కాంగ్రెస్‌లో ‘ప్రణబ్’ నాదం
హైదరాబాద్, మేజర్ న్యూస్: రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల తెలం గాణ ఆందోళనకు తెర పడినట్టేనా?...సోమవారం నుంచి బుద్ధిమంతుల్లా లోక్‌సభకు హాజరై మౌనం వహిస్తారా?.. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి అదే జరిగేలా కనిపిస్తు న్నది. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తే అటు సమైక్య వాదుల నుంచి తంటాలు ఎదురవుతాయని, ఆ పరిస్థితిని కొని తెచ్చుకునేందుకు హై కమాండ్ సిద్ధంగా లేదని కాంగ్రెస్‌లో సోనియా తర్వాత అంతటి నేతగా పేరున్న ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వాదులకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల తెలంగాణ ఎంపీలు తనను కలసినప్పుడు ప్రణబ్ వారితో కరాఖండిగా పార్టీ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది.
అరచి గీ పెట్టినా....
తనను కలిసేందుకు వచ్చిన ఎంపీలతో ప్రణబ్ ఘాటుగా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఎంత అరచి గీ పెట్టినా తెలంగాణ అంశం ప్రస్తుతానికి హై కమాండ్ పరిశీలనలో లేదని, రాష్ట్రంలో పార్టీని మళ్ళీ గాడిలో పడవేయటమే హై కమాండ్ ముందు ఉన్న ఏకైక అంశం అని ప్రణబ్ వారితో తేల్చి చెప్పినట్టు విశ్వ సనీయంగా తెలిసింది. ఈ సందర్భంగా ఒకరిద్దరు ఎంపీలు జోక్యం చేసు కుంటూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ అంత బాహాటంగా పార్టీ నాయకత్వాన్ని ఎదిరించి మాట్లాడుతుంటే ఆయనపై ఏం చర్య తీసుకున్నారని ప్రశ్నించటం, దానితో భగ్గుమన్న ప్రణబ్ ఏం చేయాలి? సస్పెండ్ చేయమం టారా? అని గద్దించటంతో ఆ ఒకరిద్దరు సైతం మౌనంవహించినట్టు తెలిసింది.
పార్టీ ముఖ్యం....: తెలంగాణపై తేల్చకపోతే జనంలో ముఖమెత్తి తిరిగే పరిస్థితి కనిపించటం లేదని కొందరు ఎంపీలు అన్నప్పుడు సైతం ప్రణబ్ వైఖరిలో మార్పు రాలేదు. హై కమాండ్‌కు సంబంధించినంతవరకు పార్టీ మనుగడ ప్రధానం అని, జనంలో ఏమి చెప్పుకుంటారో తమకు సంబంధం లేదని ప్రణబ్ ఒకే మాటపై నిలబడ్డారంటున్నారు. ఒకవైపు వైఎస్ జగన్ పార్టీ ఏర్పాటు చేయనుండటం, అటువైపు ఎవరూ దూకకుండా నిరోధించే పనిలో అధిష్ఠానం తల మునకలై ఉందని, ఇంతటి కీలక దశలో లోక్‌సభలో రోజూ ఇలా అల్లరి చేసి విపక్షాల ముందు పరువు తీసే ఆలోచనకు ముందు స్వస్తి చెప్పాలని ప్రణబ్ వారితో అన్నట్టు తెలిసింది.
నేటినుంచి మౌనం?: ప్రణబ్ మాటల దెబ్బ ఎంపీలపై బాగానే పని చేసినట్టు కనిపిస్తున్నది. సోమవారం నుంచి సమావేశాలకు హాజరయ్యే తెలంగాణ ఎంపీలు నినాదాలు చేయటం, రిబ్బన్లు కట్టుకోవటం వంటి వాటికి దూరంగా ఉండే అవకాశం ఉందని సీమాంధ్ర ప్రాంత ఎంపీలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎంపీలు తమ వైఖరి మార్చుకోకపోతే తాము సైతం సమైక్యగళం విప్పాల్సి వస్తుందని, ఎటొచ్చీ అధినాయకత్వానికే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని వారు వ్యాఖ్యానించారు.
Tag: AP. News, RajNews, hmtv, KCR, Telangana, Telangana News, Sexy, Hot Images,
0 comments:
Post a Comment