మిలియన్ మార్చ్ వెళితే అరెస్టులు తప్పదు
సిద్దిపేట,తెలంగాణ జేఏసీ 10న నిర్వహించతలపెట్టిన మిలియన్‌మార్చ్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని సిద్దిపేట డిఎస్పీ కోటిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జీవిస్తున్న ప్రజల ప్రజాజీవనానికి భంగం కల్గించటం చట్టవ్యతిరేకమన్నారు. ఆదివారం స్థానిక ఓఎస్‌డీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నేటి నుంచి ఇంటర్ పరీక్షలు,అసెంబ్లీ సమావేశాలు వంటి సమయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజా జీవనానికి ఆటంకం కల్గించవద్దన్నారు. 144 సెక్షన్,30యాక్టు అమల్లో ఉందన్నారు. ఎలాంటి సభలు,సమావేశాలు, ర్యాలీలు నిర్వహిం చరాదన్నారు.ఒకవేళ నిర్వహించాల్సి వస్తే ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
సోమవారం నుంచి ప్రతి పది కిలోమీటర్ల చొప్పున చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 20మంది సి బ్బందితో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. మిలియన్ మార్చ్‌లో పా ల్గొనడానికి వెళ్లేవారిని అరెస్టులు చేస్తామన్నారు. ముందస్తు అరెస్టులు తప్పవన్నారు.సిద్దిపేట సబ్ డివిజన్‌లో 22 ఇంటర్మీడియన్ పరీక్షా కేంద్రాలున్నాయనీ, అందులో 13సెంటర్లు సిద్దిపేటలో ఉన్నా యన్నారు. ప్రతి సెంటర్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. వి ద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment