స్వార్థమా.. వర్ధిల్లు..!
ప్రియమైన భారతీయుల్లారా.. ఘన ప్రజాస్వామ్య వారసుల్లారా రండి.. మీ కోసం మాత్రమే మీరు వెచ్చించే విలువైన సమయంలోంచి ఓ రెండు నిమిషాలు ఈ ‘ప్రతిజ్ఞ’ ఆలపించేందుకు కేటాయించండి..
‘స్వార్థ జన’వనంలోంచి ‘నిస్వార్థపు’ మొక్కలను పెకిలించేందుకు సర్కారుకు శాయశక్తులా సహకరించండి..!
‘నేను, నా కుటుంబాన్ని ప్రేమించుచున్నాను..
అనుక్షణం నా గురించి, నా భార్యా పిల్లల గురించి
మాత్రమే ఆలోచించెదను..
సమాజంతో దాని మంచి చెడులతో నాకెలాంటి
సంబంధంలేనట్లు ప్రవర్తించెదను..
ఎట్టిపరిస్థితుల్లో ఇతరుల కష్టసుఖాల్లో పాలుపంచుకోను..
నాయకులు, అధికారుల అవినీతి, అక్రమాల
గురించి ప్రశ్నించను..
పోలీసుల దాష్టీకాలకు ఎదురు తిరగబోను..
మా ‘ఆకాంక్ష’ను పట్టించుకోకున్నా..
మా సహజ హక్కులను కాలరాసినా..
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి
మా బతుకులు అథః పాతాళానికి దిగజారుతున్నా..
మా ఆరుగాలం కష్టానికి మద్దతు ధర దక్కకున్నా..
మా వనరులను కొల్లగొట్టి మా నోట్లో మట్టికొట్టినా..
సెజ్‌ల పేరుతో మా భూముల్లోంచి మమ్మల్ని తరిమికొట్టినా..
ప్రాజెక్టుల పేర మా అడవుల నుంచి మమ్మల్ని వేరుచేసినా..
మనస్పూర్తిగా ఆమోదిస్తానని, మౌనంగా భరిస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను..’
ఇలా ప్రతిజ్ఞ చేద్దాం. ఇలాగే బతుకుదాం. లేకపోతే కిషన్‌జీ ని ఏం చేసింది ఈ ప్రభుత్వం? 36 ఏళ్లుగా మళ్లీమళ్లీ వేటాడింది. చివరకు బంధించింది. పిట్టను కాల్చేసినట్లు కాల్చేసింది. ‘ఓ నిస్వార్థ జీవీ చచ్చిపో..! ఇది స్వార్థపరుల ప్రపంచం.. నీకిక్కడ చోటు లేద’ని చెప్పింది..! అవును.. మల్లోజులకు మరీ ఇంత నిస్వార్థమా? జనం కష్టాల్లో ఉన్నారని, వారి కన్నీళ్లను తుడిచేందుకు కన్నతల్లిదంవూడులను గాలికొదిలి..! అడవుల్లో.. అన్నం దొరకని చోటుకు.. నీళ్లు దొరకని చోటుకు.. నిద్రపట్టని చోటుకు.. పురుగుపుట్రా తిరిగే చోటుకు.. క్రూరమృగాలు సంచరించే చోటుకు.. తుపాకులు గర్జించే చోటుకు.. నెత్తురు పారే చోటుకు.. తానేదో విహార యాత్రకు వెళ్లినట్లు..! కోరి కో రి వెళ్ళాడు! ‘తమ్ముడూ నువ్వు కూడా రారా..!’ అంటూ పిలవంగనే ‘అన్నా.. వస్తున్నా..!’ అంటూ వేణుగోపాల్‌రావు వెళ్ళాడు.. ఏమిటి వీళ్ల ధైర్యం? అమ్మా మధురమ్మా! ఉగ్గుపాలతోనే ఉద్యమాలను నూరిపోశావా తల్లీ! అయ్యా వెంకట య్యా? స్వాతంత్య్ర సమరయోధుడివి కదయ్యా! నీవు పోరా డి సాధించిన స్వాతంత్య్రం, అణగారిన వర్గాల సంకెళ్లను తెంచలేకపోయిన విషయాన్ని కొడుకులకు బోధించావా?
ఇప్పుడు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలోని శివాల యం వీధి ఎట్లా ఉంది? కిషన్‌జీ తల్లి మల్లోజుల మధురమ్మ ఏమని రోదిస్తోంది? ఏదో ఒక రోజు కొడుకులిద్దరూ తనను చూసేందుకు వస్తారని.. ‘అమ్మా..’ అని ఆప్యాయంగా పిలిచి తన ఒడిలో వాలిపోతారని 36ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ తల్లి, కొడుకు మరణవార్త విని ఎంత దుఃఖిస్తుంది? కొడుకులను ఎంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది? అందరినీ ఉన్నత చదువులు చదివించిందే..! రెండో కొడుకు కోటేశ్వర్‌రావు ఊరికే ఉన్నాడా? ఉస్మానియాలో న్యాయశాస్త్రం చదివేందుకు వెళ్లి, అక్కడేదో అన్యాయాన్ని గ్రహించినట్లే ఉన్నా డు! లేకపోతే భారత రాజ్యాంగానికి విధేయుడిగా ఉండేవాడు కదా! 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ స్ఫూర్తి తో ప్రగతిశీల విద్యార్థి సంఘ సభ్యుడిగా చేరాడు. గడీ పెత్తనా న్ని ధిక్కరించి, పెట్టుబడిదారీ సంకెళ్ల నుంచి పేదలకు విముక్తి కల్పించాలని.. సమసమాజ స్థాపన కోసం.. విప్లవ వీధిలో నిలబడ్డాడు. జగిత్యాల జైత్రయావూతలో.. రైతుకూలీ పోరాట ల్లో.. కరువు దాడుల్లో.. గడి పునాదులు కదిలించి, కూలీ రేట్లు పెంచిపిచ్చి ఎన్ని చేశాడు? లాల్‌గఢ్ సమరానికి నేతృత్వం వహించిన కిషన్ జీ, దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలకు స్ఫూర్తివూపదాత. విప్లవ కెరటం ఎగిసి ‘పడింది’. అడుగడుగునా స్వార్థం నిండిన ఈ లోకంలో ఉండలేక నేల మీద విప్లవ తార నింగికెగిసింది.
Take By: T News :http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48014
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News
0 comments:
Post a Comment