తెలంగాణ రావాలంటే ... వరంగల్ పోవాలె
వరంగల్, మేజర్‌న్యూస్‌ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించ తలపెట్టిన తెలంగాణ మహాగర్జన మహాసభ గురువారం హన్మకొండలోని ప్రకాశ్‌రెడ్డి పేట లో నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేసింది. వేయి ఎకరాల్లో సభ నిర్వ హించేందుకు పార్టీ నాయకులు సిద్దం చేశారు. తెలంగాణ పది జిల్లాలనుండి సుమారు 30 లక్షల మంది హాజరవుతారని భావిస్తు న్నారు. గత డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసి సంవ త్సరం గడిచిన సంధర్బంగా నిర్వహించ తలపెట్టిన సభ ఈనెల 9 వ తేదీకి ముందు కురిసిన వర్షాలవల్ల 16వ తేదీకి వాయిదా వేశారు. నెల రోజులపాటు వేయి ఎకరాల స్దలాన్ని శుభ్రం చేయించిన తెరాస శ్రేణులు, విద్యుత్ దీపాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించారు.
అతిపెద్ద వేదికను ఏర్పాటు చేసి, 200 మంది అతిధులు కూర్చు నేందుకు వీలుగా వేదికను తీర్చిదిద్దారు. సభాప్రాంగణం నుండి హన్మకొండ చౌరస్తా వరకు (సుమారు 5 కిలోమీటర్లు) రోడ్లకు ఇరువైపులా మైకులు అమర్చారు. సభాప్రాంగణం చుట్టూ కెసిఆర్, తెలంగాణ తల్లీ కటౌట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. మూడువేల మంది కార్యకర్తలను శిక్షణ ఇచ్చి వలంటీర్లుగా విధులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రాంగణం చు ట్టూ వంద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, అవసర మైన మేరకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశా రు. నగరాన్ని గులాబీ జెండాలతో, బ్యానర్లతో అలంకరించారు.
ఇప్పటికే గులాబీమయమైన నగరం చుట్టూ సభాప్రాంగణానికి సమీపంలో బెలూన్లు ఏర్పాటు చేశారు. మహాగర్జనకు 2 అడిషనల్ ఎస్పీలు,11 మంది డిఎస్పీలు, 31 మంది సిఐలు, 194 మందిఎసై్సలు, 192 ఎసై్సలు, 984 కానిస్టేబుళ్ళు, 850 మంది డిస్ట్రిక్ గార్డ్స్, 10 యూనిట్ల ఎపిఎస్‌పి, 5 యూనిట్ల ఎఆర్, 5 డాగ్ స్వ్యాడ్ టీంలు బందోబస్తు చర్య కోసం ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పి ప్రభాకరరావు తెలిపారు. వరం గల్‌లో గురువారం జరిగే సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని, ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు తెలంగాణ ప్రజలు వినిపించే ప్రత్యేక రాష్ట్ర నినాదంగానే ఉంటుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్, జిల్లా అధ్య క్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దంపట్టే రీతిలో సభ జరుగు తుందని అన్నారు. స్వామి అగ్నివేశ్ మహాగర్జనకు ముఖ్య అతిధి గా హాజరవుతారని, పార్టీ అధినేత చంద్రశేఖర్ రావుతో పాటు పలు జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చివరి అవకాశంగా కాంగ్రెస్ పార్టీ అధి ష్టానానికి హెచ్చరిక జారీచేసే ఈ గర్జన నిలిచిపోతుందన్నారు.