Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, December 9, 2012

మంచి రాక్షసుడు

భీకరారణ్యంలో ఓ మర్రిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత, ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు ఉండడం మూలన్నేమో వాటి గాలి సోకి ఆ బ్రహ్మరాక్షసుడు కాలక్షికమేణా తాను వికృతాకారం నుంచి విముక్తి పొందాలనే మంచి ఆలోచన కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపే వాళ్లుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపక్షిగస్తురాలైన ఓ పులి అటుగా వచ్చింది. దాని కళ్లలోని నిర్మలత్వాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు. ‘ఓ వ్యాఘ్రేశ్వరా! నాకీ జన్మ నుంచి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా?’అని! ‘పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వజన్మలో సద్భ్రాహ్మణునిగా పుట్టి నీకు వచ్చిన విద్యను ఎవరికీ అందించకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించకుండా నీ వద్దనే ఉంచుకున్నావు. ఆ దోష కారణంగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవయ్యావు. ఏదైనా మంచి పనిచేస్తే నీకు విముక్తి కలుగుతుంది’అని చెప్పింది పులి.

అది విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు.. ‘జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు?’ . దానికి పులి.. ‘నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ రూపాన్ని పొందాను. ఏదైనా సత్కార్యం చేద్దామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసి ఎవరూ నా దగ్గరకైనా రావడం లేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు, నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బయటపడతాం’అని అన్నది.

సత్కర్మ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునికి ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగక్షేమాలు విచారించాడు. అతను తన విచారాన్ని.. ‘ఒక వంద వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను’అని తెలిపాడు. ఆ రత్నాలతో ఏమిచేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. ‘రాజకుమారిని పెళ్లాడాలి’అన్నాడు అగంతకుడు. పెళ్లికి రత్నాపూందుకని ప్రశ్నించగా.. ‘ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయట. అవి తేస్తేగానీ పెళ్లి చేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు, బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ల ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడికి వచ్చాను’అన్నాడు బాటసారి. ‘ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారేనా?’అని ప్రశ్నించాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ‘అవును.. నీకెలా తెలుసు’అన్నాడు బాటసారి.

‘అది వీర శుల్కం. వరుని ధైర్య సాహసాలు, వీరత్వం పరీక్షించడానికి నియమం. పైగా వారడిగినది 50 రత్నాలే కదా?’అన్నాడు రాక్షసుడు. ‘వాళ్లకంతా ఇచ్చేస్తే మరి నా భార్య పిల్లలకో..’అన్నాడు బాటసారి. ‘ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని, రాకుమారిని మోసగిద్దాం అనుకున్నావా? నీలాంటి దేశవూదోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను’అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మింగేశాడు ఆ బ్రహ్మరాక్షసుడు. తక్షణమే పులిగా శాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమయ్యాడు. రాక్షసుడు కూడా మానవ రూపం ధరించాడు. ‘మివూతమా! దుష్టుడైన దేశవూదోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నీకు, నాకు ఆ దేవుడు శాప విమోచనం కలిగించాడ’ని అన్నాడు. ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు.

Read more...

భలే.. షేరింగ్!

ఏ వస్తువైనా దొరికితే ఏం చేస్తాం. మన దగ్గరే ఉంచేసుకుంటాం. అది మన ఫ్రెండ్‌కు ఇష్టమైతే.. అందులో షేర్ ఇస్తాం. అయితే ఇక్కడ కొన్ని రామచిలుకలు కూడా షేరింగ్‌లో ముందున్నాయి. ఎందులో అనుకుంటున్నారు.. చాక్లెట్ మిల్క్‌షేక్‌ని తాగడంలో.

ఇది నిజం! ఆస్ట్రేలియాలోని ఓ కేఫ్‌లో తల్లీ కూతుళ్లు మిల్క్ షేక్ ఆర్డరిచ్చారు. తల్లి ఏదో పని మీద పక్కకు వెళ్లింది. ఈలోపు వెయిటర్ మిల్క్ షేక్ తీసుకొచ్చి మీద పెట్టి వెళ్లిపోయాడు.

 అమ్మ కోసం ఎదురు చూస్తుందా అమ్మాయి. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చింది ఓ రామచిలుక మిల్క్ షేక్‌ని కొద్దిగా సిప్ చేసింది. ఆ తర్వాత వింతగా శబ్దాలు చేయడం మొదలు పెట్టిందట. ఈలోపు మూడు, నాలుగు రామచిలుకలు వచ్చిచేరాయి. ఐదు నిమిషాల్లో వాటి సంఖ్య ఏకంగా 30కి చేరింది. పదినిమిషాల్లో అన్నీ కలిపి మిల్క్ షేక్‌ని గుటుక్కుమనిపించాయి చుక్క కూడా మిగల్చకుండా.

ఇదంతా చూసిన ఆ తల్లీ కూతుళ్లు వాళ్ల సెల్‌ఫోన్లో వాటి ఫోటోలను బంధించేశారు. భలే విచివూతంగా ఉంది కదూ! ఇలాంటి సంఘటనలు అక్కడ మామూలే అని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

Read more...

డ్రగ్స్ తరలిస్తూ దొరికిపోయిన నటుడు


abhishek- అభిషేక్, అతడి అనుచరుడు అరెస్ట్
- కారులో పది గ్రాముల కొకైన్ పట్టివేత.. టాలీవుడ్‌లో కలకలం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 : అతడో నటుడు. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా డు. ఆ గుర్తింపు వెనుక ఓ గ‘మ్మత్తు’ రహస్యం దాగి ఉంది! నటుడిగా స్థిరపడేందుకు అతగాడు మాదక ద్రవ్యాల దందా ఎంచుకున్నాడు! నాలుగేళ్లుగా సాగిస్తున్న ఈ దందాను ఎట్టకేలకు పోలీసు లు ఛేదించారు. వివరాలను పశ్చిమ మండలం డీసీపీ సుధీర్‌బాబు తన కార్యాలయం లో విలేకరులకు వెల్లడించారు. ఉత్తరవూపదేశ్‌కు చెందిన అభిషేక్ కుమార్(31) డిగ్రీ వరకు చదువుకున్నాడు. 1998లో తండ్రి మరణించడంతో అతడి కుటుంబం ఉత్తరవూపదేశ్ నుంచి హైదరాబాద్‌కు వలసవచ్చింది. ఈ కుటుంబానికి గోవాలో హోటల్ వ్యాపారం ఉంది. 

సినిమాల్లో నటించాలన్న ఆశతో చిత్ర పరిక్షిశమ, క్లబ్, పబ్‌లు తిరిగిన అభిషేక్‌కు 2007లో గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించే మల్హోత్ర (2008లో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు)తో పరిచయం ఏర్పడింది.

అప్పటినుంచి అభిషేక్ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. చిత్ర పరిక్షిశమకు చెందిన మరో ఇద్దరు నటులు భరత్, రఘు (వూపముఖ హీరో రవితేజ సోదరులు) అభిషేక్‌కు మంచి స్నేహితులు. చిత్ర పరిక్షిశమలో డ్రగ్స్ తీసుకునేవారి వివరాలు సేకరించిన అభిషేక్... గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి సరఫరా చేసేవాడు. అతడు ‘ఎలా చెప్పను’, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’, ‘డేంజర్’, ‘శశిరేఖ పరిణయం’, ‘గాయం’, ‘కాళిదాస్’, ‘గగనం’ వంటి పలు చిత్రాల్లో నటించాడు. గతనెల 29న అభిషేక్, అతని వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు(24) గోవా వెళ్లారు. తిరిగి ఈనెల 2న హైదరాబాద్‌కు వచ్చి.. నేరుగా ఎస్‌ఆర్‌నగర్‌లోని అభిషేక్ నివసిస్తున్న తిరుమల అపార్టుమెంట్‌కు వెళ్లారు. 

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్కోడాకారులో ఇంటి నుంచి అభిషేక్, శ్రీనివాసులు బయలుదేరారు. వారు కొకైన్‌తో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎస్‌ఆర్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ తన టీమ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున ధరమ్ ఖరమ్ రోడ్డులో అభిషేక్ కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో ఒక్కో గ్రాము చొప్పున పది కొకైన్ పాకెట్లు (పది గ్రాములు) దొరికాయి. దీంతో పోలీసులు.. అభిషేక్‌ను, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో అభిషేక్ కీలక సమాచారం వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిక్షిశమలో చాలా మంది ప్రముఖులకు నాలుగేళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతడు ఒప్పుకున్నట్లు సమాచారం.

గ‘మ్మత్తు’ టాలీవుడ్!
హైదరాబాద్, డిసెంబర్ 8 (టీ మీడియా): టాలీవుడ్.. డ్రగ్స్‌కు మధ్య సంబంధం మరోసారి బయటపడింది. ఇన్నాళ్లూ మాదకవూదవ్యాలు కొంటూ టాలీవుడ్ స్టార్లు పట్టుబడగా ఈసారి ఏకంగా చిత్ర పరిక్షిశమలోని పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నటుడు అభిషేక్ తన అనుచరుడితో దొరికిపోవడంతో చిత్రసీమలో కలకలం రేగింది. అతడు ఎవవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

 గడిచిన రెండున్నరేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో పోలీసులు 25కు పైగా డ్రగ్స్ గ్యాంగులను అరెస్టు చేసి, వారి నుంచి రెండున్నర కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదకవూదవ్యాలను వినియోగిస్తున్నవారి సంఖ్య టాలీవుడ్‌లో పదుల్లోనే ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అయితే, విచారణలో నిందితులు టాలీవుడ్ నటుల పేర్లు చెప్పినంత మాత్రాన అవతలివారిని అరెస్టు చేయలేమని పోలీసు అధికారులు అంటున్నారు. హీరో రవితేజ సోదరులు రఘు, భరత్‌లు డ్రగ్స్ ఉపయోగిస్తారని సమాచారం ఉన్నా వాళ్లు కొకైన్‌ను కొంటున్నపుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాతే కేసులు పెట్టిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు.

 అభిషేక్ కొకైన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నేపథ్యంలో టాలీవుడ్‌కు చుట్టుకున్న డ్రగ్స్ గుట్టు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు డ్రగ్స్ కొంటూ దొరికినవారు మాత్రమే ఉన్నారని, ఈ సారి ఏకంగా టాలీవుడ్‌లోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నటుడు తమ చేతికి చిక్కాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP