5వ కేటగిరీ లోనూ.. కేసలు ఎత్తేయండి
-అవసరమైన చర్యలు చేపట్టండి
-మిగతా కేసులనూ ఎత్తేయండి
-ఉద్యమ కేసులపై సీఎం కిరణ్ కీలక నిర్ణయం
-సీఎస్, డీజీపీలతో ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశాలు
-మిగతా కేసులనూ ఎత్తేయండి
-ఉద్యమ కేసులపై సీఎం కిరణ్ కీలక నిర్ణయం
-సీఎస్, డీజీపీలతో ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 ():తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణపై సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో కేటగిరీలోతీవూవమైన నేరారోపణ కింద నమోదు చేసిన 140 కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తివేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మిగతా కేటగిరీల్లో ఇంకా మిగిలి ఉన్న 306 కేసులను కూడా ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ముఖ్యంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులపై ప్రత్యేకంగా సమీక్షించి వారిపై కేసుల ఉపసంహరణ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదో కేటగిరీ కేసుల ఉపసంహరణ విషయంలో తానేమీ చేయలేనని హోంమంత్రి సబితాఇంవూదాడ్డి కూడా చేతుపూత్తేసిన నేపథ్యంలో.. ఈ కేసులపై సీఎం జారీ చేసిన ఆదేశాలు విద్యార్థులకు, ఉద్యమకారులకు ఉపశమనం కలిగించనున్నాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, డీజీపీ దినేశ్‌డ్డితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణపై ఇందులో ప్రధానంగా చర్చించారు. నవంబర్ 11, 2009- అక్టోబర్ 15, 2010 మధ్య కాలంలో 1,44 కేసులు నమోదయ్యాయని, వీటిని ఐదు కేటగిరీలుగా విభజించామని సీఎంకు అధికారులు వివరించారు.
మొదటి కేటగిరీలోని 565 కేసుల్లో ఇప్పటికే 399 కేసులను జీవోలు జారీ చేయటం ద్వారా ఉపసంహరించామని, మరో 166 కేసులను పోలీసుల దర్యాప్తు స్థాయిలోనే ఎత్తివేసినట్టు తెలిపారు. ఇక, కేటగిరీ 2, 3, 4ల్లోని 247 కేసుల్లో 169 కేసులను ఎత్తివేశామని, మరో 306 కేసులు ఎత్తివేయాల్సి ఉందని వివరించారు.
By: T News
0 comments:
Post a Comment