా తమ ‘శత్రువు’ను దుష్టశక్తిగా చిత్రించడంలో సఫలీకృతు లయ్యారు. మెజారిటీ ప్రజల శ్రేయస్సును కోరుకొనే శక్తి మంతులైన దేశాధిపతులను, ప్రపంచానికి ‘పెద్దన్న’గా చలామణి అవుతున్న అమెరికా తన దురాక్రమణ విధా నాల ద్వారా అంతం చేస్తుందని గడాఫీ దారుణహత్య మరోసారి తిరుగులేని విధంగా రుజువు చేసింది!
- లిబియా పౌరులందరికీ ఉచిత విద్యుచ్ఛక్తి.
బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు కాబట్టి పౌరులు చట్టాల ప్రకారం వడ్డీ లేకుండా రుణాలు తీసుకోవచ్చు.
ప్రజలకు నిలువ నీడ కోసం గృహవసతి పొందే హక్కు.
కొత్తగా పెళ్లయిన జంటలు ఇల్లు కొనుక్కుని, సంసారం పెట్టుకోడానికిగాను వారికి 50,000 డాలర్లను ప్రభు త్వం నుంచే పొందే హక్కు.
ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు పొందే హక్కు.
వ్యవసాయం చేసుకోదలచిన వారికి వ్యవసాయ ప్రయోజనాల నిమిత్తం ఉచితంగా భూమిని పొందే హక్కు.
పౌరులకు విద్య, వైద్య సదుపాయాలు స్థానికంగా లభించనప్పుడు వారిని ఇతర దేశాలకు ప్రభుత్వం- పంపిస్తుంది. ఇందుకుగాను వారికి నెలవారీ జీవన భృతి కింద 2,300 డాలర్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది.
- పౌరులు కారు కొనుక్కుంటే కారు రేటులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది.
అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 0.14 డాలర్లు.
లిబియాలో చెల్లించాల్సిన విదేశీ రుణాలు ఏవీలేవు, 150 బిలియన్ డాలర్ల మేర విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయి.
యూనివర్సిటీ పట్టభద్రులై విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్లిన తరువాత వారికి ఉద్యోగం దొరికే దాకా సగటు జీతాన్ని ప్రభుత్వం ఇస్తుంది.
- పెట్రోల్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదా యంలో కొంత భాగాన్ని ప్రతీ పౌరుడి బ్యాంకు అకౌం టుకు ప్రభుత్వం జమచేస్తుంది.
- ప్రతీ లిబియన్ మహిళకు పుట్టిన బిడ్డ పోషణ నిమిత్తం ప్రభుత్వం 5,000 డాలర్లు ఇస్తుంది.
40 రొట్టెల ఖరీదు 0.15 డాలర్లుగా ఉంటుంది.
లిబియా ప్రజల్లో 25 శాతం మంది యూనివర్సిటీ పట్ట భద్రులు లేదా సర్టిఫికెట్లు పొందిన వారు.
లిబియా తన మానవ వనరులను వినియోగించుకుని నదుల వంటి జలవనరులను నిర్మించడం ద్వారా అత్యంత విస్తారమైన జల వ్యవస్థను ఏర్పాటు చేసు కుంది, తద్వారా ఎడారి దేశమైన లిబియాలో ఎక్కడికి వెళ్లినా నీరు సమృద్ధిగా లభిస్తుంది.
Take By: sakshi
Tags: T News, hmtv, tv9, Telangana agitation, statehood demand, Sakshi, Gaddafi, Libya
0 comments:
Post a Comment