Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, October 6, 2011

కాల్చిపారేసేవాడితో కలిసుండుడెట్ల!

graphic-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
ఉద్యమంపై సీమాంధ్ర నేతల విషం
-కలిసుండాలంటూనే కపట నాటకం
- ఐక్యత మాటున అంతులేని విద్రోహం


- సైన్యాన్ని దించాలంటూ శివాలు
- నైజం చాటుకున్న నాయకగణం
- కేసీఆర్, కోదండరాంపై విద్వేష వ్యాఖ్యలు
- ఎన్‌హెచ్9 ముట్టడిని భూతద్దంలో చూపుతున్న సీమాంధ్ర నేతలు







ఉద్యమం అరాచకమంటూ అవాకులు చెవాకులు ఉద్యమంలో అరాచక శక్తులున్నాయట! వారు సీమాంవూధులపై దాడులకు పాల్పడుతున్నారట! వారిని అదుపు చేసేందుకు సైన్యాన్ని దించాలట! అవసరమైతే కనిపించిన వారిని కాల్చిపారేయాలట! ముఖ్యమంత్రి ఆ పని చేయకపోతే.. వారే తీవ్రంగా స్పందిస్తారట! తెలంగాణ ఉద్యమ నాయకులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తున్నారట! కనుక రాష్ట్రపతి పాలన విధించాలట! తెలుగు జాతి మధ్య చిచ్చు పెడుతున్నారట! ఆందోళనకారులు విధ్వంసకారులట! వారిని రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాంలేనట! వాళ్లు (సీమాంధ్ర నాయకులు) తిరగబడితే కేసీఆర్, కోదండరాం పారిపోతారట! కేసీఆర్.. రాష్ట్రంలో లక్షల మంది రైతుల ఉసురు పోసుకుంటున్నారట! ఆయన కుటుంబం పైశాచిక ఆనందం పొందుతున్నదట! వీటిని సహిస్తూ చేతులు ముడుచుకుని కూర్చోరట....!

అన్నదమ్ముల్లా కలిసుందామంటూ చల్లగా కబుర్లు చెప్పే నేతల క్షుద్ర నాలుకలపై నుంచి జాలువారిన విషపు గుళికలివి! నోరెత్తితే చాలు కాలం చెల్లిన సమైక్యవాదం ప్రవహించే నోళ్ల నుంచి వచ్చిన విద్వేష వ్యాఖ్యలివి! ఐక్యతను ఘోషించే నేతల అసలు సిసలు నైజాలివి!

రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అద్దాలు పగలగొట్టిన ఆందోళనకారుల ఆగ్రహానికి.. ఘనత వహించిన సీమాంధ్ర నాయకులు పెట్టిన పేరు అరాచకం! ఇప్పటివరకూ కూడా తెలంగాణ ఉద్యమం శాంతియుతంగానే సాగుతున్నది. దాన్ని ఎలాగైనా హింసా మార్గం పట్టించాలన్న కుట్రతో దానిలో చిచ్చు పెట్టడానికి లగడపాటి లాంటి వాళ్లు హైదరాబాద్ వచ్చి రచ్చ చేసినా ఉద్యమం దారి తప్పలేదు. పైగా పోలీసుల పాశవికతతో తానే గాయపడింది. ఇన్ని దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమం తూటాల వర్షంలో గుండె జల్లెడ జేసుకుంది తప్పించి సీమాంవూధులపై చేయి జారింది లేదు. మలిదశ ఉద్యమంలోనూ అదే తీరు. ఆ మాటకొస్తే మలి దశ ఉద్యమం మరింత మహత్తరంగా సాగుతున్నది.

తనను తాను కాల్చుకుని మంటల్లో మాడిపోయిన తొలి బలిదానం శ్రీకాంతాచారి మొదలుకుని.. హస్తినలో పార్లమెంటు భవనానికి కూతవేటు దూరంలో ఉరి వేసుకున్న యాదిడ్డి ఆత్మత్యాగం దాకా.. ఉస్మానియా యూనివర్సిటీలో అగ్నికి ఆహుతైన ఇషాన్‌డ్డి, యాదయ్య మొదలు.. తన తుపాకితో తనను తాను కాల్చుకుని ప్రాణాలు బలిదానం చేసిన పోలీసు కిష్టయ్య దాకా... ఉన్నత చదువులు చదివిన జేఎన్‌టియూ విద్యార్థి, సింగరేణి కార్మికుడి కొడుకు శ్రీకాంత్ మొదలుకుని.. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో కరెంటు స్తంభానికి ఉరిపోసుకున్న దినసరి కూలీ చంద్రమౌళిదాకా..! ఏడొందలకు చేరుకుంటున్న అనితర త్యాగాలు! ప్రాణాలనే కర్పూరం చేసి ఉద్యమానికి పోరు పళ్లెంలో హారతులిచ్చిన అమరవీరులు! అవాంఛనీయమని ఉద్యమం మొత్తుకుంటున్నా.. తమ ఆయుష్షును ఉద్యమానికి పోసి నిత్య జ్వలితం చేసిన నవయవ్వన త్యాగధనులు! ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల్లో పోలీసుల రబ్బరు బుల్లెట్లకు.. పెల్లెట్లకు తొడలు చీలినా... బాష్పవాయుగోళాలకు కళ్లు మండినా.. కఠినమైన లాఠీలు వీపులను, తలలను చిట్లకొట్టినా.. కరకు బూట్లు కడుపులో తన్నినా ధీరోదాత్తులై ఉద్యమ బావుటాను దించకుండా పోరాటం చేస్తున్న వీరులు! భావి జీవితాన్ని పణంగా పెట్టి సకల జనుల సమ్మె సమరంలో ఉత్తుంగ తరంగాలై ఎగసిన ఉద్యోగ, కార్మిక, శ్రామిక యోధులు! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పరిపరి విధాల చాటుతున్న సబ్బండ వర్ణాలు!

ఇంతటి మహత్తర పోరాటంలో ఒక్క సాంత్వన వచనం లేదు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతే పలకరించిన సీమాంధ్ర పెద్ద మనిషి లేడు. చేతికి అంది వచ్చిన కొడుకు.. కట్టెగా మారి కళ్ల ముందు పడి ఉంటే కడుపుకోతతో అల్లాడే కన్న తల్లి కంటనీరు తుడిచిన సమైక్య చేతులు లేనే లేవు! కానీ... ఒక్క స్వల్ప ఘటన జరగగానే మిన్ను విరిగి మీద పడినట్లు హాహాకారాలు! ఒక్క కారు ధ్వంసమైతే.. రెండు బస్సుల అద్దాలు బద్దలైతే.. ఎక్కడెక్కడి కుహనా సమైక్యవాదులంతా ఏక కంఠంతో విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ఖండించేందుకు పోటీలు పడ్డారు. ఒక దాడిని ఖండించడంలో తప్పు లేదు. కానీ.. సీమాంధ్ర నాయకత్వం ఈ ఘటనను ఖండించడంలో నాలుగు అడుగులు కాదు.. నలభై అడుగులు ముందుకేసింది. ఉద్యమకారులను కనిపిస్తే కాల్చిపారేయాలంటూ తమ హృదయాంతరాలలోని అక్కసు వెళ్లగక్కారు. ఓ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య డిమాండ్ కోసం ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ప్రజల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించాలని తమ అసలు నైజాన్ని బయటపెట్టుకున్నారు.

వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, జోగి రమేష్, మాజీ మంత్రి కోడెల శివవూపసాదరావు, యనమల రామకృష్ణుడు, సోమిడ్డి చంద్రమోహన్, జేడీ శీలం, దేవినేని నెహ్రూ.. రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచించే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. అందరిదీ అదే తీరు! కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకత! ఒకవైపు కలిసి ఉండాలని చెబుతూనే చిమ్ముతున్న విషం. ఓ ప్రజాస్వామ్య ఆకాంక్షను పట్టించుకోనితనం. దశాబ్దాల అన్యాయాన్ని కళ్లకు కడుతూ ఉధృత ఉద్యమం సాగుతుంటే చూడనిరాకరించే కబోదులు అసలు తెలంగాణ ఎందుకు ఇవ్వాలన్న సిగ్గుమాలిన ప్రశ్న!
తెలుగు జాతి మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపిస్తున్న ఈ నాయకత్వమే తెలంగాణకు లభించిన రాజ్యాంగ హామీలను తుంగలో తొక్కింది. సంయుక్త రాష్ట్రం ఏర్పడిన కొన్నాళ్లకే ఒప్పందాలను ఉల్లంఘించి.. తెలంగాణలో చిచ్చు పెట్టారు. ఆ చిచ్చు వరుస విద్రోహాలతో పెరిగి పెరిగి.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో బలమైన ఉద్యమంగా తయారైంది.

మలి విడత ఉద్యమంలో భాగంగా గత 23 రోజుల నుంచి తెలంగాణలో సకల జనం సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తమ ప్రగాఢ ఆకాంక్షను జేఏసీ పిలుపు మేరకు ఒక్కో రోజు ఒక్కో విధంగా చాటుతున్నారు. వివిధ ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయని పార్టీలు, ప్రజా సంఘాలు కద్దు! కార్యక్షికమం ఏదైనా అదొక ఉద్యమరూపమే! ఆ ఉద్యమరూపాల్లో ఒకానొక కార్యక్షికమమే తొమ్మిదో నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఆందోళన. ఇదొక్కటే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో ఉద్యమ దిక్సూచిగా ఉన్న తెలంగాణ రాజకీయ జేఏసీ వరుస ఆందోళన కార్యక్షికమాలకు పిలుపునిచ్చింది. సమ్మె సాకుతో ప్రత్యామ్నాయాలు వెతకని ప్రభుత్వం.. రైతుల కడుపు కొట్టేందుకు సిద్ధమై వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో భారీగా కోతలు పెట్టింది. దీనిపై రైతుల గుండె మండిపోయింది. రైతులు, ప్రజలు, ఉద్యమక్షిశేణులు పెద్ద ఎత్తున 9వ నెంబర్ జాతీయ రహదారిని మంగళవారం నాడు దిగ్బంధించాయి. తమ పొట్టకొ ప్రయత్నిస్తున్న సీమాంధ్ర సర్కారు కొమ్ములు వంచి వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరవధిక విద్యుత్ సాధించుకునేందుకు రాస్తారోకోలకు దిగాయి.

ఇదేమీ నిరవధిక ఆందోళన కాదు. కానీ.. అసలు ఉద్యమించడమే మహా పాపం అన్నట్లు వ్యవహరిస్తున్న పోలీసులకు ఇది పెద్ద తప్పుగానే కనిపించింది. అంతే.. బలవంతంగా ఆ ఆందోళనకారులను చెదరగొట్టే యత్నం. సహజంగానే ఇది మంగళవారం నాడు జాతీయ రహదారిపై ఉద్రిక్తతను పెంచింది. సంయమనం పాటించాల్సిన ఖాకీ.. తన సహజశైలితోనే పరిష్కారానికి దిగింది. ఆందోళనను విచ్ఛిన్నం చేసేందుకు, ఉద్యమకారులను తరిమికొ బలవంతపు అరెస్టులను, లాఠీచార్జీలను మార్గంగా ఎంచుకుంది. ఇవి ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహాన్ని కలుగజేశాయి. దశాబ్దాల వివక్ష, వరుస పోలీసు దమనకాండలతో విసుగెత్తిపోయిన రైతాంగం, జనం సహజంగానే తిరగబడ్డారు. ఈ క్రమంలోనే కళ్లెదుట కనిపించిన అక్రమార్కుల ప్రాతినిథ్యంపై రాయెత్తారు. అటు సీమాంధ్ర పెట్టుబడిదారులకూ ఆ రోజు రహదారుల దిగ్బంధం ఉంటుందని తెలుసు. కానీ.. పంతం.

ఆందోళన విజయవంతం కాకూడదన్న దుగ్ధ! ఫలితమే పట్టుపట్టి మరీ జాతీయ రహదారిపై బయల్దేరదీసిన సీమాంధ్ర నేతల ప్రైవేటు ట్రావెల్ సర్వీసుల బస్సులు! ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో పట్టుదలకు పోయి బస్సులు నడిపించేందుకు దుస్సాహసం చేయడం ద్వారా సీమాంధ్ర అమాయక ప్రజల జీవితాలను భయ భ్రాంతులకు గురి చేసింది నిజానికి ఆ ప్రాంత నాయకత్వమే.

వారికి కొమ్ము కాస్తూ.. తెలంగాణ ఉద్యమానికి తొలి శత్రువుగా ఉన్న సీమాంధ్ర సర్కారే! దాడులను సాకుగా చూపి నెపం నెట్టేయాలని సీమాంధ్ర నాయకత్వం చూసినా.. ఇది అక్షరసత్యం. ఇలాంటి విద్వేషకర వాతావరణంలో ఇంకా కలిసుండటం సాధ్యమేనా? ఇలాంటి కుట్రల అధ్యాయాల నడుమ.. సమభావనలు సమాధి అయిపోయిన చోట ఇంకా సహజీవనం అయ్యేపనేనా? తియ్యని మాటలు చెబుతూ తేనె పూసిన కత్తులు దూస్తున్న చోట చెట్టపట్టాలు వేసుకుని చెలిమి చేయడం ఏ వెలుగుల కోసం? ఎవరి వెలుగుల కోసం? ఎవరి ప్రారబ్ధం కోసం? 

1 comments:

voleti October 6, 2011 at 5:41 PM  

ఒక్కసారి దేశ ప్రధాని, యూపియే చైర్ పర్శన్ శ్రీమతి సోనియా మరియు ప్రణబ్ వాళ్ళ మాటలు కూడా చెవి యొగ్గి వినకూడదా...వాళ్ళేమీ సీమాంధ్ర పెట్టుబడి దారులు కాదు... మీ పొట్టలు కొట్టేసి...మీ నీళ్ళు, ఉద్యోగాలు కొట్టేసి... మీ చేత తిట్లు తినే ఖర్మ పట్టని వాళ్ళూ... ఎన్నాళ్ళురా.... ఇంకెన్నాళ్ళురా.... ఈ దౌర్భాగ్యం... కళ్ళుతెరవండిరా.. అభివృధ్ధి నిరోధకుల్లారా...

About This Blog

తెలుగు బ్లాగుల

my blog directory

Free Counters
CashAdvanceHelp

Total Blog Directory Submit Blog & RSS Feeds
Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!
Submit your website to 20 Search Engines - FREE with ineedhits!
You have not participated at the forum. Use the forum before you use this widget!
Make Money Blogging

Blog Directory Blog Topsites
Submit Blog
Blogs Blog Tools Allie Marie

Blogs Directory


Blog Directory

Blogger Help Templates Widgets SEO Tips Submit Site to Google Link building 

packages
Search engine submissions Politics
billiga hotellrum london Wutzle My Blog!

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service.
Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP