మంత్రి మోపిదేవికి పది లక్షలిచ్చా.. బాంబు పేల్చిన ఖమ్మం లిక్కర్ డాన్
-ఎక్సైజ్ అధికారులు మొదలు కామ్రేడ్ల దాకా
-విలేకరులకూ లంచాలిచ్చిన మద్యం వ్యాపారి
-తిలాపాపం తలా కొంత పంపిణీ!
-రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వెల్లడి
-ఇది ఒక్క జిల్లాలోనే.. ఇతర జిల్లాల్లో?
-రాజకీయ పార్టీల్లో పెను సంచలనం
-నష్టనివారణ చర్యల్లో పార్టీలు
-ఎందుకు తీసుకున్నామంటే...
-వివరణలు ఇచ్చేందుకు పోటీలు
హైదరాబాద్, మహబూబాబాద్, ఫిబ్రవరి 7 () :మద్యం మంత్రికి పది లక్షలు.. రాజకీయ నాయకులకు వారి వారి స్థాయి, హోదాలను బట్టి యాభై వేలు మొదలు లక్ష, రెండు లక్షలు ఐదు లక్షలు! పదివేలు, పాతికవేలతో సర్దుకుపోయినవారూ ఉన్నారు! అధికారులు భారీగా గుటుక్కుమనిపించారు. విలేకరులూ తగ్గలేదు! ఇది మద్యం వ్యాపారం, రాజకీయ నాయకత్వం కలిసి మెలిసి సహజీవనం చేస్తున్నాయనడానికి తాజా తార్కాణం. నిలు దర్శనమిచ్చిన నగ్నసత్యం! మద్యం వ్యాపారంలో లొసుగులు బయటపడకుండా ఉండేందుకు.. అక్రమంగా అధిక ధరలకు అమ్మేసుకుంటున్నా.. నోరు మెదపకుండా ఉండేందుకు.. లంచాల రూపంలోనైతేనేమి.. చందాల పేరుతోనైతేనేమి.. తిలాపాపం తలా కొంచెం! ముడుపులు ముట్టాయి! ఇది ఖమ్మం జిల్లా లిక్కర్ కింగ్ నున్నా రమణ బయటపెట్టిన సత్యం! అవినీతి నిరోధక శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో లిక్కర్ డాన్ చదివిన మద్యం పద్దుల చిట్టా! ఉరుములేని పిడుగులా వచ్చి పడిన బాంబుతో భీతిల్లిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. తాము ఆ వ్యాపారి నుంచి ఎందుకు ఆ మొత్తాలు తీసుకున్నామో వివరణలు ఇస్తున్నాయి! మొత్తానికి.. డబ్బులు తీసుకున్నది నిజమేనని అంగీకరించాయి!
మద్యం సిండికేట్ల వెనుక పొలిటికల్ గాడ్‌ఫాదర్లు ఉన్నట్టు వచ్చిన వార్తలకు బలం చేకూరింది. ఖమ్మంలో మద్యం సిండికేట్లకు, రాజకీయ నాయకులకు మధ్య అక్రమ సంబంధం బట్టబయలైంది. సిండికేట్ల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు గాను ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తాను స్వయంగా పది లక్షల రూపాయలు లంచంగా ఇచ్చానని లిక్కర్ డాన్ నున్నా రమణ సంచలనం రేపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్‌లో ఖమ్మంలోని చంద్రవైన్స్ యజమాని బాలాజీ, మంత్రి క్లాస్‌మేట్ అయిన రాజబాబుతో కలిసి ఈ సొమ్ము అందించినట్లు ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. మంత్రితో పాటు ఖమ్మం జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులకు, ఎక్సయిజ్ అధికారులకు లక్షల్లో ఇచ్చానని, విలేకరులకు కూడా ముడుపులు చెల్లించానని తెలిపాడు. రమణను మంగళవారం కోర్టులో హాజరుపర్చినప్పుడు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో.. రమణ ఎవవరికి ఎంతెంత సొమ్ము ఇచ్చారో ఆ వివరాలన్నింటినీ ఏసీబీ పేర్కొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించిన సమయంలోనే కొందరు మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో లిక్కర్ కింగ్ రమణను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈయన వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వ్యక్తి. రమణను ఏసీబీ అధికారులు విచారించగా పలు సంచలనాత్మక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలను పొందుపరుస్తూ ఏసీబీ వరంగల్ జిల్లా డీఎస్పీ టీపీ విఠలేశ్వర్ రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 0/ఏసీబీ-డబ్ల్యూకేహెచ్/2012 ప్రకారం అఫెన్స్ యూ/ఎస్ 7, , 12, 13(1)(ఏ) అండ్ (0) ఆర్/డబ్ల్యూ 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 19 అండ్ సెక్షన్స్ 120-బీ, 34 అండ్ 109 ఐపీసీ సెక్షన్ల ప్రకారం డీఎస్పీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రమణకు పది మద్యం సిండికేట్లలో 29 మద్యం దుకాణాలు ఉన్నాయని, వీటన్నింటినీ రమణ బినామీ పేర్లతో 2010, జూలైలో తీసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. టెండర్ల సమయంలో ఎక్కువ ధరలకు వేర్వేరు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు.. ఆ తర్వాత గరిష్ఠ చిల్లర ధరకన్నా ఎక్కువ రేట్లకు మద్యాన్ని విక్రయిస్తూ కోట్లుకొల్లగొట్టారు. ఎమ్మార్పీ రేట్లకన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు జరిపినా కేసులు నమోదు చేయకుండా ఎక్సయిజ్, పోలీస్ అధికారులకు పెద్ద మొత్తాల్లో మామూళ్లు ముట్టజెప్పారు.
లైసెన్సులు దక్కించుకున్న తరువాత సిండికేట్‌గా ఏర్పడుతూ అక్రమాలకు తెర తీస్తున్నారు. అకౌంట్స్ బాధ్యతలను ఒకటి రెండు మద్యం దుకాణాల యజమానులకు అప్పగిస్తున్నారు. వీళ్లే సిండికేట్‌లోని ఏయే వైన్‌షాపులు ఎంతెంత సరుకు కొనుగోలు చేశాయి? ఎంతవిక్రయాలు జరిపాయి? అన్నది రికార్డు చేస్తారు. అనంతరం వచ్చిన స్థూల లాభాలను లెక్క తేలుస్తారు. ఈ లాభాల్లో నుంచి ఆయా షాపుల లైసెన్స్ ఫీజులను ప్రభుత్వానికి చెల్లిస్తారు. రోజువారీ నిర్వహణ ఖర్చులు, మామూళ్లు తీసివేసి నికర లాభాలు తేలుస్తారు. ఏసీబీ రిమాండ్ రిపోర్టు ప్రకారం ఆయా అధికారులకు ప్రతినెలా నిర్ణీత మొత్తంలో మామూళ్లు మద్యం వ్యాపారుల నుంచి వెళుతున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, వైరా, పాల్వంచ, భద్రాచలం, ఏదులాపురం, గార్ల, కారేపల్లి, విశ్వనేతపల్లి, కొత్తలింగాల, బోనకల్లు, కల్లూరు, ముదిగొండ తదితర ప్రాంతాలతోపాటు వరంగల్, ఇతర జిల్లాల్లో అక్రమ మద్యం వ్యాపారం నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు రమణ విక్రయిస్తున్నాడని తెలిపారు. అందుకోసం అధికారులు, ప్రజావూపతినిధులకు మామూళ్ల రూపంలో నెలనెలా నగదును ముట్టచెబుతున్నాడని వెల్లడించారు.
రమణ 29 మద్యం దుకాణాల్లో ప్రత్యక్షంగానూ, 0 దుకాణాల్లో పరోక్షంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. రాజకీయ నాయకుల విషయానికొస్తే.. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు రూ.5లక్షలు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్షికసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావుకు రూ.4.5 లక్షలు, సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌కు రూ.3 లక్షలు, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు రూ.3 లక్షలు, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్యకు రూ.3 లక్షలు చెల్లించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
మామూళ్లు నిర్ణయించేది నేనే!
ఎవవరికి ఎంతెంత మామూళ్లు ఇవ్వాలన్నది తానే నిర్ణయించినట్టుగా రమణ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. 2010, జూలై 1వ తేదీ నుంచి 2010, సెప్టెంబరు 31వ తేదీ మధ్య మూడు నెలల కాలానికి ఎక్సయిజ్ ఎస్‌ఐ మహేంవూదకుమార్‌కు రూ.1,44,495 ఇచ్చినట్టు తెలిపాడు. ఈ మొత్తాన్ని ఎక్సయిజ్ సీఐ డీఎస్‌నాథ్, సూపరింటెండెంట్ మధుసూదన్‌రావులు పంచుకున్నట్టు చెప్పాడు. ఇక, రమణ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో కొత్తగూడెంలోని ఎంజే వైన్స్ యజమాని జనార్ధన్‌డ్డి తరఫున కొత్తగూడెం డీఎస్‌పీ దేవదాస్‌నాగుకు 2011లో రూ.50వేలు మామూళ్ల కింద ఇచ్చినట్టు తేలింది. గోల్డెన్ వైన్స్, సాయి సుధ వైన్స్‌కు చెందిన సుబ్బారావు, షాజీరావుల తరఫున ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌కు రూ.24వేలు, ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ మహేంవూదకుమార్‌కు రూ.12వేలు, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు రూ.12వేలు ముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక షాజీరావు తరఫున ఖమ్మం ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు మూడు దఫాలుగా రూ.36వేలు, రూ.1వేలు, రూ.1వేలను ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ ద్వారా పంపించినట్టు రమణ తెలిపాడు. ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్‌కు ఎనిమిది వైన్‌షాపుల నుంచి రూ.96వేలు అందినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.
మద్యం వ్యాపారులు సుబ్బారావు, షాజీరావుల నుంచి నాలుగు వైన్‌షాపుల తరఫున రూ.60వేలను ఎక్సయిజ్ ఎస్‌ఐ మహీందర్‌కుమార్ మామూళ్లుగా తీసుకుని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు అందచేసినట్టుగా వెల్లడించారు. ఖమ్మంలోని భ్రమరాంబ వైన్స్ కౌంటర్ ఇన్‌చార్జిగా ఉన్న రాజు నుంచి ఎక్సయిజ్ ఎస్‌ఐ ప్రతాప్ నెలకు రూ.12వేలను లంచంగా తీసుకుంటూ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ గంగాధర్‌కు అందచేస్తున్నట్టుగా తేలింది. వైరా ఎక్సయిజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమ.. శ్రీదుర్గ వైన్స్, భ్రమరాంబ వైన్స్‌లో కౌంటర్ ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్న రాజు, మురళి నుంచి నెలకు రూ.6వేల చొప్పున వసూలు చేసి ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌రావుకు చేరుస్తున్నట్టు పేర్కొన్నారు. సిండికేట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న రమణ.. మద్యం వ్యాపారంతోపాటు గంజాయి స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు అతనిపై మూడు కేసులు కూడా నమోదై ఉన్నట్టు తేలింది. రమణ గతంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి, తర్వాతి కాలంలో ఈ దందాలోకి దిగాడు. ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, ఎస్‌ఐ మహింవూదకుమార్, వైరా ఎక్సయిజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమలు మద్యం దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేసి పై అధికారులకు అందచేస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు.
నిరాధార ఆరోపణలు...
తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో చెప్పారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తి తనపై ఆరోపణలు చేయటం వెనక కుట్ర ఉందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డితో చర్చించనున్నట్టు తెలిపారు. విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంవూతిని కోరుతానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని విచారణలో తేలితే మంత్రి పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
ఎవరికెంత?
మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత: రూ.5 లక్షలు
పోటు రంగారావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్షికసీ జిల్లా కార్యదర్శి): రూ.4.5లక్షలు
పోతినేని సుదర్శన్ (సీపీఎం జిల్లా కార్యదర్శి): రూ.3 లక్షలు
పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ నేత): రూ.3 లక్షలు
విజయసారధి (సీపీఐ నేత): రూ.40వేలు
సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి ఎమ్మెల్యే): రూ.3లక్షలు
ఏ సమ్మిడ్డి (సాక్షి బ్యూరో మాజీ): రూ.60 వేలు
శ్రీనివాస్‌డ్డి (ఈనాడు బ్యూరో మాజీ): రూ.60 వేలు
మధుసూదన్ (ఆంవూధజ్యోతి బ్యూరో) : రూ.0 వేలు
దండి భాస్కర్ (వార్త రిపోర్టర్) : రూ.40 వేలు
దిండిగాల రాజేందర్ (టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్) : రూ.60వేలు
శ్రీనివాస్ (సీపీఎం నేత) : రూ.40వేలు