Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, December 22, 2011

Court orders social networking sites to remove objectionable images

New Delhi:  A Delhi court has ordered several social networking companies including Facebook, YouTube, Microsoft India, Google and Orkut to remove some images from their websites.

The court, hearing a petition filed by Mufti Aijaz Arshad Qasmi objecting to images hurting religious sentiments, said, "the photographs shown by the plaintiff having content of defamation and derogation against the sentiments of every community."

"Defendants are further directed to remove the same from their social networking sites...," the court added.

Over the last few months, Information Technology minister Kapil Sibal had asked social networking giants like Google and Facebook to ensure offensive material is deleted. Mr Sibal denied that this amounts to censorship; he also said that the government will have to intervene because the companies have not cooperated.

"I suggested that these platforms should evolve a mechanism on their own to ensure that such contents are removed as soon as they get to know of it... I have told them that this cannot go on," Mr Sibal had said.


Take By: ndtv News

Read more...

Australian teenager gets 13 years in jail for Indian student Nitin Garg's murder

Sydney:  An Australian teenager who fatally stabbed Indian student Nitin Garg in January 2010 was on Thursday jailed for 13 years.

The teenager, whose identity has been suppressed, was just 15 when he attacked Garg, 21, as he walked through Melbourne parkland to work. He stabbed him during an attempt to steal his mobile phone.

Garg, an Indian accounting graduate, managed to stagger to his workplace, a nearby burger restaurant, before collapsing with fatal stab wounds to the abdomen.

He died the next day in hospital.

The highest-profile in a string of attacks on Indian students in Australia, Garg's murder made international headlines and outraged public opinion in India, sparking accusations of widespread racism against migrants.

Diplomatic ties were tested, with Delhi condemning the killing as a "heinous crime on humanity" and "an uncivilised brutal attack on innocent Indians".

It followed a spate of muggings and beatings, accompanied by migration scams and colleges charging for substandard courses, which prompted street protests by Indians in Melbourne and Sydney in 2009.

Australia's reputation as a safe and welcoming destination for international students was badly damaged, leading to a drop-off in enrolments and sparking a government review of the tertiary education sector.

Judge Paul Coghlan on Thursday described Garg as an "innocent and random victim" but said the crime was spontaneous and he accepted that his attacker, now 17, was remorseful and had no intention of killing when he went to the park.

The judge also ruled that it was a crime of opportunity rather than race.

"The community abhors the use of knives because of the consequences such as this," Coghlan said.

The teen, who pleaded guilty to murder and attempted armed robbery, must serve at least eight years of his sentence before being eligible for parole.

Take By: Ndtv News :http://www.ndtv.com/article/india/australian-teenager-gets-13-years-in-jail-for-indian-student-nitin-garg-s-murder-159889

Read more...

Telugu Cinema Hyderabad Diary 2012 released


Much water has flown under the bridge ever since Tollywood shifted its base from Chennai to Hyderabad. There's development on all fronts. Many studios including some with world class standards and the graphics, creative wings and of course the post production suits have come up. The availability of artists is also easier and in one sense, Hyderabad has almost become the hub of Tollywood. As the city sleeps, Tollywood awakens.

 
Krishnanagar, Filmnagar, Jubilee Hills and Banjara Hills buzz with life as the film world prepares for a day on the sets. A workforce of around 1 lakh people cook up dreams for all of Hyderabad and the rest of the state. In a city where theatre has been reduced to a hobby and music is an afterthought, Cinema provides entertainment and escape.

Keeping all these thigs in mind a theme-based diary detailing the long journey of Telugu Cinema was released by a city based Hindi daily Hindi Milap. The diary is a tribute to our city and captures the flavour of our streets, our people, and our culture.


Hyderabad Diary 2012 is a tribute to the Telugu Film Industry or Tollywood as it is popularly referred to. The film industry has played a major role in popular culture and Hyderabad as a city has absorbed elements of Telugu cinema. The diary showcases 75 year history of Telugu Cinema through glorious posters with a small focus on depicting the effect of Tollywood in Hyderabad – on the streets, amongst people and in their daily lives.

Written by noted film maker Sandeep Gunnam, and introductory remarks by Gangaraju Gunnam, the diary has over 50 spectacular posters from all eras. The cost of the diary is `365.

Take By: The Hans India News

Read more...

T industry body launched ( TEECI) Telangana Chambers of Commerce and Industry

Hyderabad: With an aim to espouse the cause of industrialists from Telangana region, the Telangana Chambers of Commerce and Industry (TECCI) has been launched on Wednesday.

TRS MLA K T Rama Rao, who unveiled the new industry body, urged industrialists from Telangana to develop TECCI into an eminent industry body on the lines of the Confederation of Indian Industry (CII). M Venkateswarlu, Managing Director, RDF Power Gen Limited, has been elected president of the body. Y Jaihind Reddy, Managing Director, Jaihind Constructions Private Limited, is the vice-president, while D Ashok Kumar, Proprietor, Mahalaxmi Gas Agency, is the secretary.

The newly-formed industry body has also launched its website www.Tecci.rg which has information on the industrial sector in the region. In the objectives listed out on the website, TECCI stated that it would focus on small, medium and major Industries, besides power, agriculture, trade and government related issues. 

The body will soon organise a roundtable conference to review the prevailing situation and adopt measures to develop industrial sector in Telangana.

 Take By: The Hans India News

Read more...

తెలంగాణ పరిక్షిశమల్ని కాపాడుకుందాం - T industry body launched ( TEECI) Telangana Chambers of Commerce and Industry

 (TEECI Means - Telangana Chambers of Commerce and Industry)

సీమాంవూధుల దోపిడీని అరికడుదాం: వక్తల పిలుపు
తెలంగాణ యవనికపై ‘టెక్కి’ ఆవిర్భావం
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
తెలంగాణను విదర్భతో ముడిపెట్టొద్దు: పేర్వారం
తెలంగాణ ప్రజలు పాలేర్లుగా మారాల్సి వస్తోంది: విపకాశ్
టెక్కీ ఆవిర్భావం శుభపరిణామం: అల్లం నారాయణ

tred-talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 21 ():‘‘భారత్ హెవీ ఎలక్షికికల్స్ లిమిటెడ్‌లో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగి (సీమాంధ్ర వ్యక్తి) తన పలుకుబడిని ఉపయోగించి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 3,500 మందికి ఉద్యోగాలు కల్పించారు. దీంతో స్థానిక తెలంగాణ యువత తమ ఉపాధి అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది.’’

‘‘బూర్గుల రామకృష్ణారావు (తెలంగాణ వ్యక్తి) సమీప బంధువు ఒకరు పరిక్షిశమ స్థాపించేందుకు తన భూమిని తనఖా పెట్టి బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా, బ్యాంకు మొండిచేయి చూపింది. చివరకు విసుగెత్తిన ఆయన భూమిని ఓ సీమాంవూధుడికి విక్రయించాడు. తెలంగాణ వ్యక్తికి రుణం ఇచ్చేందుకు అంగీకరించని ఆ బ్యాంకు సీమాంధ్ర వ్యక్తికి అదే భూమిపై రెండు నెలల్లో రుణం మంజూరు చేసింది.’’

‘‘తెలంగాణకు చెందిన పారిక్షిశామికవేత్త ఒకరు విశాఖపట్నం సమీపంలో సిమెంట్ పరిక్షిశమ స్థాపనకు ప్రయత్నించి అనువైన స్థలం కోసం సంప్రదించగా ఏపీఐఐసీ తాను సేకరించిన ధరకంటే 10 రెట్లు అధికంగా ధరకు భూమిని కేటాయించింది. ఆ స్థలంలోనూ సిమెంట్ పరిక్షిశమ ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల పాటు సీమాంధ్ర నాయకులు, పారిక్షిశామిక వేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు మరో స్థలంలో ఆయన పరిక్షిశమ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.’’

... ఇవి తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టీఈసీసీఐ-టెక్కి) ఆవిర్భావ సమావేశంలో పలువురు వ్యక్తులు ఉదహరించిన సంఘటలు. సీమాంవూధుల పాలనలో తెలంగాణ పారిక్షిశామిక రంగం ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, అణచివేతకు సంబంధించిన ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇలా రంగాల్లో దోపిడీకి గురైన తెలంగాణ సమాజం ఉత్తేజితమై దోపిడీదారులపై తిరుగుబావుటా ఎగురవేస్తున్న క్రమంలో తాజాగా తెలంగాణ పారిక్షిశామిక వేత్తల సైతం తమ పోరాటానికి అంకురార్పణ చేశారు. ఒకప్పుడు మూడు పువ్వులు ఆరుకాయలుగా పరిఢవిల్లిన తెలంగాణ పారిక్షిశామిక రంగం దశల వారీగా దెబ్బతినడం వెనుక ఉన్న సీమాంవూధుల కుట్రను ఎండగడుతూ, పునురుజ్జీవం దిశగా అడుగులు వేస్తోంది. 

తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య వేత్తలకు ప్రోత్సాహం అందించి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే ధ్యేయంగా టెక్కీ ఆవిర్భవించింది. ఈ కార్యక్షికమం బుధవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ సీహెచ్ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. టెక్కి వెబ్‌సైట్‌ను పేర్వారం రాములు ఆవిష్కరించారు. పెన్నార్ ఇండవూస్టీస్8 చైర్మన్ జె.ఉపేందర్‌రావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్షికమంలో టెక్కి అధ్యక్షుడు ఎం ఉపాధ్యక్షులు వై.జైహింద్ రెడ్డి, వేదకుమార్, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ, విపకాశ్, ప్రముఖ రాజకీయ నాయకులు కమలాకర్, ప్రొ.రమేష్, ఇండవూస్టియలిస్ట్ బ్రహ్మయ్య, జె.బాపుడ్డి తదితరులు మాట్లాడారు.

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ హనుమంతరావు అభివూపాయపడ్డారు. ఆర్థిక ప్రగతిని సాధించడం అనేది భారత ఆర్థిక ప్రణాళికలో కీలకాంశం అన్నారు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచీ అమలుచేస్తున్న ప్రణాళికల్లో నిర్ధేశించుకున్న లక్ష్యాలతో పోలిస్తే సాధించిన ప్రగతి తక్కువగానే ఉందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత అభివృద్ధిలో వేగం పుంజుకున్నప్పటికీ పేదరిక పెరిగారనారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు పారిక్షిశామికవేత్తలకు మంచి ఊపునిచ్చాయని పేర్కొన్నారు. 

జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్8గఢ్ రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఆయా ప్రాంతాల అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. ఈ అభివృద్ధి మాతృ రాష్ట్రాల(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధికంటే ఎక్కువుందన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో ఇంతకు ముందు రాష్ట్రాలు సైతం చిన్నవిగా మారాయని తెలిపారు. తద్వారా ఈ రాష్ట్రాల్లోనూ(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధి రేటు పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో బీహార్ సాధించిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. మహరాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ కారణంగానే విదర్భ, తెలంగాణకు పోలికుందని పలువురు భావిస్తారు, కానీ ‘విదర్భ నిరాదరణకు గురైతే తెలంగాణ దోపిడీకి గురైందని’ ప్రొ.జయశంకర్ ఒక చక్కని వివరణ ఇచ్చారని హనుమంతరావు గుర్తుచేశారు. రాష్ట్రంలోని మొత్తం పరిక్షిశమల్లో 62 శాతం తెలంగాణ ప్రాంతంలో ఉండగా, వాటిలో 75శాతం సీమాంధ్ర వ్యక్తులకు చెందినవేనన్నారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల్లోనూ తెలంగాణ వారికి 25శాతం కూడా దక్కలేదన్నారు.

రక్తం మరిగిపోతోంది: పేర్వారం
అనాదిగా తెలంగాణ అణచివేతకు గురికావడం ఒకెత్తయితే 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం పరిణామాలతో అంతకు మించిన అన్యాయం జరుగుతోందని రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్8 పేర్వారం రాములు అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి చిదంబరం, ప్రధాన మంత్రి తదితరులు ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూస్తుంటే మాలాంటి రిటైర్డ్ ఉద్యోగులకూ రక్తం మరిగిపోతోంది’ అని ఘాటుగా స్పందించారు. ‘ఆంవూధవూపదేశ్ ఆవిర్భావానికి వ్యతిరేకంగా 1952లోనే (నేను రెండో తరగతిలో ఉన్నా) ఈ ప్రాంతంలో వ్యతిరేకత ఉంది..’ అని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక డిమాండ్లకు పోలిక లేదన్నారు. తెలంగాణను విదర్భతో ముడిపెట్టడం తగదని పేర్కొన్నారు. తెలంగాణలో పారిక్షిశామిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని, సీమాంవూధుల పెత్తనం మొదలయ్యాకే ఈ ప్రాంతం దోపిడీకి గురైందన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.

అవినీతిలో ఎందెందు వెతికినా సీమాంవూధులే: కేటీఆర్
దేశంలో జరిగిన దాదాపు అవినీతి కుంభకోణాల్లో సీమాంవూధుల పాత్ర ఉండటం వారి దోపిడీ విధానానికి నిదర్శనమని టీఆర్‌ఎస్8 ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్న నానుడిని వీరు నిజం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిజాం షుగర్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్8 రాజశేఖరడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి వైఎస్8 తాను అధికారంలోకి వచ్చాక పూర్తి భిన్నంగా వ్యవహరించి నిజాం షుగర్స్‌ను కోలుకోలేని స్థితికి వచ్చేలా చేశారని మండిపడ్డారు. తెలంగాణ భూములను కొల్లగొ చంద్రబాబు ప్రభుత్వం కిటీకీలు తెరిస్తే కాంగ్రెస్8 ఏకంగా తలుపులే తెరిచిందన్నారు.

అభివృద్ధికంటే దోపిడే అధికం: ప్రకాశ్
సీమాంవూధులు హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్ధం అని ప్రముఖ తెలంగాణవాది విపకాశ్ అన్నారు. ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావానికి ముందు ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ ఎన్నో రెట్లు అభివృద్ధి చెంది ఉందని గుర్తుచేశారు. తమకు అనువైన ప్రాంతంగా భావించి తెలంగాణకు వచ్చిన సీమాంవూధులు అంచెలంచెలుగా ఇక్కడి వనరుల్ని దోచుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వారుపెట్టిన పెట్టుబడులకన్నా ప్రభుత్వం ద్వారా పొందిన రాయితీలు, ప్రయోజనమే అధికమన్నారు. చర్లపల్లి పారిక్షిశామికవాడలో ఉన్న సుమారు 500 కంపెనీల్లో 300 వరకు సీమాంవూధుల ఆధీనంలోనివే అయినప్పటికీ, ఆయా కంపెనీల పెట్టుబడులు మిగతా వాటితో పోలిస్తే 10శాతం కూడా లేవని చెప్పారు. కేవలం ఫార్మా రంగంలోనే సీమాంవూధులు అధికంగా పెట్టుబడులు పెట్టారన్నారు. ఈ ప్రాంతంలో నెలకొల్పిన ఫార్మా కంపెనీల వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. పరిక్షిశమల కోసం స్థలాల్ని కోల్పోయిన తెలంగాణ ప్రజలు సొంత భూముల్లో పాలేర్లుగా మారాల్సిన దుస్థితికి వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విధ్వంసం నుంచి పునరుజ్జీవనం దిశగా: అల్లం
అడుగడుగునా విధ్వంసానికి గురైన తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య రంగాన్ని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లం నారాయణ అభివూపాయపడ్డారు. సీమాంవూధులు ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ సమాజాన్ని దోపిడీకి గురిచేశారన్నారు. తొలుత సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ దోపిడీ ఆరంభమైందని వివరించారు. ఒకప్పటి మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ పవర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఐమాక్స్ శిథిలాల కిందికి చేరిపోయిందన్నారు.

మీడియా హౌజ్‌లూ అదే దారిపట్టాయని చెప్పారు. విదర్భ వెనుకబడిన ప్రాంతం అయితే తెలంగాణ దోపిడీకి గురైన ప్రాంతం అని అన్నారు. సీమాంవూధుల విచ్చలవిడి దోపిడీతో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో నష్టపోయిందని, నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి సంస్థపూన్నో ఖాయిలా పడ్డాయని పేర్కొన్నారు. ఐడీపీఎల్ మూతపడిన వెంటనే చౌటుప్పల్ పరిసరాల్లో సీమాంవూధులకు చెందిన సుమారు 40ఫార్మా కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ పారిక్షిశామిక రంగం ఆర్థిక స్వావలంభన సాధించి నిలదొక్కుకోవడంలో భాగంగా టెక్కీ ఆవిర్భావం తొలి అడుగని ఆయన అన్నారు.

Take By: T News

Read more...

చీకటి ఖండంలో భారత్ కబ్ఝా!

africa-copy-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
 
- ఇది ఇండియన్ ఇంపీరియలిజం!
- 80 పైగా భారత కంపెనీల పాగా
- సౌదీ, సౌత్ కొరియా వంటి దేశాలూ ఉన్నాయి..
- భారీగా వ్యవసాయ భూముల ఆక్రమణ
- లక్షల హెక్టార్లు.. ఏళ్ల తరబడి లీజులు


ఆఫ్రికా! చాలా కాలం వరకూ ఇది ఓ చీకటి ఖండం! అంతుపట్టని రహస్యం! కాలం గడిచే కొద్దీ అందులోని అమూల్యమైన, అపారమైన ఖనిజ సంపద, వనరుల సంగతి జగతికి విదితమైంది! వెలుగుల తోవలో అడుగు పెట్టిన ఆఫ్రికా అక్కడే మరోమారు చీకటి ఊబిలో కూరుకుపోయింది! ఆఫ్రికా ఖండంలోని వనరులపై కన్నేసిన అనేక దేశాలు.. దాన్ని తమ దోపిడీకి వనరుగా మార్చుకున్నాయి. కొన్ని దేశాలు ప్రత్యక్షంగా వలస రాజ్యాలు ఏర్పాటు చేసుకోగా.. కొన్ని దేశాలు పరోక్షంగా ఆఫ్రికా దేశాల వనరులను దోచు కుంటున్నాయి. విశేషం ఏమిటంటే.. ఒకప్పటి బ్రిటిష్‌వలస రాజ్యంగా ఉండి, వలస పాలన బాధలు అనుభవించిన భారత దేశం కూడా ఈ నయా వలస దోపిడీలో భాగస్వామి కావడమే!

సోమాలియాలో ఆకలికి అల్లాడుతున్న చిన్నారులను గుర్తు తెచ్చుకోండి! ఎముకలు తేలిన దేహం, లోపలికి పోయిన కళ్లు, బేల చూపులు! పెను ఆహార సంక్షోభానికి నిదర్శనాలు! వీరి ఆకలికి, వీరి పోషకాహార లేమికి కారణాలేంటి? తగినంత ఆహార ఉత్పత్తి లేకపోవడమా? ఉత్పత్తికి తగిన వనరులు లేకపోవడమా? కాదు. కానే కాదు. వీరితో ఆకలి కేకలు వేయిస్తున్నది దారిద్య్రం, అసమానతలే! కళ్ల ముందు ధాన్యం గరిసెలున్నా.. ఉత్పత్తి, పంపిణీలోని తారతమ్యాలే వారి పేగులను మలమల మాడిస్తున్నాయి. ఆఫ్రికాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది! వారూ వీరూ అనిలేదు. పెట్టుబడిదారీ సమాజం అమెరికా మొదలుకుని, సామ్యవాద దేశమైన చైనా వరకు.. పెట్టుబడిదారీ దేశాల దోపిడీ పదఘట్టనల కింద మార్కెట్‌లు కోల్పోయి నయా ఆర్థిక విధానాల మాయాజాల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్న భారత్‌వంటి దేశాలు మొదలు.. చమురు సొమ్ముతో సకల విలాసాలు అనుభవిస్తున్న సౌదీ అరేబియా వరకు.. తిలా పాపం తలా పిడికెడు చందాన వ్యవహరిస్తున్నాయి. ఒక్క సూడాన్‌లోనే ఏడు లక్షల హెక్టార్లను దక్షిణ కొరియా లీజులకు తీసుకుంది. టాంజానియాలో సౌదీ అరేబియా ఐదు లక్షల హెక్టార్ల లీజులపై సంతకాలు చేసింది. 80కిపైగా భారతీయ కంపెనీలు 240 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఇది ఆఫ్రికా అభివృద్ధికి సహకారమా? లేక భూకబ్జానా?

ఆఫ్రికాలో అపారమైన జల వనరులున్నాయి. అంతకు మించి అతి తక్కువ ఖరీదుకు సారవంతమైన వ్యవసాయ భూములు దొరుకుతాయి. భారత్‌లో అయ్యే ఖర్చులో సగమే ఇక్కడ అవుతుంది. ఇంకేం.. భారతదేశానికి చెందిన కంపెనీలు ఆఫ్రికాలో అడుగు పెట్టాయి. 2010 నాటికి వివిధ ఆఫ్రికా దేశాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు 80కిపైగా భారతీయ కంపెనీలు ఇథియోపియా, కెన్యా, మడగాస్కర్, సెనెగల్, మోజాంబిక్, టాంజానియా, ఉగాండా వంటి దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో వివిధ పంటల నిమిత్తం 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ మొత్తం ఉత్పత్తిని తిరిగి తమ దేశానికి లేదా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు ఉద్దేశించారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన లక్కీ అనే గ్రూపునకు చెందిన ఎస్‌ఎన్ పాండే ఏడాది క్రితం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘ఆవూఫికాలో వ్యవసాయ ఖర్చులు భారత్‌తో పోల్చితే దాదాపు సగం. ఇక్కడి పొలాల్లో పెద్దగా ఎరువులు, పురుగుమందులు వాడనవసరం లేదు. కూలీలు కూడా చౌకకు దొరుకుతారు.

వ్యవసాయ దిగుబడి అత్యధికంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇక్కడ కనీస వేతనం రోజుకు 8 బిర్‌లు. (ఒక బిర్ మన కరెన్సీలో సుమారు మూడు రూపాయలు). దీనికి తోడు పలు ఆఫ్రికా దేశాలు భారతీయ వ్యవసాయ కంపెనీలు పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను 50 ఏళ్లపాటు లీజుకు ఇస్తున్నాయి. మరికొన్ని అయితే ఏకంగా 99 ఏళ్ల లీజులు ఆఫర్ చేస్తున్నాయి. అది కూడా కారు చౌక ధరలకే. భారతదేశంలోని పంజాబ్‌లోని దోవాబా ప్రాంతంలో ఎకరం పొలం లీజుకు (కౌలుకు) ఇస్తే కనీసం 40వేల రూపాయలు చెల్లించాలి. కానీ.. ఆఫ్రికా దేశాల్లో అదే ఎకరం భూమికి కేవలం 700 రూపాయలు చెల్లిస్తే చాలు. అంటే పంజాబ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకునే బదులు ఆఫ్రికాలో 60 ఎకరాలను కైవసం చేసుకోవచ్చన్నమాట.

132838-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తమకు తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతోనో, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించే సామర్థ్యం లేకపోవడంతోనో, లాలూచీలు పడో ఆయా ఆఫ్రికా దేశాలు తమ భూములను లీజుకు ఇచ్చేస్తున్నాయి. ఈ లీజులాటలో దారుణంగా నష్టపోతున్నది మాత్రం స్థానికులే. ఇథియోపియా వంటి దేశాల్లో సమర్థవంతమైన ప్రభుత్వాలు లేకపోవడం, ప్రజాస్వామ్యం లేకపోవడంతో భూ సేకరణ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిర్వాసితులయ్యే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వద్ద పెద్ద ఎత్తున పంటలు పండుతున్నా.. తిండికి నోచుకోక అలమటిస్తున్నారు.

పెల్లుబుకుతున్న నిరసన
అయితే ఇటీవలి కాలంలో విదేశీ భూ కబ్జాలపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల కారణంగా తమ పశువులకు మేత దొరకడం లేదని, నీళ్లు కూడా దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను పెద్ద ఎత్తున లీజులు పొందిన కంపెనీలు ఈ భూముల్లో విదేశీ పెట్టుబడుల వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలులభిస్తాయని, వారి జీవన స్థితిగతులు మెరుగై, స్థూల జాతీయోత్పత్తి పెరుగుతందని వాదిస్తున్నాయి. ఇథియోపియాలో మూడు లక్షలకుపైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. కానీ.. పూర్తి యంత్ర పరిజ్ఞానంపై ఆధారపడి జరిగే వ్యవసాయ పనుల్లో కేవలం 20వేల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయని అంచనా.

లీజు వ్యవహారాలను వ్యతిరేకించినందుకు అనేక మంది స్థానికులు హత్యలకు గురయ్యారని, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయని ఇటీవల బీబీసీ పేర్కొనడం విశేషం. స్థానిక భూములను, నదీ జలాలను వెర్దాంత హార్వెస్ట్స్ బారి నుంచి కాపాడేందుకు పలు సంస్థలు ఇప్పటికే పోరాటాలు ప్రారంభించాయి. ఈ భూములను ఖాళీ చేయించి అక్కడ తేయాకు, సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం భూములను లీజులకు ఇస్తే దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అక్కడి పోరాట సంస్థలు వాదిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారి మాటలను చెవికెక్కించుకోవడం లేదు. ‘‘గంబెలాలో ప్రస్తుతం జరుగుతున్నది న్యూఢిల్లీలో లేదా ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్, బిస్‌మార్క్, నార్త్ డకోటా వంటి ప్రాంతాల్లో జరిగితే ఏమవుతుంది? ఇది అనూహ్యం. ఆ దేశాలు ఇటువంటి సంస్థలను అనుమతించని పక్షంలో ఇథియోపియాలో ఈ లీజులను ఎలా సమర్థిస్తారు?’’ అని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియా ప్రతినిధి ఒబాంగ్‌మెథో ప్రశ్నిస్తున్నారు.

భారీ స్థాయి వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తి యాంత్రిక పద్ధతుల్లో జరిగే వ్యవసాయం పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన అంటున్నారు. వీటికి పెద్ద ఎత్తున జల వనరులు వినియోగమవుతాయని, అది భూగర్భ నీటి మట్టాలపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఫలితంగా భూమి, నీటికి మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లొసుగుల ఒప్పందాలు
Juba007-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం ఒక ఐదు భారత కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బయటపెట్టింది. అయితే.. ఈ ఒప్పందాలన్నీ పూర్తిగా లొసుగులతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీజులు పొందిన కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని నదులపై ఆనకట్టలు కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇస్తున్నారు. తమకు కావల్సినన్ని బోరుబావులు ఏర్పాటు చేసుకోవచ్చు. తమకు నచ్చిన పద్ధతిలో సాగునీటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నీటిని వాడుకున్నందుకు చెల్లింపుల సంగతి, ఎంత నీటిని, ఎంతకాలం వాడుకోవాలి అన్న విషయాల్లో మాత్రం ఒప్పందాల్లో ఎక్కడా నిర్దిష్టంగా లేదని విమర్శలున్నాయి. కార్మికులకు వేతనాలు, వారి హక్కులు, వారి పని పరిస్థితులపై కూడా ఎక్కడా నిర్దిష్టమైన షరతులు ఒప్పందాల్లో లేకపోవడం విశేషం. పైగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునే తీరు స్థానికులకు పరిచయం చేయాలన్న నిబంధనలు కూడా లేవు. దీనితో విదేశీ కంపెనీలు ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఇథియోపియాకు ఒరిగే లాభమేంటని విదేశీ కంపెనీలను వ్యతిరేకిస్తున్న సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

4.5 కోట్ల హెక్టార్లు లీజులకు...
చైనా, సౌదీ అరేబియా, కువైట్, దక్షిణ కొరియా, ఐరోపా యూనియన్‌తో పాటు తాను సైతం అంటూ భారత దేశానికి చెందిన కంపెనీలు అనేక ఆఫ్రికా ఖండంలో వ్యవసాయ భూములను కారుచౌకగా కొట్టేస్తున్నాయి. పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేయడమే కాకుండా.. స్థానికుల కడుపు మాడ్చి, ఆహారాన్ని బయటి దేశాలకు ఎగుమతులు చేసుకుని సొమ్ములు మూటగట్టుకుంటున్నాయి. దీనికి మూలాలు 2008 నుంచే ఉన్నాయి. 2008, 2009 సంవత్సరాల మధ్య దాదాపు 4.50 కోట్ల హెక్టార్ల భారీ వ్యవసాయ క్షేత్రాల ఒప్పందాలు జరిగాయని సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు తాజా నివేదిక పేర్కొన్నది.

సహకారమే : చైనా ఆఫ్రికా దేశాల్లో భూ కబ్జాలకు తాము పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలను చైనా ఖండించింది. ఆఫ్రికా వ్యవసాయ రంగ అభివృద్ధికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హోంగ్ లీ చెప్పారు. ఆఫ్రికా స్థానికులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా వారి భూముల్లో వారే సమర్థవంతంగా వ్యవసాయం చేసుకునేందుకు దోహదం చేస్తున్నామని తెలిపారు. తమ చర్యలకు ఆఫ్రికా దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న విషయాన్ని గమనించాలని లీ కోరారు. ‘‘ఆవూఫికాలో నయా సామ్రాజ్యవాదం ఉన్న సంగతి నిజమే కానీ.. అది చైనా నుంచి కాదు’’ అని ఆయన చెప్పారు.

విదేశాల్లో వెంచర్లు ప్రారంభించే భారతీయ కంపెనీలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ధోరణులను కొనసాగిస్తాయన్న భావన ఉంది. కానీ.. పేద దేశాలపై కొన్ని కంపెనీలు ఎలా తమ సామ్రాజ్యవాదకోరలను సాచి, పెద్ద ఎత్తున భూములు కబ్జాచేస్తున్నాయన్నది, ఆయాపేద దేశాల్లో స్థానికులకు చేస్తున్నదేంటన్నది పెద్దగా బయటికి వచ్చింది లేదు. అయితే రిక్ రాడెన్ అనే పరిశోధకుడు దీనిపై పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న వ్యవసాయ భూముల విషయంలో భారత పాత్ర ఏంటన్నదానిపై ఒక పత్రం విడుదల చేశారు. తమపై దారుణాలకు పాల్పడుతున్నాయంటూ పశ్చిమ దేశాలపై భారత్ పలుఅంశాల్లో విమర్శిస్తూ ఉంటుంది. అయితే..అదే స్థాయిలో ఆయా పేద దేశాలపై భారతకంపెనీల దోపిడీ కొనసాగుతుండటమే ఇక్కడ ఆశ్చర్యం కల్గించే అంశం. దీనికి ప్రభుత్వ అండదండలు ఉండటం మరో కీలకాంశం. ఇక్కడ
పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భారత ప్రభుత్వం రుణాలు కూడా మంజూరు చేస్తోంది. దీన్ని భారత ప్రభుత్వం కేవలం వ్యాపారంగానే చూస్తోంది.

కరుటూరి సామ్రాజ్యం
ఇథియోపియాలోని గంబెలా ప్రాంతంలో కరుటూరి ఆగ్రో ప్రొడక్ట్స్ అనే భారతీయ కంపెనీ భారీ లీజు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ కంపెనీ జికావో, ఇటాంగ్ జిల్లాల్లో లక్ష హెక్టార్ల భూమిని కౌలుకు తీసుకుంది. పామాయిల్ తోటలు, తృణధాన్యాలు పండించేందుకు ఈ భూమిని పొందింది. మరో రెండు లక్షల హెక్టార్లపైనా కన్నేసింది. రుచిసోయా ఇండవూస్టీస్ అనే కంపెనీ గంబెలా, బెనిషంగుల్ గుమెజ్ రాష్ట్రాల్లో లక్షన్నర హెక్టార్ల భూమిని పాతికేళ్లకు లీజుకు తీసుకుంది. ఇలాంటివి ఆఫ్రికా దేశాల్లో కోకొల్లలు. తమ దేశంలోని బంజరు భూములను అభివృద్ధి చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని ఇథియోపియా ప్రభుత్వం చెబుతున్నది. అయితే.. నిపుణులు మాత్రం ఇథియోపియాలో ఆ మాటకొస్తే మొత్తం ఆఫ్రికాలో బంజరు భూములు అనే మాటే లేదని తేల్చి చెబుతున్నారు.

మాది కేవలం వ్యాపారమే
తమపై వస్తున్న విమర్శలను మాత్రం ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయం చేస్తున్న భారతీయ కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. తాము నయా సామ్రాజ్యవాదులం కాదని, కేవలం ఇక్కడ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నామని చెబుతున్నాయి. తాము ఇక్కడి కార్మికులకు కనీసం వేతనం 8 బిర్‌లు ఇస్తున్నామని కరుటూరి గ్లోబల్‌వివరణ ఇచ్చింది. భారతీయ కరెన్సీలో ఒక బిర్‌కు 3 రూపాయలు. అంటే రోజుకు ఇథియోపియన్ కార్మికులకు దక్కుతున్న వేతనం కేవలం 24 రూపాయలు. ఇథియోపియా చట్టాలకు లోబడే పని చేస్తున్నామని, పర్యావరణ చట్టాలను అనుసరిస్తున్నామని పేర్కొంటోంది. తాము ఇప్పటికే 20వేల మందికి ఉపాధి కల్పించనున్నామని ఒక వార్తా పత్రికతో కరుటూరి గ్లోబల్ వ్యవస్థాపకుడు సాయి రామకృష్ణ చెప్పారు. ఆస్పత్రి, సినిమాహాల్, పాఠశాల, డేకేర్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇలాంటివేమీ ఏర్పడుతున్నట్లు సంకేతాలు లేవని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియాకు చెందిన ఒబాంగ్ మెథో అంటున్నారు.

ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి అచ్చుగుద్దినట్లు మన దేశంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో విదేశీ కార్పొరేట్‌లు చేస్తున్నట్లే ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఉభయ దేశాల్లోని ప్రగతిశీలవాదులు ఐక్యంగా ఉద్యమించాలని మెథో అభివూపాయపడ్డారు. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌లతో స్థానికుల కడుపు నిండుతుందనుకుంటే పొరపా ఆయన అన్నారు. ఈ ఒప్పందాలు అవినీతి రాజకీయ నాయకులు, విదేశీ ఇన్వెస్టర్ల జేబుల్లోకి డాలర్లు నింపడం తప్ప మరోటి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒప్పందాల్లో చాలా వాటిలో పాదర్శకత లేదని ఆయన విమర్శించారు.
 
Take By: T News : http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=4&ContentId=55067

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP