ఉన్నది ఉన్నట్టు రాయండి
- పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సీఎం కిరణ్‌కుమార్‌డ్డి
- ప్రజాస్వామ్య విలువలకు వేదికలు కావాలి: మండలి చైర్మన్ చక్రపాణి
- జర్నలిస్టుల కోసం 13 రకాల అవార్డులు: డీకే అరుణ
- ఘనంగా ఐజేయూ ఏడో ప్లీనరీ
- హాజరైన సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులు
హైదరాబాద్, నవంబర్ 26 ():విలేకరులు వార్తలను వార్తల్లాగా రాయడం లేదని, వ్యక్తిగత అభివూపాయాలను జోడించి వార్తారచన చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అభివూపాయపడ్డారు. ఎలక్షిక్టానిక్, ప్రింట్ మీడియాలలో ఉన్నది ఉన్నట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా రావడం లేదన్నారు. వార్తలకు వ్యాఖ్యానాలను కలిపి ప్రచురిస్తున్నారని, దాంతో ప్రధానమైన అంశం పక్కదారి పడుతున్నదని, అసందర్భమైన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. విలేకరులు వార్తారచనలో నిజాలు, నిజాయితీకి, ప్రమాణాలు, విలువలకు, ప్రాధాన్యం ఇచ్చి విశ్వసనీయతను పెంచుకోవాలని, అభివూపాయాలను సంపాదకీయాల్లోనే వ్యక్తీకరించాలని సూచించారు. పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపాలని, రుగ్మతలపై పాలకులు దృష్టి సారించే విధంగా అవి చేసే విమర్శల్లో హేతుబద్ధత ఉండాలని సీఎం సూచించారు. ఇమేజ్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఏడో ప్లీనరీ ప్రారంభ సదస్సులో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ఈ కార్యక్షికమంలో సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ చక్రపాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బీ వెంక తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం చైర్మన్ కే శ్రీనివాస్‌డ్డి, ఐజేయు ప్రధాన కార్యదర్శి డీ అమర్, ఐజేయు జాతీయ అధ్యక్షుడు ఎస్‌ఎన్ సిన్హా, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌డ్డి, ఐజేయు నాయకులు అమర్‌నాథ్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. తెలుగు పత్రికా రంగంలోని సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులతో సభాస్థలి కిటకిటలాడింది. హెచ్‌ఎంటీవీ సీఈఓ కే రామచంవూదమూర్తి, సీనియర్ సంపాదకులు వెంకవూటావు, ఆంధ్రజ్యోతి మాజీ డిప్యూటీ ఎడిటర్ ఉపేంద్రబాబు, హన్స్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లం నారాయణ, సీఈఓ కట్టా శేఖర్‌డ్డి, జీ 24 గంటలు చానెల్ సీఈఓ శైలేశ్‌డ్డి తదితర ప్రముఖ జర్నలిస్టులు, సంపాదకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు పత్రికలు, చానళ్లు విశ్వసనీయతను కోల్పోయాయని, ఏ ఒక్క పత్రికపైన ప్రజలకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. సర్క్యులేషన్, టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవడమే ధ్యేయంగా పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయన్నారు. తాత్కాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ.. శాశ్వత ప్రయోజనాలు, విలువలను విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాలలో విలేకరులు రాసిన వార్తలను, యాజమాన్యాలు అంగీకరించడం లేదని ఆయన అన్నారు. విలేకరుల భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం సమంజసం కాదని సీఎం వ్యాఖ్యానించారు. చానళ్లు, కొన్ని సంఘటనలను జుగుప్సాకరంగా ప్రసారం చేస్తున్నాయని, కొన్ని దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు ఎలక్షిక్టానిక్ మీడియా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ప్రజల బాధలు, కష్టాలు, కన్నీళ్లకు పత్రికలు వేదికలు కావాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయం చేయడం వల్ల రైతులు కష్టాలపాలవుతున్నారని, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై రైతులు దృష్టి సారించాలని తాను చెప్పిన మాటలను వక్రీకరించి శీర్షికలను ప్రచురించారని ఆయన మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రచ్చబండలో నలుగురు ప్రశ్నిస్తే, దానిని తాటికాయంత అక్షరాలతో రాశారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు ఏ పత్రికను, ఏ చానల్‌ను నమ్మడం లేదని, రెండో పత్రిక, రెండో చానల్‌ను చూసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు ప్రతికలు దర్పణం కావాలని చైర్మన్ పేర్కొన్నారు.
సమాచార శాఖ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా 13 రకాల పురస్కారాలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్షికమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఐజేయు అధ్యక్షులు ఎస్‌ఎన్ సిన్హా మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్రికలు, చానళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కే శ్రీనివాస్‌డ్డి మాట్లాడుతూ ఐజేయు సాధించిన విజయాలను, తదుపరి కార్యాచరణను, వేజ్‌బోర్డు విధానాలను వివరించారు.

Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News

0 comments:
Post a Comment