No Telangana resolution in Assembly: Kiran
Read more...
21న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు
- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు
()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను
కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద
ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్
అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో
తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు
కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం
లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన
వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు
ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్
అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన
నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు
వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర
ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ
పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని
తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని
నేతలు నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం
గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు
భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్
షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి
అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు
రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ
తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ
చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.
ఈ సమావేశం
సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను
నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల
సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ
అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి
కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో
తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం.
కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో
సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర
హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు
సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం
వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు
సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం
ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల
విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి,
టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి,
బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని
ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు
చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
అదే
సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో
సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన
మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ
దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర
ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె
దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే
తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని
చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష
సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే
విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి
సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం
తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.
కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం
నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ
జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న
భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం
జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్
మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం
చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి?
అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన
రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన
నాకు మంచి మిత్రుడు.
ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం
వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది
కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని
చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా
విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014
ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని
అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా
ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు
20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును..
కేసీఆర్ కలిశారు.
కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు
చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే
చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై
త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన
వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి
హాజరవడం విశేషం.
నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత
రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి
సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి
ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్
నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే
వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను
అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.
ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం
ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం
నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని
ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి
తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు
జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల
సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు.
ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి,
విషయాలు వివరించినట్లు సమాచారం.
అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు
వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన..
ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా
వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి
ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే
సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ
గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త
ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ
నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద
వ్యాఖ్యానించారు.
‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66
ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత
చెప్పడం గమనార్హం
Take BY: T News
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP