Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, March 7, 2011

 http://voice2telangana.blogspot.com/


Navvu Karchu Patte
Prathi Note(Rupees) Meeda
Right Side Unna Gandhi Tho Paatu Left Side
JAI TELANGANA ani Rasina Taruvate Karchu Pettu.

Appudu INDIA Mothaniki Mana Aavedhana Ardham Avutundi.

Plz. Send this SMS to ALL Telangana People....

Don't take It Easy
Take It as Challenge


Jai Telangana

http://voice2telangana.blogspot.com/

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs, NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

మిలియన్‌ మార్చ్‌ వెళితే అరెస్టులు తప్పదు

సిద్దిపేట,తెలంగాణ జేఏసీ 10న నిర్వహించతలపెట్టిన మిలియన్‌మార్చ్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని సిద్దిపేట డిఎస్పీ కోటిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జీవిస్తున్న ప్రజల ప్రజాజీవనానికి భంగం కల్గించటం చట్టవ్యతిరేకమన్నారు. ఆదివారం స్థానిక ఓఎస్‌డీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు,అసెంబ్లీ సమావేశాలు వంటి సమయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజా జీవనానికి ఆటంకం కల్గించవద్దన్నారు. 144 సెక్షన్‌,30యాక్టు అమల్లో ఉందన్నారు. ఎలాంటి సభలు,సమావేశాలు, ర్యాలీలు నిర్వహిం చరాదన్నారు.ఒకవేళ నిర్వహించాల్సి వస్తే ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

సోమవారం నుంచి ప్రతి పది కిలోమీటర్ల చొప్పున చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 20మంది సి బ్బందితో ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. మిలియన్‌ మార్చ్‌లో పా ల్గొనడానికి వెళ్లేవారిని అరెస్టులు చేస్తామన్నారు. ముందస్తు అరెస్టులు తప్పవన్నారు.సిద్దిపేట సబ్‌ డివిజన్‌లో 22 ఇంటర్మీడియన్‌ పరీక్షా కేంద్రాలున్నాయనీ, అందులో 13సెంటర్లు సిద్దిపేటలో ఉన్నా యన్నారు. ప్రతి సెంటర్‌ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. వి ద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Nagam singled out in the assembly

Alleging that Nagam Janardhan Reddy is working on his own agenda, TDP Telangana MLAs have launched a tirade against Nagam in the media. Nagam was the only person who held ‘Jai Telangana’ placards and raised slogans in state assembly today. Speaking at the media, Nagam said that he still abides by the party’s principles but might his own decision if TDP works against the telangana cause. He said that he is not working for his own benefit and that it won’t be proper to attend the assembly sessions when other parties who are fighting for a separate Telangana state have boycotted the house.

Not conferring with his statements, TDP MLA Revanth Reddy said that it is unfortunate to see a few people in the party who became Conveners with their support, are working on their own agenda now. He said that Janardhan Reddy is working on his own agenda now a days and is hurting the reputation of Telugu Desam Party.
Looks like Nagam may not continue in TDP for long. Has Chandrababu opened his third evil eye to eliminate Nagam?

Million March to be held on March 10 itself




After a meeting here in Hyderabad today,  The Telangana Joint Action Committee (TJAC) has decided to go ahead with the Million March to Hyderabad on March 10th it self. Please read the following message and share it with others to make Million March a grand success.




http://www.simplytelangana.com/wp-content/uploads/2011/03/chalo-hyderabad1.jpg http://www.simplytelangana.com/wp-content/uploads/2011/03/chalo-hyderabad2.jpg

 Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images

కాంగ్రెస్‌లో ‘ప్రణబ్‌’ నాదం

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల తెలం గాణ ఆందోళనకు తెర పడినట్టేనా?...సోమవారం నుంచి బుద్ధిమంతుల్లా లోక్‌సభకు హాజరై మౌనం వహిస్తారా?.. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి అదే జరిగేలా కనిపిస్తు న్నది. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తే అటు సమైక్య వాదుల నుంచి తంటాలు ఎదురవుతాయని, ఆ పరిస్థితిని కొని తెచ్చుకునేందుకు హై కమాండ్‌ సిద్ధంగా లేదని కాంగ్రెస్‌లో సోనియా తర్వాత అంతటి నేతగా పేరున్న ప్రణబ్‌ ముఖర్జీ తెలంగాణ వాదులకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల తెలంగాణ ఎంపీలు తనను కలసినప్పుడు ప్రణబ్‌ వారితో కరాఖండిగా పార్టీ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది.

అరచి గీ పెట్టినా....
తనను కలిసేందుకు వచ్చిన ఎంపీలతో ప్రణబ్‌ ఘాటుగా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఎంత అరచి గీ పెట్టినా తెలంగాణ అంశం ప్రస్తుతానికి హై కమాండ్‌ పరిశీలనలో లేదని, రాష్ట్రంలో పార్టీని మళ్ళీ గాడిలో పడవేయటమే హై కమాండ్‌ ముందు ఉన్న ఏకైక అంశం అని ప్రణబ్‌ వారితో తేల్చి చెప్పినట్టు విశ్వ సనీయంగా తెలిసింది. ఈ సందర్భంగా ఒకరిద్దరు ఎంపీలు జోక్యం చేసు కుంటూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ అంత బాహాటంగా పార్టీ నాయకత్వాన్ని ఎదిరించి మాట్లాడుతుంటే ఆయనపై ఏం చర్య తీసుకున్నారని ప్రశ్నించటం, దానితో భగ్గుమన్న ప్రణబ్‌ ఏం చేయాలి? సస్పెండ్‌ చేయమం టారా? అని గద్దించటంతో ఆ ఒకరిద్దరు సైతం మౌనంవహించినట్టు తెలిసింది.

పార్టీ ముఖ్యం....: తెలంగాణపై తేల్చకపోతే జనంలో ముఖమెత్తి తిరిగే పరిస్థితి కనిపించటం లేదని కొందరు ఎంపీలు అన్నప్పుడు సైతం ప్రణబ్‌ వైఖరిలో మార్పు రాలేదు. హై కమాండ్‌కు సంబంధించినంతవరకు పార్టీ మనుగడ ప్రధానం అని, జనంలో ఏమి చెప్పుకుంటారో తమకు సంబంధం లేదని ప్రణబ్‌ ఒకే మాటపై నిలబడ్డారంటున్నారు. ఒకవైపు వైఎస్‌ జగన్‌ పార్టీ ఏర్పాటు చేయనుండటం, అటువైపు ఎవరూ దూకకుండా నిరోధించే పనిలో అధిష్ఠానం తల మునకలై ఉందని, ఇంతటి కీలక దశలో లోక్‌సభలో రోజూ ఇలా అల్లరి చేసి విపక్షాల ముందు పరువు తీసే ఆలోచనకు ముందు స్వస్తి చెప్పాలని ప్రణబ్‌ వారితో అన్నట్టు తెలిసింది.

నేటినుంచి మౌనం?: ప్రణబ్‌ మాటల దెబ్బ ఎంపీలపై బాగానే పని చేసినట్టు కనిపిస్తున్నది. సోమవారం నుంచి సమావేశాలకు హాజరయ్యే తెలంగాణ ఎంపీలు నినాదాలు చేయటం, రిబ్బన్లు కట్టుకోవటం వంటి వాటికి దూరంగా ఉండే అవకాశం ఉందని సీమాంధ్ర ప్రాంత ఎంపీలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎంపీలు తమ వైఖరి మార్చుకోకపోతే తాము సైతం సమైక్యగళం విప్పాల్సి వస్తుందని, ఎటొచ్చీ అధినాయకత్వానికే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని వారు వ్యాఖ్యానించారు.
Tag: AP. News, RajNews, hmtv, KCR, Telangana, Telangana News, Sexy, Hot Images,  

విరమణా.. వాయిదా ?

‘ప్రభుత్వ హామీతో ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణ విరమణ’
‘పార్లమెంటు సమయంలో తిరిగొచ్చిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌’
‘విద్యార్థుల తలిదండ్రులు మిలియన్‌ మార్చ్‌ వాయిదా వేయమని అడుగుతున్నారు. జేఏసీలో చర్చించి నిర్ణయిస్తాం’
‘మే వరకూ కాంగ్రెస్‌ తెలంగాణపై ఆలోచించే అవకాశం లేనందున సహాయ నిరాకరణను విరమించు కోండంటూ ఉద్యోగ సంఘాల జాక్‌ నేతలకు కేసీఆర్‌ సూచన’
telagns- ఈ పరిణామాలు పరిశీలిస్తే.. తెలంగాణ ఉద్యమానికి విరామమా? కొంతకాలం విరమణా అన్న ప్రశ్నలు సహజంగానే తెరపై కొస్తున్నాయి. వ్యూహాత్మకంగా జరిగిపోతున్న పరిణామాలపై తెలంగాణ ఉద్యమ సంస్థలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిర్ణయాలు, ప్రకటనలు కొందరికే పరిమితం అవుతున్న వైనం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించిన టీఆర్‌ఎస్‌ అధ్య క్షుడు కేసీఆర్‌, ఆ ప్రక్రియను కొనసాగించకుండా హఠాత్తుగా హైదరాబాద్‌ తిరిగి రావడం చర్చనీయాంశ మయింది. దానికి తోడు.. మే వరకూ తెలంగాణపై కాంగ్రెస్‌లో కదలిక వచ్చే అవకా శం లేదని, స్వయంగా కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల జాక్‌ నేతలతో ఫోన్‌లో చెప్పిన వైనం అనేక అనుమానాలకు తావిస్తోంది.

దీన్నిబట్టి.. తెలంగాణ అంశంపై కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతం, సమాచారం వచ్చినట్లు తెలంగాణ ఉద్యమ వర్గాలు భావిస్తున్నాయి. మే వరకూ కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణ అంశాన్ని పక్కకుపెట్టిందన్న అనుమానా లు ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నం దున అప్పటివరకూ కాంగ్రెస్‌ నాయకత్వం తెలం గాణ గురించి ఆలోచించే ప్రశ్నే లేదని కాంగ్రెస్‌ నాయకత్వం తమ పార్టీ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రణబ్‌ ముఖర్జీ సైతం తనను కలసిన తెలంగాణ ఎంపీలతో తెలంగాణ అంశం ఇప్పట్లో సమస్య పరిష్కారం కాదని, వచ్చే ఎన్నికల వరకూ ప్రజలకు మీరే ఏదో ఒకటి చెప్పుకోండని స్పష్టం చేశారు. చిదంబరం అయితే తెలంగాణ సమస్య ఒక్క రాత్రికే పరిష్కారం కాదని వ్యాఖ్యనించడం బట్టి కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణపై ఇప్పట్లో దృష్టి సారించే అవకాశం లేదని అర్ధమవుతోందని తెలంగాణ వర్గాలు వివరిస్తున్నాయి.

పార్లమెంటులో తెలంగాణ గురించి డిమాండ్‌ చేసిన కేసీఆర్‌, తెలంగాణ ఇచ్చే శక్తి ఉన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సభలోనే ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఆమెను విమర్శించకపోవడం ప్రస్తావనార్హం. బీజేపీ సీనియర్లు తనకు తెలంగాణ అంశంలో దన్నుగా నిలిచినప్పటికీ, దానిని వినియోగించుకుని సోనియాపై విరుచుకుపడక పోవడాన్ని తెలంగాణ ఉద్యమ సంఘాల నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ను విమర్శి స్తున్న కేసీఆర్‌, ఆ పార్టీ అధినేత్రిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదని, దీనిని బట్టి తెలంగాణపై కాంగ్రెస్‌ ఆలోచనా ధోరణికి సంబంధించి కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఉందని స్పష్టమవుతోందంటున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణను విరమించడం చర్చనీయాంశమ యింది. ఇది మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత, నిరసనకు దారితీసింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సహాయ నిరాకరణను విరమించమని కేసీఆర్‌ తమను కోరారని ఉద్యోగ సంఘాల జాక్‌ నేతలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఈ విధంగా ఎందుకు కోరవలసి వచ్చిందన్న అనుమానాలు కూడా ఉద్యమ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఆ మేరకు కేసీఆర్‌కు ఏమయినా సంకేతాలు పంపిందా? సహాయ నిరారణ విరమణపై కాంగ్రెస్‌ కేసీఆర్‌ సాయం అర్ధించిందా? ఆ మేరకు ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడకూడదన్న భావనతో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు వారి నుంచి వినిపిస్తున్నాయి. అయితే, పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులతో కలసి ఆందోళన చేస్తామని ఉద్యోగ జేఏసీ నేతలు చెప్పిన దాని ప్రకారం.. సహాయ నిరాకరణకు విరామం మాదిరిగానే, 10న మిలియన్‌ మార్చ్‌ కూడా విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోమవారం జరగనున్న జాక్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించనున్నారు. విద్యార్థుల తలిదండ్రులు మిలియన్‌ మార్చ్‌ను వాయిదా వేయమని తమను అభ్యర్ధించారని, తాను జేఏసీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీనితో మిలియన్‌ మార్చ్‌ కూడా విరమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ కేసీఆర్‌ ఆదేశాల మేరకే రాజకీయ జేఏసీ నడుస్తున్నందున పరీక్ష రోజు జరిగే మిలియన్‌ మార్చ్‌ కూడా విరమణ అయ్యే అవకాశాలున్నాయి. మిలియన్‌ మార్చ్‌రోజు ఇంటర్‌ పరీక్ష ఉన్నందున, దానిని సజావుగా జరిపేందుకు మార్చ్‌ను వాయిదా వేయాలని ఇప్పటికే అన్ని పార్టీలు, ప్రభుత్వం కోరింది.

ఈ క్రమంలో.. భవిష్యత్తులో తెలంగాణ ఉద్య మం ఇక చల్లబడుతుందన్న సంకేతాలు స్పష్టమవు తున్నాయి. మే వరకూ తెలంగాణపై ఎలాంటి ఉద్య మాలు నిర్వహించినా ఫలితం ఉండదని కేసీఆర్‌ భావిస్తున్నట్లు ఆయన వ్యవహారశైలి స్పష్టం చేస్తోం ది. అదే సమయంలో ఉద్యమం వల్ల ప్రభుత్వం ఇబ్బందిపడకూడదన్న ధోరణి కూడా ఆయన మాటల్లో కనిపిస్తోంది. కేసీఆర్‌ పైకి.. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నప్పటికీ ఆ పార్టీ అధినేత్రిని మాత్రం ఇప్పటివరకూ ఒక్కమాట కూడా అనకపోవడం కూడా తెలంగాణ ఉద్యమ సంఘాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆరా? ప్రజలా ?
kcr-sad(సూర్య ప్రధాన ప్రతినిధి)తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ వంతు పోరాటాలు చేస్తున్న ఉద్యోగ, విద్యార్థి వర్గాల జేఏసీలు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను వణికించిన ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం హటాత్తుగా నిలిపివేయడానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సూచనే కారణమని తెలంగాణ ఉద్యోగుల జాక్‌ నేతలు తాజాగా స్పష్టం చేశారు. ఫలితంగా ఆయా సంఘాల్లో భాగస్వాములుగా ఉన్న మిగిలిన సంఘాల ఉద్యోగులు తమ జాక్‌ నేతల దిష్టిబొమ్మలు తగులబెట్టడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఉద్యోగుల్లో చీలిక వచ్చిందనే సంకేతాలు పంపడంతో ఇకపై ఉద్యమాలు-విరమణ సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై జేఏసీలలో ఆత్మపరిశీలన మొదలయింది.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేసిన తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమం చివరకు ఢిల్లీ వరకూ చేరింది. బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ సైతం రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారంటూ పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ క్రమంలో ప్రభుత్వం కూడా డైలమాలో పడింది. ఉద్యోగుల సహాయ నిరాకరణ ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి, గవర్నర్‌, మంత్రులకు సైతం జీతాలు రాని దుస్థితి ఏర్పడింది. ఆ రకంగా తెలంగాణ ఉద్యోగులు తమ సత్తా చాటారు. తాము తలచుకుంటే ప్రభుత్వం ఏ స్థితికి చేరుతుందనేది అనుభవపూర్వకంగా తెలియచేశారు. రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఉద్యోగ సంఘాలు చేసిన ఈ నిరసన తొలిసారి అన్ని వర్గాలపైనా ప్రభావం చూపింది.

అయితే, ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఉద్యోగ సంఘాల జాక్‌ నేతలు అమ్ముడుపోయారంటూ స్వామిగౌడ్‌, శ్రీనివాసగౌడ్‌, సి.విఠల్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటు.. ఉద్యోగ సంఘాలలో ఉన్న ఉద్యోగులే వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి, చెప్పులతో కొట్టి, ఊరేగించిన వైనం ఉద్యోగుల్లో తిరుగుబాటుకు దారితీసింది. సర్కారుతో చర్చలు జరిపిన నేతలు కేసీఆర్‌కు అమ్ముడుపోయారంటూ జాక్‌ నేతలతో వాగ్వాదానికి దిగడంతో పాటు, రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామిరెడ్డిని కూడా చుట్టుముట్టారు.

కాగా, సహాయ నిరాకరణను విరమించుకోవాలని కేసీఆరే తమను స్వయంగా కోరారని, ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌ శుక్రవారం తమతో ఫోన్‌లో మాట్లాడారని జాక్‌ నేతలు వెల్లడించారు. మే వరకూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై స్పందించే అవకాశం లేనందున ఆ తర్వాత తలెత్తే సమస్యల దృష్ట్యా అప్పటివరకూ సహాయ నిరాకరణ విరమించుకోవాలని కేసీఆర్‌ తమకు సూచించినట్లు జాక్‌ నేతలు స్వయంగా మీడియాకు వివరించారు. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత మళ్లీ నిరాకరణకు నోటీసు ఇవ్వాలనే విరమణ ప్రకటన చేశామని, అందుకు స్టీరింగ్‌ కమిటీ కూడా అంగీకరించిందని జాక్‌ నేతలు వెల్లడించారు.

ఇది వివిధ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఉద్యోగుల తిరుగుబాటు, నేతల దిష్టిబొమ్మల దగ్ధం పరిణామాల నేపథ్యంలో.. ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి, కేసీఆర్‌కు సంబంధం ఏమిటి? కేసీఆర్‌ ఆదేశాలను జాక్‌ పాటించవలసిన అవసరం ఏమిటి? జాక్‌కు స్వతంత్ర ప్రతిపత్తి లేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొచ్చాయి.జాక్‌ నేతలకు కేసీఆర్‌ ఫోన్‌ చేసి, సహాయ నిరాకరణను విరమించాలని కోరడం, ఆ తర్వాత జాక్‌ నేతలు నిరాకరణను విరమించడం చూస్తే.. కేసీఆర్‌ దిశానిర్దేశంలోనే జాక్‌ నడుస్తోందన్న వాస్తవం స్పష్టమవుతోందని తెలంగాణ ప్రజాసంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈనెల 10న తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ కూడా వాయిదా వేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోందంటున్నారు. విద్యార్థుల తలిదండ్రులు పరీక్షలు వాయిదా వేయవద్దని కోరుతున్నారంటూ తాజాగా కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య పరిశీలిస్తే మిలియన్‌ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కేసీఆర్‌ ఈపాటికే జాక్‌కు ఆదేశాలు ఇచ్చి ఉంటారన్న వ్యాఖ్యలు ప్రజాసంఘాలలో వ్యక్తమవుతోంది.

అటు.. కొన్ని విద్యార్థి జేఏసీలు కూడా టీఆర్‌ఎస్‌ ఆదేశాల మేర కే నడుచుకుంటున్నాయన్న విమర్శలు తెలంగాణ ప్రజాసంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కొన్ని విద్యార్థి సంఘాల నాయకులను టీఆర్‌ఎస్‌ ప్రభావితం చేస్తోందని, అందుకే బందులు, నిరసన కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ఖరారు చేసిన తర్వాతే తేదీలను ప్రకటిస్తోందని స్వతంత్ర జేఏసీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇప్పటికే రాజకీయ జేఏసీ కేసీఆర్‌కు తొత్తుగా మారిందని, టీఆర్‌ఎస్‌ ఎన్ని తప్పులు చేసినా దానిని ప్రశ్నించడంలో కోదండరామిరెడ్డి విఫలమయ్యారని, స్వయంగా కోదండరామిరెడ్డి పేరు టీఆర్‌ఎస్‌ డైరీలో పొలిట్‌బ్యూరో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కోదండరామిరెడ్డి వ్యవహారశైలిపై అటు బీజేపీ కూడా అసంతృప్తితోనే ఉంది. కాంగ్రెస్‌ అధినే త్రి సోనియాగాంధీని ఎందుకు విమర్శించడం లేదని, ఆ మేరకు కేసీఆర్‌పై కోదండరామిరెడ్డి ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.తాజాగా, ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని నిలిపివేయడంపై క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, విద్యార్ధుల జేఏసీలలో వ్యతిరేకత మొదలయింది.

ఈ పరిణామాలు అటు ఉద్యోగుల జాక్‌ నేతలలోనూ ఆత్మవిమర్శ దిశగా అడుగులు వేయిస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదని, తాము సహ ఉద్యోగుల దృష్టిలో చెడ్డవారిగా ముద్రవేసుకునేవారం కాదని మదనపడుతున్నారు. తమ సహాయ నిరాకరణకు మద్దతు ప్రకటించి ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహించిన విద్యర్థి జాక్‌లతో కూడా చర్చించి ఉంటే బాగుండేదని ఇప్పుడు భావిస్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి సాధించకుండా, మరొకరిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇకపై కేసీఆర్‌ ఆదేశాలను పాటించకూడదన్న ఒత్తిడి కూడా మొదలయింది.

ప్రధానంగా.. కేసీఆర్‌ సహాయ నిరాకరణను విరమించమని కోరారన్న విషయాన్ని అంగీకరించడం వల్ల.. తెలంగాణ జాక్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదన్న వాస్తవం తెలిసిపోయిందన్న సంకేతాలు ప్రజలకూ వెళ్లాయి. దీనివల్ల జాక్‌ల మనుగడను కేసీఆరే నిర్దేశిస్తున్నారు తప్ప, జాక్‌లు కాదన్న విషయం కూడా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎదురవుతున్న చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తులో కూడా కేసీఆర్‌ ఆదేశాలు పాటించాలా? లేక సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలా అన్న అంశంపై జాక్‌ నేతల్లో ఆత్మపరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. మూడు జిల్లాల్లో ఎదురయిన తిరుగుబాటు పరిణామాలను చవిచూసిన కొందరు జాక్‌ నేతలు ఇకపై కేసీఆర్‌తో సంబంధం లేకుండా వ్యవహరించాలని, టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి కూడా వెళ్లకూడదని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్‌కు తోకలుగా మారవద్దు
Jayaprasadffఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణ వల్ల ప్రభుత్వం పూర్తి స్థాయి లో దిగివచ్చి, తెలంగాణ పై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే సమయంలో ఉద్యమాన్ని విరమించ డం ఆత్మహత్యా సదృశ మని తెలంగాణ బీసీ ఫ్రం ట్‌ కన్వీనర్‌, తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కస్తూరి జయప్రసాద్‌ వ్యాఖ్యానించారు. స్వతంత్రంగా వ్యవహ రించవలసిన ఉద్యోగ, విద్యార్థి సంఘాల జాక్‌లు తెలం గాణ భవన్‌కు వెళ్లి, కేసీఆర్‌ ఆదేశాలు పాటించడం వల్లే ప్రజల్లో జాక్‌లపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఉద్య మ సంఘాలు కేసీఆర్‌కు తోకలుగా మారవద్దని, మారి తే ప్రజల్లో ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయన్నారు. ఉద్యోగుల తిరుగుబాటును జాక్‌లు ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు. జాక్‌లలో ఉన్న బీసీ నేతలు కేసీఆర్‌ కు తొత్తులుగా వ్యవహరించొద్దని, అగ్రకులాల అడుగు లకు మడుగులొత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

ఎందుకీ పరాధీవత ?
Narra-Jayalakshmఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమంతో కేంద్రం దిగివచ్చే సమ యంలో ఆ వాతావర ణాన్ని కేసీఆర్‌ చెడగొట్టా రని తెలంగాణ డెమో క్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షు రాలు నర్రా జయలక్ష్మి విమర్శించారు. తాజా పరిణామాలు ఉద్యోగ నేత పరాధీనతను చాటాయ న్నారు. సహాయ నిరాకరణ విమరించే సందర్భంలో ఉద్యోగ జాక్‌ నేతలు తెలంగాణ ప్రజాసంఘాలు, పార్టీలతో ఎందుకు సంప్రదించలేదని ఆమె ప్రశ్నిం చారు. కేసీఆర్‌ ఆదేశాలను పాటించి నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు ఇంతకు మించి భిన్నంగా ఉండవని స్పష్టం చేశారు. ఉద్యోగుల నిరసనలను బట్టి వారిలో కేసీఆర్‌పై ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉందో అర్ధమవుతోందన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా తెలంగాణపై పోరాడవలసిన కేసీఆర్‌ హైదరాబాద్‌ ఎందుకు వచ్చారని ఆమె నిలదీశారు.


Tag: AP. News, RajNews, hmtv, KCR, Telangana, Telangana News, Sexy, Hot Images,  
take By: Suryaa

About This Blog

తెలుగు బ్లాగుల

my blog directory

Free Counters
CashAdvanceHelp

Total Blog Directory Submit Blog & RSS Feeds
Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!
Submit your website to 20 Search Engines - FREE with ineedhits!
You have not participated at the forum. Use the forum before you use this widget!
Make Money Blogging

Blog Directory Blog Topsites
Submit Blog
Blogs Blog Tools Allie Marie

Blogs Directory


Blog Directory

Blogger Help Templates Widgets SEO Tips Submit Site to Google Link building 

packages
Search engine submissions Politics
billiga hotellrum london Wutzle My Blog!

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service.
Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP