చిరుకు టూరిజం
కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయం.. రాష్ట్రానికి మొత్తం రెండు పదవులు
వీలు చిక్కితే మరోటి వచ్చే చాన్స్.. ఉన్నవారిలో కొందరికి ప్రమోషన్?
నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ విస్తరణ.. సీమాంధ్ర కోటాలో చిరంజీవి.. తెలంగాణ నుంచి రేసులో వీహెచ్, సర్వే, అంజన్ లాబీయింగ్‌లో కావూరి, కోట్ల.. మంత్రి పదవులపై రాష్ట్ర ఎంపీల ఆశలు
హైదరాబాద్, అక్టోబర్ 23 ():కష్టకాలంలో పార్టీని విలీనం చేసి ప్రభుత్వాన్ని కాపాడిన చిరంజీవి త్యాగానికి గుర్తింపు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నెలాఖరులో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి బెర్తు ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనకు పర్యాటక శాఖ ఇస్తారని తెలుస్తోంది. చిరంజీవితో పాటు మరొకరికి కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తుది కూర్పులో వీలు చిక్కితే ఆంధ్రవూపదేశ్‌కు మరో బెర్తు లభించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఉన్న కొందరికి ప్రమోషన్‌లు కూడా ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఖాయంగా కనిపిస్తున్న రెండు బెర్తుల్లో ఒకటి చిరంజీవికి పోను.. మిగిలినది తెలంగాణ ప్రాంతానికి దక్కుతుందని అంటున్నారు. ఈ స్థానం కోసం తెలంగాణ ప్రాంతం నుంచి సీనియర్ నేత వీ హన్మంతరావు, ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చాలా కాలం నుంచి కేంద్ర కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్న కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యవూపకాశ్‌డ్డి సైతం వారి ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నెలాఖరులో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తథ్యమని మస్తిన నుంచి బలమైన ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పదవులపై రాష్ట్ర ఎంపీలు ఆశలు పెట్టుకుంటున్నారు. అవకాశం ఉన్నది రెండు ఖాళీలకే అయినా ఆశావహులు మాత్రం భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మూడో మంత్రిని కూడా రాష్ట్రం నుంచి తీసుకోవాలని భావించిన పక్షంలో రాయలసీమ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి వరించే అదృష్టం లేక పోలేదంటున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వారం రోజుల క్రితం జరిపిన ఢిల్లీ పర్యటనలో సైతం రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో తీసుకునే వారి పేర్లపై పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. దసరా వేడుకలు ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం నుంచి హస్తినకు చేరుకోగానే కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ
వర్గాల సమాచారం.
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఐదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్ జైపాల్‌డ్డి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కేబినెట్ మంత్రులుగా, పళ్లం రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి సహాయ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్‌డ్డి ఒకరే కేబినెట్‌లో ఉండగా మిగతా నలుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఈసారి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఒకరిద్దరికి కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ కల్పించే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. వీరిలో పళ్ళం రాజు, పురంధేశ్వరిలలో ఒకరికి ప్రమోషన్ ఖాయమని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలను అందించిన ఆంధ్రవూపదేశ్ నుంచి కేంద్రంలో కేవలం ఐదుగురు మంత్రులే ప్రాతినిధ్యం వహించడం, వారిలో ఇద్దరు మాత్రమే కేబినెట్ హోదా కలిగి ఉండటం కూడా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
సీమాంధ్ర కోటాలో మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కచ్చితంగా ఉంటారని, మరో పదవిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉందని పీసీసీ అగ్రనేత ఒకరు స్పష్టం చేశారు. జగన్ దెబ్బతో కష్టాల్లో పడిన కిరణ్ ప్రభుత్వాన్ని ఆదుకుని, అవిశ్వాస తీర్మానంలో నెగ్గించడమే కాకుండా, ఆపదలో ఉన్నప్పుడు పార్టీకి ఆపద్భాంధవుడిలా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి నేనున్నాంటూ అభయమిచ్చినందుకు ప్రతిఫలంగా పూర్వ పీఆర్పీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యనేత, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వాలనే పట్టుదలతో అధిష్ఠానం పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పీఆర్పీ విలీనం సమయంలోనే చిరంజీవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన అభయాల మేరకు ఆయన్ని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని అంటారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో అవకాశం కల్పిస్తారని ఈ ఏడాది మార్చ్ నుంచి కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మార్చ్ నుంచి ఇప్పటి వరకు పలు దఫాలు ప్రధాని తన కేబినెట్లో మార్పులు, చేర్పులు చేసినప్పటికీ చిరుకు అవకాశం లభించ లేదు. అయితే కేంద్ర కేబినెట్ నుంచి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు మంత్రులు ఇటీవల రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకోవడం, వివిధ కారణాల రీత్యా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం, మరో కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మృతి చెందడం, మరికొందరు అదనపు బాధ్యతల్లో కీలక శాఖలు నిర్వహిస్తుండడంతో ఈసారి ఎక్కువ మందినే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా, ముగ్గురిని ఈసారి కేంద్ర కేబినెట్‌లోకి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవికి పర్యాటక శాఖ ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన్ని అందుబాటులో ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ నుంచి ముగ్గురి పేర్లు!
తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు, మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ, సికింవూదాబాద్ ఎంపీ ఎం అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. వీహెచ్ మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజీవ్, సోనియా కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడిగా, పార్టీ అధిష్ఠానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. చిరంజీవికి మంత్రిపదవి ఇచ్చిన పక్షంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌ను కేంద్రంలో తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. అయితే చిరంజీవి సీమాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, తెలంగాణ ప్రాంతం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌కు కూడా అవకాశం కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. వీహెచ్ సీనియారిటీ కూడా కేంద్ర మంత్రి పదవికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మంగళవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై పార్టీ పరిస్థితులు, రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పేరును పరిశీలించాలని కూడా వీహెచ్ ఈ సందర్భంగా అధినేవూతికి విన్నవించినట్లు తెలిసింది.
వీహెచ్ కాని పక్షంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సర్వే సత్యనారాయణకు కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చంటున్నారు. ఆయన కూడా పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి, హైకమాండ్ గీసిన గీత దాటని నేతగా ముద్రపడ్డారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన పనబాక లక్ష్మి మంత్రిగా ఉన్నందున, తెలంగాణ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. హైకమాండ్‌తో సఖ్యతగా మెలుగుతూ, తెలంగాణ కోసం టీ కాంగ్రెస్ ఎంపీలు ఉద్యమా బాట పట్టినా సర్వే సత్యనారాయణ కలిసిరాలేదనే విమర్శలు పార్టీలో ఉన్నాయి. కేంద్ర మంత్రిపదవిపై ఆయన ఆశపెట్టుకోవటమే దీనికి కారణమనే వాదన ఉంది. వీరిద్దరు కాని పక్షంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజన్‌కుమార్ యాదవ్ పేరును అధిష్ఠానం పరిశీలిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాదవ్ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకు, తెలంగాణలో తమకు నమ్మినబంటుగా ఉంటాడనే సమీకరణలతో అంజన్‌ను మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
కాగా ముగ్గురికి అవకాశం కల్పించే పరిస్థితి వస్తే సీనియర్ ఎంపీలు కావూరి సాంబశివరావు (ఆంధ్ర), కోట్ల సూర్యవూపకాష్‌డ్డి (రాయలసీమ)లలో ఒకరికి చాన్స్ ఉంటుందంటున్నారు. కావూరి చాలా కాలంగా కేంద్రంలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆయన్ని తీసుకోక పోవడంపై ఆయన తీవ్ర
అసంతృప్తితో కనిపించారు. అంతే కాకుండా చిరంజీవిని కేంద్ర కేబినెట్‌లోకి
తీసుకుంటారని గతంలో ప్రచారం జరిగినప్పుడు.. సీనియర్లను పక్కనపెట్టి
జూనియర్లకు అవకాశం కల్పించడం సమంజసం కాదని చిరంజీవిని ఉద్దేశించి తన
అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా రాయలసీమ నుంచి గతంలో కేంద్రంలో సహాయ
మంత్రిగా ఉన్న సాయివూపతాప్ రాజీనామా అనంతరం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం
లేకుండా పోయింది.
ఈ లోటును పూడ్చడానికి కర్నూలు నుంచి మూడు సార్లు ఎంపీగా
గెలిచిన కోట్ల సూర్యవూపకాష్‌డ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు
ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సూర్యవూపకాష్‌డ్డి మాజీ
ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌డ్డి కుమారుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చే
ఆంశంగా చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి విస్తరణలో రాష్ట్రానికి తగిన
ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
- T News
Read more...