అవినీతి.. భారత్
అంతర్జాతీయ సూచీలో 95వ స్థానం
మూడేళ్లుగా దిగజారుతున్న ర్యాంకు.. గత ఏడాది 87వ స్థానంలో..
చైనా, శ్రీలంకల కన్నా ఇక్కడే ఎక్కువ.. పాక్‌తో పోలిస్తే మెరుగు
వరుస కుంభకోణాలు, నేతల అరెస్టులు.. కారణాలు!
న్యూఢిల్లీ, డిసెంబర్ 1:భారతదేశంలో అవినీతి భూతం నానాటికీ పెట్రేగుతోంది. లంచాలకు మరిగి, ప్రజాసేవ అటకెక్కించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు దేశంలో కొదువే లేకపోవడంతో అవినీతి హద్దూఅదుపు లేకుండా విజృభిస్తోంది. ఓవైపు అవినీతిపై ఉక్కుపాదం మోపే లోక్‌పాల్ కోసం సామాజిక ఉద్యమనేత అన్నా హజారే నాయకత్వంలో జోరుగా ఉద్యమం సాగుతున్నా, అవినీతిని ఎంతమాత్రం సహించం, కూకటివేళ్లతో పెకిలిస్తామని జాతీయస్థాయిలో నేతలు ఉపన్యాసాలు దంచుతున్నా, దేశంలోని అవినీతిపరులు తొణకుండా, బెణకుండా తమ పని తాము సాగిస్తున్నారు! చేయి తడిపితేనా.. అమ్యామ్యాలు ముట్టితేనే సర్కారీ కార్యాలయాల్లో పనులు సాగుతున్నాయి! అవినీతిలో ఆరితేరిన రాజకీయ నాయకులు రోజుకో భారీ కుంభకోణంతో దేశంలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇక మన దేశంలో అవినీతి ఎలా తగ్గుముఖం పడుతోంది? ఈ జ్యాఢ్యాన్ని నియంవూతించే విషయంలో మన ప్రతిష్ట ఎలా మెరుగుతోంది?? అందుకే 183 దేశాలతో టాన్స్‌పన్సీ ఇంటేర్నేషనల్ రూపొందించిన అంతర్జాతీయ అవినీతి సూచి(కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్-సీపీఐ)లో భారత్ 95వ స్థానంలో నిలిచింది. అవినీతి నియంవూతణ విషయంలో భారత్ ర్యాంకు క్రమంగా దిగజారుతోంది. అవినీతి విషయంలో 10 మార్కులకు గాను భారత్ 3.1 మార్కులను మాత్రమే సాధించింది. 2007లో అత్యధికంగా 3.5 మార్కులు తెచ్చుకున్న భారత్ ఆ ఏడు 180 దేశాల సీపీఐలో 72వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్రమంగా మన ర్యాంకు దారుణంగా పడిపోతూ వస్తోంది. అవినీతిని నియంవూతించడంలో వ్యవస్థ తీరు నానాటికీ తీసికట్టుగా ఉందని ప్రజలు భావించడమే ఇందుకు కారణం. గత ఏడాది ఈ జాబితాలో 87వ స్థానంలో నిలిచిన మన దేశం ఈ ఏడాది ఎనిమిది స్థానాలు దిగజారింది. పొరుగు దేశాలు చైనా(75 ర్యాంకు), శ్రీలంక (86)ల కన్నా ఎంతో వెనుకబడిన ఇండియా.. 134వ స్థానంలో ఉన్న దాయాది పాకిస్థాన్‌తో పోలిస్తే మెరుగు అనిపించుకుంది. ప్రభుత్వ రంగాల్లో అవినీతి గురించిన వివరాల ఆధారంగా సీపీఐ వివిధ దేశాలకు ర్యాంకులను నిర్ధారిస్తోంది. ఇందుకోసం నిపుణులైన అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల నుంచి సంక్లిష్ట ప్రక్రియ ద్వారా సమాచారం సేకరిస్తోంది.
13 అధ్యాయనాల ఆధారంగా భారత ర్యాంకును నిర్ణయించారు. దేశం పనితీరుపై ప్రపంచబ్యాంకు నివేదిక, ఇనిస్టిట్యూషనల్ అసెస్‌మెంట్, వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఒపినియన్ సర్వే, గ్లోబల్ ఇన్‌సైట్ ఇచ్చిన రిస్క్ రేటింగ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పన్సీ రూపొందించిన తాజా జాబితాలో 9.5 మార్కులతో న్యూజీల్యాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్, ఫిన్‌ల్యాండ్‌లు నిలిచాయి. అస్థిరత, అంతర్గత సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న సోమాలియా, ఉత్తర కొరియా, మయున్మార్, అఫ్గానిస్థాన్‌లు అట్టడుగు స్థానానికి పరిమితమయ్యాయి. దిమ్మతిరిగే కుంభకోణాలు వెలుగు చూస్తుండటం, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్లు అరెస్టవ్వడం, అవినీతి పీచమణచడం కోసం లోక్‌పాల్ ఉద్యమం జోరుగా సాగుతుండటం.. మన దేశ ర్యాంకు దిగజారడానికి కొద్దిస్థాయిలో దోహదపడొచ్చునని ట్రాన్స్‌పన్సీ ఇంటర్నేషనల్ ఇండియా బాధ్యులు తెలిపారు.
కుదిపేసిన కుంభకోణాలు..
ఈ మధ్యకాలంలో దేశాన్ని వరుస కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో, సామాన్యుడి ఊహకందని రేంజ్‌లో లక్షల కోట్ల రూపాయాల కుంభకోణాలు వెలుగుచూశాయి. 2జీ నుంచి ఓటుకు నోటు వరకు అన్నీ ప్రజల్లో గుబులు రేపిన కుంభకోణాలే. ఆ వివరాలు..
2జీ స్పెక్ట్రం స్కాం:
2జీ కేటాయింపులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టి, వారి నుంచి ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలపై ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంతో రూ.1.76 లక్షల కోట్లు నష్టపోయిందన్న కాగ్ నివేదికతో దేశం దిమ్మెరపోయింది. ఈ స్కాంలో టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో సహా ముఖ్య ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ ప్రముఖులు నిందితులుగా ఉన్నారు
ఓటుకు నోటు:
యూపీఏ-1 ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కడం కోసం ఎంపీలను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచిందని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నోట్ల కట్టలు ప్రదర్శించడంతో సంచలనం సృష్టించింది. ఈ స్కాంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీవీసీ నియామకంపై నిరసనలు:
కేంద్ర విజిపూన్స్ కమిషనర్‌గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడం కూడా కేంద్రంలోని యూపీఏ సర్కారును తీవ్రంగా ఇరకాటంలో పడేసింది. కేరళలో పామోలిన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజే థామస్‌ను సీవీసీగా నియమించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన దిగిపోక తప్పలేదు. ఇది కేంద్రానికి ఎదురుదెబ్బగా మారింది.
ఆదర్శ్ కుంభకోణం:
ముంబైలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాల కోసం నిర్మించిన ఆదర్శ్ సోసైటీలో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ, ఆర్మీ అధికారులు ప్లాటు పొందడం కోసం నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ స్కాం దెబ్బతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కామన్ క్రీడల కుంభకోణం:
ప్రతిష్ఠాత్మక కామన్ క్రీడల నిర్వహణ విషయంలో ఆది నుంచి అక్రమాలు వెలుగుచూశాయి. చివరి క్షణం వరకు పనులు కొనసాగడం, వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు, అసలు క్రీడలు సజావుగా జరుగుతాయా అన్న ఉత్కంఠ మధ్య.. ఎలాంటి అవాంతరం లేకుండా ఈ క్రీడలు ముగిశాయి. అయితే కామన్ క్రీడల నిర్వహణలో జరిగిన ఎన్నో అక్రమాలు వెలుగుచూడడంతో కామన్ క్రీడల చైర్మన్ సురేశ్ కల్మాడీ జైలు పాలయ్యారు. మరికొందరు నిర్వాహకులు కూడా అరెస్టయ్యారు.

Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News

0 comments:
Post a Comment