భారత నల్లధనం ఖాతాదారుల గుట్టురట్టు చేస్తా!
- వచ్చే ఏడాది ఎప్పుడైనా అకౌంట్ల వివరాలు విడుదల
-జాతీయ భద్రత పేరిట ఈమెయిళ్లు, ఇంటర్‌నెట్ లావాదేవీలపై ‘నిఘా’
- వాల్‌మార్ట్ వంటి సంస్థలకు చేరవేత
- ఇదేపనిలో భారత నిఘా సంస్థ ‘రా’
- సీబీఐ వివరాలను చైనా లాగేస్తోంది
- ‘సై్ప ఫైల్’ పేరుతో వాటిని బయటపెడతా
- ‘హెచ్‌టీ’ సదస్సులో వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రపంచ దేశాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తున్న వికీలీక్స్ వచ్చే ఏడాది భారత్‌లో సంచలనం సృష్టించనుంది. భారతీయలు స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనం గుట్టురట్టు చేస్తానని వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజే వెల్లడించారు. ప్రస్త్తుతం బ్రిటన్ గృహ నిర్బంధనంలో ఉన్న అసాంజే.. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో వీడియో కాన్ఫన్స్ ద్వారా మాట్లాడారు. భారత స్విస్ ఖాతాదారుల సమాచారంకు సంబంధించిన సీడీ తన దగ్గర ఉందని, దీనిని వికీలీక్స్‌కు రహస్య సమాచారాన్ని సేకరించి పంపుతున్న రుడాల్ఫ్ ఎల్మర్ తనకు అందించారని తెలిపారు. అయితే ఎల్మర్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని, ఈ సంకట పరిస్థితిలో నల్లధన ఖాతాదారుల పేరును తాను బయటపట్టలేనని తెలిపారు. తమ మనుషుల్ని కాపాడుకోవడమే ఇప్పుడు ముఖ్యమని వ్యాఖ్యానించార. కానీ వచ్చే ఏడాదిలో ఏదో ఒకరోజు కచ్చితంగా భారత నల్లధన ఖాతాదారుల పేర్లు బయటపెడతానని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. కొన్ని దేశాల నిఘా సంస్థలు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని ఈ మెయిల్స్, ఇంటర్‌నెట్ లావాదేవీల సేకరిస్తున్నాయని, అనంతరం వాటిని వాల్‌మార్ట్ లాంటి బడా కంపెనీలకు చేరవేస్తున్నాయని వెల్లడించారు. ఈ పద్ధతిలో సమాచారాన్ని సేకరించే అమెరికాకు చెందిన ఎన్‌టీఆర్‌ఓ(అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ) వలే భారత్‌లో కూడా ఓ సంస్థ ఉందని, అది ఇస్లామిక్ ఉగ్రవాదంపై నిఘాపేరిట ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి వ్యవస్థలను వాల్‌మార్ట్, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్‌లాంటి కంపెనీలకు ఆర్థిక సమాచారాన్ని సమకూర్చి పెట్టేందుకే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జాతీయ, ప్రైవేటు ఏజెన్సీలు సేకరించిన సమాచారాన్ని వాటి ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని తెలిపారు. అయితే ఇలాంటి సమాచారాన్ని పొందినందుకు కంపెనీలు ఏమైనా చెల్లిస్తున్నాయా? లేదా? అనేదానికి తన దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవని వెల్లడించారు. ఇలాంటి పనికోసం రెండు ప్రైవేటు కంపెనీలు భారత విదేశీ గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌కు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో రహస్యంగా సాగుతున్న సమాచార దోపిడీ అనేది సర్వీస్ ప్రొవైడర్‌లకు తెలిసిగానీ, తెలియకగానీ జరుగుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. లిబియాలోని ప్రజల కదలికలను తెలిపేందుకు ఆ దేశాన్ని ఎక్కువరోజులు ఏలిన గడాఫీకి ఇలాంటి ఫ్రెంచ్ నిఘా సంస్థే తోడ్పడిందని చెప్పారు. భారత్‌లోని సంస్థకు హిందీ, తమిళ భాషలో ఉన్న సమాచారాన్ని కూడా సేకరించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. గుట్టుగా సాగుతున్న ఇలాంటి సమాచార దోపిడీపై తాను ఆరేళ్ల క్రితం అధ్యయనం చేసానాని తెలిపారు. ఈ సంస్థల ద్వారానే భారత్‌కు చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈమెయిల్‌లను చైనా సేకరించి తన ప్రయోజనాల కోసం వాడుకుంటోందని వెల్లడించారు. ఈ కంపెనీల వల్ల భారత సార్వభౌమాధికారం ప్రత్యక్షంగా ప్రభావితమవుతోందని అన్నారు. భారత్ సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి ప్రజలకు దేశంలో జరిగే ఏ విషయానై్ననా తెలుసుకోగలిగే హక్కు కల్పిస్తూ.. ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా నిరూపించుకొందని అసాంజే కొనియాడారు.
రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించే నిఘా సాధనాలను జర్మనీకి చెందిన ఓ సంస్థ బహిరంగంగానే అమ్ముతోందని వెల్లడించారు. మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్‌ల నుంచి సమాచారాన్ని సేకరించి అమ్ముకున్న నిఘా సంస్థల వివరాలను ‘సై్ప ఫైల్’ పేరిట బయటపెడుతానని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం 287 డాక్యుమెంట్లను విడుదల చేశానని, వచ్చే ఏడాది మిగతా వాటినన్నింటినీ బయటపెడుతానని వెల్లడించారు.

Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News

0 comments:
Post a Comment