Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, November 27, 2011

స్వార్థమా.. వర్ధిల్లు..!

ప్రియమైన భారతీయుల్లారా.. ఘన ప్రజాస్వామ్య వారసుల్లారా రండి.. మీ కోసం మాత్రమే మీరు వెచ్చించే విలువైన సమయంలోంచి ఓ రెండు నిమిషాలు ఈ ‘ప్రతిజ్ఞ’ ఆలపించేందుకు కేటాయించండి..
‘స్వార్థ జన’వనంలోంచి ‘నిస్వార్థపు’ మొక్కలను పెకిలించేందుకు సర్కారుకు శాయశక్తులా సహకరించండి..!
‘నేను, నా కుటుంబాన్ని ప్రేమించుచున్నాను..
అనుక్షణం నా గురించి, నా భార్యా పిల్లల గురించి
మాత్రమే ఆలోచించెదను..
సమాజంతో దాని మంచి చెడులతో నాకెలాంటి
సంబంధంలేనట్లు ప్రవర్తించెదను..
ఎట్టిపరిస్థితుల్లో ఇతరుల కష్టసుఖాల్లో పాలుపంచుకోను..
నాయకులు, అధికారుల అవినీతి, అక్రమాల
గురించి ప్రశ్నించను..
పోలీసుల దాష్టీకాలకు ఎదురు తిరగబోను..
మా ‘ఆకాంక్ష’ను పట్టించుకోకున్నా..
మా సహజ హక్కులను కాలరాసినా..
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి
మా బతుకులు అథః పాతాళానికి దిగజారుతున్నా..
మా ఆరుగాలం కష్టానికి మద్దతు ధర దక్కకున్నా..
మా వనరులను కొల్లగొట్టి మా నోట్లో మట్టికొట్టినా..
సెజ్‌ల పేరుతో మా భూముల్లోంచి మమ్మల్ని తరిమికొట్టినా..
ప్రాజెక్టుల పేర మా అడవుల నుంచి మమ్మల్ని వేరుచేసినా..
మనస్పూర్తిగా ఆమోదిస్తానని, మౌనంగా భరిస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను..’

ఇలా ప్రతిజ్ఞ చేద్దాం. ఇలాగే బతుకుదాం. లేకపోతే కిషన్‌జీ ని ఏం చేసింది ఈ ప్రభుత్వం? 36 ఏళ్లుగా మళ్లీమళ్లీ వేటాడింది. చివరకు బంధించింది. పిట్టను కాల్చేసినట్లు కాల్చేసింది. ‘ఓ నిస్వార్థ జీవీ చచ్చిపో..! ఇది స్వార్థపరుల ప్రపంచం.. నీకిక్కడ చోటు లేద’ని చెప్పింది..! అవును.. మల్లోజులకు మరీ ఇంత నిస్వార్థమా? జనం కష్టాల్లో ఉన్నారని, వారి కన్నీళ్లను తుడిచేందుకు కన్నతల్లిదంవూడులను గాలికొదిలి..! అడవుల్లో.. అన్నం దొరకని చోటుకు.. నీళ్లు దొరకని చోటుకు.. నిద్రపట్టని చోటుకు.. పురుగుపుట్రా తిరిగే చోటుకు.. క్రూరమృగాలు సంచరించే చోటుకు.. తుపాకులు గర్జించే చోటుకు.. నెత్తురు పారే చోటుకు.. తానేదో విహార యాత్రకు వెళ్లినట్లు..! కోరి కో రి వెళ్ళాడు! ‘తమ్ముడూ నువ్వు కూడా రారా..!’ అంటూ పిలవంగనే ‘అన్నా.. వస్తున్నా..!’ అంటూ వేణుగోపాల్‌రావు వెళ్ళాడు.. ఏమిటి వీళ్ల ధైర్యం? అమ్మా మధురమ్మా! ఉగ్గుపాలతోనే ఉద్యమాలను నూరిపోశావా తల్లీ! అయ్యా వెంకట య్యా? స్వాతంత్య్ర సమరయోధుడివి కదయ్యా! నీవు పోరా డి సాధించిన స్వాతంత్య్రం, అణగారిన వర్గాల సంకెళ్లను తెంచలేకపోయిన విషయాన్ని కొడుకులకు బోధించావా?

ఇప్పుడు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలోని శివాల యం వీధి ఎట్లా ఉంది? కిషన్‌జీ తల్లి మల్లోజుల మధురమ్మ ఏమని రోదిస్తోంది? ఏదో ఒక రోజు కొడుకులిద్దరూ తనను చూసేందుకు వస్తారని.. ‘అమ్మా..’ అని ఆప్యాయంగా పిలిచి తన ఒడిలో వాలిపోతారని 36ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ తల్లి, కొడుకు మరణవార్త విని ఎంత దుఃఖిస్తుంది? కొడుకులను ఎంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది? అందరినీ ఉన్నత చదువులు చదివించిందే..! రెండో కొడుకు కోటేశ్వర్‌రావు ఊరికే ఉన్నాడా? ఉస్మానియాలో న్యాయశాస్త్రం చదివేందుకు వెళ్లి, అక్కడేదో అన్యాయాన్ని గ్రహించినట్లే ఉన్నా డు! లేకపోతే భారత రాజ్యాంగానికి విధేయుడిగా ఉండేవాడు కదా! 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ స్ఫూర్తి తో ప్రగతిశీల విద్యార్థి సంఘ సభ్యుడిగా చేరాడు. గడీ పెత్తనా న్ని ధిక్కరించి, పెట్టుబడిదారీ సంకెళ్ల నుంచి పేదలకు విముక్తి కల్పించాలని.. సమసమాజ స్థాపన కోసం.. విప్లవ వీధిలో నిలబడ్డాడు. జగిత్యాల జైత్రయావూతలో.. రైతుకూలీ పోరాట ల్లో.. కరువు దాడుల్లో.. గడి పునాదులు కదిలించి, కూలీ రేట్లు పెంచిపిచ్చి ఎన్ని చేశాడు? లాల్‌గఢ్ సమరానికి నేతృత్వం వహించిన కిషన్ జీ, దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలకు స్ఫూర్తివూపదాత. విప్లవ కెరటం ఎగిసి ‘పడింది’. అడుగడుగునా స్వార్థం నిండిన ఈ లోకంలో ఉండలేక నేల మీద విప్లవ తార నింగికెగిసింది.

Take By: T News :http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48014


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News

Read more...

ఉద్యమానికి ‘భాగ్య’నగరం

 HYD1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 26 (: భిన్నత్వంలో ఏకత్వం అన్న నానుడిని సొంతం చేసుకున్న హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. నాటి నగర చారివూతక వైభవం నేటికీ గుభాళిస్తోంది. 1857 సిపాయిల తిరుగుబాటు రోజుల్లోనే.. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన నగరం. సుల్తాన్‌బజార్‌లో వీరత్వానికి చిహ్నంగా కనిపిస్తోన్న తుర్రేబాజ్‌ఖాన్ అమర స్తూపం నేటి తెలంగాణ ఉద్యమానికి ైధైర్యాన్ని నింపుతోంది. శస్త్ర చికిత్సలో అత్యంత ముఖ్యమైన అనస్థీషియా (మత్తు మందు)ను కనిపెట్టిన వైద్యుడు డా.మల్లయ్య, బడుగుల కోసం తాపవూతయపడ్డ కె.కృష్ణస్వామిముదిరాజ్.. ఇలా ఒక్కరేమిటి? వందల సంఖ్యలో ఎందరో మహనీయులు నడయాడిన నేల ఇది. పట్టెడన్నం కోసం పట్నమొచ్చిన ఎవరినైనా అక్కున చేర్చుకుంది. దేశ విదేశీయులనూ తన పొత్తిళ్లల్లో దాచుకుంది. మార్వాడీలు, గుజరాతీలు, బీహారీలు..ఇలా మినీ భారతం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. ప్రత్యక్షంగా లక్షలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి భాగ్యనగరం ఉపాధి కల్పిస్తోంది.

ఎంత మందినో భాగ్యవంతులుగా తీర్చిదిద్దింది. అందరూ హైదరాబాదీలతో సమ్మిళితమై హాయిగా బతుకుతున్నారు. కానీ వలసాధిపత్యం కలిగిన సీమాంవూధకు చెందిన కొందరు పెత్తందార్లు మాత్రం జులుం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముల్కీ.. నాన్ ముల్కీ, ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ వంటి ఉద్యమాలకు పుట్టినిల్లు ఈ భాగ్యనగరం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1969లో పునాదులను పటిష్టంగా నిర్మించడంలో నగరవాసుల పాత్ర ఎనలేనిది. తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన ఘనత నగరవాసులకే దక్కుతుంది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం నాటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన 369 మందిలో సింహభాగం హైదరాబాదీయులే. ఈ క్రమంలోనే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ఉద్యమానికి ఆలయంగా మారింది. మలి విడత తెలంగాణ ఉద్యమానికి కూడా హైదరాబాద్ కేంద్రమైంది.

కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు
Congress5-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రేటర్ హైదరాబాద్‌లో అధికంగా ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరుతో పార్టీకి నష్టం చేకూరుతోంది. తెలంగాణ ఉద్యమం పట్ల అంటీముట్టనట్లుగా నాయకులు వ్యవహరిస్తుండటంతో కూడా పార్టీ పట్ల ప్రజలు విముఖత చూపుతున్నారు. ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్, గోషామహల్ నుంచి గెలుపొందిన మూల ముఖేష్‌గౌడ్, కంటోన్మెంట్ నుంచి విజయం సాధించిన శంకర్‌రావు, మహేశ్వరం నుంచి జయకేతనం ఎగురవేసిన సబిత మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. కాగా రెండు పర్యాయాలు సికింవూదాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఎటువంటి పదవిని దక్కించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌కు చెందిన మంత్రులు, ఎంపీ మధ్యన ఆధిపత్యపోరు చోటుచేసుకుంది. వీరంతా పైకి కలిసికట్టుగా ఉన్నట్లు నటిస్తున్నా, ఎవరికి వారు అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

టీడీపీలో గ్రూపుల లొల్లి
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెరపైకి తీసుకురావడంతో టీడీపీకి ప్రజలు క్రమంగా దూరమవుతున్నారు. ఇక గ్రూపు రాజకీయాలు తోడవ్వడంతో గ్రేటర్ టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారుతోంది. 1983లో జరిగిన ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని విజయఢంకా మోగిస్తే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2002లో మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో కొంత వరకు పార్టీ కేడర్‌ను కాపాడుకోగలిగింది. ప్రస్తుతం గ్రేటర్ టీడీపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా నియోజవర్గాల ఇన్‌చార్జీల ఎంపిక నిలిచిపోయింది. ఇక జనచైతన్య యాత్రల్లో గ్రూపు తగాదాలతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజవర్గాల్లో ఎవరికి వారు తామే నియోజవర్గ ఇన్‌చార్జిలుగా అన్నట్లుగా గ్రూపులు కట్టుకుంటున్నారు. ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు నగరంలో పాదయాత్ర చేసినా కొందరు నాయకులు మినహా కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదరు. ఒకనాడు కళకళలాడిన టీడీపీ ఇప్పుడు వెళ చెప్పవచ్చు.

బీజేపీకి జీవం పోసిన ఉద్యమం
Bjp2-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రేటర్‌లో పూర్తిగా చతికిలపడిపోయిన భారతీయ జనతాపార్టీకి తెలంగాణ ఉద్యమం మళ్లీ జీవం పోసింది. గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కలహాలతో బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడంతో పార్టీ నిర్వీర్యం అయ్యింది. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో ఉద్యమం ఆ పార్టీకి కలిసొచ్చింది. గ్రేటర్‌లో రెండు నియోజక వర్గాలకే పరిమితమైన బీజేపీకి ఉద్యమం, బీజేపీ జాతీయ నేత అద్వానీ రథయావూతతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. గ్రేటర్‌లో ఒక ఎమ్మెల్యే, ఐదుగురు కార్పొరేటర్లకు పరిమితమైన బీజేపీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు విశ్వవూపయత్నం చేస్తున్నారు.

పుంజుకుంటున్న ఎంబీటీ
పాతనగరంలో మజ్లీస్ పార్టీ నేతలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్షికమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు మజ్లిస్ బచావ్ తహెరిక్ (ఎంబీటీ) సత్తా చాటుతోంది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ వాదంతో మైనార్టీ వర్గాలను ప్రభావితం చేస్తోంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రెండోసారి ఈ పార్టీ కన్వీనర్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. మైనార్టీల్లోని పలు గ్రూపుల మధ్య విభేధాలకు ఆజ్యం పోస్తున్న మజ్లిస్ వ్యవహారాలు ఎంబీటీకి బలం చేకూరుస్తున్నాయి.

ఉద్యమంతో సీపీఐకి ఊపిరి
CPI1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవామపక్ష పార్టీలలో సీపీఐ తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో తెలంగాణ ఉద్యమం సీపీఐకి బాగా కలిసొచ్చింది. పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నుంచి మళ్లీ కేడర్ బలోపేతం చేసుకునే దిశగా పార్టీ కార్యక్షికమాలు రూపొందించుకుంటోంది. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటోంది. సీపీఎం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో గ్రేటర్‌లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

ఉనికి కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యత్నాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. అధినేత జగన్ చరిష్మాతో పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు సమస్యగా మారింది. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ప్రకటించకపోవడం, పటిష్టమైన కేడర్ లేకపోవడం కూడా పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయవూపకాష్ నారాయణ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో ఓటమి భయంతో అక్టోబర్‌లో జరిగిన కేపీహెచ్‌బీకాలనీ డివిజన్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యంపార్టీకీ ప్రజల ఆదరణ కరువై బొక్కబోర్లాపడింది. ప్రజాక్షేవూతంలోఎక్కువ కాలం నిలవలేక జెండా ఎత్తేయడంతో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరారు.

పట్టుబిగిస్తున్న టీఆర్‌ఎస్
TRS2-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్‌లో క్రమంగా పట్టుబిగిస్తోంది. ఉద్యమానికి కేంద్ర బిందువైన హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. కేసీఆర్ ఆమరణ దీక్ష తరువాత నగరంలోని తెలంగాణవాదం బయటపడింది. మిలియన్‌మార్చ్, ఓయూ విద్యార్థుల ఉద్యమం టీఆర్‌ఎస్‌కు స్ఫూర్తినిచ్చింది. సకలజనుల సమ్మెనాటికి అది మహోధృతంగా మారి టీఆర్‌ఎస్‌కు కొండంత అండగా నిలిచింది. విద్యావంతులు, ఉద్యోగులు, యువతరం తెలంగాణవాదంతో టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడుతున్నారు. ఇటీవల నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి ఒకవైపు హరీష్‌రావు, మరోవైపు కేటీఆర్‌లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. విభిన్న సంస్కృతుల కలయికతో ఉన్న నగరంలో రాష్ట్ర సాధన కోసం ఇచ్చిన ప్రతి పిలుపుకు ప్రజలు స్పందించి తెలంగాణవాదాన్ని చాటిచెప్పారు. సీమాంధ్ర వలసవాదులు ఉన్న కొన్ని ప్రాంతాలలో తప్ప హైదరాబాద్‌లో తెలంగాణవాదం బలంగానే ఉంది. ఇటీవల కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ నియోజవర్గాల్లో నిర్వహించిన పాదయావూతలకు ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందననే ఇందుకు సాక్ష్యం.

నిర్ణయాత్మక శక్తిగా మజ్లిస్
మైనార్టీల ప్రతినిధిగా ముద్రపడిన ఎంఐఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఆరంభంలో కేవలం మున్సిపల్ ఎన్నికలకు పరిమితమైన మజ్లిస్, ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానం కూడా దక్కించుకుని గ్రేటర్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆ పార్టీకి చెందిన దివంగత నేత సలావుద్దీన్ ఒవైసీ ముందుచూపు, అసదుద్దీన్ ఒవైసీ దూరదృష్టితో ఎంఐఎం రాజకీయ ప్రాబల్యం క్రమంగా పెరిగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌లో సైతం 42 కార్పొరేటర్ స్థానాలను దక్కించుని నిర్ణయాత్మకశక్తిగా మారింది. అయితే ఒంటెత్తు పోకడల నేపథ్యంలో ఎంఐఎంపై మైనార్టీలో వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అత్యధికంగా మైనార్టీలు కోరుతుండటంతో ఆ పార్టీ చిక్కుల్లో పడింది. పాత నగరం అభివృద్ధి పై కపట ప్రేమతో వ్యవహరించడం కూడా స్థానిక మైనార్టీ ఒటర్లకు మింగుడుపడటం లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షగా భాగస్వామ్యం అవుతున్న జమాతే ఇస్లామియా, ఇతరత్రా మైనార్టీ సంఘాల కూటమిలు మజ్లీస్ పార్టీకి ధీటూగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. .

Take By: T News http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48012


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News 
 

Read more...

గిరిజన సంక్షేమ శాఖలో 700 పోస్టుల భర్తీకి ఓకే

 -ట్రైటా దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పసుపులేటి
 
ఎల్బీనగర్, నవంబర్ 26 (: గిరిజన గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. శనివారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం(ట్రైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్షికమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో 700 పోస్టులను భర్తీ చేయ డానికి అనుమతి లభించిందని, 1900 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చేందుకు టీచర్లు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా 25 ఏళ్ళ సర్వీసును పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను మంత్రి బాలరాజు సన్మానించారు. ట్రైటా అధ్యక్షుడు టి.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రైటా ప్రధాన కార్యదర్శి బి.సీతామనోహర్‌రావులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Take By: T News


Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, Kirankumar Reddy,




Read more...

ఉన్నది ఉన్నట్టు రాయండి

- పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సీఎం కిరణ్‌కుమార్‌డ్డి
- ప్రజాస్వామ్య విలువలకు వేదికలు కావాలి: మండలి చైర్మన్ చక్రపాణి
- జర్నలిస్టుల కోసం 13 రకాల అవార్డులు: డీకే అరుణ
- ఘనంగా ఐజేయూ ఏడో ప్లీనరీ
- హాజరైన సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులు

amar1 talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 26 ():విలేకరులు వార్తలను వార్తల్లాగా రాయడం లేదని, వ్యక్తిగత అభివూపాయాలను జోడించి వార్తారచన చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అభివూపాయపడ్డారు. ఎలక్షిక్టానిక్, ప్రింట్ మీడియాలలో ఉన్నది ఉన్నట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా రావడం లేదన్నారు. వార్తలకు వ్యాఖ్యానాలను కలిపి ప్రచురిస్తున్నారని, దాంతో ప్రధానమైన అంశం పక్కదారి పడుతున్నదని, అసందర్భమైన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. విలేకరులు వార్తారచనలో నిజాలు, నిజాయితీకి, ప్రమాణాలు, విలువలకు, ప్రాధాన్యం ఇచ్చి విశ్వసనీయతను పెంచుకోవాలని, అభివూపాయాలను సంపాదకీయాల్లోనే వ్యక్తీకరించాలని సూచించారు. పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపాలని, రుగ్మతలపై పాలకులు దృష్టి సారించే విధంగా అవి చేసే విమర్శల్లో హేతుబద్ధత ఉండాలని సీఎం సూచించారు. ఇమేజ్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఏడో ప్లీనరీ ప్రారంభ సదస్సులో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ఈ కార్యక్షికమంలో సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ చక్రపాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బీ వెంక తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం చైర్మన్ కే శ్రీనివాస్‌డ్డి, ఐజేయు ప్రధాన కార్యదర్శి డీ అమర్, ఐజేయు జాతీయ అధ్యక్షుడు ఎస్‌ఎన్ సిన్హా, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌డ్డి, ఐజేయు నాయకులు అమర్‌నాథ్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. తెలుగు పత్రికా రంగంలోని సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులతో సభాస్థలి కిటకిటలాడింది. హెచ్‌ఎంటీవీ సీఈఓ కే రామచంవూదమూర్తి, సీనియర్ సంపాదకులు వెంకవూటావు, ఆంధ్రజ్యోతి మాజీ డిప్యూటీ ఎడిటర్ ఉపేంద్రబాబు, హన్స్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లం నారాయణ, సీఈఓ కట్టా శేఖర్‌డ్డి, జీ 24 గంటలు చానెల్ సీఈఓ శైలేశ్‌డ్డి తదితర ప్రముఖ జర్నలిస్టులు, సంపాదకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

amartalangana patrika telangana culture telangana politics telangana cinemaఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు పత్రికలు, చానళ్లు విశ్వసనీయతను కోల్పోయాయని, ఏ ఒక్క పత్రికపైన ప్రజలకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. సర్క్యులేషన్, టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవడమే ధ్యేయంగా పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయన్నారు. తాత్కాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ.. శాశ్వత ప్రయోజనాలు, విలువలను విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాలలో విలేకరులు రాసిన వార్తలను, యాజమాన్యాలు అంగీకరించడం లేదని ఆయన అన్నారు. విలేకరుల భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం సమంజసం కాదని సీఎం వ్యాఖ్యానించారు. చానళ్లు, కొన్ని సంఘటనలను జుగుప్సాకరంగా ప్రసారం చేస్తున్నాయని, కొన్ని దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు ఎలక్షిక్టానిక్ మీడియా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ప్రజల బాధలు, కష్టాలు, కన్నీళ్లకు పత్రికలు వేదికలు కావాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయం చేయడం వల్ల రైతులు కష్టాలపాలవుతున్నారని, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై రైతులు దృష్టి సారించాలని తాను చెప్పిన మాటలను వక్రీకరించి శీర్షికలను ప్రచురించారని ఆయన మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రచ్చబండలో నలుగురు ప్రశ్నిస్తే, దానిని తాటికాయంత అక్షరాలతో రాశారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు ఏ పత్రికను, ఏ చానల్‌ను నమ్మడం లేదని, రెండో పత్రిక, రెండో చానల్‌ను చూసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు ప్రతికలు దర్పణం కావాలని చైర్మన్ పేర్కొన్నారు.

సమాచార శాఖ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా 13 రకాల పురస్కారాలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్షికమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఐజేయు అధ్యక్షులు ఎస్‌ఎన్ సిన్హా మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్రికలు, చానళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కే శ్రీనివాస్‌డ్డి మాట్లాడుతూ ఐజేయు సాధించిన విజయాలను, తదుపరి కార్యాచరణను, వేజ్‌బోర్డు విధానాలను వివరించారు.

Read more...

ప్రత్యేక ‘ఆంధ్రా’ మండళ్లు

- సెజ్‌లలోనూ సీమాంవూధులదే హవా
- రాజధాని చుట్టూ వారిదే ఆధిపత్యం
- 10కిపైగా సీమాంధ్ర పెట్టుబడిదారులవే
- సత్యం, మేటాస్, శ్రీని, అనంత్, నవయుగ, ల్యాంకో, ఇందు... ఇదో చాంతాడు
- అభివృద్ధి ముసుగులో భూములు స్వాహా
- లొసుగుల పునాదులపై రియల్ దందా
- ల్యాంకోహిల్స్, ఎమ్మార్, ఐటీ పార్కులే నిదర్శనాలు
- పాలకులకు కాసుల వర్షం

real105-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపేరుకు అవి ప్రత్యేక ఆర్థిక మండళ్లు! కానీ తరచి చూస్తే అవి ప్రత్యేక ఆంధ్ర మండళ్లు! సత్యం, మేటాస్, శ్రీని, అనంత్, నవయుగ, ఇందు... చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తేలుతుంది. నయా ఆర్థిక విధానాల అమలు క్రమంలో కార్మిక హక్కులను కాలరాస్తూ.. భారీ మినహాయింపులు పొందుతూ సెజ్‌లు పుట్టుకొచ్చాయి. సెజ్‌ల చట్టంలో లొసుగులు ఆధారం చేసుకుని అసలు సంగతి పక్కనపె రియల్‌దందా మొదలు పెట్టాయి. పోగుపడిన సంపదను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న సీమాంధ్ర బడాబాబులకు ఈ సెజ్‌లు వరంగా పరిణమించాయి. వారి ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం తోడవడంతో సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి అంతే లేకుండా పోయింది. ఇప్పుడు సెజ్‌లంటే సీమాంవూధుల ఆధిపత్యమే కనిపించే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో అదే అభివృద్ధిగా నాడు చంద్రబాబు నాయుడు అనంతరం వైఎస్ రాజశేఖర్‌డ్డి ఉద్ఘోషించారు. ఆ అభివృద్ధి ఫలాలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని చూస్తే.. అక్కడా సీమాంవూధులే కనిపిస్తున్నారు.

( హైదరాబాద్) ప్రత్యేక ఆర్థిక మండళ్ల విషయంలోనూ సీమాంధ్ర హవా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఉన్న సెజ్‌లే కాకుండా.. ఇటీవల ప్రారంభమైన సెజ్‌లలోనూ వారిదే ఆధిపత్యం. సెజ్‌ల పేరుతో భూములు స్వాహా చేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు.. నిబంధనల్లో లొసుగులను ఆధారం చేసుకుని రియల్ వ్యాపారం చేస్తున్నారు. సెజ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనూ సెజ్‌లు వచ్చాయి. ఆ సమయంలో ఎక్కువగా ఐటీ రంగం ఊపులో ఉండడం వల్ల ఐటీ సెజ్‌లు ఎక్కువగా వెలిశాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 73 సెజ్‌లుండగా వాటిలో పూర్తిగా ఆంధ్రవూపదేశ్ ఇండవూస్టియల్ ఇన్‌వూఫావూస్టక్చర్స్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నవి 17, ఏపీఐఐసీ భాగస్వామిగా ఉండి ప్రైవేటు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవి 29, పూర్తిగా ప్రైవేటు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవి 25 ఉన్నాయి. వీటిలో పూర్తిగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్నవాటికి ప్రైవేటు వ్యక్తులతో సంబంధం ఉండదు. అయితే, ఏపీఐఐసీ సహకారంతో ప్రైవేటు డెవలపర్స్ భాగస్వామ్యంతో ఏపీఐఐసీ అభివృద్ది చేసేవాటిలో, ప్రైవేటు డెవలపర్స్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నవాటిలోనే సీమాంవూధులు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు.

ఏపీఐఐసీ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న సెజ్‌లలో హైదరాబాద్ చుట్టుపక్కల.. అంటే రంగాడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న సెజ్‌ల సంఖ్య 19. వీటిలో ఎక్కువ భాగం ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులకు చెందిన కంపెనీలు పెట్టుకునే సెజ్‌లదే. వీటిలో పక్కాగా సీమాంధ్ర పెట్టుబడిదారులకు చెందిన సెజ్‌లు కూడా ఉన్నాయి. ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఉన్న ప్రతి సెజ్‌లోనూ పరోక్షంగా సీమాంధ్ర బడాబాబులకు వారి ద్వారా పాలకులకు లాభం జరిగింది. వీటిలో జరిగిన అక్రమాల్లో ఏపీఐఐసీ వాటా తగ్గించి భూములు అందినకాడికి లాక్కోవడం, మిగతావి అమ్ముకుని జేబులో వేసుకున్నారని ఇటీవల వెలుగు చూసిన అక్రమాలే చెబుతున్నాయి.

ఇవికాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రైవేటు డెవలపర్స్ డెవలప్ చేస్తున్న సెజ్‌లు చాలా ఉన్నాయి. వీటిలో శేరిలింగంపల్లిలోని ఏపీ టెక్నో ప్రాజెక్ట్ ప్రైవేట లిమిటెడ్ (24.70 ఎకరాలు, ఐటీ), బహదూర్‌పల్లిలోని సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ (25.98, ఐటీ), సీఎంసీ లిమిటెడ్ (50 ఎకరాలు), సంఘీ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ (202.40, ఐటీ), మేటాస్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ సెజ్ లిమిటెడ్ (15.92 ఎకరాలు, ఐటీ), రుద్రదేవ్ ఇన్ఫోపార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (12.25 ఎకరాలు, ఐటీ), మహవీర్ సై్క స్క్రాపర్స్ (56.27ఎకరాలు, ఐటీ), మేటాస్ ప్రాపర్టీస్ (73 ఎకరాలు, ఐటీ), శ్రీని ప్రాపర్టీస్ (66ఎకరాలు, ఐటీ), నవయుగ లీగల్ ఎస్టేట్స్ (25 ఎకరాలు, ఐటీ), జెన్‌ప్యాక్ట్ ఇండియా (50ఎకరాలు,ఐటీ), వివో బయోటెక్ లిమిటెడ్ (27ఎకరాలు), ఎస్2 టెక్ లిమిటెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (25ఎకరాలు, ఐటీ),

జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (251ఎకరాలు, ఏవియేషన్), ఇన్‌ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ (296 ఎకరాలు, ఐటీ), దేవ్ భూమి రియల్టర్స్ (25ఎకరాలు, ఐటీ), అనంత్‌టెక్నాలజీస్ (25 ఎకరాలు, ఐటీ), గోద్రేజ్ రియల్‌ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (34 ఎకరాలు, ఐటీ), లహరి ఇన్‌వూఫావూస్టక్చర్స్ (25 ఎకరాలు,ఐటీ), బయాలజికల్ ఈ లిమిటెడ్ (25ఎకరాలు, బయోటెక్ సెజ్), మధుశీల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ (25 ఎకరాలు,ఐటీ) సెజ్‌లున్నాయి. వీటిలో కొన్ని జాతీయ,అంతర్జాతీయ కంపెనీలకు చెందిన సెజ్‌లుండగా సత్యం, మేటాస్, నవయుగ, జీఎంఆర్ ఇంటర్నేషనల్, అనంత్ టెక్నాలజీస్, శ్రీని ప్రాపర్టీస్, బయలాజికల్ ఈ లిమిటెడ్ లాంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకు చెందిన సెజ్‌లూ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ డెవలపర్ భూమి సమకూర్చుకున్న అనంతరం కేంద్రవూపభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సెజ్‌గా నోటిఫై చేస్తుంది. వీటిలో కంపెనీల రాక, నిర్వహణ, పర్యవేక్షణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ చూస్తుంటారు. ఇలా ఏపీఐఐసీ భాగస్వామ్యం, ప్రైవేటుకు చెందిన సెజ్‌లన్నింటికీ సెజ్ చట్టం 2005 కిందే అన్ని రకాల రాయితీలు, ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటారు.

ఇదీ సెజ్ చట్టం
పరిక్షిశమల రంగాన్ని అభివృద్ధి చేయడానికి, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికిగాను భారత ప్రభుత్వం 2005లో స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టాన్ని (సెజ్ యాక్ట్) రూపొందించింది. అప్పటి వరకు ఫారన్ ట్రేడ్ పాలసీ కింద ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం సమగ్ర విధివిధానాలతో స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టం-2005 తయారైంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల బిల్లు మే 2005లో పార్లమెంటు ఆమోదం పొందింది. 2006 ఫిబ్రవరి 10 నుంచి ఇది అమలులోకి వచ్చింది.పలు రంగాలకు చెందిన పరిక్షిశమలను ప్రోత్సహించడానికి కొంత భూమిని ప్రభుత్వమే డెవలపర్‌కు అప్పగిస్తుంది.
ఆ ప్రదేశంలో పరిక్షిశమలు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రాయితీలు ఇస్తాయి.

ఇది ఒక పద్ధతి కాగా, మరో పద్ధతిలో సొంత భూమి కలిగి ఉన్న ప్రైవేటు డెవలపర్ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని రకాలు పరిశీలించిన మీదట ఆ ప్రదేశాన్ని సెజ్‌గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. దేనిని ఉద్దేశించి ఆ సెజ్ పెట్టుకున్నారో అందులో వచ్చే పరిక్షిశమలన్నింటికీ రాయితీలు సెజ్ చట్టం 2005 ప్రకారం రాయితీలు కల్పిస్తారు. సెజ్‌లో వచ్చే పరిక్షిశమలకు మొదటి 5 సంవత్సరాల పాటు 100% ఆదాయం పన్ను మినహాయింపు, తర్వాతి 5 సంవత్సరాలకు 50 శాతం ఆదాయ పన్ను మినహాయింపు, డ్యూటీ ఫ్రీ దిగుమతులు, మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మినహాయింపు,

ఎలాంటి పరిమితులు లేకుండా గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి సంవత్సరానికి 500 మిలియన్ డాలర్ల రుణం తీసుకోవడానికి అనుమతి, అమ్మకపు పన్ను మినహాయింపు, సేవా పన్ను మినహాయింపు, రాష్ట్రాల సేవా పన్ను మినహాయింపుతో పాటు సె్ నుంచి జరిగిన ఎగుమతులపై వచ్చిన ఆదాయంపై 10ఏళ్ల పాటు మినహాయింపులాంటి ఎన్నో భారీ రాయితీలు సెజ్ డెవలపర్‌కు కల్పిస్తారు. ఇన్ని రాయితీలతో పాటు ఎన్నో లొసుగులున్న సెజ్ చట్టాన్ని చూస్తే పెట్టుబడిదారుపూవరికైనా నోరూరుతుంది. అందులోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎక్కడ రాయితీలుంటే అక్కడ వాలిపోతుంటారు.

సెజ్‌ల ముసుగులో రియల్ వ్యాపారం
సాధారణంగా సెజ్‌లలో ప్రాసెసింగ్ ప్రదేశం, నాన్ ప్రాసెసింగ్ ప్రదేశం ఉంటాయి. వీటిలో నాన్ ప్రాసెసింగ్ ప్రదేశంలో సెజ్‌లో ఉద్దేశించిన కంపెనీలు రాకముందే వాటితో సంబంధం లేకుండా కమర్షియల్ కాంప్లెక్సులు, రెసిడెన్షియల్ టవర్లు, థియేటర్లు, రిక్రియేషన్ క్లబ్‌లు, రెస్టాంట్‌లు, కన్వెన్షన్ సెంటర్‌లు, కార్లసర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు భూముల విలువ ఎక్కువగా ఉండే రంగాడ్డి జిల్లాలో సెజ్‌ల పేరుతో భూమి తీసుకొని వాటిలో ఎలాంటి కంపెనీలు రాకముందే ఇళ్లు నిర్మించి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. లాంకోహిల్స్ టెక్నాలజీ ప్రైవేట్ పార్క్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉదంతాలు ఇందుకు నిదర్శనం.

ఇవి ఐటీ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెజ్‌లని చాలా మందికి తెలియదు. కంపెనీల రాకకంటే ముందే ఇక్కడ వెలసిన రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గోల్ఫ్‌కోర్సులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం... వాటిని అమ్ముకునేందుకు ఫక్తు రియల్‌ఎస్టేట్ కంపెనీల మాదిరిగా ప్రచారం ఇవన్నీ తెలిసిందే. లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో హి్ టెక్నాలజీ పార్క్, సీమాంధ్ర పాలకులందరి హస్తమున్న ఎమ్మార్ టౌన్‌షిప్ హిల్స్‌పై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా సెజ్ చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకొని కాలంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల రంగాడ్డి, మెదక్‌జిల్లాల్లోని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను సెజ్‌ల ముసుగులో కాజేసి సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు కలిసి తెగనమ్ముకుంటున్నారు.


Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP