Thursday, October 6, 2011
23RD DAY SAMME UPDATES….23వ రోజుకు చేరిన సకలజనుల సమ్మె,ఏపీకి గ్యాస్ కేటాయించిన కేంద్రం,మద్యం డిపోల్లో సమ్మె ఉధృతం
ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె 23వ రోజుకు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరింది. నేటి నుంచి సమ్మెకు మద్ధతుగా ఎకై్సజ్ ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. మద్యం తయారీ సంస్థలు, డిపోలు మూయనున్నారు.
సీఎంతో డీజీపీ భేటీ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో శాంతి భద్రత సమస్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఏపీకి గ్యాస్ కేటాయించిన కేంద్రం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విన్నపం మేరకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఏపీకి గ్యాస్ కేటాయించారు. 1.5 ఎంఎంఎస్‌సీడీ గ్యాస్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 330 మెగావాట్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
మద్యం డిపోల్లో సమ్మె ఉధృతం
సకల జనుల సమ్మెకు మద్ధతుగా మద్యం డిపోల్లో తెలంగాణ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం డిపోలకు తాళాలు వేశారు. తెలంగాణ వచ్చేంత వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఎకై్సజ్ జేఏసీ తెలిపింది. నిజామాబాద్ జిల్లా మాక్లురు మండలం మాదాపూర్‌లో ఉన్న ఐఎంఎల్ డిపోకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. ఆదిలాబాద్‌లోని ఊట్నూర్‌లో ఉన్న మద్యం డిపోకు తెలంగాణ ఉద్యోగులు తాళం వేశారు.
ప్రణబ్‌పై మండిపడ్డ ఎంపీ విజయశాంతి,11న మళ్లీ ఢిల్లీ టూర్: కేసీఆర్,తెలంగాణ ఇవ్వకపోతే మనుగడ కష్టం:యాష్కీ
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సమస్యలు వస్తాయి అని ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టి తెలంగాణ సమస్యను నాన్చొద్దని ఆమె హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్‌ను నిమజ్జనం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదన్నారు. ఎన్డీఏనే తెలంగాణ ఇస్తుందన్నారు.11న మళ్లీ ఢిల్లీ టూర్: కేసీఆర్
ఈనెలలోనే మళ్లీ ఢిల్లీ యాత్ర ఉంటుందని టీఆర్‌ఎస్ కె. చంద్రశేఖరరావు తెలిపారు. హైదరాబాద్‌కు బయలుదేరేముందు ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11న ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీలను కలుస్తానని చెప్పారు. వీరు అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయానని కేసీఆర్ తెలిపారు. జేఏసీ ప్రతినిధులు తీసుకొచ్చే విషయంపై ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పారు.
ప్రణబ్ వ్యాఖ్యల్లో కొత్తదనం లేదు: వినోద్
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్టు భావించడం లేదని టీ ఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ప్రణబ్ చరిత్రను ఉటంకించారని చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో దేశ సమగ్రతకు ఎలాంటి భంగం కలగదని గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ ఇవ్వనంతమాత్రాన కొత్త రాష్ట్రాల డిమాండ్‌లు ఆగిపోతాయా అని వినోద్ ప్రశ్నించారు. ప్రణబ్ వ్యాఖ్యల్లో కొత్తదనమేమీ లేదన్నారు.
తెలంగాణ ఇవ్వకపోతే మనుగడ కష్టం:యాష్కీ
తెలంగాణ ఇస్తే కొత్త రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్న సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ మధుయాష్కీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వకపోతేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అంశానికి, వేరే డిమాండ్లకు పోలిక లేదన్నారు.
ప్రభుత్వానికి పాలించే హక్కులేదు: జూపూడి,కోమట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించిన గవర్నర్,ఇక ప్రత్యక్షపోరే : కోమట్‌రెడ్డి
రైతుల సమస్యల్ని పరిష్కరించలేని రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే హక్కులేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు అన్నారు. రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం 6 నెలలకు మించి కొనసాగే అవకాశం లేదని జూపూడి జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా మార్చిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని ఆయన అన్నారు.కోమట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించిన గవర్నర్
మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కోమట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఇవాళ మధ్యాహ్నం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌కు సీఫార్సు చేశారు. ఇక కోమట్‌రెడ్డి ప్రత్యక్ష పోరులో పాల్గొంటారని ఆయన అనుచరులు తెలిపారు.
ఎమ్మెల్యేల రాజీనామాలూ ఆమోదించాలి : నాగం
మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లే ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదించాలని నాగరం జనార్ధనరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పదవికి అడ్డు రాని భావోద్వేగాలు ఎమ్మెల్యే పదవి రాజీనామాలను ఆమోదించడంలో ఎందుకడ్డుస్తున్నాయని ఆయన నాగం ప్రశ్నించారు. స్పీకర్ రాజ్యాంఘాన్ని ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని నాగం అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన దాదాపు 101 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందనే భయంతోనే ఆమోదించడం లేదన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించుకుంటే ఈ సకల జనుల సమ్మె అవసరమే లేదని, జనాలు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదని నాగం అన్నారు.
వరంగల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ
జిల్లా వ్యాప్తంగా బుధవారం సద్దుల బతుకమ్మను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రతి మహిళ తాను తాయరు చేసిన బతుకమ్మలపై జై తెలంగాణ నినాదం, తెలంగాణ మ్యాపు కల్గిన ప్లకార్డునుంచడం గమనార్హం. హన్మకొండలోని పద్మాక్షమ్మ దేవాలయం ప్రాంతమంతా మహిళలతో సందడిగా మారింది. ఎవరిని కదిపినా జైతెలంగాణ అంటూ స్పందించారు. వచ్చే బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటామనే విశ్వాసం మహిలల్లో కనిపించింది.
తెలంగాణపై ప్రధానికి బర్ధన్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ నాయకులు బర్ధన్ ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ రాష్ట్రంలో సకల జనుల సమ్మె ప్రారంభించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. సమ్మె వల్ల రాష్ట్రంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ప్రధానికి బర్ధన్ తెలిపారు.
ఇక ప్రత్యక్షపోరే : కోమట్‌రెడ్డి
తన మంత్రి పదవికి చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించడాన్ని కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ఆయన చెప్పారు. మంత్రి పదవిని ఆమోదించినట్లే ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను కూడా ఆమోదించాలని కోమట్‌రెడ్డి స్పీకర్ కోరారు.
కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం
రాష్ట్ర ఓడరేవులు, మౌలిక సదుపాయాల కల్పనశాఖ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి రాజీనామాను గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ ఆమోదించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ప్రెస్ సెక్రటరీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోమటిడ్డి రాజీనామాను ఆమోదించాలని సిఫారసు చేస్తూ సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కూడా బుధవారం గవర్నర్‌కు లేఖ పంపించారు. దీంతో గవర్నర్ మంత్రి రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కోమటిడ్డి నిర్వహించిన శాఖలను మరోమంవూతికి అప్పగించే వరకు సీఎం కిరణ్ చూస్తారని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రి పదవికి కోమటిడ్డి చేసిన రాజీనామా ఆమోదం పొందినప్పటికీ, శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. స్పీకర్ ఇంకా ఆయన రాజీనామా లేఖపై నిర్ణయం తీసుకోలేదు. తన రాజీనామా ఆమోదించక పోతే పట్టుబట్టి ఆమోదింపజేసుకుంటానని కోమటిడ్డి ఇంతకు ముందే ప్రకటించారు.
ఇటీవల కోమటిడ్డి నేరుగా సీఎంపైనే విమర్శలు సంధించడం, సకలజనుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ఇటీవల విద్యుత్ సౌధ వద్ద జరిగిన ఉద్యోగుల ఆందోళన కార్యక్షికమంలో అరెస్టు కావడం లాంటి చర్యలు సీఎంకు తలనొప్పిగా తయారయ్యాయనే వాదన వినిపిస్తోంది. మిగతా మంత్రులు కూడా రాజీనామాస్త్రాలు సంధించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కోమటిడ్డి రాజీనామాను ఆమోదించాలని గవర్నర్‌కు సిఫరసు చేసినట్లు తెలిసింది. తెలంగాణ కోసం అంతకుముదు జూపల్లి కృష్ణారావు కూడా తన మంత్రి పదవిని త్యాగం చేసిన విషయం తెలిసిందే.
పదవులు గడ్డిపరకలే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముందు తమ పదవులు గడ్డిపరకలతో సమానమని కోమటిడ్డి వెంకట్‌డ్డి అన్నారు. కేవలం తెలంగాణ కోసమే కోమటిడ్డి తన పదవికి రాజీనామా చేశారని భావించటం లేదంటూ కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఆయన ఈ విధంగా స్పందించారు. తన మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కోమటిడ్డి ఈనెల 8వ తేదీలోపు ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను కూడా ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 9వ తేదీ నుంచి ప్రజలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లో దీక్ష చేపడతానని హెచ్చరించారు.
కాల్చిపారేసేవాడితో కలిసుండుడెట్ల!
-కలిసుండాలంటూనే కపట నాటకం
- ఐక్యత మాటున అంతులేని విద్రోహం
- సైన్యాన్ని దించాలంటూ శివాలు
- నైజం చాటుకున్న నాయకగణం
- కేసీఆర్, కోదండరాంపై విద్వేష వ్యాఖ్యలు
- ఎన్‌హెచ్9 ముట్టడిని భూతద్దంలో చూపుతున్న సీమాంధ్ర నేతలు
-
ఉద్యమం అరాచకమంటూ అవాకులు చెవాకులు ఉద్యమంలో అరాచక శక్తులున్నాయట! వారు సీమాంవూధులపై దాడులకు పాల్పడుతున్నారట! వారిని అదుపు చేసేందుకు సైన్యాన్ని దించాలట! అవసరమైతే కనిపించిన వారిని కాల్చిపారేయాలట! ముఖ్యమంత్రి ఆ పని చేయకపోతే.. వారే తీవ్రంగా స్పందిస్తారట! తెలంగాణ ఉద్యమ నాయకులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తున్నారట! కనుక రాష్ట్రపతి పాలన విధించాలట! తెలుగు జాతి మధ్య చిచ్చు పెడుతున్నారట! ఆందోళనకారులు విధ్వంసకారులట! వారిని రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాంలేనట! వాళ్లు (సీమాంధ్ర నాయకులు) తిరగబడితే కేసీఆర్, కోదండరాం పారిపోతారట! కేసీఆర్.. రాష్ట్రంలో లక్షల మంది రైతుల ఉసురు పోసుకుంటున్నారట! ఆయన కుటుంబం పైశాచిక ఆనందం పొందుతున్నదట! వీటిని సహిస్తూ చేతులు ముడుచుకుని కూర్చోరట....!
అన్నదమ్ముల్లా కలిసుందామంటూ చల్లగా కబుర్లు చెప్పే నేతల క్షుద్ర నాలుకలపై నుంచి జాలువారిన విషపు గుళికలివి! నోరెత్తితే చాలు కాలం చెల్లిన సమైక్యవాదం ప్రవహించే నోళ్ల నుంచి వచ్చిన విద్వేష వ్యాఖ్యలివి! ఐక్యతను ఘోషించే నేతల అసలు సిసలు నైజాలివి!
రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అద్దాలు పగలగొట్టిన ఆందోళనకారుల ఆగ్రహానికి.. ఘనత వహించిన సీమాంధ్ర నాయకులు పెట్టిన పేరు అరాచకం! ఇప్పటివరకూ కూడా తెలంగాణ ఉద్యమం శాంతియుతంగానే సాగుతున్నది. దాన్ని ఎలాగైనా హింసా మార్గం పట్టించాలన్న కుట్రతో దానిలో చిచ్చు పెట్టడానికి లగడపాటి లాంటి వాళ్లు హైదరాబాద్ వచ్చి రచ్చ చేసినా ఉద్యమం దారి తప్పలేదు. పైగా పోలీసుల పాశవికతతో తానే గాయపడింది. ఇన్ని దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమం తూటాల వర్షంలో గుండె జల్లెడ జేసుకుంది తప్పించి సీమాంవూధులపై చేయి జారింది లేదు. మలిదశ ఉద్యమంలోనూ అదే తీరు. ఆ మాటకొస్తే మలి దశ ఉద్యమం మరింత మహత్తరంగా సాగుతున్నది.
తనను తాను కాల్చుకుని మంటల్లో మాడిపోయిన తొలి బలిదానం శ్రీకాంతాచారి మొదలుకుని.. హస్తినలో పార్లమెంటు భవనానికి కూతవేటు దూరంలో ఉరి వేసుకున్న యాదిడ్డి ఆత్మత్యాగం దాకా.. ఉస్మానియా యూనివర్సిటీలో అగ్నికి ఆహుతైన ఇషాన్‌డ్డి, యాదయ్య మొదలు.. తన తుపాకితో తనను తాను కాల్చుకుని ప్రాణాలు బలిదానం చేసిన పోలీసు కిష్టయ్య దాకా... ఉన్నత చదువులు చదివిన జేఎన్‌టియూ విద్యార్థి, సింగరేణి కార్మికుడి కొడుకు శ్రీకాంత్ మొదలుకుని.. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో కరెంటు స్తంభానికి ఉరిపోసుకున్న దినసరి కూలీ చంద్రమౌళిదాకా..! ఏడొందలకు చేరుకుంటున్న అనితర త్యాగాలు! ప్రాణాలనే కర్పూరం చేసి ఉద్యమానికి పోరు పళ్లెంలో హారతులిచ్చిన అమరవీరులు! అవాంఛనీయమని ఉద్యమం మొత్తుకుంటున్నా.. తమ ఆయుష్షును ఉద్యమానికి పోసి నిత్య జ్వలితం చేసిన నవయవ్వన త్యాగధనులు! ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల్లో పోలీసుల రబ్బరు బుల్లెట్లకు.. పెల్లెట్లకు తొడలు చీలినా... బాష్పవాయుగోళాలకు కళ్లు మండినా.. కఠినమైన లాఠీలు వీపులను, తలలను చిట్లకొట్టినా.. కరకు బూట్లు కడుపులో తన్నినా ధీరోదాత్తులై ఉద్యమ బావుటాను దించకుండా పోరాటం చేస్తున్న వీరులు! భావి జీవితాన్ని పణంగా పెట్టి సకల జనుల సమ్మె సమరంలో ఉత్తుంగ తరంగాలై ఎగసిన ఉద్యోగ, కార్మిక, శ్రామిక యోధులు! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పరిపరి విధాల చాటుతున్న సబ్బండ వర్ణాలు!
ఇంతటి మహత్తర పోరాటంలో ఒక్క సాంత్వన వచనం లేదు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతే పలకరించిన సీమాంధ్ర పెద్ద మనిషి లేడు. చేతికి అంది వచ్చిన కొడుకు.. కట్టెగా మారి కళ్ల ముందు పడి ఉంటే కడుపుకోతతో అల్లాడే కన్న తల్లి కంటనీరు తుడిచిన సమైక్య చేతులు లేనే లేవు! కానీ... ఒక్క స్వల్ప ఘటన జరగగానే మిన్ను విరిగి మీద పడినట్లు హాహాకారాలు! ఒక్క కారు ధ్వంసమైతే.. రెండు బస్సుల అద్దాలు బద్దలైతే.. ఎక్కడెక్కడి కుహనా సమైక్యవాదులంతా ఏక కంఠంతో విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ఖండించేందుకు పోటీలు పడ్డారు. ఒక దాడిని ఖండించడంలో తప్పు లేదు. కానీ.. సీమాంధ్ర నాయకత్వం ఈ ఘటనను ఖండించడంలో నాలుగు అడుగులు కాదు.. నలభై అడుగులు ముందుకేసింది. ఉద్యమకారులను కనిపిస్తే కాల్చిపారేయాలంటూ తమ హృదయాంతరాలలోని అక్కసు వెళ్లగక్కారు. ఓ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య డిమాండ్ కోసం ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ప్రజల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించాలని తమ అసలు నైజాన్ని బయటపెట్టుకున్నారు.
వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, జోగి రమేష్, మాజీ మంత్రి కోడెల శివవూపసాదరావు, యనమల రామకృష్ణుడు, సోమిడ్డి చంద్రమోహన్, జేడీ శీలం, దేవినేని నెహ్రూ.. రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచించే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. అందరిదీ అదే తీరు! కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకత! ఒకవైపు కలిసి ఉండాలని చెబుతూనే చిమ్ముతున్న విషం. ఓ ప్రజాస్వామ్య ఆకాంక్షను పట్టించుకోనితనం. దశాబ్దాల అన్యాయాన్ని కళ్లకు కడుతూ ఉధృత ఉద్యమం సాగుతుంటే చూడనిరాకరించే కబోదులు అసలు తెలంగాణ ఎందుకు ఇవ్వాలన్న సిగ్గుమాలిన ప్రశ్న!
తెలుగు జాతి మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపిస్తున్న ఈ నాయకత్వమే తెలంగాణకు లభించిన రాజ్యాంగ హామీలను తుంగలో తొక్కింది. సంయుక్త రాష్ట్రం ఏర్పడిన కొన్నాళ్లకే ఒప్పందాలను ఉల్లంఘించి.. తెలంగాణలో చిచ్చు పెట్టారు. ఆ చిచ్చు వరుస విద్రోహాలతో పెరిగి పెరిగి.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో బలమైన ఉద్యమంగా తయారైంది.
మలి విడత ఉద్యమంలో భాగంగా గత 23 రోజుల నుంచి తెలంగాణలో సకల జనం సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తమ ప్రగాఢ ఆకాంక్షను జేఏసీ పిలుపు మేరకు ఒక్కో రోజు ఒక్కో విధంగా చాటుతున్నారు. వివిధ ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయని పార్టీలు, ప్రజా సంఘాలు కద్దు! కార్యక్షికమం ఏదైనా అదొక ఉద్యమరూపమే! ఆ ఉద్యమరూపాల్లో ఒకానొక కార్యక్షికమమే తొమ్మిదో నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఆందోళన. ఇదొక్కటే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో ఉద్యమ దిక్సూచిగా ఉన్న తెలంగాణ రాజకీయ జేఏసీ వరుస ఆందోళన కార్యక్షికమాలకు పిలుపునిచ్చింది. సమ్మె సాకుతో ప్రత్యామ్నాయాలు వెతకని ప్రభుత్వం.. రైతుల కడుపు కొట్టేందుకు సిద్ధమై వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో భారీగా కోతలు పెట్టింది. దీనిపై రైతుల గుండె మండిపోయింది. రైతులు, ప్రజలు, ఉద్యమక్షిశేణులు పెద్ద ఎత్తున 9వ నెంబర్ జాతీయ రహదారిని మంగళవారం నాడు దిగ్బంధించాయి. తమ పొట్టకొ ప్రయత్నిస్తున్న సీమాంధ్ర సర్కారు కొమ్ములు వంచి వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరవధిక విద్యుత్ సాధించుకునేందుకు రాస్తారోకోలకు దిగాయి.
ఇదేమీ నిరవధిక ఆందోళన కాదు. కానీ.. అసలు ఉద్యమించడమే మహా పాపం అన్నట్లు వ్యవహరిస్తున్న పోలీసులకు ఇది పెద్ద తప్పుగానే కనిపించింది. అంతే.. బలవంతంగా ఆ ఆందోళనకారులను చెదరగొట్టే యత్నం. సహజంగానే ఇది మంగళవారం నాడు జాతీయ రహదారిపై ఉద్రిక్తతను పెంచింది. సంయమనం పాటించాల్సిన ఖాకీ.. తన సహజశైలితోనే పరిష్కారానికి దిగింది. ఆందోళనను విచ్ఛిన్నం చేసేందుకు, ఉద్యమకారులను తరిమికొ బలవంతపు అరెస్టులను, లాఠీచార్జీలను మార్గంగా ఎంచుకుంది. ఇవి ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహాన్ని కలుగజేశాయి. దశాబ్దాల వివక్ష, వరుస పోలీసు దమనకాండలతో విసుగెత్తిపోయిన రైతాంగం, జనం సహజంగానే తిరగబడ్డారు. ఈ క్రమంలోనే కళ్లెదుట కనిపించిన అక్రమార్కుల ప్రాతినిథ్యంపై రాయెత్తారు. అటు సీమాంధ్ర పెట్టుబడిదారులకూ ఆ రోజు రహదారుల దిగ్బంధం ఉంటుందని తెలుసు. కానీ.. పంతం.
ఆందోళన విజయవంతం కాకూడదన్న దుగ్ధ! ఫలితమే పట్టుపట్టి మరీ జాతీయ రహదారిపై బయల్దేరదీసిన సీమాంధ్ర నేతల ప్రైవేటు ట్రావెల్ సర్వీసుల బస్సులు! ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో పట్టుదలకు పోయి బస్సులు నడిపించేందుకు దుస్సాహసం చేయడం ద్వారా సీమాంధ్ర అమాయక ప్రజల జీవితాలను భయ భ్రాంతులకు గురి చేసింది నిజానికి ఆ ప్రాంత నాయకత్వమే.
వారికి కొమ్ము కాస్తూ.. తెలంగాణ ఉద్యమానికి తొలి శత్రువుగా ఉన్న సీమాంధ్ర సర్కారే! దాడులను సాకుగా చూపి నెపం నెట్టేయాలని సీమాంధ్ర నాయకత్వం చూసినా.. ఇది అక్షరసత్యం. ఇలాంటి విద్వేషకర వాతావరణంలో ఇంకా కలిసుండటం సాధ్యమేనా? ఇలాంటి కుట్రల అధ్యాయాల నడుమ.. సమభావనలు సమాధి అయిపోయిన చోట ఇంకా సహజీవనం అయ్యేపనేనా? తియ్యని మాటలు చెబుతూ తేనె పూసిన కత్తులు దూస్తున్న చోట చెట్టపట్టాలు వేసుకుని చెలిమి చేయడం ఏ వెలుగుల కోసం? ఎవరి వెలుగుల కోసం? ఎవరి ప్రారబ్ధం కోసం?
Read more...
Why Hyderabad as a Union Territory is not acceptable
It is easier said. It is not an easier compromise. It will be creating one other ulcer, to remove the cancerous one created 55 years ago. One should be a telanganite to understand the issue. Andhras are not known for keeping their words. Last 55 years of Telangana history is a testimony to it. It was the proverbial ‘Camel and the Tent’ story. In the end they want to have their own brand new capital and their share in the ‘UT’ too. There is no limit to their avarice.
Just to please these modern day ‘colonialists’ why telangana people should open their 400 year old heritage-city and their cultural ‘icon’ to whole of India. As their wont, again these andhras will be calling the shots, to make the life of native telanganites miserable in the city.
Chandigarh is a special case. The city was built in between the two divided states. As a matter of fact, the agreement on the ‘UT’ status of this city, is also out living its period. Hyderabad is more than 200 Kms from its Andhra border. The joint capital idea is not tenable. Making Hyderabad an ‘UT’ to make andhras to build their new capital sounds very absurd. It has not happened in case of creation of 14 earlier new states. More particularly in case of Madras.
Andhras when they broke away from Madras they have demanded, the whole of Madras for themselves. They did not get it. They could have had it as a joint capital, as it was just sitting on the border of the two states. In case of other new states no original capital was made an ‘UT’ either, to facilitate building a new capital. In case of Assam the original capital, Shillong went to Nagaland, the new state.
Assam had to build Dispur for itself. When the time tested precedents are like this, why should one make Hyderabad a ‘UT’ for the sake of these modern day ‘colonialists’. For outsiders it might appear as a reasonable compromise.
But it is not as simple as that. You are dealing with the centuries old history, ethos and the identity of a people. The experience of Telangana people in the hands of andhras in the last 55 years is very bitter. The loss of life of more than 1000 youth for emancipation from this ‘neo-colonial rule’ is a clear indicator of the feelings of the people of this region.
Making Hyderabad ‘UT’ is totally un warranted and will be an unprecedented move. If it is done so, it will be construed as a reward for the plunder of Telangana by andhras. Hyderabad city belongs to its native people, like madras, Mumbai, Bangalore, Kolkata etc., not to the colonialists. Andhras can have an arrangement like in case of earlier divisions, till they build their capital. Centre can give all the packages which a new state is eligible. But, not any agreements where andhras can have the scope to play their dirty political games again. Read more...
Bharat Bandh on Oct. 11 for Telangana
The CPI (Maoists) central committee leadership has called for observing “Bharath Bandh,” an all-India shutdown on October 11 in support of the demand for a separate Telangana state. Party central committee member and spokesperson Abhay said that the ongoing sakala Janula samme was enjoying the support of the CPI (Maoists).
Lauding the participation of the government employees in the strike, he wanted all sections of people to take part in the agitation. Despite the threats held out by the government and the people in power, they did not yield to the pressure tactics of the government.
He pointed out that every day a new theory was being floated on the Telangana issue to put the people in confusion. Telangana state with Kurnool as headquarters or Telangan state with Hyderabad as headquarters, Telangana without Hyderabad, Hyderabad as union territory or Hyderabad as common capital were all different theories floated by vested political interests.
He stated that the Centre was out to confuse people on this count. Telanganites will not accept anything less that the erstwhile Nizam state with Hyderabad as its capital. People were not to be carried away with the false proposals. He said Telangana agitation was no longer in the hands of the leaders. It was now a movement of Telangana People.
The students, Singareni workers, RTC employees, lecturers,electricity employees, farmers and a host of other sections are instrumental for its success. Instead of supporting the struggle, some political leaders are deliberately misleading the people on key aspects of the agitation. Such leaders should be ready to face the ire
of the Telangana people.