Man throws ink at Ramdev after Batla House comment
-18,19 తేదిల్లో సదస్సులు : డీవైఎఫ్‌ఐ
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.
టెట్‌ను నిరసిస్తూ ఈ నెల 18,19 తేదిల్లో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులను నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కే భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి తెలిపారు.
పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి. కొత్త అల్లుళ్ల రాకలు. యువకుల గాలిపటాల కేరింతలు. పిల్లల బొమ్మరిల్లాటలు. ఇలా హడావిడి మధ్య, ఎముకలు కొరికే చలితో సయ్యంటూ సంక్రాంతి పండుగను వేడుకగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. మూడు రోజులు జరుపుకునే పండుగ ఎంతో ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. ఆడబిడ్డల రాకతో పల్లెల్లో కళకళలాడుతుంటాయి. పండుగ రోజు ప్రతి ఇంటి ముందు రంగుల హరివిల్లులను తలపించే ముగ్గులేసేందుకు యువతుల ఉత్సాహాలు ఒకవైపు. డూడూ బసవన్న అంటూ తెల్లారేసరికి వచ్చే గంగిద్దులవారి చప్పుళ్లతో సంక్రాంతి పండుగ కొత్త కాంతిని సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగ విశిష్టత పై ‘టీ న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
సంబురాలు సంక్రాంతి
సంక్రాంతి అంటే ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేశాధి, ద్వాదశ రాశులందూ క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి మొదలవుతుంది. ఏడాదికి 12 సంక్రాంతులుంటే కాగా పుష్యమాసంలో, హేమంతరుతువులో చల్లటి గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతిని మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగుపెడతాడు. అందుకే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని చెబుతుంటారు. ఈ ఉత్తరాయణ కాలం నుంచి చేయు దానాలను ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, దుంపలు,కాయగూరలు, పండ్లు మొదలైనవి ఈ కాలమందు చేయు దానాల వల్ల స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు.
గంగిద్దుల సందడి.......
తెల్లారే సరికి ఇళ్ల ముందు హరిదాసు కీర్తనలు వినిపిస్తుంటాయి. గంగిద్దులను ఆడించే అలంకరించిన గంగిద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు,సన్నాయి రాగాలతో అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తుంటారు. అయ్యవారికి దణ్ణం పెట్టు...అమ్మవారికి దణ్ణం పెట్టంటూ గంగిద్దుల వారి సందడి ఎంతో రమణీయంగా ఉంటుంది. పండించిన పంట సంక్రాంతికి ముందే రావడంతో ఆ ధాన్యాన్ని గంగిద్దుల వారికి దానంగా ఇస్తుంటారు.
ఆకట్టుకునే హరిదాసుల కీర్తనలు....
సంక్రాంతి పండుగ రోజు హరిలో రంగ హరి అంటూ నడి నెత్తి పై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో , కంచు గజ్జెలు గల్లుగల్లుమనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిడుతలు కొడుతూ హరిదాసులు చేసే కీర్తనలు ఎంతో ఆకట్టుకుంటాయి. తల పై అక్షయపాత్ర కదలకుండా హరిదాసులు కీర్తనలు చేస్తూ పాడటం ఎంతో బాగుంటుంది. గతంలో ఇలాంటి వేడకలుండేవి. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హరిదాసులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
పిల్లల గాలిపటాల ఆటలు...
పండుగ రోజులో పిల్లలు, యువకులు గాలిపటాలు ఎగురేస్తుంటారు. కనువిందైన గాలిపటాలు ఎగిరేస్తూ సందడి చేస్తారు. చిన్నపిల్లలు బొమ్మరిలాటలాడుతుంటారు. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటుంటారు. బావమరదళ్ల సయ్యాటలు సంక్రాంతి రోజు కనిపిస్తుంటాయి.
వాకిళ్లలో వెలిసే గొబ్బెమ్మలు...
స్త్రీలు వాకిళ్లలో ముగ్గులు వేస్తుంటారు. యువతులు, ఆడపిల్లలు ఆవుపేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు వాకిళ్లల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ గొబ్బెమ్మల మీద గరకపోసలు, రంగుల పూలరేకులు పసుపు, కుంకుమలు పెడతారు.
ఇళ్లల్లో ప్రత్యేక వంటకాలు...
సంక్రాంతి పండుగ తెల్లారి జరుపుకునే కనుమ రోజు ఇళ్లల్లో ప్రత్యేకమైన పిండి వంటకాలు తయారు చేసుకుంటారు. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా భోజనాలు తయారు చేసుకొని తింటారు. కనుమ రోజంతా కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఇలా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
సంక్రాంతి అంటే గుర్తొచ్చేది రంగురంగుల పతంగులు. ఆకాశాన్నంతా రంగులమయం చేసే పతంగుల కహానీ తెలియాలంటే ఇతర రాష్ట్రాలు, దేశదేశాలు చుట్టాల్సిందే. ఆ సంగతులు ఈ సంక్రాంతి రోజున మీకోసం..మొట్టమొదటిసారిగా 2,000 సంవత్సరాల క్రితం చైనా దేశం తయారు చేసింది. అంటే.. ఐదవ సెంచరీలో ైచైనీస్ తత్త్వవేత్తలు మోజీ,లూబాన్ పేపర్ కైట్‌లను ఉపయోగించారని తేలింది. ఈ పేపర్ కైట్లను తమని తాము ప్రమాదం నుంచి రక్షించుకొవడానికి, సమాచారాన్ని పంపించడం కొరకు ఉపయోగించారు. అంతేకాదు, మీడివియల్ అనే జాతి చైనీయులు కైట్లను దూరాన్ని, గాలి వేగాన్ని, మనిషిని ఎత్తడానికి, సిగ్నలింగ్, మిలిటరీ ఆపరేషన్స్ కొరకు ఉపయోగించేవారు. అప్పటి కైట్స్ మందంగా, దీర్ఘచతురవూసకార ఆకారంలో ఉండేవి. భారతదేశంలో ఫైటర్ కైట్‌ను ‘పతంగ్’లా మార్చారు. కైట్లను వింత వింత ఆకారాలలో, తోకలు లేకుండా, తాళ్ళతో కట్టి వింతగా తయారు చేస్తున్నారు. మనదేశంలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు పోటీలను నిర్వహిస్తున్నారు.
300 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కైట్స్ ఫెస్టివల్లో సంప్రదాయ పండగలు, కట్టుబాట్లు అన్నీ కన్పిస్తాయి. ఆసియా : ఆసియాలో.. వాహ్ జాలా బుడి కైట్‌ను తయారు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. వెదురు కట్టడంపై పేపర్‌తో కవరింగ్ చేసి దానిపై వేరువేరు రంగులతో డెకరేట్ చేస్తారు. ఆసియా దేశాల్లో ఈ పండగ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు కైట్ ఫైటింగ్ మొదలౌతుంది. ఫైటర్ కైట్ అంటే కైట్ ఎగరవేసేటప్పుడు ఇంకొకరి కైట్‌ను తెంచడం. ఫైటర్ కైట్స్ చిన్నగా, మందంగా, వజ్రపు ఆకారంలో ఉంటుంది. పేపర్, వెదురు కర్రను ఉపయోగిస్తారు. ఈ కైట్లకు తోకలు పెట్టరు.ఆఫ్ఘానిస్తాన్ : ఆఫ్ఘానిస్తాన్‌లో కైట్ ఎగరవేయడం ఒక సంప్రదాయకమైన ఆటగా భావిస్తున్నారు. ఈ ఆటను ధరి (గుడిపారన్ బాజి) అని అంటారు. ఫైటర్ కైట్‌ను ఎగురవేయడానికి ఉపయోగించే తాళ్ళను గాజుపొడి, గ్లూతో చేస్తారు.
దీనితో పోటీపడేవారి కైట్‌ను కట్ చేయడం చాలా సులభం అవుతుంది. ఈ తాళ్ళు మనుషులకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. తాలిబన్ల చట్టం ప్రకారం ఇతర కారణాల వల్ల కైట్‌ను ఎగురవేయడం నిషేధించారు. పాకిస్థాన్‌లో పతంగి ఎగురవేయడాన్ని ‘గుడి బాజి’ లేదా ‘పతంగ్ బాజి’ అంటారు. వీళ్ళు స్ప్రింగ్ ఫెస్టివల్లో ఈ కైట్‌లను ఎగుర వేస్తారు. దీన్నే జస్‌నే బహారాన్ లేదా బసంత్ అని కూడా అంటారు. వీళ్ళు సంవత్సరం మొత్తం కైట్స్‌ను ఎగురవేస్తారు. కైట్స్ ఫైటింగ్ చాలా కన్నులపండగగా ఉంటుంది. కానీ అర్బన్ సెంటర్స్ ముఖ్యంగా లాహోర్‌లో ఫైటర్స్ కైట్‌తో పోటీ పడిన వారు ఓడిపోతే వారి దగ్గర ఉన్న మారణాయుధాలతో వెంటపడుతూ చాలా సంబరంగా ఎగురవేస్తారు. గాజు పొడితో తయారు చేసిన తాళ్ళతో మాంజాలు వాహనదారులపై పడి ఒకసారి ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి కైట్స్ ఎగురవేయడాన్ని పంజాబ్‌లో నిషేధించారు. వియత్నాంలో తోకలేని పతంగులను ఎగురవేస్తారు. లక్నోలో ఇండియా కైట్స్ ఎంతో ప్రసిద్ధి. వీళ్లు కూడా సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకొంటారు. బీహార్, జార్ఖండ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్ కైట్ ఫైటింగ్‌లో ఆరితేరిన రాష్ట్రాలు. ఉత్తారాయణానికి ముందు వాడోధర, సూరత్, అహ్మదాబాద్‌లో మూడురోజులు పాటు ఈ పతంగులను ఎగురవేస్తారు. బేర్‌ముడా కైట్. వేయ్‌ఫాంగ్, షాన్‌డాంగ్, చైనాలకు కైట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా పేరొచ్చింది. చైనాలో పెద్ద మ్యూజియమ్ ఉంది. ఇందులో వేల కైట్స్‌ను సేకరించి ఉంచారు. జపాన్, యూకే, మలేషియా, ఇండోనేషియా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్‌లోని మాలేస్ కైట్‌లను చేపలు పట్టడానికి ఉపయోగించేవారు.
Take By: T News
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP