మోడల్ స్కూళ్లలో ఖాళీలు-12351 - స్పెషల్ డీఎస్సీ ద్వారా నియామకం (DSC / TET)
మోడల్ స్కూళ్లలో ఖాళీలు-12351 - 7,100 పోస్టులు స్పెషల్ డీఎస్సీ ద్వారా నియామకం
- 5074 పోస్టులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో..
- 176 పోస్టులు డిప్యు భర్తీ
- ఆర్థిక శాఖ అనుమతి
హైదరాబాద్, డిసెంబర్ 3 (): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 355 మోడల్ స్కూళ్ళలో 12,351 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 7,100 ఉపాధ్యాయ పోస్టులు కాగా, మిగిలినవి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.
టీచింగ్ పోస్టుల భర్తీకి త్వరలో స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.
మిగిలిన 5, 074 నాన్‌టీచింగ్ కేటగిరీ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిన,
174 పోస్టులు శాఖాపరమైన డిప్యు ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది.
రాష్ట్ర స్థాయిలో మోడల్ స్కూల్స్‌కు అదనపు డైరెక్టర్ నియామకంతో పాటు 39 కొత్త పోస్టులను డిప్యు ద్వారా భర్తీ చేయనున్నారు.
జిల్లా స్థాయిలో 138 కొత్త పోస్టులను డిప్యు ద్వారా నియమించనున్నారు.
ప్రిన్సిపల్స్ - 355
పీజీ టీచర్స్ - 4260
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ - 2485
ఔట్ సోర్సింగ్ విధానంలో ..రాష్ట్రస్థాయిలో...
కన్సప్టూంట్ - 2
కంప్యూటర్ ప్రోగ్రామర్ - 1
జాయింట్ స్టెనోక్షిగాఫర్ - 1
డాటా ఎంట్రీ ఆపరేటర్ - 4
ఆఫీస్ సబార్డినేట్ - 4
--------------------------------------------------------------------------------
కంప్యూటర్ ప్రోగ్రామర్ - 23
డాటా ఎంట్రీ ఆపరేటర్ - 23
ఆఫీస్ సబార్డినేట్ - 23
స్కూల్ లెవల్...
ఫిజికల్ డైరెక్టర్స్ - 355
యోగా టీచర్స్ - 355
ఆర్ట్ టీచర్స్ - 355
ఎస్‌యూపీడబ్ల్యూ టీచర్స్ - 355
కంప్యూటర్ టీచర్స్ - 355
లైబ్రేరియన్స్ - 355
క్లర్క్ కం అకౌంటెంట్ - 355
జూనియర్ అసిస్టెంట్ - 355
ఆఫీస్ సబార్డినేట్స్ - 1420
వాచ్‌మెన్ - 710
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, DSC, outsourcing, outsourcing Jobs, AP Jobs, AP govt jobs,
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)



(హైదరాబాద్):ఇంకా స్పష్టత రాని రాజకీయ లెక్కలు కిరణ్ సర్కారును కూల్చేస్తాయా? జగన్ మంతనాలు ఏ మేరకు ఫలిస్తాయి? చిరంజీవి అసంతృప్తి టీ కప్పులో తుఫానేనా? తెలంగాణవాదులందరూ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కేసీఆర్ పిలుపు ప్రభావమేంటి? అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా? ప్రభుత్వాన్ని కాపాడుకునే యత్నంలో కాంగ్రెస్ సఫలీకృతమవుతుందా?
నల్లగొండ, :తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సోయి ఉన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కిరణ్ సర్కార్‌ను కూల్చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు కాసో జు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నిజమైన తెలంగాణ బిడ్డలుగా నిలబడాలి. ఇప్పుడు మనం పులి మీద స్వారీ చేస్తున్నాం, దిగితే పులి మింగివేస్తుంది. ఉద్యమంపై ఏ మాత్రం వెనకడుగు వేసినా సీమాంధ్ర ప్రభుత్వం మనల్ని దోచుకుంటుంది. ప్రజా వైద్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ జై తెలంగాణ అన్నందుకు పీడీ యాక్టు, నాసా కింద కేసులు నమోదు చేశారు. నల్లచట్టాలు అమలుచేస్తున్న నల్లారి కిరణ్‌కుమార్ సర్కార్‌ను కూల్చేయాల్సిందే. ఓ డాక్టర్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే కాంగ్రెస్ జిల్లా నాయకులు సిగ్గుపడాలి. నాలుగున్నర కోట్ల ప్రజలు జై తెలంగాణ అంటున్నారు, ఎంత మందిని జైల్లో పెడతారో పెట్టండి. 11 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ హింసా మార్గంలోకి వెళ్లలేదు. ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాధతో కడుపు మండి బస్సులపై రాళ్లు విసిరితే నల్లచట్టాలతో కేసులు పెట్టి సర్కారు వేధిస్తోంది. రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంవూతులు మారినా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఈ సమస్యకు పరిష్కారం. తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరును తెలంగాణలో ఏదో ప్రాజెక్టుకు, రహదారికి పెట్టాలన్న సోయి మన ఎమ్మెల్యేలకు లేదు. సీఎంను చూస్త్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లాగులు తడుస్తున్నాయి. తెలంగాణలో ఏ ప్రాజెక్టుకైనా పేరు పెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి అర్హులు. ప్రజలు సంఘటితమై పోరాడి తెలంగాణ సాధించుకుందాం.’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
సోమవారం అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఇది తెగదెంపుల సమరం, చరివూతలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇది సువర్ణావకాశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో, లేక ఆంధ్ర సర్కాకు అండగా నిలుస్తారో తేల్చుకోవాల్సిన సమయమిది. తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని చెప్పుకున్న నేతలంతా అవిశ్వాసంలో తెలంగాణ పక్షాన నిలబడాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలి. జేఏసీ, కులసంఘాలు, తెలంగాణవాదులు ఎవరికి వారే పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలపై ఒత్తిడి తేవాలి. చరివూతలో కీలకమైన సందర్భంలో మనమంతా ఉద్యమించాలి. శ్రీకాంత్‌చారిలా ఆత్మబలిదానాలు అవసరం లేదు, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తేచాలు. జీవితంలో తిరిగి రానిది ఒక్క ప్రాణమే, దాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన శ్రీకాంతాచారి ఈ తరానికి ఆదర్శనీయుడు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (): అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న వేళ.. కాంగ్రెస్‌లో విలీనమైన పీఆర్పీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అధికార పార్టీ తమను గడ్డిపోచల్లా చూస్తున్నదని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విషయంలో పునరాలోచన చేస్తామని హెచ్చరించారు. తమ నాయకుడు చిరంజీవికి సైతం ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి గుర్తింపునూ ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసతీర్మానంపై గట్టెక్కేందుకు జగన్ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ను ఉరుములేని పిడుగులా వచ్చిన పడిన ఈ వ్యవహారం కలవరపెట్టింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేసిన సందర్భంగా కనీసం మూడు మంత్రి పదవులతో పాటు చిరంజీవికి రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఉత్తమ స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ఇంత వరకూ ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే సరైన సమయమని పీఆర్పీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని సమాచారం.
కాంగ్రెస్ నుంచి గెలిచి జగన్ గూటికి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే వారికి కోట్ల రూపాయల పనులు ఇస్తున్నారని, గౌరవంగా ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎలాంటి షరతు లేకుండా విలీనమైన తమకు కనీస విలువ ఇవ్వడం లేదని చిరంజీవి వద్ద వాపోయారు. తమ నేత అమాయకుడని, చంద్రబాబులాగా ఎత్తుగడలు వేయలేడని, అందుకే తమను ఆడుకుంటున్నారని ఒక నేత అన్నారు. తొందరపడి విలీనం చేసినట్లు వాపోయారు. మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చిరంజీవి కూడా వారి వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తరువాత పీఆర్‌ఎల్‌పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన చిరంజీవి తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తమ మద్దతుతోనే ప్రభుత్వం మనగలుగుతోందని అన్నారు. తమ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. చిరంజీవి చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్‌లో కలవరం కలిగించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రపంచ దేశాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తున్న వికీలీక్స్ వచ్చే ఏడాది భారత్‌లో సంచలనం సృష్టించనుంది. భారతీయలు స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనం గుట్టురట్టు చేస్తానని వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజే వెల్లడించారు. ప్రస్త్తుతం బ్రిటన్ గృహ నిర్బంధనంలో ఉన్న అసాంజే.. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో వీడియో కాన్ఫన్స్ ద్వారా మాట్లాడారు. భారత స్విస్ ఖాతాదారుల సమాచారంకు సంబంధించిన సీడీ తన దగ్గర ఉందని, దీనిని వికీలీక్స్‌కు రహస్య సమాచారాన్ని సేకరించి పంపుతున్న రుడాల్ఫ్ ఎల్మర్ తనకు అందించారని తెలిపారు. అయితే ఎల్మర్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని, ఈ సంకట పరిస్థితిలో నల్లధన ఖాతాదారుల పేరును తాను బయటపట్టలేనని తెలిపారు. తమ మనుషుల్ని కాపాడుకోవడమే ఇప్పుడు ముఖ్యమని వ్యాఖ్యానించార. కానీ వచ్చే ఏడాదిలో ఏదో ఒకరోజు కచ్చితంగా భారత నల్లధన ఖాతాదారుల పేర్లు బయటపెడతానని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. కొన్ని దేశాల నిఘా సంస్థలు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని ఈ మెయిల్స్, ఇంటర్‌నెట్ లావాదేవీల సేకరిస్తున్నాయని, అనంతరం వాటిని వాల్‌మార్ట్ లాంటి బడా కంపెనీలకు చేరవేస్తున్నాయని వెల్లడించారు. ఈ పద్ధతిలో సమాచారాన్ని సేకరించే అమెరికాకు చెందిన ఎన్‌టీఆర్‌ఓ(అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ) వలే భారత్‌లో కూడా ఓ సంస్థ ఉందని, అది ఇస్లామిక్ ఉగ్రవాదంపై నిఘాపేరిట ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి వ్యవస్థలను వాల్‌మార్ట్, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్‌లాంటి కంపెనీలకు ఆర్థిక సమాచారాన్ని సమకూర్చి పెట్టేందుకే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.






















