నల్లచట్టాలతో ఉద్యమాన్ని ఆపలేరు
- అణచివేయాలనుకుంటే మరింత తీవ్రం
- సీఎం కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారు
- తెలంగాణ మంత్రులకు చీమూ నెత్తురు లేదు
- టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
- చెరుకు సుధాకర్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్
(-వరంగల్):ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి నియంతలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని సహించలేక ప్రభుత్వం నల్ల చట్టాలతో అణచాలని చూస్తోందని మండిపడ్డారు. అణచివేయాలనుకుంటే ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రముఖ వైద్యుడు చెరుకు సుధాకర్‌ను ప్రభుత్వం అకారణంగా అరెస్టు చేసిందని తప్పుపట్టారు. ఆయన ఆరోగ్యం ఏమీ బాగాలేదని, ఆయనను ప్రభుత్వం తక్షణమే బేషరతుగా విడుదల చే యాలని డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి, నాసా కేసు మోపడంతో వరంగల్ జైలుకు పంపిన డాక్టర్ చెరుకు సుధాకర్‌ను ఇటీవల అనారోగ్యం కారణంగా ఎంజీఎం ఆసుపవూతికి తరలించారు. ఆసుపవూతిలో ఉన్న ఆయనను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి, వరంగల్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి ఉన్నారు.
అనంతరం మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘చెరుకు సుధాకర్‌ను అర్ధరాత్రి అరెస్టు చేయడంతో మా ఎమ్మెల్యేలందరూ తెలంగాణ మంత్రులను కలిస్తే 10 నుంచి 15 రోజు ల్లో విడుదల చేస్తామన్నరు. తెలంగాణ కోసం ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమం చేస్తున్న వ్యక్తిని అదీ పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడం ఏమిటని వారే ఆశ్చర్యపోయారు. ఆయన విడుదలకు సహకరిస్తామన్నారు. కానీ ఏమీ చేయలేకపోతున్నారు. తెలంగాణ మం త్రులకు చీమూనెత్తురు, సిగ్గూ శరం ఏమాత్రం లేవు’’ అని ఆయన ఈ ప్రాంత మంత్రులపై, వారి చేతకానితనంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అరెస్టులతో అడ్డుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చూస్తే అంతకన్నా అవివేకం ఏమీ ఉండదని ఆయన విమర్శించారు. నల్గొండలో ప్రజావైద్యుడిగా పేరున్న చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంతో మమేకమై తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారని, అలాంటి వ్యక్తిపై నల్లచట్టాలు, నాసాలు ప్రయోగిస్తే వాటికి తెలంగాణవాదులు ఎవ్వరూ భయపడేదిలేదన్నారు. చెరుకు సుధాకర్‌ను ఎలా విడుదల చేసుకోవాలో తమకు తెలుసునని, రాష్ట్ర హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ మంత్రులు సిగ్గూశరం లేకుండా చీమూనెత్తురు లేకుండా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము ఉద్యమిస్తే 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం హామీనిచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని, ఎటువంటి కేసులు పెట్టి, ఎంత భయానక వాతావరణం సృష్టించాలని చూసినా తెలంగాణ భయపడేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. చెరుకు సుధాకర్‌ను ఆస్పత్రి నుంచి తొందరగా జైలుకు పంపాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, సీనియర్ నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, ముత్తిడ్డి యాదగిరిడ్డి, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంటతడి పెట్టిన కేసీఆర్
వరంగల్ రూరల్: వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించిన పార్టీ అధినేత కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. సుధాకర్ ఆరో గ్య పరిస్థితిని చలించిపోయా రు. ఒక్కసారిగా ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. ‘‘అన్నా నువ్వేం భయపడొద్దు.. నీకు, నీ కుటుంబానికి మేము న్నాం. నీ వెనకాల యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నారు’’ అని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభు త్వం బేషరతుగా విడుదల చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమం ఆగదు
మేడిపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు ఉద్యమకారులపై ఎన్ని నాసా కేసులు పెట్టినా వెనుకకు తగ్గేది లేదని, తెలంగాణ ఉద్యమం కొసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌లో పోలీసు నిర్బంధంలో ఉన్న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించేందుకు గురువారం వెళుతూ మార్గమధ్యంలో మేడిపల్లి పరిధిలోని చెంగిచర్ల చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణవాదులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా పోరాడుతున్నవారిపై దుర్మార్గమైన దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపె సభను జరుగనివ్వబోమని, శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపె ఉద్యమించాలని కోరారు. తెలంగాణ ఉద్య మం చల్లబడిందనే సీమాంధ్ర నేతల ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్షికమంలో రంగాడ్డి జిల్లా టీఆర్‌ఎస్ కార్యదర్శి పంగ మహేందర్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నత్తి మైసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చర్ల ఆంజనేయులు, బింగి జంగయ్యయాదవ్, ఏర్పుల వెంక మేకల వెంక చంద్రశేఖర్, పన్నాబాయ్, సునీల్, సంపత్, యాదగిరి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News

0 comments:
Post a Comment