పంజా పవర్
పవన్‌కళ్యాణ్ చిత్రం వస్తోందంటే అందరిలోనూ ఆసక్తే. రాబోయే ‘పంజా’ చిత్రానికైతే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కారణం ఈ చిత్రంలో ఆయన విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తుండటమే. ప్రస్తుతం నిర్మాణమవుతున్న క్రేజీ హీరోల చిత్రాల బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్‌తో టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో తెరకెక్కిన ‘పంజా’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపుగా యాభై కోట్ల బిజినెస్ జరుపుకోవడం తెలుగు చిత్ర పరిక్షిశమలో సంచలనంగా మారింది. నైజామ్ ఏరియా హక్కులు (దాదాపుగా)14 కోట్లకు అమ్ముడుపోగా సీడెడ్ ఏరియా పంపిణీ హక్కుల కింద ఈ చిత్రం 6.5 కోట్ల వసూలు చేసిందట. నెల్లూరు: 1.4 కోట్లు, కృష్ణ: 2 కోట్లు, గుంటూరు: 3 కోట్లు, వైజాగ్: 3 కోట్లు, ఈస్ట్ గోదావరి: 2.4 కోట్లు, వెస్ట్‌గోదావరి: 2 కోట్లు యుఎస్‌ఎ: 3 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే విస్మయపరుస్తోంది. ఇవి కాక ఓవర్సీస్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ మొత్తంగా కలిపి దాదాపుగా 12 కోట్లు కొల్లగొట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా కలిపితే పవన్‌కళ్యాణ్ ‘పంజా’ చిత్రం విడుదలకు ముందే 50 కోట్లు వసూలు చేసిందని, విడుదలయ్యాక బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటం విశేషం.
Take By: T News
Tags: T News, hmtv, tv9, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood, Paanja, Pavankanlyan
Tags: T News, hmtv, tv9, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood, Paanja, Pavankanlyan
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)

























0 comments:
Post a Comment